The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu

The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu

Lionsgate Distribute చేసిన “The Stranger: Chapter 1” అనే హార్రర్ సస్పెన్స్ మూవీ 4.6/10 IMDb రేటింగ్ ని సాధించింది. మే 17, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Renny Harlin” దర్శకుడిగా “Bryan Bertino” రచయితగా వ్యవహరించారు. Ema Horvath, Froy Gutierrez, Emma Bruccoleri, Gabriel Basso మరియు Madeline Petsch ప్రధాన పాత్రల్లో నటించారు. 8.5 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 48.2 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.

ఇప్పుడు మెయిన్ స్టోరీ!
1) రోడ్ ట్రిప్

Open చేస్తే, Jeff Morell అనే వ్యక్తి ఎవరినుంచో తప్పించుకుంటూ ఒక నిర్మానుష్యమైన అడవిలో పరిగెడుతుంటాడు. అలా jeff వేగంగా పరిగెడుతూ పొరపాటున తను కింద పడిపోతాడు. ఇక Jeff ని తరుముతున్న Killers అక్కడికి వచ్చి jeff ని చంపేస్తారు. అసలీ సైకో కిల్లర్స్ ఎవరు? వీరెందుకు Jeff ని చంపారో తెలియాలంటే మనం movie లోకి వెళ్ళాల్సిందే! రయన్ and మాయ తమ three days road trip లో భాగంగా Portland కి వెళ్తుంటారు. Present వాళ్లున లొకేషన్ నుంచి Portland ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరుకునేందుకు సుమారు ఐదున్నర గంటల సమయం పట్టిద్ది.

కాబట్టి ఈ లోపు ఎక్కడైనా ఆగి, ఏమైనా తిందామని రయన్ అంటాడు. So, మాయ google maps లో చెక్ చేసి, ఒక కేఫ్ ని find out చేస్తుంది. ఇక వారిద్దరు భోజనం చేసేందుకు ఆ కేఫ్ ఉన్న లొకేషన్ కి వెళ్తుంటారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్స్ కి సిగ్నల్ కట్ అవుతుంది. దాంతో అసలు వారిద్దరు ఎక్కడున్నారన్న విషయం, తమకి ఏమీ అర్థం కాదు. కొంచెం ముందుకు వెళ్తే సిగ్నల్ అందుకుంటదేమో అన్నట్టుగా, వాళ్ళు కార్ ని డ్రైవ్ చేసుకుంటూ ఇంకా కొంత దూరం ముందుకు వెళ్తారు. అప్పుడు వాళ్ళకి “వీనస్” అనే ఒక చిన్న టౌన్ కనిపిస్తుంది. Civilization కనిపించడంతో రయన్, మాయ కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతారు.

ఇంతకుముందు Google maps లో చూసిన కేఫ్ కూడా అక్కడే ఉండడంతో, ఇక రయన్, మాయ తమ కార్ ని పక్కన పార్క్ చేసి కేఫ్ లోకి enter అవుతారు. అయితే వాళ్లు కార్ పార్క్ చేసి, కేఫ్ లోకి వెళ్ళడాన్ని రూడి and డగీ అనే ఇద్దరు వ్యక్తులు గమనిస్తారు. యాక్చువల్ గా, రయన్, మాయ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉంటారు. ఈ రోజు వాళ్ళ 5 years anniversary కూడా. తమ మాటల సందర్భంలో ఈ విషయం కేఫ్ లో ఉన్న remaining Customers కి కూడా తెలుస్తుంది. అప్పుడు నీల్, ఈడెన్, వాళ్ళిద్దరికీ తమని తాము పరిచయం చేసుకుని, “ఈ రోజు మాది కూడా anniversary నే, మాకు marriage అయ్యి ఇప్పటికి 2 years complete అయింది. మీకు marriage అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందని అడుగుతారు.

