Subservience Movie Explained in Telugu

Subservience Movie Explained in Telugu

XYZ Films Distribute చేసిన “Subservience” అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 5.4/10 IMDb రేటింగ్ ని సాధించింది. సెప్టెంబర్ 13, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “S.K. Dale” దర్శకుడిగా వ్యవహరించారు. Will Honley, April Maguire రచయితలుగా ఉన్నారు. Megan Fox, Michele Morrone, Madeline Zima, Andrew Whipp, Jude Allen Greenstein మరియు Matilda Firth ప్రధాన పాత్రల్లో నటించారు. 5 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర $264,096 డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.

స్టోరీ ఏంటంటే!
1) ఇంటికి రోబోట్ రావడం

ఓపెన్ చేస్తే ఒక అందమైన ఫ్యామిలీ. నిక్, Maggie భార్యాభర్తలు. వీళ్లకి ఇద్దరు పిల్లలు. పాప పేరు Isla (ఐలా), బాబు పేరు Max. ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలోకి అనారోగ్యం రూపంలో ఒక సమస్య వస్తది. Maggie కి Heart Problem అని తెలియడంతో నిక్ వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. Maggie ని హాస్పిటల్లో join చేసినప్పటి నుంచి, నిక్ ఒక్కడే ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకుంటూ అలాగే Daily పనికి వెళ్తూ హడావిడిగా ఉంటుంటాడు. So ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకునేందుకు ఎవరైనా తోడుంటే బాగుంటదని నిక్ కి ఆలోచన వస్తది. అలా నిక్ ఒకరోజు Kobol (కొబోల్) Industries కి వెళ్తాడు.

ఇక్కడ AI Technology కలిగిన Advanced Sims ని అమ్ముతుంటారు. ఇక్కడ Sims అంటే Robots అని అర్థం. ఇవేమీ మామూలు Robots కాదు. ఇవి చూడ్డానికి Same మనుషుల్లాగే ఉంటయ్. ఈ Robots ఇంటి పనులు మాత్రమే కాదు, ఒంటి పనులు కూడా చేయగలవు and ఇవి Human Emotions ని కూడా బాగా అర్థం చేసుకోగలవు. So ఏ రోబోని కొనాలని నిక్ ఆలోచిస్తుండగా, ఐలా కి ఒక robot బాగా నచ్చిద్ది. “దీన్నే కొందాం Daddy” అని ఐలా అడగడంతో నిక్ ఇకా robot ని కొనేస్తాడు. కట్ చేస్తే మరసటి రోజు ఉదయం డెలివరీ ఏజెంట్స్ నిక్ ఇంటికి Robo ని Delivery చేస్తారు.

ఆ robot కి ఎటువంటి పేరు లేకపోవడంతో, ఐలా దానికి Alice అనే పేరుని పెట్టిద్ది. Alice నిక్ తో, “మీ Work Schedules and School Schedules ని నాకిస్తే, వాటికి తగ్గట్టుగా పనులన్నిటిని టయానికి చేస్తానని అంటది. అలా చెప్పినట్టుగానే Alice నిమిషాల్లోనే వస్తువులన్నింటిని సర్ది, ఇళ్ళంతటిని నీట్ గా Clean చేస్తది. Alice యొక్క పనితనం చూసి నిక్ షాకై పోతాడు. ఈ రోబోట్స్ కి ఉండే ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే, వీటికేమైనా దెబ్బలు తగిలినా, లేదా చర్మం ఎక్కడైనా కోసుకుపోయిన సరే No Problem. Just ఒక బ్యాండేజ్ ని దెబ్బ తగిలిన చోట గాని లేదా చర్మం కోసుకుపోయిన చోట గాని అతికించి, కొన్ని సెకండ్స్ తర్వాత బ్యాండేజ్ తీసేస్తే సరి. గాయం వెంటనే మానిపోద్ది.

Subservience Movie Explained in Telugu
Subservience Movie Explained in Telugu
2) రోబోట్ పనితనం

ఒకరోజు నిక్ ఫ్యామిలీతో పాటు Alice కూడా హాస్పిటల్లో ఉన్న Maggie ని కలిసేందుకు వెళ్తది. Maggie నిక్ తో, “నేను మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా, వీలైనంత త్వరగా ఇంటికొచ్చేసి మీతో గడపాలని ఉందని అంటది. “సర్జరీ లిస్ట్ లో నీ పేరు టాప్ లో ఉంది, So త్వరగానే సర్జరీ పూర్తయిద్ది. నువ్వికా ఇంటికి కూడా వచ్చేయొచ్చని నిక్ తనకి ధైర్యం చెప్తాడు. యాక్చువల్ గా నిక్ Construction Field లో వర్క్ చేస్తుంటాడు. తనతో పాటు చాలామంది వ్యక్తులు కూడా Construction Field లో వర్క్ చేస్తుంటారు. వారందరితో నిక్ కి మంచి బాండింగ్ ఉంటది. లూయిస్ కొబోల్ కంపెనీ వ్యక్తుల్ని సైట్ వద్దకి తీసుకొచ్చి వాళ్ళకి తమ Construction సైట్ గురించి details చెప్తుంటాడు. అప్పుడు నిక్ కి కాస్త డౌట్ వస్తది.

