Year 10 Movie Explained in Telugu
Blue Fox Entertainment Distribute చేసిన “Year 10” అనే హార్రర్ సర్వైవల్ మూవీ 5.4/10 IMDb రేటింగ్ ని సాధించింది. 24 ఆగష్ట్ 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Benjamin Goodger” దర్శకుడిగా మరియు రచయితగా వ్యవహరించారు. Duncan Lacroix, Toby Goodger, Hannah Khalique- Brown మరియు Luke Massy ప్రధాన పాత్రల్లో నటించారు. 1 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 1.4 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.
కథ తెలుసుకుందాం!
1) వైపరీత్యం తర్వాతి జీవితం
ఓపెన్ చేస్తే భయంకరమైన ప్రకృతి వైపరిత్యం జరగడం వల్ల భూమి మీదున్న మనుషులు చాలా వరకు చనిపోతారు. కేవలం కొద్ది మంది మాత్రమే వైపరిత్యం నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుంటారు. ప్రకృతి వైపరిత్యం జరిగి భూమి మీద మనుషులు చనిపోయిన రోజు నుంచి సంవత్సరాలనేవి మొదటి నుంచి మొదలవుతాయి. అలా ప్రస్తుతం పదవ సంవత్సరం జరుగుతుంటది. వైపరిత్యం జరిగిన మొదటి రోజుల్లో మనుషులు తమ ఆకలిని తీర్చుకునేందుకు జంతువుల్ని వేటాడేవారు. But Year 10 లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మనుషులు మృగాళ్లాగా మారి తమ తోటి మనుషులనే చంపుకుని తినడం మొదలుపెడతారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్ కి Names ఏమీ లేవు.
So Story Clear గా అర్థమయ్యేందుకు మనమే వీళ్ళందరికి పేర్లు పెట్టేద్దాం. ఈ మూవీలో ఏ ఒక్కరు కూడా నోరు తెరిచి ఒకరితో నొకరు అస్సలు మాట్లాడుకోరు. కేవలం సైగలద్వారా and ఎమోషన్స్ ద్వారానే మూవీ అంతా సాగుతుంటది. మరి వీళ్ళసలు ఎందుకు మాట్లాడుకోరో, దీని వెనకున్న మిస్టరీ ఏంటో మనం కొన్ని క్షణాల్లోనే తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే Jason (జేసన్) తన నాన్నతో కలిసి వేటకు వెళ్తాడు. Jason నాన్న పేరు సైమన్. సైమన్ ఒక అడవి పందికి బాణాన్ని వేస్తాడు. కొన ప్రాణంతో ఉన్న ఆ అడవి పంది వారిద్దరి నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోద్ది. కానీ అది ఏ క్షణమైనా సరే తన ప్రాణాన్ని కోల్పోద్ది. So పంది నుంచి కారుతున్న రక్తపు జాడల్ని Follow అవుతూ Jason and Simon ఒక చిన్న లేక్ వద్దకి చేరుకుంటారు.
అయితే ఆ ప్రదేశంలో పంది ఎక్కడా కనిపించకపోవడంతో వీరిద్దరు నిరాశగా వెనక్కి తిరుగుతారు. అలా నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యంలో రెండు కార్ లు కనిపిస్తాయి. ఏదైనా ఆహారంగాని లేదా ఏమైనా ఉపయోగపడే వస్తువులుగాని దొరకొచ్చేమో అన్న ఉద్దేశంతో వీరిద్దరు చెరో కార్ దగ్గరికెళ్లి లోపలంతా చెక్ చేస్తుంటారు. అప్పుడు సైమన్ కి కాల్చిపడేసిన కొన్ని సిగరెట్లు, ఒక చిన్నపాటి లాలిపాప్ లాంటి క్యాండీ దొరికిద్ది. అలాగే Jason కి కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరికిద్ది. కానీ తను ఆ బిస్కెట్స్ ని Simon తో Share చేసుకోకుండా చాటుగా మూడు, నాలుగు బిస్కెట్స్ ని తినేస్తాడు.

2) మనుషుల్ని తినే మనుషులు
ఆ సమయంలో పొరపాటున తన చెయ్యి తగిలి Car Horn మోగుతుంది. దాంతో Simon వెంటనే Jason ఉన్న కార్లోకి వచ్చి Doors అన్నింటిని Close చేసేస్తాడు. అప్పుడు కొన్ని క్షణాల్లోనే అక్కడికి కొన్ని అడవి కుక్కలు వస్తాయి. కానీ వాటికి మనుషులెవరూ కనిపించకపోవడంతో అవి వెంటనే Cars దగ్గర్నుంచి వెళ్ళిపోతాయి. So వీరు ఒకరితో నొకరు మాట్లాడుకోకపోవడానికి రీజన్ ఏంటంటే, ఎటువంటి శబ్దం వినిపించినా సరే ఈ అడవి కుక్కలు శబ్దాన్ని ఫాలో అవుతూ వెంటనే వచ్చేస్తాయి. వీటికి గాని మనుషులు కనిపించారంటే ఇక అంతే సంగతులు. ఇవి మనుషుల్ని దారుణంగా తినేస్తాయనమాట. అందుకనే వీళ్ళు నోరు తెరిచి అస్సలు మాట్లాడుకోరు.