The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu
The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu
2) కార్ పాడవడం

దానికి రయన్, “మేమింకా పెళ్లి చేసుకోలేదు, మేము last 5 years గా రిలేషన్ లోనే ఉన్నామని అంటాడు. “ఐదు సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉంటూ, ఇంకా నువ్వు తనని పెళ్లి చేసుకోకుండా దేనికోసం ఎదురుచూస్తున్నావు” అని కారోల్ కాస్త ఆడ్ గా రయన్ తో అంటది. కట్ చేస్తే, రయన్, మాయ కేఫ్ లో భోజనం చేసిన తర్వాత బయటికి వచ్చి, తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేందుకు కార్ ని start చేస్తారు. కానీ ఆ కార్ start అవ్వదు. “ఇందాకటి వరకు బాగానే ఉంది కదా, మరి ఇప్పుడేమయింది, కార్ అసలు start అవడం లేదు” అని వాళ్ళిద్దరూ కాస్త టెన్షన్ గా ఫీల్ అవుతారు.

అప్పుడు రూడి అక్కడికి వచ్చి తనని తాను వాళ్ళిద్దరికీ పరిచయం చేసుకుని, కార్ కి వచ్చిన problem ఏంటో ఒకసారి check చేస్తాడు. యాక్చువల్ గా, ఈ రూడి and డగీ ఒక గ్యారేజ్ ని రన్ చేస్తుంటారు. అలా రూడి వాళ్ళ కార్ ని చెక్ చేసి, “Alternator Short అయింది, అందుకే కార్ start అవడం లేదని రయన్, మాయ తో చెప్తాడు. కొత్త Alternator ని వేరే గరాజ్ లోంచి తెప్పించి, దానిని కార్ లో fix చేసేందుకు మినిమం రేపటి మధ్యానం వరకు సమయం పడుతుంది. కాబట్టి ఈ రోజు రాత్రికి రయన్, మాయ ఆ town లోనే ఉండాల్సి వస్తుంది. మాయ, రూడీతో, “మరి మేమిక్కడ ఈ రోజు రాత్రికి stay చేసేందుకు, మోటల్స్ ఏమైనా ఉన్నాయా?” అని అడుగుతుంది.

“Motels అయితే present ఏమీ లేవు, కానీ Joe అనే వ్యక్తి అప్పుడప్పుడు తన ఇంటిని రెంటుకిస్తుంటాడు. Joe every year కొన్ని నెలలు hunting కి వెళ్తుంటాడు. ఇప్పుడు కూడా తను ఇళ్లు వదిలిపెట్టి hunting కి వెళ్ళాడు. కానీ పర్లేదు, మీరు Joe ఇంట్లో ఈ రోజు రాత్రికి stay చేయొచ్చని, రూడి and Shelly అంటారు. మాయ కూడా joe ఇంట్లో stay చేసేందుకు ఒప్పుకుంటది. కాకపోతే రయన్ కి మాత్రం ఇదంతా ఒక Scam లాగా అనిపిస్తది. రయన్, మాయాతో, “మనం కార్ పార్క్ చేసి కేఫ్ లోకి వెళ్లిన తర్వాత, వీరిద్దరే మన కార్ ని damage చేసి, ఇప్పుడిలా నాటకాలు ఆడుతున్నట్టుంది” అని రూడి, డగీలనుద్దేశించి అంటాడు.

3) గుర్తు తెలియని వ్యక్తి

కానీ మాయ మాత్రం రయన్ మాటల్ని అంతగా పట్టించుకోదు. “మనం three days గా కార్ లో తిరుగుతునే ఉన్నాం కదా, కాబట్టి నిజంగానే మన కార్ పాడయ్యి ఉండొచ్చని, మాయ, రయన్ తో చెప్తది. దాంతో రయన్ కూడా కాంప్రమైజయ్యి joe ఇంట్లో stay చేసేందుకు ఒప్పుకుంటాడు. రయన్ కూడా ఒప్పుకోవడంతో, ఇక షెల్లీ వారిద్దరిని తన కార్ లో ఎక్కించుకుని, Joe ఇంటి దగ్గర drop చేస్తుంది. కట్ చేస్తే, రయన్, మాయ, తమ 5 years relationship లో జరిగిన happy moments అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రొమాన్స్ చేసుకోవడం మొదలుపెడతారు.

