Wolf Man Movie Explained & Summary in Telugu

Wolf Man Movie Explained & Summary in Telugu

Universal Pictures Distribute చేసిన “Wolfman” అనే హార్రర్ ఫాంటసీ మూవీ 5.6/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ జనవరి 12, 2025 లో రిలీజయింది. ఈ సినిమాకి Leigh Whannell దర్శకుడిగా మరియు రచయితగా బాధ్యతలు చేపట్టారు. అలాగే Corbett Tuck కూడా రచయితగా వ్యవహరించాడు. నటీనటుల విషయానికొస్తే Julia Garner, Christopher Abbott, Matilda Firth మరియు Sam Jaeger ప్రధాన పాత్రల్లో నటించారు. 25 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర 34.9 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. అలాగే క్రిటిక్స్ దగ్గర్నుంచి Mixed Reviews ని పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో Available గా ఉంది.

అసలు కథ ఏంటంటే!
1) మొదలు

1995లో ఒక హైకర్ Oregon లోని ఫారెస్ట్కి వెళ్లి అక్కడ తప్పిపోతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అతనికి అనిమల్స్ కి వచ్చే హిల్ ఫీవర్ వచ్చిందని అనుకుంటారు. వాళ్ళందరూ ఆ వ్యాధిని “ఫేస్ ఆఫ్ వోల్ఫ్” అని పిలుస్తారు. కట్ చేస్తే గ్రేడి తన కొడుకు బ్లేక్ తో హంటింగ్ కి వెళ్తాడు. అప్పుడు వాళ్ళకి ఒక జింక కనిపిస్తుంది. ఇద్దరూ దాన్ని షూట్ చేయాలని చూస్తారు, కానీ అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రేడి వెనక్కి తిరిగి చూస్తే బ్లేక్ అక్కడ ఉండడు. ఈలోపే వీడెక్కడికెళ్ళాడురా అనుకుని గ్రేడి కొంచెం భయపడతాడు. బ్లేక్ ఆ జింకను వేటాడటం కోసం సరైన స్పాట్ ను వెతుక్కుంటూ ఉంటాడు.

బ్లేక్ జింకను వెతుకుతున్నప్పుడు అతనికి జింక కాదు గాని ఏదో ఒక విచిత్రమైన మనిషి రూపంలో ఉన్న జీవి కనిపిస్తుంది. దాన్ని చూడగానే బ్లేక్ కి కొంచెం భయం వేస్తది. మళ్లీ దాని కోసం చెక్ చేస్తే ఆ జీవి అక్కడ కనిపించదు. ఇక అక్కడి నుంచి చిన్నగా వెనక్కి వస్తుంటే ఆ విచిత్రమైన జీవి యొక్క అరుపులు తనకి దగ్గరవుతున్నట్టు బ్లేక్ కి వినిపిస్తూ ఉంటాయి. గ్రేడీ వెంటనే అక్కడికి వచ్చి తన కొడుకుని తీసుకొని పక్కనే ఉన్న హంటింగ్ బ్లైండ్ లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఉల్ఫ్ మాన్ వాళ్ల మీద ఎటాక్ చేయడానికి హంటింగ్ బ్లైండ్ లాడర్ ని ఎక్కుతుంటాడు. లోపల ఉన్న గ్రేడీ  ఉల్ఫ్ మాన్ పైకి రాగానే షూట్ చేయడానికి గన్ తో రెడీగా ఉంటాడు.

కానీ ఆ ఉల్ఫ్ మాన్ కి ఈలోగా జింక కనిపించడంతో వెళ్ళి దాన్ని చంపేస్తాడు. అసలు ఏం జరిగిందని గ్రేడి చూడగా, జింక చనిపోయి ఉంటది. ఆ సమయంలో ఉల్ఫ్ మాన్ అటు పక్క నుంచి వెళ్తుండడంతో గ్రేడి షూట్ చేస్తాడు. కానీ అది మిస్ ఫైర్ అవుతది. అసలది ఏంటని బ్లేక్ గ్రేడి ని అడగడంతో, “అదొక బేర్” అని గ్రేడి బ్లేక్ కి అబద్దం చెప్తాడు. ఆరోజు రాత్రి గ్రేడి తన ఫ్రెండ్ అయిన డాన్ నీ రేడియోలో కాంటాక్ట్ అయ్యి, “అడవిలో ఆ Wolf Man ని చూశాను. మనం దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి, లేకపోతె మన పిల్లలకి ఆ Wolf Man వల్ల ప్రమాదం రావచ్చు” అని అంటాడు. ఆ సమయంలో బ్లేక్ అదంతా వింటాడు. అంటే హంటింగ్ లో మాకు కనిపించింది బేర్ కాదు అది ఉల్ఫ్ మాన్ అని బ్లేక్ కి అర్థమవుతుంది.

