Wineville Movie Explained & Summary in Telugu
Dark Star Pictures Distribute చేసిన “Wineville” అనే హార్రర్ థ్రిల్లర్ మూవీ 4.3/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ సెప్టెంబర్ 10, 2024 లో రిలీజయింది. ఈ సినిమాకి Brande Roderick దర్శకత్వం వహించారు. అలాగే Richard Schenkman రచయితగా ఉన్నారు. నటీనటుల విషయానికొస్తే “Tess Lott” అనే పాత్రలో “Brande Roderick”, “Aunt Margaret” అనే పాత్రలో “Carolyn Hennessy” మరియు “Joe Lott” అనే పాత్రలో “Casey King” నటించారు. 1920s లో జరిగిన కొన్ని నిజ జీవిత మర్డర్స్ ద్వారా ఈ సినిమాని తీశారు. రెట్రో మూవీస్ ఇష్టపడే సినీ ప్రియులకి ఈ సినిమా మంచి Experience ఇస్తది.
కథ ఏంటంటే!
1) మొదలు
ఓపెన్ చేస్తే మిస్సి అనే అమ్మాయి హైవేలో వెళుతుండగా, అదే హైవేలో తన కార్ Breakdown అయిపోవడం వల్ల జో దాన్ని చెక్ చేస్తుంటాడు. మిస్సీ అతని చూసి టెంప్ట్ అయ్యి, “సరే నేను నిన్ను నీ ప్లేస్ లో డ్రాప్ చేస్తాను. కార్ ఎక్కు” అని అంటది. ఇక ఇద్దరు అక్కడినుంచి జో ప్లేస్ కి వెళ్తారు. ఆల్రెడీ ఆ అమ్మాయి జోని చూసి టెంప్ట్ అయింది కదా. సో ఇద్దరూ కిస్ చేసుకుంటారు అండ్ మిస్సి రూమ్ లోకి వెళ్దామని జోకి సిగ్నల్ ఇస్తది. జో ఆమెని తన వైన్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు. కట్ చేస్తే తనని ఒక క్రాస్ కి కట్టేసి చిత్రహింసలు పెడతారు. ఆమె భయంతో చాలా గట్టిగా అరుస్తది. అప్పుడు అక్కడికి ఎవరో వచ్చి ఆమెను పొడిచి చంపేస్తారు.
నెక్స్ట్ సీన్ లో టెస్ తన కొడుకు వాల్టర్ తో విన్నియాడ్ దగ్గరికి బయలుదేరుతుంది. టెస్ట్ ఫాదర్ ఆమెని చిన్నతనంలో చిత్రహింసలు పెట్టడం వల్ల తను టీనేజ్ కి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోతుంది. ప్రజెంట్ జో ఉంటున్న విన్నియాడ్ కి ఓనర్ Tes ఫాదరే. ప్రస్తుతం ఆయన చనిపోయి ఉంటాడు అండ్ టెస్ ఫైనాన్షియల్ సిచువేషన్ కూడా అంతేం బాగుండదు. అందువల్ల తను ఆ విన్యాడ్ని అమ్మేయాలనే ఉద్దేశంతో అక్కడికి వస్తుంది. టెస్ అత్తయ్య మార్గరెట్ ఆమెని హ్యాపీగా పలకరిస్తుంది. ఆమె టెస్ కి Joe ని పరిచయం చేసి ఇతన్ని మీ నాన్న, నేను అడాప్ట్ చేసుకున్నామని చెప్తది. టెస్ ఇంట్లోకి వెళ్ళగానే ఆమెకి తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి.
ఆమెని తన ఫాదర్ చాలా abuse చేసి ఉంటాడు. తనకవన్ని గుర్తొచ్చి చాలా uncomfortable గా ఫీల్ అవుతుంది. ఆరోజు సాయంత్రం టెస్ లాయర్ ఇంటికి వచ్చి, “ఈ ప్రాపర్టీ మొత్తం మీ నాన్నగారు మీ ఒక్కదానికే రాశారు. నువ్వు ఇది ఉంచుకోవచ్చు లేదంటే మార్గరెట్ కి రాసిచ్చేయొచ్చు లేదంటే అమ్ముకోవచ్చు అంతా నీ ఇష్టం” అని చెప్తుంది. Tess కి ఆ ప్లేస్ లో బ్యాడ్ మెమరీస్ తప్పా గుర్తుంచుకునే అంత గుడ్ మెమరీస్ ఏమీ లేవు. అందువల్ల తను ఆ ప్లేస్ అంతా అమ్మేసి సిటీలో తన కొడుకు వాల్టర్ కి ఒక మంచి హౌస్ కొనియ్యాలని అనుకుంటది. ప్లేస్ మొత్తం తన బ్రదర్ Tess కే రాసిచ్చాడని మార్గరెట్ కి తెలిసి, “మా అన్న నన్ను ఇంత మోసం చేస్తాడా” అని అనుకుంటది.