కొంచెం సేపటి తరువాత Simon, Jason కార్ లోంచి బయటికొచ్చి ఇంటికి బయల్దేరతారు. మార్గమధ్యంలో Jason తన దగ్గరున్న బిస్కెట్స్ అన్నింటినీ తినేసి, కవర్ని మాత్రం దారిలోనే పడేస్తాడు. Jason Girlfriend పేరు Emily. Emily అనారోగ్యంతో బాధపడుతుంటది. తన అనారోగ్యం తగ్గేందుకు Simon తనకి ప్రతిరోజు Tablets ఇస్తుంటాడు. ఇలా ఈ ముగ్గురు జంతువుల్ని వేటాడుతూ, దొరికిన ఆహారాన్ని తింటూ ఇతరుల కంటపడకుండా చాలా సెక్యూర్ గా జీవితాన్ని గడుపుతుంటారు. కట్ చేస్తే, మరుసటి రోజు ఉదయం తెల్లవారిన తర్వాత Jason ఇంటినుంచి బయటకొస్తాడు. అప్పుడు తనకి కొంతమంది మనుషులు కనిపిస్తారు.
దాంతో Jason ఒక్కసారిగా భయపడిపోయి, వెంటనే ఇంట్లోకి పరుగుతీసి తలుపుని బలంగా వేసేస్తాడు. తీరాచూస్తే ఆ మనుషులందరూ తమ ఇంటి వైపే వస్తుండడంతో, వీరు ముగ్గురు తమకు కావాల్సిన వస్తువుల్ని అలాగే Tablets ని ఒక బ్యాగ్ లో సర్దుకుని Back Door గుండా ఇంటి నుంచి బయటకొచ్చేస్తారు. మనుషుల నుంచి తప్పించుకునేందుకు వేగంగా పరుగుతీసి, బంకర్ లాంటి ప్రదేశం వద్దకు చేరుకుంటారు. ఆ ప్రయత్నంలో తమ Bag పొరపాటున దారిలోనే పడిపోద్ది. కానీ వెనక్కి వెళ్లి దాన్ని తెచ్చుకునేంత సమయం లేదు. So Emily and Jason వెంటనే బంకర్ లోకి దిగుతారు. Simon మాత్రం బంకర్ లోకి దిగకుండా, వారిద్దరిని రక్షించేందుకు మనుషులకి ఎదురెళ్లి పోరాడతాడు. కానీ చివరికి సైమనే వాళ్ళ చేతిలో చనిపోతాడు.

3) టాబ్లెట్స్ కోసం ప్రయాణం
ఈ మనుషులందరూ ఒక Batch అనమాట. ఈ Batch కి Kevin అనే వ్యక్తి లీడర్ గా ఉంటాడు. Simon ని చంపిన place లోనే Bag కూడా ఉంటది. కెవిన్ దాని దగ్గరికెళ్లి అందులో ఏమున్నాయని చెక్ చేస్తాడు. అందులో ఉపయోగపడే వస్తువులతో పాటు Tablets కూడా ఉండడంతో కెవిన్ ఆ బ్యాగ్ ని భుజానికి తగిలించుకుంటాడు. అలాగే Simon Dead బాడీని కూడా ఒక కర్రకి కట్టి తమ ప్రదేశానికి తీసుకెళ్ళిపోతారు. ఈ విషయాలన్నింటినీ బంకర్ కున్న చిన్నపాటి గ్యాప్ గుండా Jason, Emily చూస్తూనే ఉంటారు. కానీ ఏం చేయలేని పరిస్థితిలో సైలెంట్ గా ఉండిపోతారు. కొంచెం సేపటి తర్వాత Emily, Jason బంకర్ లోంచి ఇంటికొచ్చేస్తారు. Bag తో సహా Tablets ని కూడా Kevin తీసుకెళ్లిపోయాడు కదా.
ఆ టాబ్లెట్స్ లేకపోతే Emily కోలుకోవడం Impossible. So తను కొద్ది కొద్దిగా ప్రాణం కోల్పోతూ నరక మనుభవిస్తూ చనిపోవడం చూడలేక జేసనే తనని చంపేయాలనుకుంటాడు. కానీ తన మీద ఉన్న ప్రేమ వల్ల Jason Emily ని చంపలేకపోతాడు. కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర్నుంచి టాబ్లెట్స్ తీసుకురావాలని Jason డిసైడవుతాడు. ఇక తను Emily ని ఇంట్లోనే వదిలిపెట్టి, టాబ్లెట్స్ తీసుకొచ్చేందుకు ప్రయాణాన్ని మొదలుపెడతాడు. సైమన్ బాడీలోంచి కారిన రక్తపు గాడల్ని ఫాలో అవుతూ Jason అడుగులు వేస్తుంటాడు. అలా తను చాలా దూరం ప్రయాణిస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత టెంపరేచర్ బాగా తగ్గిపోవడంతో, Jason చలికి తట్టుకోలేక Full గా వణికిపోతుంటాడు.
