Megan Fox Full Biography in Telugu – మేగన్ ఫాక్స్ పూర్తి బయోగ్రఫీ తెలుగులో!
“ట్రాన్స్‌ఫార్మర్స్” సినిమాతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన మేగన్ ఫాక్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసు! చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుని 19 ఏళ్లకే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అభిమానుల చేత ఆరాధించబడిన మేగన్ ఫాక్స్ జీవితంలో ఎన్నో రహస్యాలు, మరెన్నో భయంకరమైన నిజాలున్నాయి. కాబట్టి ఈ రోజు మనం మేగన్ ఫాక్స్ జీవితంలో జరిగిన పెళ్ళిళ్ళు, విడాకులు, వివాదాలు, విమర్శలు, సాధించిన విజయాలు ఇలా మొత్తం చిన్నతనం నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతీ విషయాన్ని Explore చేయబోతున్నాం!
చిన్నతనం
మేగన్ ఫాక్స్ 1986 మే 16న, టెనెస్సీలోని ఓక్ రిడ్జ్ అనే చిన్న పట్టణంలో జన్మించింది. తన తండ్రి పేరు ఫ్రాంక్లిన్ థామస్ ఫాక్స్, తల్లి పేరు గ్లోరియా డార్లిన్ ఫాక్స్. మేగన్ కి ఒక అక్క కూడా ఉంది, తన పేరు Kristi Branim Fox. Kristi, Megan కంటే పన్నెండేళ్ళు పెద్దది. దురదృష్టవశాత్తూ మేగన్ కి కేవలం మూడేళ్లు ఉన్నప్పుడే తన తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గ్లోరియా, టోనీ టోనాచియో అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని, మేగన్ మరియు క్రిస్టీలని తీసుకుని ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీకి మకాం మార్చింది.
తల్లితో పాటు సవతి తండ్రి కూడా
మేగన్, క్రిస్టీలని గ్లోరియా, టోని అంతగా ప్రేమగా చూసుకుండేవారు కాదు. మేగన్ యొక్క బ్లాండ్ హెయిర్ నచ్చక గ్లోరియా తన జుట్టుకి చిన్నతనం నుంచే నలుపు రంగు వేసేది. టోనీ యొక్క స్ట్రిక్ట్ ప్రవర్తన వల్ల మేగన్ తన ఫ్రెండ్స్‌ని ఇంటికి తీసుకురావడంగాని, అబ్బాయిలతో స్నేహం చేయడంగాని అస్సలు చేసేది కాదు.
నటనపై ప్రేమ ఏర్పడడం
మేగన్ కి మూడేళ్ల వయసులోనే నటనపై ఇష్టం కలిగి నటిగా మారాలని డిసైడయింది. మేగన్ ఐదేళ్ల వయసులోనే డాన్స్ లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత తనకి పదేళ్ల వయసున్నప్పుడు సెయింట్ పీటర్స్‌బర్గ్‌కి మకాం మార్చారు. మేగన్ పదమూడేళ్లకే మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. 1999లో దక్షిణ కారొలినాలో జరిగిన టాలెంట్ కాంపిటిషన్‌లో కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకుంది. చదువుకునే రోజుల్లో మేగన్ని తన తోటి పిల్లలు బాగా ఏడిపించేవాళ్లు. అందుకని కొన్ని సార్లు తను బాత్రూంలో కూర్చుని లంచ్ తినాల్సి వచ్చేది. ఇక 17 ఏళ్ల వయసులో మేగన్ స్కూల్ మానేసి నేరుగా లాస్ ఏంజల్స్‌కి మూవ్ అయింది.

