Wineville (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

Wineville (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమాని చాలా భిన్నంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలియని భయం కలుగుతుంటది. అలాగని ఇదేమీ దయ్యాలకి సంబంధించిన సినిమా కాదులేండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే “Wineville”. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన థ్రిల్లర్ సినిమా. ఇందులో ఒక వ్యక్తి వల్ల చాలా మంది మనుషులు బాగా ఇబ్బందులు పడతారు. ఆ మనుషులు బయటి వారు కూడా కాదు. ఆ వ్యక్తి వల్ల ఇబ్బందిపడ్డది తన సొంత కుటుంబ సభ్యులే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తన వల్ల ఆ కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మరి కొన్ని క్షణాల్లోనే తెలుసుకుందాం.

అలాగే చాలా సంవత్సరాల తర్వాత సిటీ నుంచి సొంతింటికి తిరిగొచ్చిన ‘టెస్’ అనే అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు చంపాలని చూస్తారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు!? వాళ్ళు ఎందుకని ఆమెని చంపాలనుకుంటున్నారు!? వింటుంటే ఈ సినిమా చాలా ట్విస్టులతో నిండి ఉన్నట్టుంది కదా! అవును, సినిమా చాలా చాలా ట్విస్టులతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కథను సింపుల్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చెప్పబోతున్నాను.

ఇంటికి చేరుకున్న టెస్

‘మిస్సీ’ అనే అమ్మాయి కార్లో హైవే మీదుగా వెళ్తుంటది. అదే హైవేలో ‘జో’ కార్ పాడవడంతో తను తన కారుని రిపేర్ చేస్తుంటాడు. మిస్సీ అతన్ని చూసి టెంప్ట్ అయ్యి, “నేను నీకు లిఫ్ట్ ఇస్తా, వచ్చి కార్లో కూర్చో” అని అంటది. ఇక ఇద్దరు అక్కడినుంచి జో ప్రదేశానికి వెళ్తారు. ఎలాగూ మిస్సీకి జో మీద కోరిక కలిగింది కదా. అలా వారిద్దరు ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు మిస్సీ గదిలోకి వెళ్దామని జోకి సైగ చేస్తది. దాంతో జో ఆమెని తన వైన్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు. కట్ చేస్తే, మిస్సీని ఒక క్రాస్ కి కట్టేసి చిత్రహింసలు పెడతారు. తను భయంతో గట్టి గట్టిగా కేకలు వేస్తుంటది. అప్పుడక్కడికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మిస్సీని కత్తితో పొడిచి చంపేస్తారు.

‘టెస్’ తన కొడుకు ‘వాల్టర్’ ని తీసుకుని వైన్యార్డ్ వద్దకి బయల్దేరుతుంది. టెస్ చిన్నతనంలో తన నాన్న వల్ల చాలా చిత్రహింసలు పడిద్ది. అందుకని టెస్ తన టీనేజ్ దశలో ఇంట్లో నుంచి పారిపోద్ది. ప్రస్తుతం జో ఉంటున్న వైన్యార్డ్ ఓనర్ టెస్ యొక్క నాన్నే అనమాట. ప్రస్తుతం టెస్ వాళ్ళ నాన్న చనిపోయింటాడు అలాగే టెస్ యొక్క ఆర్ధిక స్థితి కూడా అంత మంచిగా ఉండదు. అందువల్ల తను వైన్యార్డ్ అమ్మేయాలనే ఉద్దేశంతో ఇంటికి వస్తది. టెస్ అత్తయ్య పేరు ‘మార్గరెట్’. మార్గరెట్ టెస్ ని ఆప్యాయంగా పలకరిస్తది. తను టెస్ కి జో ని పరిచయం చేసి ఇతన్ని మీ నాన్న, నేను దత్తత తీసుకున్నాం అని చెప్తది. టెస్ ఇంట్లోకి అడుగుపెట్టగానే తనకి తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి.