2) ప్లాన్
తను వెంటనే Joe దగ్గరికి వెళ్లి, ఇన్ని రోజులు మనం ఈ ప్లేస్ అంతటిని రక్షిస్తే మనకి అట్లీస్ట్ కొంచెం షేర్ కూడా రాయలేదు. Tess ఈ ప్లేస్ మొత్తాన్ని అమ్మేయాలనుకుంటుందని frustrate అవుతుంది. అప్పుడు joe ఆమెతో, “టెస్ ఇప్పుడే కదా వచ్చింది. తనకి కొంచెం టైం ఇద్దాం, తను తన ఆలోచన మార్చుకొని ఇక్కడే ఉండొచ్చేమోలే” అని చెప్తాడు. కట్ చేస్తే మరుసటి ఉదయం, టెస్ వాల్టర్ ని జో దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ ప్లేస్ లోనే కొన్ని సంవత్సరాల క్రితం టెస్ మదర్ ఉరివేసుకొని చనిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే టెస్ కి అది గుర్తొచ్చి కాస్త బాధ పడుతుంది. టెస్ జోతో నువ్వు వాల్టర్ ని చూస్తుండు, నేను మార్గరెట్ దగ్గరికి వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుండి మార్గరెట్ దగ్గరికి వెళ్తుంది.
ఆమె మార్గరెట్ ని ఇంటి పేపర్స్ ఎక్కడున్నాయని అడగడంతో పక్కనే మెయిల్ బాక్స్ దగ్గర ఉన్నాయి చూడమని చెప్తది. ఇక టెస్ వాటిని తీసుకొని ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తుంటుంటది. అదే సమయంలో టౌన్ షరీఫ్ జాన్ అక్కడికి వస్తాడు. జాన్ మార్గరెట్ దగ్గరికి వెళ్లి మిస్సి ఫోటోనీ చూపించి, “ఈ అమ్మాయి కనిపించట్లేదు. లాస్ట్ గా ఈ అమ్మాయి మీ ఏరియాకి వచ్చినట్టు తెలిసింది. మీరు ఏమైనా చూశారా?” అని అడుగుతాడు. దానికి మార్గరేట్ నేనీ అమ్మాయిని చూడలేదని చెప్తది. సరే ఒకవేళ joe ఏమైనా చూసుండొచ్చేమో అని జాన్ జో దగ్గరికి వచ్చి మిస్సి గురించి అడుగుతాడు. కానీ joe కూడా నేను తనని చూడలేదని అబద్ధం చెప్తాడు.
ఇక జాన్ అక్కడ్నుంచి వెళ్లబోతుండగా తను టెస్ ని చూస్తాడు. జాన్ అండ్ టెస్ చిన్నప్పుడు క్లాస్మేట్స్. జాన్ టెస్ ని గుర్తుపట్టి పలకరిస్తాడు. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఇద్దరం డిన్నర్ కి వెళ్దామని అంటాడు. దానికి tess చూద్దామని ఆన్సర్ ఇస్తుంది. కట్ చేస్తే కాసేపయ్యాక joe, tess and వాల్టర్ ని తీసుకెళ్లి, తను గ్రేప్స్ నుండి వైన్ ఎలా తయారు చేస్తాడో చూపిస్తూ చెప్తుంటాడు. అప్పుడు వాల్టర్ మిషన్ కి ఉన్న బ్లడ్ మరకలు చూసి, “అది బ్లడ్ ఏ కదా?” అని అంటాడు. కానీ joe మాత్రం, “అది బ్లడ్ కాదు. జస్ట్ grapes కి సంబంధించిన మరకలు” అని టాపిక్ మార్చేస్తాడు. కట్ చేస్తే నలుగురు ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు.
