Naga Chaitanya’s THANDEL Postponed/New Release Date

Naga Chaitanya’s THANDEL Postponed/New Release Date:

అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న “తండేల్” మూవీ రిలీజ్ వాయిదా పడింది. మొదట “తండేల్” మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20, 2024న రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ ప్రస్తుతం “తండేల్” మూవీ తన రిలీజ్ డేట్ ని మార్చుకుంది.

మొదటి పాన్ ఇండియా మూవీ:

నాగచైతన్య‌ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలో కల్లా, ఈ “తండేల్” మూవీ యొక్క బడ్జెట్టే చాలా ఎక్కువ. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తండేల్ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అన్నీ భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే నాగచైతన్య కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఈ తండేల్ మూవీనే.

హీరో & హీరోయిన్:

ఇందులో హీరోయిన్ గా “సాయి పల్లవి” నటిస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి కలిసి “లవ్ స్టోరీ” అనే సినిమాలో మొదటిసారి జంటగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ఈ “తండేల్”.

నాగ చైతన్య లుక్:

ఇప్పటివరకు నాగచైతన్య నటించిన సినిమాలన్నింటిలో కల్లా, “తండేల్” చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇందులో నాగచైతన్య రగ్గెడ్ మాస్ లుక్ లో, ఒక మత్యకారుని పాత్ర పోషిస్తున్నాడు. శ్రీకాకుళంలో జరిగినటువంటి కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ  సినిమా తెరకెక్కుతుంది.

Naga Chaitanya's THANDEL Postponed/New Release Date
Naga Chaitanya’s THANDEL Postponed/New Release Date
కార్తికేయ 2 యొక్క ఎఫెక్ట్:

ఈ సినిమాకి డైరెక్టర్ “చందు మొండేటి”. చందు మొండేటి, హీరో నిఖిల్ తో తీసిన “కార్తికేయ 2” మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. కార్తికేయ 2 సినిమా 2022, ఆగష్ట్ 13న రిలీజ్ అయింది. ఆ సినిమా తర్వాత చందు మొండేటి నాగచైతన్యతో కలిసి ఈ తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కార్తికేయ 2 చిత్రం తర్వాత, చందు మొండేటి తీస్తున్న మూవీ అవడంతో “తండేల్” పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ & బ్యానర్:

“తండేల్” సినిమాకి “దేవి శ్రీ ప్రసాద్” మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ “గీత ఆర్ట్స్” బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

ఎక్కడ చూసినా పోటీనే:

చిత్ర యూనిట్ మొదట ఈ సినిమాని డిసెంబర్ 20, 2024న ఖచ్చితంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ రోజున “శంకర్-రామ్ చరణ్” కాంబోలో తెరకెక్కుతున్న “గేమ్ చేంజర్” రిలీజ్ అవ్వబోతుందని వార్తలు రావడంతో “తండేల్” తన రిలీజ్ డేట్ ని మార్చుకోక తప్పలేదు.

RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా అవడంతో గేమ్ చేంజర్ పై భారీగానే అంచనాలున్నాయి. కాబట్టి గేమ్ చేంజర్ కి పోటీగా తండేల్ ని రిలీజ్ చేయడం మంచి ఆలోచన కాదని చిత్ర యూనిట్ భావించారు. అయితే తండేల్ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచించారు. కాకపోతే సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. స్టార్ హీరో అజిత్ నటిస్తున్న “Good Bad Ugly”, మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర”, ఇంకా బాలకృష్ణ మరియు వెంకటేష్ నటిస్తున్న సినిమాలు కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. అలా సంక్రాంతి సీజన్ లో చాలా సినిమాలే పోటీలో ఉండడంతో, “తండేల్” మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడం కూడా మంచిది కాదని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యారు.

ఇక వచ్చే సంవత్సరమే రిలీజ్:

కాబట్టి పై కారణాల వల్ల “తండేల్” మూవీ ఇటు క్రిస్మస్ కి గాని అటు సంక్రాంతికి గానీ రిలీజ్ అవ్వలేని పరిస్థితి. అందుకని మేకర్స్ ఒక ఆలోచన చేసి తండేల్ని జనవరి 26, 2025న రిలీజ్ చేసేందుకు డిసైడయ్యారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జనవరి 26, 2025న అయితే, అప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల సందడి చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకి అంతగా మంచి టాక్ రానట్లయితే, థియేటర్స్ కూడా త్వరగానే ఖాళీ అయ్యి, “తండేల్” కి మంచిగా థియేటర్స్ దక్కుతాయి. కాబట్టి తండేల్ ని జనవరి 26, 2025న రిలీజ్ చేయడమే మంచిదని మేకర్స్ భావిస్తున్నారు. అప్పుడయితేనే ఎటువంటి పోటీ లేకుండా థియేటర్స్ లోకి రావచ్చని మేకర్స్ యొక్క అంచనా. మరి చూద్దాం, 2025 జనవరి 26న అయిన “తండేల్” వస్తుందో లేదా మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందో.

 

Frequently Asked Questions (FAQ):

Who are the main characters in Thandel?

When is Thandel releasing?

Who directed Thandel?

What are some similar movies to Thandel?

What is the genre of Thandel?

Leave a Comment