ఆమెని తన నాన్న చాలా చిత్రహింసలు పెట్టుంటాడు. తనకి అవన్నీ గుర్తొచ్చి చాలా ఇబ్బందిగా ఫీలవుతుంది. ఆరోజు సాయంత్రం లాయర్ ఇంటికి వచ్చి, “ఈ ప్రాపర్టీ మొత్తం మీ నాన్నగారు నీ పేరు మీదనే రాశారు. నువ్వు దీన్ని ఉంచుకోవచ్చు, లేదంటే మార్గరెట్ కి రాసియ్యొచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు… అంతా నీ ఇష్టం” అని చెప్తది. టెస్ కి ఆ ప్రదేశంలో చెడు జ్ఞాపకాలు తప్పా గుర్తుంచుకునేంత మంచి జ్ఞాపకాలు ఏమీ లేవు. అందువల్ల తను ఆ ప్రాపర్టీ అంతటిని అమ్మేసి, తన కొడుకు వాల్టర్ కి సిటీలో ఒక మంచి ఇళ్లు కొనియ్యాలని అనుకుంటది. ప్రాపర్టీ అంతటిని తన అన్న టెస్ పేరు మీదనే రాశాడని తెలిసి, “మా అన్న నన్ను ఇంతలా మోసం చేశాడా” అని మార్గరెట్ అనుకుంటది.

Wineville (2024) Movie Explained in Telugu - Summary & Ending Explained
Wineville (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained
పతకం వేసిన జో

తను వెంటనే జో దగ్గరికెళ్లి, “ఇన్ని రోజులు మనం ఈ ప్రాపర్టీ అంతటిని రక్షిస్తే మనకి కనీసం కొంచెం వాటా కూడా రాయలేదు. టెస్ ఈ ప్రాపర్టీ మొత్తాన్ని అమ్మేయాలనుకుంటుంది” అని కోపంగా చెప్తది. అప్పుడు జో, “టెస్ ఇప్పుడే కదా వచ్చింది. తనకి కొంచెం సమయమిద్దాం. తను తన ఆలోచన మార్చుకుని ఇక్కడే ఉండొచ్చేమో” అని అంటాడు. మరుసటి ఉదయం టెస్ వాల్టర్ ని జో దగ్గరికి తీసుకెళ్తది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రదేశంలోనే టెస్ అమ్మ ఉరివేసుకొని చనిపోద్ది. అక్కడికి వెళ్ళగానే టెస్ కి ఆ విషయం గుర్తుకురావడంతో తను కాస్త బాధపడుతుంది. టెస్ జోతో, “నువ్వు వాల్టర్ ని చూస్తుండు. నేను మార్గరెట్ దగ్గరికి వెళ్లి వస్తా,” అని చెప్పి మార్గరెట్ దగ్గరికెళ్తుంది.

తను ఇంటి పేపర్స్ ఎక్కడున్నాయని అడగడంతో, “అవి మెయిల్ బాక్స్ దగ్గర ఉన్నాయి చూడు” అని మార్గరెట్ చెప్తది. ఇక టెస్ వాటిని తీసుకొని ఆ ప్రదేశమంతా పరిశీలిస్తది. అదే సమయంలో టౌన్ షరీఫ్ ‘జాన్’ వస్తాడా. జాన్ మార్గరెట్ దగ్గరికి వెళ్లి మిస్సీ ఫోటోని చూపించి, “ఈ అమ్మాయి కొన్ని రోజులుగా కనిపించడం లేదు. తను చివరిగా మీ ఏరియాకి వచ్చినట్టు తెలిసింది. మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా?” అని అడుగుతాడు. దానికి మార్గరేట్, “లేదు, నేను ఈ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు” అని చెప్తది. ఒకవేళ జో ఏమైనా చూసుండొచ్చేమో అని జాన్ జో దగ్గరికి వెళ్ళి మిస్సీ ఫోటోని చూపిస్తాడు. జో కూడా మిస్సీని చూడలేదని అబద్ధం చెప్తాడు.