So తను లూయిస్ ని పక్కకు తీసుకెళ్లి, ఎంతమందిని పనిలోంచి తీసేయబోతున్నారని అడుగుతాడు. “మొత్తం అందర్ని తీసేస్తున్నాం. వాళ్లకి బదులుగా వచ్చేవారం నుంచి Robots ని పనిలోకి పెట్టబోతున్నాం. కాకపోతే సైట్ వద్ద Robots కి Foreman గా ఉండేందుకు ఒక మనిషి కావాలి. కాబట్టి నిన్ను మాత్రమే Replace చేయడం లేదని లూయిస్ అంటాడు. అంటే Development లో భాగంగా మనుషుల్ని పనిలోంచి తీసేసి AI Robots ని పనిలో పెడతారనమాట. తనతో పని చేసే వ్యక్తులతో నిక్ కి మంచి బాండింగ్ ఉంది కదా. So తను లూయిస్ పై కోప్పడి, “నువ్వు నన్ను Replace చేయకపోయినా సరే, అందరితోపాటు నేను కూడా ఇక్కడినుంచి వాకౌట్ చేస్తానని అంటాడు. కాకపోతే Maggie ఆపరేషన్ కి డబ్బులు కావాలి కదా. కాబట్టి చేసేదేం లేక Robots కి Foreman గా ఉండేందుకు నిక్ ఒప్పుకుంటాడు.

కట్ చేస్తే నిక్ ఇంటికొచ్చేసి “కాసబ్లాంకా” అనే ఒక మూవీని చూస్తుంటాడు. అది తన ఫేవరెట్ మూవీ అనమాట. Alice కి ఆ మూవీ యెుక్క స్టోరీ తెలుసు. కానీ తను నిజానికి movie ని చూసుండదు. నిక్ Alice తో, “Story తెలిస్తే సరిపోదు, మూవీని కళ్ళతో చూసి మనసారా Experience అవ్వాలి. కాబట్టి నీ మైండ్ లో ఉన్న ఈ మూవీ Information అంతటినీ Erase చేసెయ్” అని అంటాడు. Alice కి నిక్ Primery User and also Owner. So నిక్ ఏది చెప్తే Alice అది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి తన మైండ్ లో ఉన్న కాసబ్లాంక మూవీ Information ని Erase చేసేందుకు Alice ఒప్పుకుంటది. Alice మెడ దగ్గరున్న Power Button ని ఏడు సెకండ్ల పాటు నిక్ Press చేసి పట్టుకుంటాడు. అప్పుడు Alice Restart అవ్వడం జరిగిద్ది.

Subservience Movie Explained in Telugu
Subservience Movie Explained in Telugu
3) నిక్ పై రోబోట్ కి ప్రేమ

అలాగే తన mind లో ఉన్న కాసబ్లాంక మూవీ Information మొత్తాన్ని Alice Erase చేసేసుకుంటది. ఇక తను నిక్ తో కలిసి మూవీ చూడడం మొదలుపెట్టిద్ది. ఆ సమయంలో Maggie హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి, “మనకి Heart దొరికింది, రేపే నాకు సర్జరీ చేయబోతున్నారని అంటది. అది విని నిక్ చాలా happy గా ఫీలవుతాడు. మరుసటి రోజు ఉదయం అందరూ హాస్పిటల్ కి వెళ్తారు. Maggie Alice తో మాట్లాడుతూ, “ఒకవేళ సర్జరీ fail అయ్యి నేను చనిపోతే, నువ్వే నిక్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. నిక్ పిల్లల్ని బాగానే చూసుకుంటాడు, కానీ తన గురించి తాను అస్సలు పట్టించుకోడు. కాబట్టి నువ్వు నిక్ ని జాగ్రత్తగా చూసుకో” అని బాధపడుతూ చెప్పిద్ది. అందుకు Alice కూడా ok అంటది. ఇక Maggie ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు.

సర్జరీకి Use చేయబోయే Heart ని వేరే చోట నుంచి Plane లో హాస్పిటల్ కి తీసుకొస్తుంటారు. అయితే ఒక Massive Storm మార్గమధ్యంలో ఏర్పడడంతో Correct Time కి Heart ని delivery చేయలేకపోతారు. అలా సర్జరీ మొదలవ్వక ముందే ఆగిపోద్ది. ఏంటి ఈ విధంగా జరిగిందని అందరూ కాస్త Sad గా ఫీలవుతారు. కట్ చేస్తే అందరూ ఇంటి కొచ్చేస్తారు. నిక్ గరాజ్ లోకి వెళ్లి కార్ ని రిపేర్ చేస్తూ సర్జరీ గురించి ఆలోచిస్తూ బాగా Frustration ఫీలవుతుంటాడు. ఆ సమయంలో Alice తన దగ్గరికొచ్చి, “నువ్వు చాలా Stress గా ఉన్నావ్. నీ stress నేను తగ్గిస్తా” అని చెప్పి Alice నిక్ ని Seduce చేస్తది.

