Oddity Movie Explained in Telugu
Wildcard Distribute చేసిన “Oddity” అనే హార్రర్ థ్రిల్లర్ మూవీ 6.7/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఆగష్ట్ 30, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Damian McCarthy” దర్శకుడిగా మరియు రచయితగా వ్యవహరించాడు. Gwilym Lee, Tadgh Murphy, Steve wall, Caroline Menton, Caroline Bracken మరియు Jonathan French ప్రధాన పాత్రల్లో నటించారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర $1.6 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.
ఇక స్టోరీ చూద్దాం:
1) మొదటిలోనే ట్విస్ట్
ఓపెన్ చేస్తే, Dani తన Husband Ted తో కలిసి ఒక కొత్త ఇంటికి వస్తుంది. Ted ఒక మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ గా వర్క్ చేస్తుంటాడు. So తను హాస్పిటల్ కి వెళ్ళగా, Dani ఒక్కతే తమ కొత్త ఇంటిని సర్దుతుంటది. కార్ లో ఉన్న కొన్ని వస్తువులని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు Dani కార్ దగ్గరకెళ్ళి అందులోని వస్తువులని తీసుకుంటుండగా, తనకి చీకట్లో కాస్త చప్పుడు వినిపిస్తది. కానీ తను light వేసి అక్కడంతా చెక్ చేస్తే తనకక్కడ ఎవరూ కనిపించరు. కాబట్టి తనా విషయాన్ని అంతగా పట్టించుకోకుండా కార్ లో ఉన్న వస్తువులు తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తది. అయితే తను ఇంట్లోకి వచ్చిన కొద్దిసేపటికే, బయటనుంచి ఎవరో door ని ఓపెన్ చేస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తది.
So Dani టెన్షన్ పడుతూ Peep Hole ని ఓపెన్ చేయగా అక్కడ Olin Boole (ఒలిన్ బూల్) నిలబడి ఉంటాడు. Boole ని చూసిన Dani ఒక్కసారిగా భయపడిపోతది. Actual గా ఈ Boole కూడా డాక్టర్ Ted యొక్క పేషెంటే. Boole Dani తో, “ఇందాక నువ్వు door open చేసి car దగ్గరకి వెళ్ళావ్ కదా. ఆ సమయంలో ఎవరో Unknown Person మీ ఇంట్లోకి చొరబడ్డాడు. కాబట్టి Door ఓపెన్ చేయండి. నేను లోపలికొచ్చి మీకు సహాయం చేస్తానని అంటాడు. కానీ Dani మాత్రం Boole మాటల్ని నమ్మదు. “ఇక్కడ నేను తప్ప మరెవరూ లేరు. కాబట్టి మీరిక్కడి నుంచి వెళ్లిపోండని Dani అంటది. అప్పుడు Boole, “వాళ్ళ మాటలు నాకు గోడ లోపల నుంచి వినిపించాయి. అందుకనే నేను నీకు సహాయం చేసేందుకు ఇక్కడికొచ్చా.
తీరాచూస్తే ఎవరో Unknown Person మీ ఇంట్లోకి చొరబడడం నాకు కనిపించింది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. Please door open చేయండి. నేను మీకు సహాయం చేస్తానని Dani తో అంటాడు. కానీ తనకి మాత్రం Boole చెప్తున్న మాటలపై ఎంతకీ నమ్మకం రాదు. ఒకవేళ Door ఓపెన్ చేస్తే, Boole వల్లనే తనకేదైనా ప్రమాదం కలుగుతదేమో అని Dani అనుకుంటది. అయితే అదే సమయంలో ఇంట్లో నుంచి ఏవో చప్పుల్లు వినిపించడంతో, నిజంగానే లోపలెవరో ఉన్నట్టుందని Dani భయపడిపోయి, Boole చెప్పినట్టుగా డోర్ ఓపెన్ చేసెందుకు handle ని పట్టుకుంటది. ఆ తర్వాత Dani కి ఏం జరిగింది? Boole Dani ని ఏం చేశాడు? నిజంగానే ఒక Unknown Person Dani ఇంట్లోకి చొరబడ్డాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మూవీలోకి వెళ్లాల్సిందే!