ఇక జాన్ అక్కడ్నుంచి వెళ్లబోతుండగా తనకి టెస్ కనిపిస్తది. వీరిద్దరు చిన్నప్పుడు ఒకే క్లాస్ అవమాట. అలా జాన్ టెస్ ని గుర్తుపట్టి పలకరిస్తాడు. ఎప్పుడైనా ఖాలి సమయం ఉంటే ఇద్దరం డిన్నర్ కి వెళ్దామని జాన్ అంటాడు. దానికి టెస్, “సరే, చూద్దాం” అని అంటది. కొంచెంసేపటి తర్వాత టెస్ మరియు వాల్టర్ ని జో ఫాక్టరీ వద్దకి తీసుకెళ్లి, తను ద్రాక్షాల నుండి వైన్ ఎలా తయారు చేస్తాడో చూపిస్తాడు. అప్పుడు మిషన్ కి కొన్ని రక్తపు మరకలు ఉండడాన్ని వాల్టర్ చూసి, “అవి రక్తపు మరకలే కదా?” అని అంటాడు. కానీ జో మాత్రం, “అవి రక్తపు మరకలు కాదు. కేవలం ద్రాక్షా రసం యొక్క మరకలు” అని టాపిక్ మార్చేస్తాడు. కొంచెంసేపటి తర్వాత నలుగురు స్నేహితులు అటువైపుగా వస్తారు.

మరో ప్రాణంకి టార్గెట్

వాళ్లలో ‘రోజర్’ అనే అబ్బాయి ఉంటాడు. నిజానికి తను గే అనమాట. అతను జోని చూసి టెంప్ట్ అయ్యి, “నాకు మీ వైన్ ఫ్యాక్టరీ చూపిస్తావా?” అని అడుగుతాడు. అందుకు జో కూడా ఒప్పుకుంటాడు. ఇక ఆ స్నేహితులు రోజర్ ని జో దగ్గర వదిలి తమ పనికి వెళ్ళిపోతారు. జో ఫ్యాక్టరీ అంతా చూపిస్తుండగా రోజర్ తనకి మసాజ్ చేస్తూ ముద్దు పెట్టుకుంటాడు. నేనేంటి అబ్బాయితో రొమాన్స్ చేస్తున్నానని జో వాడ్ని పక్కకు తోసేస్తాడు. కానీ చంపేందుకు మరొకడు దొరికాడులే అని అనుకున్నాడో ఏమో గాని, ఇంతకుముందు మిస్సీని ఎక్కడైతే చంపారో రోజర్ ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. ఇక రోజర్ జోతో రొమాన్స్ చేయడం మొదలుపెడతాడు. ఆ సందర్భంలో తనని చిన్నప్పుడు మార్గరెట్ ఏ విధంగా చిత్రహింసలు పెట్టిందో జో గుర్తుచేసుకుంటాడు.

అంటే మార్గరెట్ తన శారీర కోరికలు తీర్చుకునేందుకు జో ని వాడుకుంటదనమాట. దానివల్ల జో మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇక జో ఆ కోపాన్ని రోజర్ పై చూపించి తనని బాగా కొట్టడంతో తను సృహకోల్పోతాడు. అరే ఏంటి నేను ఇలా కొట్టేశానని జో వెంటనే బయటికెళ్లి తనకి అంటుకున్న రక్తమంతటిని శుభ్రం చేసుకుంటాడు. ఆ తరువాత మార్గరేట్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. ఇక వాళ్లిద్దరు రోజర్ దగ్గరికి వచ్చి మిస్సీని ఎలాగైతే కట్టేశారో తనని కూడా అలాగే కట్టేస్తారు. మార్గరెట్ జో ని బయటికి వెళ్ళమని చెప్పి, మిస్సీని ఎలాగైతే చంపేసిందో రోజర్ ని కూడా అంతే చంపేస్తది.

ఆ సమయంలో రోజర్ అరిచిన అరుపులు వాల్టర్ కి వినిపిస్తాయి. వాల్టర్ భయంతో టెస్ దగ్గరికి వెళ్లి, “నాకు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి” అని చెప్తాడు. దానికి టెస్, “అది పీడ కల అయింటదిలే! నువ్వు ప్రశాంతంగా పడుకో” అని అంటది. మార్గరెట్ బయటికొచ్చి, “వాడి కథ ముగిసిపోయింది. త్వరగా శవాన్ని మాయం చేసేయ్” అని జో కి చెప్తది. ఇక జో రోజర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మిషన్లో వేసేస్తాడు. దాంతో రోజర్ శరీరం నుజ్జునుజ్జుగా అయిద్ధి. ఇక జో దాన్ని తీసుకెళ్లి ఒకచోట గుంత తీసి కప్పెట్టేస్తాడు. తర్వాత ఎక్కడా ఒక్క చుక్క రక్తం లేకుండా మరకలు మొత్తం శుభ్రం చేస్తాడు.