నటనా ప్రవేశం
మేగన్ యెుక్క యాక్టింగ్ కెరీర్ 2001లోనే స్టార్ట్ అయింది. తను లాస్ ఏంజల్స్‌కి షిఫ్ట్ అవ్వకముందే, “Holiday in the Sun” అనే సినిమాలో ఒల్సన్ సిస్టర్స్‌తో కలిసి నటించింది. కాకపోతే ఆ సినిమాని థియేటర్స్ కి రిలీజ్ చేయలేదు. మేకర్స్ ఆ మూవీని నేరుగా DVD రిలీజ్ చేశారు. ఆ తర్వాత మేగన్ “Ocean Ave” అనే స్వీడిష్ సీరియల్లో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసింది. అలాగే “What I Like About You” అనే సిట్‌కామ్‌లో అమాండా బైన్స్‌తో కూడా నటించింది.
2003లో “Bad Boys II” అనే యాక్షన్ మూవీలో మేగన్ చిన్న పాత్రలో కనిపించింది. క్లబ్‌లో డాన్స్ చేసే అమ్మాయి పాత్ర అనమాట అది. ఆ పాత్రలో మేగన్ ని గుర్తుపట్టడం కాస్త కష్టమే. ఎందుకంటే తను కొన్ని సెకండ్స్ మాత్రమే స్క్రీన్ పై ఉంటుంది. తన ఫేస్ కూడా అంత క్లారిటీగా కనిపించదు. 2004లో రిలీజయిన “Confessions of a Teenage Drama Queen” అనే సినిమాలో మేగన్‌కి మంచి డెబ్యూట్ లభించింది.
మొదటి ప్రేమికుడు
మేగన్ కి 18 ఏళ్ల వయసున్నప్పుడు “బ్రియన్ ఆస్టిన్ గ్రీన్” అనే యాక్టర్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే బ్రియన్ కి 30 ఏళ్లు. అయినాసరే మేగన్ తనపై మనసు పారేసుకుని ప్రేమలో పడిపోయింది. వీళ్ళ మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ వల్ల బ్రియన్ మేగన్ ని ప్రేమించేందుకు మొదట ఒప్పుకోలేదు. కానీ మేగన్ తన మనసు మార్చడంతో ఇద్దరూ రిలేషన్ లోకి అడుగుపెట్టారు. 2006లో ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిజానికి మేగన్ కంటే ముందు “వనెస్సా మార్సిల్” అనే నటిని బ్రియన్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ క్యాసియస్ అనే కొడుకు కూడా పుట్టాడు. కాకపోతే ఆ తర్వాత బ్రియన్, వనెస్సా విడిపోయారు.
హాలీవుడ్ లో మేగన్ కి అసలైన సక్సెస్
2007 లో రిలీజయిన “ట్రాన్స్‌ఫార్మర్స్” సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకందరికి తెలుసు. మేగన్ ఈ మూవీలో “మికాయెలా బేన్స్” అనే పాత్రలో నటించి కుర్రకారుల మతులు పోగొట్టింది. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా “స్టీవెన్ స్పీల్‌బర్గ్” ఉన్నాడు. డైరెక్టర్ మరెవరో కాదు “మైఖేల్ బే”. నిజానికి మైఖేల్ బే ఈ సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకోలేదు. ఈ చిన్న పిల్లల బొమ్మల కథలు ఎవరు డైరెక్ట్ చేస్తారులే అన్నట్టు లైట్ తీసుకుండు.
కాకపోతే స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో కలిసి పనిచేయాలని అనిపించి ట్రాన్స్‌ఫార్మర్స్ మూవీని డైరెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నాడు. దాదాపు 200 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, వరల్డ్‌వైడ్‌గా 709 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి, 2007లో అత్యధిక కలెక్షన్ సాధించిన ఐదో మూవీగా నిలిచింది. ఈ మూవీ వల్ల మేగన్ కి హాలీవుడ్ లో గొప్ప స్టార్డం వచ్చింది. రెమ్యునరేషన్ కూడా బానే పెరిగింది. ఒకపక్క సినిమాల్లో నటిగా, మరోపక్క మ్యాగజైన్స్ పై మోడల్ గా మేగన్ ఫుల్ బిజీగా మారిపోయింది. 2008వ సంవత్సరంలో FHM మ్యాగజైన్ మేగన్ని “The Sexiest Woman Alive”గా ప్రకటించింది.

