Sting (2024): Story | Cast | Box Office | OTT | Release Date
Well Go USA Entertainment & StudioCanal Distribute చేసిన “Sting” అనే సైన్స్ ఫిక్షన్ హార్రర్ థ్రిల్లర్ మూవీ 5.7/10 IMDb రేటింగ్ తో క్రిటిక్స్ నుంచి Mixed Average టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 12, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Kiah Roache- Turner” రచయితగా మరియు దర్శకుడిగా వ్యవహరించారు. Alyla Browne, Penelope Mitchell, Ryan Corr, Noni Hazlehurst, Robyn Nevin, Sylvia Colloca మరియు Jermaine Fowler లు ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 30 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర కేవలం 2.7 మిలియన్ డాలర్స్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.
ఇక కథలోకి వెళ్దాం!
1) గోడల్లోంచి శబ్దాలు
ఓపెన్ చేస్తే Helga అనే ముసలావిడ ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని TV చూస్తూ ఒక Sweater ని కుడుతుంటది. ఆ సమయంలో ఇంటి గోడల నుంచి కాస్త విచిత్రంగా శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాల్ని విన్న Helga ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే Frank అనే Exterminator కి Phone చేస్తది. “మా ఇంటి గోడల్లోంచి విచిత్రంగా Sounds వస్తున్నాయి, మీరిక్కడికి త్వరగా వచ్చి అవేంటో ఒకసారి Check చేయండని Helga అంటది. “Maybe అవి ఎలుకలై ఉండొచ్చు. నేనొచ్చి వాటి సంగతి చూస్తానని Frank అంటాడు. చెప్పినట్టుగానే కొన్ని క్షణాల్లోనే Frank Location కి చేరుకుంటాడు. అక్కడ Bug Brothers యొక్క Van కూడా ఉండడంతో, “నా ఏరియాలో వీళ్లకేం పని” అని Frank కాస్త Frustrate గా ఫీలవుతాడు.
Frank Building లోకెళ్లి Helga తో మాట్లాడుతూ, “మీరు Bug Brothers Company కి ఎందుకు Phone చేశారు. వాళ్ళు నిజమైన Brothers కాదు. నిజానికి వాళ్ళు జైల్లో ఉండాల్సిన క్రిమినల్స్. ఒకసారి వాళ్ళు Jail కి కూడా వెళ్లొచ్చారు. ఇంకోసారి వాళ్లని పనికి పిలవకండి, వాళ్ళు మీ వస్తువులని కూడా దొంగతనం చేస్తారని అంటాడు. అప్పుడు Helga, “నువ్వసలు ఏం మాట్లాడుతున్నావ్? నేనెవరికీ Phone చేయలేదు, నువ్విక్కడికి ఎందుకొచ్చావ్?” అని అంటది. అంటే Helga కి డమెన్ష అనే డిసార్డర్ ఉంటది. అందువల్ల తను కొన్ని క్షణాల క్రితం జరిగిన విషయాల్ని కూడా వెంటనే మర్చిపోద్ది. “మీ గోడలోంచి విచిత్రంగా Sounds వస్తున్నాయని Phone చేసి పిలిచింది నువ్వేగా” అని Frank గుర్తుచేస్తాడు.
అదే సమయంలో లోపలినుంచి మరోసారి విచిత్రంగా శబ్దాలు రావడంతో, “అవును మా గోడల్లోంచి శబ్దాలు వస్తున్నాయని Helga అంటది. “సరిపోయింది రా బాబు” అని అనుకుని Frank లోపలికెళ్లి అక్కడంతా ఎలుకల కోసం చెక్ చేస్తుంటాడు. అప్పుడు తనకి ఎలుకలు కాదు, కొణప్రానంతో రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న Bug Brothers యొక్క Agent కనిపిస్తాడు. ఏంట్రా వీడికేమైందని అనుకుంటూ Frank ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆ సమయంలో ఒక విచిత్రమైన Creature Sudden Entry ఇచ్చి Frank పై ఎటాక్ చేసి తనని వెంట్స్ లోకి లాక్కెళ్లిపోద్ది. ఆ Scene చూసిన Helga ఒక్కసారిగా భయపడిపోద్ది. But తనా విషయాన్ని కొన్ని క్షణాల్లోనే మర్చిపోయి ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని TV చూస్తది.