Wineville (2024) Movie Explained in Telugu - Summary & Ending Explained
Wineville (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained
టెస్ నాన్న యొక్క అరాచకాలు

రోజర్ కనిపించడం లేదని తన స్నేహితులు పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు. చివరిగా అతన్ని వైన్యార్డ్ దగ్గరే వదిలిపెట్టామని స్నేహితులు చెప్తారు. కాబట్టి జాన్ రోజర్ కోసం వైన్యార్డ్ దగ్గరికి వస్తాడు. తను టెస్ కి రోజర్ ఫొటోని చూపించి, “ఇతన్ని ఎక్కడైనా చూశావా?” అని అడుగుతాడు. అపుడు టెస్, “లేదు, నేను చూడలేదు” అని చెప్తది. అలాగే, “కుదిరితే ఈరోజు రాత్రి డిన్నర్ కి ఇంటికి రా” అని టెస్ తనని ఆహ్వానిస్తది. ఇక జాన్ అక్కడి నుండి జో దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో మార్గరెట్ అక్కడికి రావడంతో జాన్ రోజర్ ఫోటోని చూపించి, “ఇతన్ని ఏమైనా చూశారా?” అని అడుగుతాడు. నేను చూడలేదు అని మార్గరెట్ చెప్తది. “రోజర్ ని అతని స్నేహితులు ఇక్కడే వదిలి పెట్టారంట.

నువ్వు తనని ఏమైనా చూశావా?” జాన్ జో ని అడుగుతాడు. అందుకు జో, “ఏమో, నేను చూడలేదు” అని అంటాడు. రోజర్ స్నేహితులేమో మేము అతన్ని  వైన్యార్డ్ దగ్గరే వదిలిపెట్టామని చెప్పారు. కానీ వీళ్ళేమో అసలు అతన్ని చూడలేదని అంటున్నారు. ఇదేదో తేడాగా ఉంది అని జాన్ కి వాళ్ళ మీద అనుమానం కలిగిద్ది. జాన్ ఆరోజు రాత్రి డిన్నర్ చేసేందుకు టెస్ దగ్గరికొస్తాడు. వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటుంటారు. అప్పుడు జాన్, “అసలు నువ్వు ఎందుకని ఇంట్లో నుంచి పారిపోయావు?” అని అడుగుతాడు. దానికి టెస్, “మా నాన్న అంత మంచోడు కాదు, తను చాలా చెడ్డవాడు” అని అంటూ తన నాన్న గురించి చెప్పడం మొదలుపెట్టిద్ది. టెస్ నాన్న తనని శారీరకంగా బాగా ఇబ్బందిపెడతాడు.

నిజం చెప్పాలంటే అతను టెస్ ని శారీరకంగా ఉపయోగించుకున్నాడనమాట. టెస్ అది భరించలేక ఒక రోజు తను అమ్మకి నిజం చెప్పేస్తది. కానీ టెస్ నాన్న టెస్ అమ్మని బాగా కొడతాడు. చివరికి టెస్ తన నాన్న వల్ల గర్భవతి అవుద్ది. ఈ దారుణాలు చూడలేక టెస్ అమ్మ ఉరి వేసుకుని చనిపోద్ది. కొన్ని నెలలు గడిచిన తర్వాత టెస్ ఒక బాబుకి జన్మనిస్తది. కానీ మార్గరెట్ ఆ బాబుని తీసుకెళ్లి ఒకచోట భూమిలో పాతి పెట్టిద్ది. ఆ తర్వాత కొన్ని రోజులకి టెస్ ఇంటి నుంచి పారిపోద్ది. ఇదంతా విన్న జాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తను టెస్ ని ఓదార్చేందుకు సరదాగా ఒక పాట పాడుతూ ఆమెతో డాన్స్ వేస్తాడు.

ఆహారంలో మత్తుమందు!