Wolf Man Movie Explained & Summary in Telugu
Wolf Man Movie Explained & Summary in Telugu
2) పాత ఇంటికి ప్రయాణం

కట్ చేస్తే 30 ఇయర్స్ గడిచిపోతాయి. ప్రస్తుతం బ్లేక్ Charlet అనే ఆమెని పెళ్లి చేసుకుని సిటీలో నివసిస్తుంటాడు. వీళ్ళకి జింజర్ అనే కూతురు కూడా ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు బ్లేక్ కి ఒక లెటర్ వస్తది. ఆ లెటర్లో గ్రేడి ఇంటి keys కూడా ఉంటాయి. గ్రేడి కొన్ని సంవత్సరాలుగా కనిపించకపోవడంతో అతను చనిపోయాడని డిక్లేర్ చేస్తూ స్టేట్ ఆఫ్ Oregon ఆ లెటర్ ని పంపిస్తది. బ్లేక్ ఫాదర్ డిక్టేటర్ లా బిహేవ్ చేస్తున్నాడనీ తనకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లేక్ తన ఫాదర్ ని వదిలేసి సిటీకి వచ్చేస్తాడు. ఎంత లేదన్నా చనిపోయింది తన ఫాదర్ కదా! సో బ్లేక్ కి కొంచెం బాదేస్తది.

తన ఫాదర్ తో కొంచెం ఎక్కువ సమయం గడిపి ఉంటే బాగుండేదని అనుకుంటాడు. ఇక బ్లేక్ చార్లెట్ తో, “మనం మా ఫాదర్ ఉండే ఊరికి వెళ్దాం, అక్కడే మనం సమ్మర్ అంతా గడిపేసి, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని వద్దాం. కొంతకాలం మనం దగ్గరగా గడిపినట్లు ఉంటుంది కదా” అని అంటాడు. ఇక బ్లేక్ తన ఫ్యామిలీతో Oregan కి బయలుదేరుతాడు. కొంత దూరం వచ్చిన తర్వాత రోడ్డు రెండుగా డివైడ్ అయ్యుంటది. ఏ రూట్ లో వెళ్తే తన ఫాదర్ ఇంటికి చేరుకుంటాడో Blake కి అర్థంకాక, బండి అక్కడ ఆపేస్తాడు. సెల్ఫోన్లో మ్యాప్స్ చూద్దామంటే సెల్ కి సిగ్నల్ ఉండదు. అదే సమయంలో పక్కనే ఉన్న ట్రీ హౌస్ లో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు.

ఆ వ్యక్తి ట్రీ హౌస్ నుండి దిగి కార్ దగ్గరికి వస్తాడు. బ్లేక్ అతనితో, “నేను Grady కొడుకుని అతని ఇంటికి ఎలా వెళ్లాలో దారి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది చెప్తారా?” అని అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు. బ్రేక్ కి Childhood ఫ్రెండ్ అయినా డెరిక్. డెరిక్ బ్లేక్ ని గుర్తుపట్టి, “మీ ఇంటికి వెళ్లే రూట్ ని ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కూడా నివసించట్లేదులే, నేనే మీ ఇంటికి తీసుకెళ్తాను” అని చెప్పి కార్ ఎక్కుతాడు. ఇక అందరూ వెళ్తుండగా సడన్గా రోడ్డు మీద ఎవరో నిలబడినట్టుగా కనిపిస్తది. అయితే అక్కడ నిలబడింది ఏదో కాదు, అది ఉల్ఫ్ మాన్. దాన్ని చూసి Blake ఒక్కసారిగా భయపడి పోయి వ్యాన్ ని పక్కకు తిప్పుతాడు.