2) డాని – డార్సి కవలలు
ఓపెన్ చేస్తే, Dani ఇన్సిడెంట్ జరిగిన సంవత్సరం తరువాత స్టోరీ మొదలవుతుంది. Olin Boole Dani ని చంపేశాడని Ted కి తెలిసి, తనని Hospital నుంచి డిస్చార్జ్ చేసి చాల పెద్ద తప్పు చేశామని Ted అనుకుంటాడు. దాంతో Boole ని మళ్ళీ మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఒకరోజు రాత్రి బూల్ తన room లో నిద్రపోతుండగా ఒక Unknown Person hospital లోకి ఎంటరయ్యి, Boole తలని దారుణంగా బద్దలుకొడతాడు. దాంతో బూల్ అక్కడికక్కడే చనిపోతాడు. Actual గా Boole యెుక్క కుడి కన్ను నిజమైంది కాదు. అదొక Artificial Eye. Dani కి ఒక సిస్టర్ ఉంటది. తన పేరు డార్సి. ఈ Dani and డార్సి Twins అనమాట.
అయితే Darcy కి కళ్ళు కనిపించవు. కానీ ప్రస్తుతం తనొక antique shop ని రన్ చేస్తుంటది. and తను సైకిక్ కూడా. ఎవరిదైనా పర్సనల్ item ని టచ్ చేసి, దాని ద్వారా ఆ పర్సన్ యొక్క పాస్ట్ అంతటని Darcy తెలుసుకోగలదు. Olin బూల్ యొక్క ఆర్టిఫిషియల్ ఐ ని Darcy అడగడంతో, Ted ఆ Eye ని తీసుకొని Darcy వద్దకి వస్తాడు. “దీన్ని చూడగానే కోపంగా నా కాలితో గట్టిగా తొక్కేయాలనిపించింది, కానీ నువ్వు అడిగావు కాబట్టి నీ దగ్గరికి తీసుకొచ్చా. అయినా నువ్వు దీంతో ఏం చేస్తావ్” అని Ted Darcy ని అడుగుతాడు. అప్పుడు Darcy, “వాడు Dani ని చంపేశాడుగా. So కనీసం వాడు చనిపోతున్నప్పుడైనా సరే, తను Dani ని చంపినందుకు కాస్తైనా పశ్చాత్తాప పడ్డాడో లేదో తెలుసుకుంటానని Darcy అంటది.
అలా వాళ్ళ మాటల సందర్భంలో, ప్రస్తుతం Ted యాన అనే అమ్మాయితో చాలా రోజుల నుంచి రిలేషన్ లో ఉన్నాడని Darcy కి తెలిసి, తను కాస్త అప్సెట్ అయిద్ధి. అంటే తన సిస్టర్ Dani చనిపోయి సంవత్సరం కూడా కాకముందే Ted Dani ని మర్చిపోయి, ఇంకో అమ్మాయితో రిలేషన్ లోకి వెళ్ళాడని Darcy అలా అప్సెట్ గా ఫీలయిద్ధి. Darcy షాప్ లో ఒక బెల్ ఉంటది. అదేమీ మామూలు బెల్ కాదు. ఆ బెల్ ని ఎవరైనా ప్రెస్ చేశారంటే ఒక దయ్యం ప్రత్యక్షమైద్ది. దీని స్టోరీ ఏంటంటే, జాక్ అనే వ్యక్తి ఒక hotel ల్లో bell boy గా వర్క్ చేస్తుంటాడు. అయితే ఆ హోటల్లోనే Jason అనే Person stay చేస్తుంటాడు. ఒకసారి Jason Full గా తాగి హోటల్ కి రావడంతో, Jason ని రూమ్ లోకి తీసుకెళ్లేందుకు జాక్ హెల్ప్ చేస్తుంటాడు.