2) అంతరిక్షం – భూమి
అసలా Creature ఏంటి, అది మనుషుల్ని ఎందుకు తింటుందో తెలుసుకోవాలంటే మనం నాలుగు రోజులు వెనక్కి వెళ్లాల్సిందే. నాలుగు రోజుల క్రితం అంతరిక్షంలోంచి ఒక విచిత్రమైన గుడ్డొకటి భూమిపై పడిద్ది. అది ఏ అడవిలోనో ఎడారిలోనో Land అవ్వకుండా సరిగ్గా Helga నివషిస్తున్న Apartment లోనే Land అయిద్ది. ఆ గుడ్డు యెుక్క Force కి కిటికీ అద్దాలు కూడా పగిలిపోతాయి and ఆ గుడ్డులోంచి ఒక విచిత్రమైన సాలే పురుగు బయటికొస్తది. Helga నివసిస్తున్న Apartment కి గంటర్ అనే ఆవిడ Owner గా ఉంటది. Helga, గంటర్ అక్కాచెల్లెల్లు. గంటర్ దగ్గర చాలా రకాల బొమ్మలుంటయ్. తన బొమ్మల్ని దొంగతనం చేసేందుకు చార్లెట్ అనే అమ్మాయి సీక్రెట్ గా వెంట్స్ లో పాక్కుంటూ గంటర్ యెుక్క Storeroom లోకి చేరుకుంటది.
అక్కడ టేబుల్ పై ఉన్న బొమ్మని చార్లెట్ దొంగతనం చేయబోతుండగా చార్లెట్ చేతి మీద అంతరిక్షం నుంచొచ్చిన సాలె పురుగు వాలిద్ది. చార్లెట్ కి ఇలాంటి విచిత్రమైన జంతువుల మీద కాస్త ఇంట్రెస్ట్ ఉంటది. So Charlet ఆ సాలె పురుగుని చెక్ చేస్తుండగా, “ఎవరు లోపలా?” అని అరుస్తూ గంటర్ Storeroom లోకి వస్తుంటది. గంటర్ వస్తుండడంతో Charlet అక్కడున్న బొమ్మని and అలాగే సాలె పురుగుని కూడా తీసుకుని వెంట్స్ లో పాక్కుంటూ Fast గా తన Bedroom లోకెళ్ళిపోద్ది. Charlet ఆ సాలె పురుగుని ఒక గ్లాస్ జార్ లో వేసి దానికి Sting అనే పేరు పెట్టిద్ది. Charlet తన బొమ్మల్ని దొంగతనం చేసిందని గంటర్ కి అర్ధమై తను కోపంతో Ethan దగ్గరికెళ్తది. “మీ అమ్మాయి ఊరకే నా బొమ్మలన్నింటిని దొంగతనం చేస్తుంది.
ఈరోజు తను మా కిటికీ అద్దాల్ని కూడా పగలగొట్టింది. నువ్వా కిటికీని సరి చేస్తావా లేదా” అని అంటూ గంటర్ Ethan పై గొడవపడిద్ది. “మీ కిటికీ అద్దాల్ని పగలకొట్టాల్సిన అవసరం చార్లెట్ కేముంది. తనా పని చేసుండదని Ethan అంటాడు. కానీ గంటర్ మాత్రం తన మాటల్ని పట్టించుకోదు. Ethan Charlet యొక్క Stepfather. Ethan Charlet దగ్గరికెళ్లి, “ఎవరో గంటర్ వాళ్ల Storeroom Window ని పగలగొట్టారు and తన బొమ్మ కూడా ఒకటి కనిపించడం లేదంటా. ఆ పని చేసింది నువ్వేనా” అని అడుగుతాడు. “నేనసలు నా Room లోంచి ఎక్కడికీ వెళ్ళలేదు. ఆ పని చేసింది నేను కాదు, అయినా నాకు బొమ్మలంటే ఇష్టం కూడా లేదని చార్లెట్ అంటది. “సరే నువ్వు గంటర్ కి కాస్త దూరంగా ఉండు” అని చెప్పి Ethan తన దగ్గర్నుంచి వెళ్ళిపోతాడు.

3) వేట మొదలెట్టిన సాలీడు
Ethan కి పెద్ద Comic Writer అవ్వాలనే కోరిక ఉంటది. కానీ Family ని పోషించేందుకు Day Time లో Building Supervisor గా Part Time Work చేస్తూ Only Nighttime మాత్రమే Comics Draw చేస్తుంటాడు. కొంచెం సేపటి తర్వాత Heather Charlet ని పిలిచి, “నాకు కాస్త Important Work ఉంది. నా వర్క్ Complete అయ్యేవరకు నువ్వు Liam ని జాగ్రత్తగా చూసుకో” అని చెప్తది. Liam కి Babysitting చేయడం Charlet కి ఇష్టం ఉండదు. But ముఖం మీదనే No చెప్పలేక “సరే చూసుకుంటాలే” అని Charlet అంటది. So, Heather Liam ని Charlet కి అప్పగించి Office Room లోకెళ్తది. కట్ చేస్తే Sting ఆకలితో ఉందేమో అని అనుకుని Charlet రెండు బొద్దింకల్ని జార్ లో వేస్తది.