3) Wolf Man దాడి

ఇంక వ్యాన్ చిన్న లోయ లాంటి ప్లేస్ లోకి వెళ్లి క్రాష్ అయ్యి చెట్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. లక్కీగా ఎవరికి పెద్దగా గాయాలు కానీ, ప్రాణం పోవడం గాని జరగదు. డెరిక్ వ్యాన్ నుంచి బయటకు రావాలని డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ తను కింద పడిపోతాడు. Blake చార్లెట్ అండ్ జింజర్ ని డోర్ నుండి వ్యాన్ పైకి ఎక్కమని చెప్పడంతో వాళ్లు వ్యాన్ పైకి ఎక్కేస్తారు. కానీ ఈలోగా డ్రైవర్ క్యాబిన్ దగ్గరికి Wolf Man వస్తుంటాడు. దాన్ని మిర్రర్ లో చూసిన Blake డోర్ ని వేసేస్తాడు. కానీ అది అద్దాన్ని పగలగొట్టడంతో బ్లేక్ చేతికి గాయం అవుతుంది. ఆ తర్వాత అది Deric ని లాక్కెళ్లిపోతుంది. ఇదే కరెక్ట్ టైం అని బ్లేక్ తన ఫ్యామిలీతో అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు.

Wolf Man Movie Explained & Summary in Telugu
Wolf Man Movie Explained & Summary in Telugu

అలా వెళ్తున్న వాళ్లకి Grady హౌస్ కనిపిస్తది. హౌస్ కనిపించిందని సంతోషపడే లోపే వెంటనే వెనుక  నుంచి ఆ Wolf Man వీళ్ళని వేటడటానికి వస్తుంటాడు. ఇక వీళ్ళు భయంతో పరిగెత్తుకుంటూ హౌస్ దగ్గరికి వెళ్తారు. బ్లేక్ వెంటనే డోర్ ఓపెన్ చేసి ఆ ఉల్ఫ్ మాన్ వీళ్ళ మీద అటాక్ చేసే లోపే లోపలికి వెళ్ళిపోతారు. బట్ ఆ ఉల్ఫ్ మాన్ మాత్రం డోర్ ని పగలగొట్టాలని చాలా గట్టిగా డోర్ ని కొడుతుంటాడు. డోర్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం Blake డోర్ ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. కాసేపయిన తర్వాత Wolf Man అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే Blake బేస్మెంట్లో ఉన్న జనరేటర్ ని ఆన్ చేయడంతో లైట్స్ ఆన్ అవుతాయి.

జింజర్ బాగా భయపడి పోయి, మనం ఇంటికి వెళ్దామని అడుగుతుంది. దానికి Blake, “మనమిప్పుడు ఇంటికి వెళ్ళడం చాలా ప్రమాదకరమైన పని. ఉదయం వరకు ఎదురు చూసి, ఉదయాన్నే వెళ్లిపోదాం” అని కొంచెం ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో చార్లెట్ బ్లేక్ ని అసలు మనల్ని అటాక్ చేసింది ఏంటని అడుగుతది. దానికి బ్లేక్, అదేంటో నాకు కరెక్ట్ గా తెలియదు. కానీ అది రెండు కాళ్ళ మీద మనుషిలాగా నిలబడిందని చెప్తాడు. డోర్ ఓపెన్ అవకుండా ఉండడం కోసం బ్లేక్ కబోర్డ్ ని డోర్ కి అడ్డంగా పెడతాడు. ఆ తర్వాత బేస్మెంట్ లో ఉన్న తన ఫాదర్ రేడియోని తీసుకుని సహాయం కోసం దాంట్లో ట్రై చేస్తుంటాడు.

4) బ్లేక్ Wolf Man గా మారడం

కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వరు. అదే సమయంలో బ్లేక్ కి పక్కనే ఉన్న డోర్ నుంచి ఏదో స్మెల్ వస్తుంటది. డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మాంసం వేలాడదీసి ఉంటది. Blake ఒక పీస్ తీసుకొని తింటాడు. కానీ దాని వల్ల తన jaw దెబ్బతిని ఒక పన్ను కూడా ఊడిపోతుంది. Charlet కి కొంచెం భయం వేసి వెంటనే కొంచెం కాటన్ ఇస్తది. ఆ తరువాత తన చేతికి ఉన్న గాయాన్ని చూస్తే అది బాగా కోసుకొని పోయి ఉంటుంది. Blake Charlet తో అద్దం ముక్క బాగా కోసుకొని పోయినట్టుందని చెప్తాడు. అప్పుడు చార్లెట్, “ఇది అద్ధం ముక్క కోసుకున్నట్టుగా లేదు” అని చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది.