The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu
The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu

సరిగ్గా అదే సమయంలో ఒక Unknown Person అక్కడికి వచ్చి, డోర్ ని బలంగా కొడతారు. “ఈ time లో ఇక్కడికి ఎవరు వచ్చారు?” అని అనుకుంటూ రయన్ door ని open చేస్తాడు. అప్పుడు ఆ Unknown Person రయన్ తో, “ఇక్కడ టమారా ఉందా?” అని అడుగుతుంది. దానికి రయన్, “మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టుంది, ఇక్కడ టమారా అనే పేరుతో ఎవరూ లేరని చెప్తాడు. దాంతో తను అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఈ unknown person ని మనం K1 అనే పేరుతో పిలుద్దాం. Joe ఇళ్లు ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒంటరిగా ఉంటది. So రయన్, మాయ, “అసలీ అమ్మాయి ఒంటరిగా ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఎలా వచ్చిందని కాస్త suspicious గా ఫీల్ అవుతారు.

Next scene లో వాళ్ళిద్దరూ K1 టాపిక్ ని వదిలేసి, మళ్లీ సరదాగా మాట్లాడుకుంటుంటారు. నిజానికి మాయకి marriage అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకనే రయన్, తనని ఇప్పటివరకూ marriage చేసుకోకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు మాయ, తనని marriage చేసుకునేందుకు సిద్ధంగా ఉందని రయన్ కి తెలియడంతో, రయన్ చాలా సంతోషిస్తాడు. మాయ, రయన్ తో మాట్లాడుతూ, “నాకు Portland లో జాబ్ వచ్చిన తర్వాత, నువ్వు నా దగ్గరికి పూర్తిగా వచ్చేస్తావు కదా” అని అడుగుతుంది. “అలాగే, ఖచ్చితంగా వస్తానని రయన్ కూడా చెప్తాడు. రయన్ కి ఆస్తమా ఉంటుంది. So, తనకిప్పుడు కాస్త ఊపిరాడనట్టుగా అనిపించడంతో రయన్ తన inhaler కోసం వెతుకుతాడు.

4) రయన్ టౌన్ లోకి వెళ్ళడం

అయితే inhaler కార్ లోనే ఉందన్న విషయం ఇప్పుడు వాళ్లకి గుర్తుకురావడంతో, రయన్, మాయని ఇంట్లోనే ఉండమని చెప్పి, తను Joe bike ని తీసుకుని town లోకి బయల్దేరతాడు. మాయ తన ఫ్రెండ్ డెబ్బీ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా, మళ్లీ అక్కడికి ఎవరో వచ్చి door ని బలంగా కొడతారు. అది విన్న మాయ, రయన్ వచ్చాడేమో అని అనుకుని, door open చేసేందుకు వెళ్తుంది. తీరచూస్తే అక్కడ K1 ఉంటుంది. K1 మాయాతో, “ఇక్కడ టామర ఉందా?” అని మళ్ళీ అడుగుతుంది. అసలీ అమ్మాయేంటి ఇక్కడికి మళ్లీ వచ్చి, ఇలా అడుగుతుందని మాయ కాస్త టెన్షన్ గా ఫీల్ అవుతుంది.

మాయ, K1 తో, “ఇక్కడ టామర లేదని మేము ఇంతకుముందే నీకు చెప్పాం కదా” అని అంటుంది. కానీ K1 మాత్రం మాయ మాటల్ని పట్టించుకోకుండా, “ఇక్కడ టామర ఉందా?” అని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటది. దాంతో మాయాకి ఏం చేయాలో ఏమీ అర్థం కాక, “రయన్ త్వరగా వస్తే బాగుండు” అని అనుకుంటూ K1న్ని పట్టించుకోకుండా డోర్ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత ఎవరో మెట్లు ఎక్కుతున్నట్టు, ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు మాయకి sounds వినిపిస్తాయి. అసలీ sounds ఎక్కడినుంచి వస్తున్నాయని మాయని ఒక పక్క భయపడుతూనే ఇళ్ళంతా చెక్ చేస్తది. కానీ తనకి ఎవరూ కనిపించరు.