కొంచెంసేపటి తర్వాత జాన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వీళ్లిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నింటినీ ఒక వైపు నుండి జో మరో వైపు నుండి మార్గరెట్ వింటారు. టెస్ ఫాదర్ మార్గరెట్ ని కూడా వదిలిపెట్టడు. తను ఆమెను కూడా శారీరకంగా చాలా ఇబ్బంది పెడతాడు. మరుసటి రోజు జో టెస్ ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి తను తయారుచేసిన వైన్ కొంచెం తాగమని ఇస్తాడు. ఆ సమయంలో జో టెస్ కి ముద్దు పెడతాడు. అలా వాళ్లిద్దరూ ముద్దు పెట్టుకుంటుండడాన్ని వాల్టర్ చూస్తాడు. తన అమ్మ అలా వేరే వ్యక్తిని ముద్దు పెట్టుకోవడంతో వాల్టర్ కి చాల కోపం వస్తది. తను కోపంతో గట్టిగా అరిచి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. టెస్ వెంటనే వాల్టర్ వెనకే వెళ్తది.

జో కోపంతో పక్కనున్న వైన్ బాస్కెట్ పగలగొట్టి వెంటనే అక్కడ్నుంచి కార్లో ఎక్కడికో వెళ్లిపోతాడు. టెస్ వాల్టర్ కి క్షమాపణ చెప్పిద్ది. కానీ వాల్టర్ మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. “నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. మనం తొందరగా మన ఇంటికి వెళ్ళిపోదాం” అని అంటాడు. దానికి టెస్, “ఈ ప్రాపర్టీని అమ్మేసిన వెంటనే మనం వెళ్ళిపోదాం” అని అంటది. అదే సమయంలో మార్గరెట్ అక్కడికొచ్చి, “నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నా. కుదిరితే ఈరోజు నాతో కలిసి డిన్నర్ చేయండి” అని ఆహ్వానిస్తది. రోజర్ స్నేహితులు జాన్ కి ఫోన్ చేసి, “రోజర్ ఎక్కడున్నాడో కనిపెట్టారా?” అని అడుగుతారు. దానికి జాన్, “ఇంకా తనని కనిపెట్టలేకపోయాము, వెతుకుతున్నాం” అని చెప్తాడు.

Wineville (2024) Movie Explained in Telugu - Summary & Ending Explained
Wineville (2024) Movie Explained in Telugu – Summary & Ending Explained

“మేము రోజర్ ని వైన్యార్డ్ దగ్గరే వదిలిపెట్టాము. అతన్ని జో ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లాడు” అని చెప్తారు. అది విన్న తర్వాత జాన్ కి జో మీద అనుమానం వచ్చి వెంటనే వైన్యార్డ్ దగ్గరికి బయల్దేరుతాడు. ఆరోజు రాత్రి మార్గరెట్, టెస్ మరియు వాల్టర్ డిన్నర్ చేస్తుంటారు. డిన్నర్ చేసిన వెంటనే వాల్టర్, టెస్ కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకంటే మార్గరెట్ తమ ఆహారంలో మత్తుమందు కలిపిద్ది. మార్గరెట్ వాల్టర్ ని ఒక గదిలోకి తీసుకెళ్ళి బంధిస్తది. తర్వాత టెస్ ని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తది. వీళ్ళిద్దర్ని చంపేస్తే ఆ ప్రాపర్టీ మొత్తం తనదే అవుతుంది కదా! అందుకే మార్గరెట్ వాళ్లని చంపేందుకు పథకం వేస్తది. కాసేపటి తర్వాత టెస్ మెలకువలోకి వస్తది.

నిజం చెప్పిన మార్గరెట్

అప్పుడు మార్గరెట్ మాట్లాడుతూ, “నువ్వు మీ నాన్నని వదిలేసి దూరంగా వెళ్ళిపోయావ్. అప్పటి నుంచి మీ నాన్నని, ఈ ప్రాపర్టీ మొత్తాన్ని నేనే ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చా. ఇప్పుడు నువ్వు డబ్బుల కోసం ఇక్కడికొచ్చి ప్రాపర్టీ మొత్తం అమ్మేయాలని చూస్తే నేను మౌనంగా ఉండాలా. ఈ ప్రాపర్టీని నా పేరు మీద రాయకపోతే వాల్టర్ ని చంపేస్తా” అని బెదిరిస్తది. అదే సమయంలో జాన్ వైన్యార్డ్ దగ్గరికొస్తాడు. జాన్ వచ్చే సమయానికి జో కూడా తిరిగిస్తాడు. జాన్ కి వైన్యార్డ్ దగ్గర మిస్సీ యొక్క కారు కనిపిస్తది. అంటే మిస్సీని చూడలేదని జో ఇంతకుముందు నాకు అబద్ధం చెప్పాడనమాట అని జాన్ కి అర్థమయిద్ది.