కట్ చేస్తే wolfman తలుపు తోసుకొని రాకుండా ఉండడం కోసం బ్లేక్ కబోర్డ్ దగ్గర మరొక చెక్కని పెట్టి దాన్ని అక్కడ బిగిస్తుంటాడు. కానీ Blake సుత్తిని కూడా సరిగా పట్టుకోలేక దాన్ని తన వేళ్ళకి కొట్టేసుకుంటాడు. Blake కి బాగా చమట వస్తుండడంతో తను వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటాడు. కానీ అదే సమయంలో చాలా పెద్ద శబ్దం పై నుండి వినిపిస్తుండడంతో wolfman ఏమైనా పైకి వచ్చాడా అని డౌట్ వచ్చి Blake upstairs కి వెళ్తాడు. అక్కడున్న వార్డ్ రోబ్ లో నుండి సౌండ్ వస్తుండడంతో బ్లేక్ వార్డురోబ్ ని ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే అక్కడున్నది స్పైడర్. దాని కాళ్లు చేస్తున్న శబ్దం బ్లేక్ కి పెద్దగా వినిపిస్తుంటది.

Wolf Man Movie Explained & Summary in Telugu
Wolf Man Movie Explained & Summary in Telugu

Actully ఆ సౌండ్ నార్మల్ పర్సన్స్ కి అసలు వినిపించదు. కానీ బ్లేక్ కి మాత్రం దాని సౌండ్ అంత హెవీగా వినిపించడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి కాసేపు తన తల తిరిగినట్టుగా అనిపిస్తుంది. కట్ చేస్తే Blake నార్మల్ అయిపోయి తన ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. అయితే కిందకి వచ్చినా బ్లేక్ కి ఇంటి బయట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇక బ్లేక్ గాలిలో వాసన పీలుస్తూ బయట ఎవరున్నారని అబ్జర్వ్ చేస్తుంటాడు. చార్లెట్ కి తన హస్బెండ్ బిహేవియర్ ఎందుకో కొంచెం అబ్నార్మల్ గా అనిపిస్తది. అప్పుడే ఉల్ఫ్ మాన్ ఒక కిటికీ దగ్గర నుంచి వెళ్లడం కనిపిస్తది.

5) థ్రిల్లింగ్

బ్లేక్ ఒక తలుపు దగ్గరికి వెళ్ళిన తరువాత ఉల్ఫ్ మెన్ తలుపుకు ఉన్న పెట్ డోర్ నుంచి Blake కాలుని పట్టుకుని బయటికి లాగేందుకు  చూస్తాడు. కానీ చార్లెట్ వెంటనే సుత్తిని తీసుకొని ఆ wolfman ని బాగా కొట్టడంతో అతను Blake ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల బ్లేక్ చాలా భయపడిపోయాయి అన్కాన్షియస్ గా పడిపోతాడు. కట్ చేస్తే కాసేపటి తర్వాత Blake కి మెలుకువ వస్తది. కానీ ఆ చుట్టుపక్కల తన కూతురు గాని వైఫ్ గాని కనిపించదు. బేస్మెంట్ నుంచి ఏదో వాయిస్ వినిపిస్తుండడంతో బ్లేక్ అక్కడికి వెళ్తాడు. బేస్మెంట్లో జింజర్ నిద్రపోతుంటది. చార్లెట్ రేడియోలో వాళ్ళ సిచువేషన్ గురించి చెప్తూ, “నా హస్బెండ్ wolfman వల్ల ఇన్ఫెక్ట్ అయినట్టున్నాడు.

మేము ప్రమాదంలో ఉన్నాం, ఎవరైనా ఉంటే సహాయం చేయండి” అని అడుగుతుంటది. కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఫ్రస్టేషన్ తో ఆ మైక్ ని విసిరికొడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే బ్లేక్ చీకట్లో నిలబడి Charlet దగ్గరికి వస్తుంటాడు. బ్లేక్ ఏదో మాట్లాడాలని చూస్తుంటాడు. కానీ అతనికి మాటలు రావు అండ్ అప్పటికే అతని మొహం అంతా కూడా పూర్తిగా మారిపోయి ఉంటుంది. అతని సిచువేషన్ చూసిన చార్లెట్ అతని తీసుకొని వెళ్ళి పడుకోబెడుతుంది. ఆ టైంలో బ్లేక్ తన హెయిర్ ని పట్టుకుంటే హెయిర్ అంతా ఊడిపోవడం మొదలవుతది. Blake ఏదో చెప్పాలని చూస్తున్నాడు కదా!