3) మరో ప్రాణంకి టార్గెట్
వాళ్లలో రోజర్ అనే అబ్బాయి ఉంటాడు. బట్ అతను గే. అతను joe చూసి టెంప్ట్ అయ్యి, “నాకు మీ వైన్ ఫ్యాక్టరీ చూపిస్తావా” అని అడుగుతాడు. Joe కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక అమ్మాయిలు రోజర్ ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. Joe ఫ్యాక్టరీ అంతా చూపిస్తుండగా, రోజర్ joe కి మసాజ్ చేస్తూ టెంప్ట్ చేయాలని చూస్తాడు అండ్ joe ని కిస్ కూడా చేస్తాడు. నేనేంటి అబ్బాయితో రొమాన్స్ చేస్తున్నానని joe వాడ్ని పక్కకు తోసేస్తాడు. బట్ చంపడానికి మరొకడు దొరికాడు కదా అని అనుకున్నాడో ఏమో గాని, ఇంతకుముందు మిస్సిని ఎక్కడైతే చంపారో వాడిని అక్కడికి తీసుకెళ్తాడు. ఇక రోజర్ joe తో రొమాన్స్ చేస్తుండగా, ఆ టైంలో joe కి చిన్నప్పుడు మార్గరెట్ తనని అబ్యూస్ చేసిన మెమరీస్ గుర్తొస్తాయి.

సింపుల్ గా చెప్పాలంటే మార్గరెట్ తన ఫిజికల్ నీడ్స్ కోసం joe నీ యూస్ చేసుకుంటది. దానివల్ల joe మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇక joe ఆ కోపాన్ని రోజర్ పై చూపించి రోజర్ ని బాగా కొట్టడంతో వాడు అన్కాన్షియస్ గా పడిపోతాడు. Joe ఆ మెమోరీస్ నుంచి బయటకు వచ్చి అరే ఏంటి నేను ఇలా కొట్టేశానని వెంటనే బయటికి వెళ్లి బ్లడ్ అంతటిని క్లీన్ చేసుకుంటాడు. ఆ తరువాత మార్గరేట్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. ఇక ఇద్దరూ రోజర్ దగ్గరికి వస్తారు. మిస్సిని ఎలాగైతే కట్టేశారో రోజర్ని కూడా అలానే కట్టేస్తారు. మార్గరెట్ joe ని అక్కడ్నుంచి వెళ్ళిపొమ్మని మిస్సిని ఎలాగైతే చంపేసిందో రోజర్ ని కూడా అంతే చంపేస్తుంది.
ఆ టైంలో రోజర్ అరిచిన అరుపులు వాల్టర్ కి వినిపించి, వాడికి భయం వేసి టెస్ దగ్గరికి వెళ్లి, నాకు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తాడు. దానికి ఆమె, “ఏదైనా పేడకలై ఉంటదిలే! నువ్వు పడుకో” అని చెప్తుంది. మార్గరెట్ బయటికి వచ్చి, “వాడి కథ ముగిసిపోయింది. బాడిని డిస్పోస్ చేసేయ్” అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక joe వాడి బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని తీసుకెళ్లి మిషన్లో వేస్తాడు. దాంతో వాడి బాడీ మొత్తం pulp లా అవుతుంది. ఇక joe దాన్ని తీసుకెళ్లి ఒకచోట గుంత తీసి కప్పెట్టేస్తాడు. తర్వాత ఒక్క ప్లేస్ లో కూడా బ్లడ్ మరకలు లేకుండా మొత్తాన్ని క్లీన్ చేసేస్తాడు.
4) టెస్ ఫాదర్ అరాచకాలు
రోజర్ ఫ్రెండ్స్ అతను మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇస్తారు. అండ్ లాస్ట్ గా అతన్ని వినియాడ్ దగ్గరే వదిలిపెట్టామని చెప్తారు. సో జాన్ రోజర్ కోసం వినియాడ్ దగ్గరికి వస్తాడు. జాన్ టెస్ కి రోజర్ ఫొటోని చూపించి, “ఇతన్ని ఎక్కడైనా చూసావా?” అని అడుగుతాడు. అపుడు టెస్, “నేను చూడలేదు” అని చెప్పి కుదిరితే ఈరోజు రాత్రి డిన్నర్ కి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇక జాన్ అక్కడనుండి joe వ్యాన్ దగ్గరికి వెళ్లి అతన్ని బయటికి రమ్మని పిలుస్తాడు. అదే సమయంలో మార్గరెట్ అక్కడికి రావడంతో జాన్ రోజర్ ఫోటోని చూపించి, “ఇతన్ని ఏమైనా చూశారా?” అని అడుగుతాడు. కానీ ఆమె నేను చూడలేదని చెప్తది. Joe ని కూడా బయటకు పిలిచి, “రోజర్ ని అతని ఫ్రెండ్స్ ఇక్కడే డ్రాప్ చేశారంట.