పాపం అది ఎప్పటినుంచి ఆకలితో ఉందో, బొద్దింకల్ని జార్ లోకి వేయడమే ఆలస్యం, Sting వాటిని లపక్కిన తినేస్తది. అది చూసిన Charlet “Wow” అని ఆశ్చర్యపోద్ది. Ethan తన Day Time Work Complete చేసేసి Tired గా ఇంటికొస్తాడు. అప్పుడు Heather Liam ని Ethan కి అప్పజెప్పి, “నేను వెళ్లి మా అమ్మని పడుకోబెట్టొస్తా” అని Heather Helga దగ్గరికెళ్తది. ఆ సమయంలో Helga, గంటర్ TV చూస్తుంటారు. Heather గంటర్ ని పలకరించి, Helga ని తీసుకెళ్లి Bed పై పడుకోబెట్టిద్ది. Helga Heather తో మాట్లాడుతూ, “నేను మీ పాప కోసం ఒక స్వెటర్ ని రెడీ చేశా. అది Table Drawer లో ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్లని అంటది. “సరే నేను తీసుకెళ్తా నువ్వు ప్రశాంతంగా పడుకో” అని చెప్పి Heather అక్కడున్న Sweater తీసుకుని Helga దగ్గర్నుంచి ఇంటికొచ్చేస్తది.
Heather ఆ Sweater ని Charlet కిస్తది. కానీ ఆ Sweater నుంచి మాత్ బాల్స్ యొక్క వాసన వస్తుండడంతో Charlet దాన్ని తీసుకునేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. సరే తీసుకుందాంలే అన్నట్టుగా ఏదో అలా తీసుకుంటదంతే! కొంచెం సేపటి తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రపోతుండగా, Glass Jar కున్న మూతని Open చేసుకుని Sting Jar లోంచి బయటికొస్తది. అది ఆహారం కోసం వెతుక్కుంటూ వెంట్స్ లోకి ఎంటరయిద్ది. అప్పుడు దానికి గంటర్ పెంచుకుంటున్న Big Size Parrot ఒకటి కంటపడిద్ది. ఇంకేముంది Sting వెంటనే Parrot దగ్గరికెళ్లి దాని అవయవాలన్నింటిని Melt చేసుకుని తింటది.

4) ముగింపు
మరుసటి రోజు ఉదయం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా గంటర్ ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తది. ఏంట్రా బాబు ఏమైందని అనుకుంటూ Ethan వెంటనే గంటర్ దగ్గరికెళ్తాడు. తీరా చూస్తే గంటర్ పెంచుకుంటున్న Big Size Parrot దారుణంగా చనిపోయి ఉంటది. ఇది ఎలా జరిగిందని Ethan అడగ్గా, “దీనికి కారణం ఎలుకలై ఉండొచ్చు, నువ్వు వెంటనే Frank కి Phone చెయ్” అని గంటర్ అంటది. కట్ చేస్తే Frank Location కి చేరుకుని Parrot యొక్క Dead బాడీ చూసి షాకైపోతాడు. “దీన్ని చంపింది ఎలుకలేనంటావా?” అని గంటర్ Frank ని అడిగిద్ది. “ఎలుకలు తమ ఆహారాన్ని ఈ విధంగా మెల్ట్ చేసుకుని తినవు.
దీన్ని చంపింది ఏదో కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలని Frank అంటాడు. వెంట్స్ దగ్గర రక్తపు మరకలు ఉండడంతో Maybe Parrot ని చంపింది లోపల ఉందేమో అని అనుకుని Frank వెంట్స్ ని Open చేస్తాడు. తీరాచూస్తే లోపల కూడా రక్తపు మరకలుంటయ్. So Bugs ఏమైనా ఉంటే చనిపోతాయన్న ఉద్దేశంతో Frank Some kind of smoke bomb ని వెంట్స్ లోకి విసిరేస్తాడు. అలాగే Building అంతటినీ ఒకసారి నీట్ గా Spray చేస్తే మీకే మంచిదని Frank అనడంతో, “సరే అలాగే చెయ్” అని గంటర్ అంటది. Charlet తన మొబైల్లో Cat Videos చూస్తుండగా, Cats ఏ విధంగా అయితే Sounds చేస్తాయో Same Sting కూడా అదే విధంగా Sounds చేస్తది.
అప్పుడే Charlet కి అర్థమయిద్ది, తన దగ్గరున్న సాలెపురుగు కొన్ని రకాల శబ్దాల్ని కూడా మిమిక్ చేయగలదని. నిన్న రాత్రి కేవలం ఒక Parrot ని తిన్నందుకే Sting Small size నుంచి medium size కి చేరుకుంటది. Charlet కొన్ని బొద్దింకల్ని ఆహారంగా వెయ్యబోతుండగా తన స్వెటర్లోని మాత్ బాల్ ఒకటి పొరపాటున Sting దగ్గరపడిద్ది. నిజానికీ విచిత్రమైన సాలీడుకి మాత్ బాల్స్ అంటే చాలా భయం. అంటే దాని Weakness మాత్ బాల్స్ అనమాట. So Sting భయంకరంగా శబ్దం చేస్తూ మాత్ బాల్ నుంచి దూరంగా పారిపోయేందుకు Try చేస్తుంటది. So Charlet ఆ మాత్ బాల్ ని Sting దగ్గర్నుంచి వెంటనే తీసేస్తది. దాంతో అది Calm ఐపోద్ది.
Image Credit: Sting (2024)