అదే సమయంలో ఎవరో గట్టిగట్టిగా అరుస్తున్నట్టు జాన్ కి శబ్ధాలు వినిపిస్తుంటాయి. జాన్ ఆ శబ్ధాల్ని అనుసరిస్తూ వాల్టర్ ని చేరుకుంటాడు. జాన్ వాల్టర్ ని కాపాడి తనని గదిలోంచి బయటికి తీసుకొస్తాడు. మరోవైపు మార్గరెట్ టెస్ తో మాట్లాడుతూ, “చిన్నప్పుడు నీకు పుట్టిన బాబుని నేను చంపేశాననుకున్నావా? నేను వాన్ని చంపలేదు. మీ నాన్న వాడిని చంపాలనుకున్నాడు. కానీ నేను వాన్ని జాగ్రత్తగా పెంచాను. మీ నాన్న, నేను జో ని దత్తత తీసుకున్నాం అని చెప్పాను కదా! నిజానికి వాడే నీకు, మీ నాన్నకి పుట్టిన కొడుకు” అని చెప్తది. అది విన్న టెస్ ఒక్కసారిగా షాకైపోద్ది. మరోవైపు జాన్ వాల్టర్ ని తీసుకుని వెళ్ళిపోతుండడాన్ని జో చూసేస్తాడు.

ఇక జాన్, జో మధ్యన పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ కొట్లాటలో జో జాన్ ని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ కొట్లాటలో తనకి కూడా బాగా గాయాలవడంతో తను సృహతప్పి కిందపడిపోతాడు. ఇదే సరైన సమయమని వాల్టర్ మెల్లగా ఫ్యాక్టరీలోకి వెళ్లి తన అమ్మని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు మార్గరెట్ వాల్టర్ ని పట్టుకోబోతుండగా టెస్ ఒక రాయితో మార్గరెట్ ని చంపేస్తుంది. ఈలోపు జో మెలకువలోకి వస్తాడు. టెస్ మార్గరెట్ ని చంపేయడంతో జోకి చాలా కోపం వస్తది. ఆ కోపంతో తను టెస్ ని చంపబోతుండగా, వాల్టర్ గ్రేప్ కట్టర్ ఉపయోగించి జో ని దారుణంగా చంపేస్తాడు.

ముగింపు

చూశారు కదా ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో! ఈ సినిమాలో మీకు అర్థంకాని సన్నివేశాల్ని మరియు ఎండింగ్ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా ఇప్పటివరకు వివరించడం జరిగింది.

  • నాకైతే ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. సినిమాలో బలమైన కథ ఉంది. ఆ కథని ఇంకొంచెం బలంగా తెరకెక్కించి ఉండుంటే సినిమా ఫలితం ఇంకా చాలా బాగా వచ్చుండేది.
  • కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్టులు రివీల్ చేసే సన్నివేశాల్లో ఇంకాస్త ఇంటెన్స్ చూపించుంటే బాగుండేది. సినిమాలోని ప్రతీ ఒక్కరూ తమ పాత్రకి తగ్గ నటనని కనబరిచారు.
  • తన నాన్న వల్ల టెస్ ఎంతలా బాధపడిందో, తను ఎంతలా నరకం అనుభవించిందో డైరెక్టర్ చాలా బాగా చూపించారు.

ఈ సినిమాని కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చా? అని అడిగితే మాత్రం, ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడకపోతేనే మంచిది అనేది నా అభిప్రాయం. మొత్తానికి ఎలాగోలా ఈ సినిమా ప్రేక్షకుల యొక్క దృష్టిని ఆకర్షించి కాస్త మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఆలస్యం ఎందుకు! మీరు కూడా ఒకసారి ఈ సినిమాని చూసేయండి.

Leave a Comment