సరిగ్గా అదే సమయంలో తనకొక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ పిల్లాడి పేరు Williams. వీడు నన్నెక్కడ చంపి తింటాడో అని భయపడి Williams వెంటనే ఇంటికి పరిగెడతాడు. తనని Follow అవుతూ Jason కూడా Wiiliam ఇంటికి చేరుకుంటాడు. అక్కడ పిల్లాడితో పాటు ఒక ముసలాయన కూడా నివసిస్తుంటాడు. వీడు మమ్మల్ని చంపి తింటాడేమో అని అనుకుని వారిద్దరూ బాగా భయపడిపోతారు. కానీ Jason మాత్రం వాళ్ళకి ఎటువంటి హానీ కలిగించకుండా వారి దగ్గర్నుంచి ఒక ప్యాంట్ and స్వెటర్ ని తీసుకుని ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. తిరిగి ప్రయాణం మొదలుపెట్టిన Jason కి మార్గమధ్యంలో మంటల్లో కాల్చిన ఒక Skull కనిపిస్తది. ఆ Skull ఎవరిదో కాదు, సైమన్ దే. Jason తన Skull ని మట్టిలో పూడ్చేసి బాధతో తనకి నివాళి అర్పిస్తాడు.

4) ముగింపు
ఆ మంట ఇంకా వెలుగుతూనే ఉండడంతో, సైమన్ని చంపిన మనుషులు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు, వాళ్ళు దగ్గర్లోనే ఉండి ఉండొచ్చని Jason కి డౌట్ వస్తది. So తనొక చెట్టెక్కి చుట్టుపక్కలంతా పరిశీలించగా తనకి కొంత దూరంలోనే పొగ కనిపించడం జరిగిద్ది. సరిగ్గా అదే సమయంలో Jason పొరపాటున చెట్టు నుంచి జారి కింద పడతాడు. అంత ఎత్తు నుంచి పడడంతో నొప్పిని తట్టుకోలేక Jason గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు అడవి కుక్కలకి కూడా వినిపిస్తాయి. అవి శబ్దాన్ని ఫాలో అవుతూ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు Jason వెంటనే మంటని పెద్దదిగా చేస్తాడు. కొన్ని క్షణాల్లోనే అడవి కుక్కలు Jason వద్దకి చేరుకుంటాయి.
కానీ తను వాటికి నిప్పుని చూపిస్తూ బెదిరించడంతో అవి తన దగ్గర్నుంచి పారిపోతాయి. మరుసటి రోజు ఉదయం Jason కి ఒక టెంట్ కనిపిస్తది. లోపలికెళ్ళి చూస్తే అందులో ఒక Skeleton ఉంటది. And అక్కడే ఒక మ్యాచ్ బాక్స్, ఒక నైఫ్ అలాగే ఒక విజిల్ కూడా Jason కి దొరుకుతాయి. వాటిని తీసుకుని తను మళ్ళీ ప్రయాణం మొదలుపెడతాడు. కెవిన్ బ్యాచ్ లోని Mandy అనే అమ్మాయి, ఒక కాలువ దగ్గర బాటిల్ కి నీళ్ళు నింపుకుంటుండడం Jason చూస్తాడు. But Mandy మాత్రం Jason ని గమనించకుండా వాటర్ తీసుకుని షెల్టర్ కి వెళ్లిపోద్ది. Mandy ని ఫాలో అవుతూ Jason కూడా వాళ్ళ షెల్టర్ వద్దకి చేరుకుంటాడు.
యూరిన్ పాస్ చేసేందుకు Mandy తమ షెల్టర్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిద్ది. ఇక ఇదే సరైన సమయమని భావించి టాబ్లెట్స్ ని తీసుకునేందుకు Jason అక్కడంతా వెతుకుతుంటాడు. But అప్పటికే Mandy షెల్టర్ వద్దకి చేరుకుని Jason పై ఎటాక్ చేసేందుకు Try చేస్తది. వాళ్ల మధ్య జరిగిన ఫైట్ లో Jason Mandy ని చంపేస్తాడు. ఆ సమయంలోనే కెవిన్ బ్యాచ్ కూడా తమ వేటని ముగించుకుని షెల్టర్ వైపుగా వస్తుంటారు. అది గమనించిన Jason Mandy Dead బాడీని లాక్కుంటూ వేగంగా ఒక చెట్టు వెనక్కి వెళ్లి ఎవరికీ కనిపించకుండా దాక్కుంటాడు. ఈసారి కెవిన్ బ్యాచ్ వేటాడింది ఎవరినో కాదు. మనం ఇంతకుముందు Willians అనే పిల్లాడిని చూశాం కదా. ఆ పిల్లాడినే వీళ్ళు వేటాడతారు.
Image Credit: Year 10 (2024)