సో పెన్ అండ్ పేపర్ ఇస్తే రాస్తాడేమో అని చార్లెట్ పెన్ అండ్ పేపర్ ఇస్తది. బ్లేక్ రాయడానికి కూడా బాగా కష్టపడతాడు. బట్ ఫైనల్ గా పేపర్ మీదా dying అని రాస్తాడు. అది చూసిన Charlet, “నీకు జస్ట్ ఇన్ఫెక్షన్ మాత్రమే అయింది, మీకేం అవ్వదు. మనం దీన్ని సరి చేయొచ్చు” అని బ్లేక్ తో ప్రేమగా మాట్లాడుతుంటది. కానీ బ్లేక్ కి చార్లెట్ మాటలు అసలేం అర్థం అవ్వవు, అండ్ బ్లేక్ విజన్ కూడా వుల్ఫ్ విజన్ లాగా మారిపోతుంది. బ్లేక్ ఏదో మాట్లాడుతుంటాడు, కాని అది Charlet కి అర్థమవదు. ఆ టైంలో జింజర్ అక్కడికి వచ్చి Blake తో కాసేపు ప్రేమగా మాట్లాడిద్ది.

Wolf Man Movie Explained & Summary in Telugu
6) ముగింపు

జింజర్ని వేరే రూమ్ లోకి పంపించిన తర్వాత చార్లెట్ బ్లేక్ యొక్క కట్టుని విప్పి చూస్తే ఆ గాయం మరీ వరస్ట్ కండిషన్ లో ఉంటది. బ్లేక్ సడెన్ గా ఒక జంతువులాగా తన చేతిని గీరుకుంటూ ఆ గాయాన్ని తినడం మొదలుపెడతాడు. అతను ఎంతలా ఆ గాయాన్ని  తింటుంటాడో అంతలా తన పళ్ళు ఊడిపోతుంటాయి. బ్లేక్ ని అలా చూసిన చార్లెట్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోద్ది. కొంచెం సేపటికి Blake కాన్షియస్ లోకి వస్తాడు. చార్లెట్ కి అసలు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోద్ది. కట్ చేస్తే చార్లెట్ కి కొంచెం దూరంలో Grady కారు కనిపిస్తది.

ఆ కార్ ద్వారా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్లొచ్చు అని చార్లెట్ కి ఐడియా వచ్చి, బేస్మెంట్ లోకి వెళ్లి కార్ కీస్ ని, ఒక బ్యాటరీని అలాగే కిచెన్ లో ఒక కత్తిని కూడా తీసుకొని, తన ఫ్యామిలీతో ఇంటి నుంచి బయటకొస్తది. ఇక వాళ్ళు ఫాస్ట్ గా కారు దగ్గరికి చేరుకుంటారు. చార్లెట్ బ్యాటరీ ని కార్ కి కనెక్ట్ చేసి కార్ ని స్టార్ట్ చేయాలని చూస్తది. ఫస్ట్ కార్ స్టార్ట్ అవ్వదు. ఈలోపు ఎక్కడ ఉల్ఫ్ మాన్ అటాక్ చేస్తాడేమో అని టెన్షన్ పడుతుంటారు. కానీ ఫైనల్ గా కార్ స్టార్ట్ అవుతది. ఇక చార్లెట్ వెంటనే  బ్యాటరీని తీసేసి కార్లో వెళ్లాలని చూస్తుండగా వెంటనే wolfman అటాక్ చేస్తాడు.

Wolf Man కార్ యొక్క గేర్ లెవెల్ ని పీకేస్తాడు. ఇక వాళ్లందరికీ భయం వేసి వెంటనే అక్కడి నుంచి ఒక గ్రీన్ హౌస్ మీదకి ఎక్కుతారు. కానీ ఆ ఉల్ఫ్ మాన్ గ్రీన్ హౌస్ లోకి కూడా వస్తాడు. ఆ గ్రీన్ హౌస్ top చాలా thin గా ఉంటది. సో ఉల్ఫ్ మాన్ దాన్ని డ్యామేజ్ చేస్తాడు. జింజర్ కి భయం వేసి వాళ్ళ అమ్మ వైపు వెళ్లబోతు పై నుంచి కిందపడబోద్ది. కానీ Blake అండ్ చార్లెట్ జింజర్ ని పట్టుకుంటారు. Blake చార్లెట్ తో మీరు ఇంట్లోకెళ్ళండి, నేను దాన్ని దారి మళ్ళిస్తానని సైగతో చెప్పి అక్కడి నుంచి ఫారెస్ట్ లోకి పరిగెత్తుతాడు. వెంటనే ఆ Wolf Man బ్లేక్ వెంటపడతాడు. ఆ సమయంలో చార్లెట్ జింజర్ ని తీసుకుని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతది.

Image Credit: Wolf Man (2025)

Leave a Comment