నువ్వు అతన్ని ఏమైనా చూసావా?” అని అడుగుతాడు. అందుకు joe చూడలేదని చెప్తాడు. రోజర్ ఫ్రెండ్స్ ఏమో మేము అతన్ని వినియార్డ్ దగ్గరే వదిలిపెట్టామని చెప్పారు. కానీ వీళ్ళేమో అసలు అతన్ని చూడలేదని అంటున్నారు. ఇదేదో తేడాగా ఉందని జాన్ కి వాళ్ళ మీద డౌట్ వస్తది. కట్ చేస్తే జాన్ ఆరోజు రాత్రి డిన్నర్ కి టెస్ దగ్గరికి వస్తాడు. వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటుండగా జాన్ టెస్ ని, “నువ్వు ఎందుకసలు ఇంట్లో నుంచి పారిపోయావు?” అని అడుగుతాడు. దానికి టెస్, “మా నాన్న అంత మంచోడేం కాదు, చాలా చెడ్డవాడు” అని అతని ఫాదర్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తది. టెస్ ఫాదర్ ఆమెని ఫిజికల్ గా చాలా ఇబ్బంది పెడతాడు.

లిటరల్లీ చెప్పాలంటే ఆమెని ఫిజికల్ గా యూస్ చేసుకుంటాడన్నమాట. దాన్ని భరించలేక టెస్ ఒక రోజు తన అమ్మకి నిజం చెప్పేస్తది. చెప్పినా పెద్ద యూజ్ ఏం ఉండదు. టెస్ ఫాదర్ టెస్ మదర్ ని బాగా కొడతాడు. సో టెస్ అండ్ టెస్ మదర్ అతన్ని ఏం చేయలేకపోతారు. టెస్ తన ఫాదర్ వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ దారుణాలన్నీ చూడలేక టెస్ మదర్ ఉరి వేసుకుని చనిపోతుంది. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత టెస్ ఒక బాబుకి జన్మనిస్తుంది. కానీ టెస్ అత్తయ్య మార్గరెట్ ఆ బాబుని తీసుకెళ్లి ఒకచోట పాతేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి టెస్ ఇంటి నుంచి పారిపోతుంది. ఇదంతా విన్న జాన్ కాస్త షాక్ అయ్యి టెస్ ని ఓదార్చడం కోసం ఒక పాట పాడుతూ ఆమెతో డాన్స్ వేస్తాడు.
5) ట్విస్ట్ ఇక్కడ
ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్లిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ ఒక వైపు నుండి joe మరో వైపు నుండి మార్గరెట్ వింటూనే ఉంటారు. టెస్ ఫాదర్ తన చెల్లెలయిన మార్గరెట్ ని కూడా వదిలిపెట్టడు. ఆమెని కూడా ఫిజికల్ గా చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు joe టెస్ కి ఫ్యాక్టరీని చూపిద్దామని తీసుకెళ్లి తను రెడీ చేసిన వైన్ ని కొంచెం తాగమని ఇస్తాడు. ఆ టైంలో జో టెస్ ని కిస్ చేస్తాడు. అలా వాళ్లిద్దరూ కిస్ చేసుకుంటుండగా అదే సమయంలో వాల్టర్ రూమ్లోకొస్తాడు. తన మదర్ ని అలా చూసి వాల్టర్ కోపం వచ్చి గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టెస్ వెంటనే వాల్టర్ వెనకే వెళుతుంది.
Joe కి బాగా కోపం వచ్చి అక్కడున్న వైన్ బాస్కెట్ ని పగలగొట్టి వెంటనే అక్కడి నుంచి కార్ ఎక్కి ఎక్కడికో వెళ్లిపోతాడు. టెస్ వాల్టర్ తో మళ్ళీ అలా జరగదని సారీ చెప్తది. కానీ వాల్టర్ కి మాత్రం ఆ కోపంలానే ఉండి, “నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. మనం తొందరగా వెళ్ళి పోదాం” అని అంటాడు. దానికి టెస్, “ఈ ప్లేస్ అమ్మేసి మనం వెంటనే వెళ్ళిపోదాం లే” అని అంటది. అదే సమయంలో మార్గరెట్ అక్కడికి వచ్చి, “నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాను. సో కుదిరితే ఈరోజు నాతో లాస్ట్ డిన్నర్ చేయండి” అని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తది. కట్ చేస్తే రోజర్ ఫ్రెండ్ జాన్ కి ఫోన్ చేసి, “రోజర్ ని కనిపెట్టారా?” అని అడుగుతది. దానికి జాన్, “ఇంకా కనిపెట్టలేకపోయాను. వెతుకుతున్నాం” అని చెబుతాడు.