The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu
The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu

ఇక మాయ ఆ tension నుంచి బయటపడేందుకు, ఒక weed సిగరెట్ ని smoke చేస్తూ, పియానో play చేస్తుంటది. అయితే మాయ అలా పియానో play చేస్తుండడాన్ని ఒక వ్యక్తి అంతే చూస్తుంటాడు. కానీ ఈ విషయం మాయకి తెలియదు. ఈ వ్యక్తిని మనం K2 అనే పేరుతో పిలుద్దాం. Town లోకి చేరుకున్న రయన్, గరాజ్ లో ఉన్న తన కార్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న inhaler ని తీసుకుంటాడు. తర్వాత తను కేఫ్ దగ్గరికి వెళ్లి, మాయ కోసమని కొంత ఫుడ్ ని తీసుకుని, Bike పై మాయ దగ్గరికి వస్తుంటాడు. మాయ స్నానం చేస్తుండగా, K2 అక్కడికి కూడా వచ్చి తనని చూస్తుంటాడు. అప్పుడు మాయాకి, తన పక్కన ఎవరో ఉన్నట్టుగా డౌట్ రావడంతో, తను వెంటనే తల పక్కకు తిప్పి చూస్తుంది.

5) మాయాపై దాడి

కానీ అప్పుడు మాత్రం K2 అక్కడ ఉండడు. Next scene లో, మాయ తన hair ని dry చేస్తుండగా ఇంట్లో పవర్ పోతుంది. So ఫ్యూజ్ బాక్స్ ఎక్కడుందో కనిపెట్టి power on చేద్దామని, మాయ flashlight use చేస్తూ, fuse box కోసం ఇళ్ళంతా వెతుకుతుంటుంది. అయితే తనకి ఆ సమయంలో, ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టుగా, వాటర్ ని కింద పారపోస్తున్నట్టుగా sounds వినిపిస్తాయి. దాంతో మాయ చాలా భయపడిపోతుంది. చివరికి తను ఫ్యూజ్ బాక్స్ ని కనిపెట్టి power on చేయబోతుండగా తన దగ్గరికి సడన్గా K3 వస్తుంది. K3 చూసిన మాయా ఒక్కసారిగా భయపడిపోయి, అక్కడినుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక room లో ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది. కానీ K3 మాత్రం మాయని అస్సలు వదిలిపెట్టకుండా, తనకోసం ఆ ఇళ్ళంతా వెతుకుతుంటది.

ఇక K3, మాయ ఎక్కడుందో కనిపెట్టి, తనని చంపబోతుందని అందరూ అనుకుంటుండగా, Sudden గా అక్కడికి రయన్ వస్తాడు. మాయ ఏడుస్తూ, “ఈ ఇంట్లో ఎవరో విచిత్రంగా మాస్క్ వేసుకుని, నన్ను చంపేందుకు ప్రయత్నించారని రయన్ తో చెప్తుంది. “సరే ముందు Power on చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో కనిపెడదామని రయన్ అంటాడు. ఇక మాయ, తనని fuse box దగ్గరికి తీసుకెళ్లగా రయన్ power on చేస్తాడు. మాయ ఆ Mask Person గురించి రయన్ కి చెప్తూ చాలా భయపడుతుంటది. అప్పుడు రయన్ మాయతో, “నువ్వా సిగరెట్ ని smoke చేశావా?” అని అడుగుతాడు. “నేను ఇంతకుముందు కాస్త మాత్రమే smoke చేశాను. కానీ ఆ సిగరెట్ వల్ల నాకేమీ mind పాడవ్వలేదు.

ఇక్కడ నిజంగానే ఎవరో ఉన్నారని మాయ చెప్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి K1 మళ్ళీ వచ్చి, డోర్ ని కొడుతుంది. ఇక రయన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, అసలు నీ ప్రాబ్లమేంటని అంటూ K1 దగ్గరికి వెళ్తుంటాడు. దాంతో K3 అక్కడినుంచి పారిపోతుంది. ఇంకోసారి ఇక్కడికి వస్తే Police లకి కాల్ చేస్తా అని రయన్ గట్టిగా అరుస్తాడు. అసలా అమ్మాయి ఎందుకని ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తుందని మాయ కాస్త టెన్షన్ పడుతూ రయన్ తో అంటది. తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తుండగా పైనుంచి కొన్ని రక్తపు చుక్కలు Table మీద పడతాయి. అది గమనించిన వారిద్దరు, అసలిక్కడ ఏం జరుగుతుందని అనుకుంటూ తలపైకెత్తి చూడగా, అక్కడొక చనిపోయిన కోడి కిందకి వేలాడదీయబడి ఉంటుంది.