3) డానికి తెలిసిన రహస్యం
అప్పుడు తాగిన మత్తులో ఉన్న Jason, పొరపాటున జాక్ ని మెట్ల పైనుంచి కిందకి తోసేయడంతో, జాక్ మెడవిరిగి చనిపోతాడు. అలా అప్పటి నుంచి ఆ బెల్ ని ఎవరైనా ప్రెస్ చేశారంటే జాక్ వెంటనే ప్రత్యక్షమవుతాడు. ఈ విషయం తెలీక, జాక్ చనిపోయిన తర్వాత ఆ బెల్ ని ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ప్రెస్ చేస్తారు. అలా వాళ్ళు బెల్ ని ప్రెస్ చేయగానే జాక్ ప్రత్యక్షమై వాళ్ళిద్దరినీ చంపేస్తాడు. ఇప్పుడీ స్టోరీని డార్సి ted కి చెప్తది. కానీ ted తన మాటల్ని అంతగా నమ్మడు. ఇప్పుడీ bell boy స్టోరీని నేను మీకెందుకు చెప్పానో లాస్ట్ లో ఒక Twist reveal అవుతది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. And నిజానికి ఈ బెల్ మాత్రమే కాదు, Darcy షాప్ లో ఉన్న ప్రతీ వస్తువు ఏదో ఒక హర్రర్ స్టోరీకి కనెక్టయి ఉంటది.
But ఎవరైనా డబ్బులిచ్చి ఆ వస్తువులని కొనుక్కుంటే మాత్రం, ఆ వస్తువుకున్న Curse అక్కడితో పూర్తిగా కంప్లీటయ్యి, ఆ వస్తువు మామూలు Item గా మారిపోద్ది. కట్ చేస్తే, Darcy ఇంటికెళ్లి Olin Boole యొక్క ఆర్టిఫిషియల్ ఐ పై తన చేతిని ఉంచుతుంది. అప్పుడే తనకి Dani యొక్క మరణం గురించి ఒక నిజం తెలుస్తది. దాంతో డార్సి చాలా ఏడుస్తది. అసలా నిజమేంటో మనం కూడా కొన్ని నిమిషాల్లో తెలుసుకుందాం. యానా Ted తో మాట్లాడుతూ, “నిన్న రాత్రి నాకు Dani కనిపించి, వెంటనే మాయమైపోయిందని చెప్తది. అప్పుడు Ted, “అంటే తను దెయ్యంగా మారిందంటావా” అని యానాతో అంటాడు. “అలా అని కాదు. నువ్వు రాత్రిళ్ళు కూడా హాస్పటల్లో వర్క్ చేస్తుండడం వల్ల, నాకీ ఇంట్లో ఒక్కదానికి నిద్ర పట్టట్లేదు.
అలా సరిగా నిద్ర లేకపోవడం వల్ల నాకిలా విచిత్రంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నీ night డ్యూటీస్ కంప్లీటయ్యే వరకు, నేను సిటీలోని నా అపార్ట్మెంట్ లోనే stay చేస్తానని యానా అడిగిద్ది. “సరే అలాగే చేయి” అని Ted ఒప్పుకుంటాడు. అప్పుడే డార్సి ఒక బాక్స్ ని తీసుకుని ted ఇంటికి వస్తది. Darcy ని చూసిన Ted and Yana కాస్త అన్ కంఫర్టబుల్‌గా ఫీలవుతారు. నిజానికి ఆరోజు Dani యొక్క మొదటి Anniversary అనమాట. I mean డెత్ యానివర్సరీ. అందుకని Darcy Ted ఇంటికి వస్తది. But Ted డార్సీతో, “ఈరోజు నాకు నైట్ షిఫ్ట్ ఉంది. హాస్పిటల్లో ఫుల్ వర్క్. And యానా కూడా ఈ రోజు రాత్రికి సిటీలోని తన అపార్ట్మెంట్ కి వెళ్తుందని అంటాడు. అంటే Indirect గా Darcy ని తమ ఇంట్లో Stay చేయొద్దని చెప్తాడనమాట.