దానికామె, “నేను రోజర్ ని వినియాడ్ దగ్గరే వదిలిపెట్టాను. అతను joe తో ఫ్యాక్టరీని చూడడానికి లోపలికి వెళ్ళాడు” అని చెప్తది. అది విన్న తర్వాత జాన్ కి joe మీద అనుమానం వచ్చి వినియాడ్ దగ్గరికి బయలుదేరుతాడు. ఆరోజు రాత్రి మార్గరెట్, టెస్ అండ్ వాల్టర్ డిన్నర్ చేస్తుంటారు. బట్ ఆ ఫుడ్ తిన్న తర్వాత వాల్టర్ అండ్ టెస్ కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకంటే మార్గరెట్ ఆ ఫుడ్ లో మత్తుమందు కలిపి ఉంటుంది. ఆ తరువాత ఆమె వాల్టర్ ని ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తుంది. టెస్ అరవకుండా ఉండాలని నోటిని కట్టేసి ఆమెని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తుంది. వీళ్ళిద్దరిని చంపేస్తే ఆ ప్రాపర్టీ మొత్తం తనదే అవుతుంది కదా! అందుకే మార్గరెట్ ఇలా చేస్తది. కాసేపైన తర్వాత టెస్ మెలకువలోకి వస్తుంది.

6) ముగింపు
మార్గరెట్ టెస్ దగ్గరికి వెళ్లి, “నువ్వు మీ నాన్నని వదిలేసి నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు. ఆ తర్వాత మీ నాన్నని, ఈ ప్లేస్ మొత్తాన్ని నేనే ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చా. ఇప్పుడు నువ్వు డబ్బులు కోసం ఇక్కడికి వచ్చి ప్రాపర్టీ మొత్తం అమ్మేయాలని చూస్తే నేను సైలెంట్ గా ఉండాలా. ఈ ప్రాపర్టీ నా పేరు మీద రాయకపోతే వాల్టర్ ని చంపేస్తా” అని బెదిరిస్తది. అదే సమయంలో జాన్ వినియర్డ్ దగ్గరికి వస్తాడు. జాన్ వచ్చే సమయానికి joe కూడా ఇంటి దగ్గరికి వస్తాడు. జాన్ కి వినియాడ్ దగ్గర మిస్సీ యొక్క కారు కనిపిస్తుంది. అంటే మిస్సిని చూడలేదని joe నాకు అబద్ధం చెప్పాడని జాన్ కి అర్థం అవుతుంది.
ఇక జాన్ ఆ ప్లేస్ లో వెతుకుతుండగా ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తుంటాయి. జాన్ ఆ సౌండ్ వస్తున్న వైపుగా వెళ్తే వాల్టర్ ని క్రాస్ వుడ్ కి కట్టేసి ఉంటారు. జాన్ వాల్టర్ ని విడిపించి అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాడు. మరోవైపు మార్గరెట్ టెస్ తో, “చిన్నప్పుడు నీకు పుట్టిన బాబుని నేను చంపేశాననుకున్నావా? నేను వాన్ని చంపలేదు. మీ నాన్న వాడిని చంపాలనుకున్నాడు. కానీ నేను వాన్ని జాగ్రత్తగా పెంచాను. మీ నాన్న joe ని అడాప్ట్ చేసుకున్నాడని చెప్పాను కదా! వాడే నీకు మీ నాన్నకి నీకు పుట్టిన కొడుకు” అని చెప్తది. అది విన్న టెస్ షాకైపోతుంది. మరోవైపు జాన్ వాల్టర్ ని తీసుకుని వెళ్ళిపోతుండగా joe అక్కడికి వస్తాడు.
ఇక జాన్ కి joe కి మధ్యన పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ joe జాన్ ని పొడిచి చంపేస్తాడు. ఆ ఫైట్లో జోకి కూడా బాగా గాయాలయ్యి కిందపడిపోతాడు. ఇదే కరెక్ట్ టైం అని వాల్టర్ మెల్లగా ఫ్యాక్టరీలోకి వెళ్లి తన మదర్ కట్లని విప్పేస్తాడు. బట్ మార్గరెట్ వాడిని చూసేసి పట్టుకుంటుంది. కానీ టెస్ ఆమె మీద పడి ఒక రాయితో ఆమెను కొట్టి చంపేస్తుంది. ఈలోపు joe మేలుకువలోకొచ్చి అక్కడికి వస్తాడు. చనిపోయిన మార్గరెట్ ని చూసిన జోకి కోపం వచ్చి టెస్ ని చంపేయాలని చూస్తాడు. But వాల్టర్ joe పాకెట్ లో ఉన్న గ్రేప్ కట్టర్ తో జో గొంతు మీద గుచ్చడంతో అతను చనిపోతాడు. ఇక టెస్ and వాల్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు.
Image Credit: Wineville (2024)