The Strangers: Chapter 1 Movie Explained & Summary in Telugu
6) ముగింపు

మాయ రయన్ తో, “ఈ ఇంట్లో నిజంగానే ఎవరో ఉన్నారని నేను నీకు ముందే చెప్పినాగా” అని భయంతో అంటుంది. అదే సమయంలో, doors ని పగలగొట్టుకుంటూ Killers లోపలికి వస్తుండడంతో, రయన్, మాయ వెంటనే ఒక రూమ్ లోకి వెళ్లి ఎవరికీ కనిపించకుండా దాక్కుంటారు. కానీ K2 మాత్రం వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో కనిపెట్టి, వాళ్ళున్న room door ని తన గొడ్డలితో పగలగొడతాడు. కానీ K3 వాళ్ళని చంపకుండా, భయంతో వణికిపోతున్న వాళ్లిద్దరి వైపూ అంతే కొంచెం సేపు చూసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అసలు వీళ్ళు ముగ్గురూ ఎవరో, వీళ్ళు ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో రయన్, మాయ కి ఏమీ అర్థం కాదు. కొంచెం సేపటి తర్వాత అంతా నిశ్శబ్దంగా ఉండడంతో Killers ఇంట్లో నుంచి వెళ్ళిపోయారేమో అని వాళ్లిద్దరూ అనుకుంటారు.

రయన్, మాయతో, “వీళ్ళెవరో గానీ మనతో ఆడుకుంటున్నట్టుంది. కాబట్టి మనం వెంటనే బైక్ మీదకెక్కి, వీళ్లనుంచి తప్పించుకుని టౌన్ లోకి వెళ్ళిపోదామని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ fast గా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసి, bike దగ్గరికి వెళ్తుంటారు. కానీ ఇంతలోనే K2 అక్కడికి మళ్ళీ వచ్చి ఆ బైక్ ని blast చేసేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ, “వీడు మళ్ళీ వచ్చాడా” అని అనుకుంటూ, ఇంట్లోకి పరుగుతీసి ఒక రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు. రయన్, మాయ తమ safety కోసమని ఏదైనా ఒక weapon కోసం వెతుకుతుండగా, K1, K2 ఇంట్లోకి ఎంటరయ్యి సాంగ్స్ ని పెట్టుకుని Dance చేస్తుంటారు. అప్పుడు మాయకి తమ పక్కనే ఒక క్రాల్ స్పేస్ కనిపిస్తుంది. ఆ క్రాల్ స్పేస్ గుండా ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి బయటపడొచ్చు.

So, కిల్లర్స్ కంటపడకుండా ఇంటి నుంచి బయటపడేందుకు ఇదే సరైన మార్గమని రయన్, మాయ డిసైడ్ అవుతారు. ఇక వాళ్ళిద్దరూ ఆ క్రాల్ స్పేస్ గుండా పాక్కుంటూ ఇంటి నుంచి బయటపడేందుకు try చేస్తుంటారు. అయితే అప్పుడు పొరపాటున ఒక పాత ఇనుప చీల మాయ అరచేతికి గుచ్చుకుంటది. మాయ ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరవబోతుంది. కానీ ఒకవేళ తన అరుపు కిల్లర్స్ కి గనక వినిపిస్తే, తాము ఎక్కడున్నారో కిల్లర్స్ కి తెలిసిపోతుందని మాయ అరవకుండా తన నొప్పిని కంట్రోల్ చేసుకుంటది. ఇక రయన్ వెంటనే మాయ అరచేతికి గుచ్చుకున్న చీలని బయటికి లాగేస్తాడు. చివరికి వాళ్ళిద్దరూ కిల్లర్స్ కంట పడకుండా ఇంటి నుంచి బయటికి వచ్చేసి, పక్కనే ఉన్న షెడ్ లోకి వెళ్ళిపోతారు.

Image Credit: The Strangers Chapter 1 (2024)

Leave a Comment