But నిక్ మాత్రం, “నేను Maggie ని మోసం చేయలేనని చెప్పి తన దగ్గరి నుంచి దూరంగా వెళ్లిపోతాడు. Next Scene లో నిక్ తన ఫ్రెండ్స్ తో కలిసి బార్ లో డ్రింక్ చేస్తుంటాడు. ప్రస్తుతం తమని పనిలో నుంచి తీసేసి తమ Place లో Robots ని అపాయింట్ చేసినందుకు, Construction company మీద అలాగే Robots మీద మాంటి చాలా కోపంగా ఉంటాడు. So తన కోపాన్నంతటిని తీర్చుకునేందుకు నిక్ ని తీసుకుని మాంటి Site వద్దకి వెళ్తాడు. “ప్లీజ్ నా మాట విను, మనమిక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏదైనా తేడా జరిగితే Problems లో చిక్కుకుంటామని నిక్ అంటాడు. కానీ మాంటి మాత్రం తన మాటల్ని పట్టించుకోడు. Day Time Work కంప్లీటయిన తర్వాత రోబోట్స్ అన్నీ ఒక కంటైనర్ లోకి వెళ్ళిపోతాయి.

Subservience Movie Explained in Telugu
Subservience Movie Explained in Telugu
4) ముగింపు

మాంటి కంటైనర్ ని open చేసి, తమ పనిని లాక్కున్న రోబోట్స్ అన్నింటిపై కోపంతో దారుణంగా ఎటాక్ చేస్తాడు. “కొంప ముంచావ్ కదరా బాబు” అని అనుకొని నిక్ చాలా టెన్షన్ పడిపోతాడు. కట్ చేస్తే నిక్ ఇంటికొచ్చేసి బాత్రూంలో స్నానం చేస్తుంటాడు. అప్పుడు Alice టవల్స్ ని తీసుకొని లోపలికి వస్తది. ఇదేంట్రా బాబు ప్రతి చోటకి వస్తుందనుకుని నిక్ కాస్త uncomfortable గా ఫీలవుతాడు. నిక్ కాస్త Stress గా ఉన్నాడని అర్థంచేసుకుని Alice తనకి romance offer చేస్తది. But తను మాత్రం అందుకు ఒప్పుకోడు. Alice నిక్ తో, “నువ్వు నీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నావ్, నీకోసం నన్నీ ఒక్క పని చేయనివ్వు” అని అంటది.

తను నిక్ కళ్ళకి గంతలు కట్టి, Maggie Voice ని మిమిక్ చేస్తూ తనని Seduce చేయడం మొదలుపెట్టిద్ది. అలా వారిద్దరూ Physical గా Meet అవుతారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత నిక్ కాస్త అప్సెట్ గా ఫీలవుతాడు. Alice కిచెన్ లో వంట చేస్తుండగా నిక్ తన దగ్గరికి వెళ్లి, “నిన్న పొరపాటున అలా జరిగింది. ఇంకోసారి మనమావిధంగా చేయకూడదని అంటాడు. అప్పుడు Alice, “నువ్వు నాతో కలిసినప్పుడు నీ Stress Levels బాగా తగ్గుతున్నయ్ కదా. మరి ఎందుకు వద్దంటున్నావ్” అని అడిగిద్ది. “నాకొక ఫ్యామిలీ ఉంది. కాబట్టి నేనిలా చేయకూడదు. So నువ్విక దీని గురించి మర్చిపో” అని నిక్ అంటాడు.

ఇక తను ఐలాని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి సైట్ వద్దకి వెళ్తాడు. అప్పటికే సైట్ వద్ద చాలా మంది గుమిగూడి ఉంటారు. నిక్ లూయిస్ తో, “ఏంటి, ఇక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. లూయిస్ నిక్ ని పక్కకు తీసుకెళ్ళి, “కంటైనర్ ఓపెన్ చేసి ఎవరో Unknown Persons Robots పై ఎటాక్ చేసి వాటిని నాశనం చేశారు. దీని గురించి నీకేమైనా తెలుసా” అని అడుగుతూ లూయిస్ నిక్ మీద కాస్త డౌట్ పడతాడు. “నిన్న రాత్రి నేను Maggie కి తోడుగా హాస్పటల్లో ఉన్నా. అసలు నాకూ, ఈ ఎటాక్ కి ఎటువంటి సంబంధం లేదని నిక్ అంటాడు. అదే సమయంలో Maggie హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి, “సర్జరీ కోసం Heart దొరికిందని చెప్పిద్ది.

Image Credit: Subservience (2024)

Leave a Comment