4) ముగింపు
కానీ డార్సీ తన మాటల్ని పట్టించుకోకుండా, “పర్లేదు నేనొక్కదాన్నే ఇక్కడ Stay చేస్తాలే” అని అంటది. తర్వాత డార్సి తన బాక్స్ ని ఓపెన్ చేసి, అందులో ఉన్న Wooden Doll ని బయటికి తీస్తది. Darcy Ted తో, “ఇది నేను మీకిస్తున్న ఒక ప్రెజెంట్ అని చెప్తది. ఆ బొమ్మ చూడ్డానికి చాలా క్రీపీగా ఉంటది. So దాన్ని తమ ఇంట్లో ఉంచుకోడం ఇష్టం లేకపోయినా సరే, ముఖం మీదే No చెప్పలేక, డార్సీ ప్రెజెంట్ ని Ted Accept చేస్తాడు. ఇక కొంచెం సేపటి తర్వాత Ted ready అయ్యి హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. యానా కూడా రెడీ అయ్యి సిటీకి బయల్దేరేందుకు సిద్ధమవుతది. కానీ తన కార్ కీస్ ఎక్కడున్నాయో యానాకి కనిపించవు. తను చాలా చోట్ల కీస్ కోసం వెతికిద్ది. కానీ తనకవి ఎక్కడా కనిపించవు.
So ఇక చేసేదేం లేక సిటీకి వెళ్లే ప్లాన్‌ని యానా Cancel చేసుకుంటది. Actual గా ఆ Wooden Doll ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక Witch Darcy Mother కి Gift గా ఇస్తది. దాన్నిప్పుడు Darcy Ted కి ప్రెజెంట్ చేస్తదనమాట. కట్ చేస్తే, రాత్రి సమయంలో డార్సి, యానా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటల సందర్భంలో డార్సి ఒక సైకిక్ అన్న విషయం యానాకి తెలుస్తది. And ఇక్కడే Darcy ఒక ట్విస్ట్ ని reveal చేస్తది. అదేంటంటే, Dani ని చంపింది Olin Boole కాదు. Door open చేసేందుకు Dani తలుపు వద్దకు వెళ్తది. But తనకి Boole మాటలపై నమ్మకం కలగక డోర్ ని open చేయదు.
అప్పుడు Boole Dani తో, “సరే నేను సిటీలోకి వెళ్లి పోలీసుల్ని సహాయానికి తీసుకొస్తా, నీకు మాత్రం ఇంట్లో ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే ఇంట్లోంచి బయటికి పరిగెత్తు” అని చెప్పి Boole సిటీలోకి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత నిజంగానే ఇంట్లో నుంచి ఏవో చప్పుల్లు వినిపిస్తుండడంతో, Dani బాగా భయపడి పోయి Boole ని గట్టిగా పిలుస్తది. కానీ Boole సిటీలోకి వెళ్లిపోయి ఉంటాడు కదా. దాంతో Dani ఒంటరిగా భయపడుతూ టెంట్లో దాక్కుని ఉండగా, ఒక Mask men సడన్ గా అక్కడికి వచ్చి Dani ని దారుణంగా చంపేస్తాడు. ఈ విషయాలన్నింటినీ డార్సి ఇప్పుడు యానాకి చెప్తది. And ఆ Mask men ఎవరో కాదు. Ted Co- Worker అయిన Ivan. ఈ విషయాలన్నీ Olin Boole యొక్క ఆర్టిఫిషియల్ ఐ పై Darcy తన చేతిని ఉంచడం ద్వారా ఇవన్నీ తనకి తెలుస్తాయన్నమాట.
Image Credit: Oddity (2024)