రెండో ప్రేమికుడు
ప్రొఫెషనల్ లైఫ్ బాగానే సాగుతున్నప్పటికీ, తన పర్సనల్ లైఫ్ మాత్రం అంత సాఫీగా ఐతే లేదు. తమ ప్రొఫెషనల్ లైఫ్ వల్ల బ్రియన్, మేగన్ల మధ్య దూరం పెరిగింది. ఈ దూరం బ్రేకప్ కి కూడా దారి తీసింది. ఆ తర్వాత మేగన్ తన కో-స్టార్ అయిన షియా లాబఫ్తో ప్రేమలోపడడం, అలా వారిద్దరూ కొన్ని నెలలపాటు Relationship లో ఉండడం జరిగింది. కానీ పది నెలల తర్వాత బ్రియన్, మేగన్ మళ్ళీ ఒకటయ్యి పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు.
ట్రాన్స్‌ఫార్మర్స్ కంటే తక్కువే
కెరీర్ లో పెద్ద విజయం తెచ్చిన ట్రాన్స్‌ఫార్మర్స్ తర్వాత మేగన్ 2008లో రెండు సినిమాల్లో నటించింది. ఒకటి “How to Lose Friends & Alienate People” మరొకటి “Whore” అనే సినిమా. ఇవేమీ అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ట్రాన్స్‌ఫార్మర్స్ రిలీజ్ అవ్వకముందే మేగన్ ఈ సినిమాలకి ఒప్పుకుంది.
ట్రాన్స్‌ఫార్మర్స్ నుంచి మేగన్ని తీసేయడం
మొదటి పార్ట్ కి కొనసాగింపుగా 2009లో Transformers పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేగన్ మరోసారి మికాయెలా బేన్స్ పాత్రలో కనిపించి కుర్రకారుని అతలాకుతలం చేసింది. మేగన్ ఒక ఇంటర్వ్యూలో మైఖేల్ బే ని హిట్లర్ తో పోలుస్తూ, “తనకి సన్నగా ఉండే నటులంటే ఇష్టం ఉండదు. అందుకే నేను తనతో పనిచేసేటప్పుడు బాగా బరువుగా ఉండేందుకు ట్రై చేసేదాన్ని. తనకన్నీ కరెక్ట్ గా ఉండాలి” అని చెప్పింది. మైకేల్ బే ని హిట్లర్ తో పోల్చినందుకు ట్రాన్స్‌ఫార్మర్స్ ప్రొడ్యూసర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ కి కోపమొచ్చి మేగన్ని తమ మూవీస్ లోంచి తొలగించారు. అందుకే ట్రాన్స్‌ఫార్మర్స్ 3 లో మేగన్ కి బదులు రోసీ హంటింగ్టన్-వైట్‌లీ నటించింది. కానీ మేగన్ మాత్రం తనంతట తానుగానే ట్రాన్స్‌ఫార్మర్స్ సిరీస్ నుంచి తప్పుకున్నట్టు చెప్పింది. మరి వీళ్ళ మాటల్లో ఎవరిది నిజమో, ఎవరిది అబద్ధమో!
జెన్నిఫర్స్ బాడీ
మేగన్ నటించిన “జెన్నిఫర్స్ బాడీ” అనే సినిమా కూడా 2009లోనే రిలీజయింది. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. మేగన్ అందానికి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచిగానే మార్కులు పడ్డాయి. ఈ మూవీకి తను తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాల 50 లక్షల డాలర్లు.
వరస్ట్ సినిమా
మేగన్ నటించిన “Jonah Hex” అనే సూపర్‌హీరో వెస్ట్రన్ మూవీ 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేగన్ ఈ మూవీలో Lilah Black అనే డేంజరస్ బ్యూటీ పాత్రలో నటించింది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ బానే ఉన్నప్పటికీ సినిమా మాత్రం దారుణంగా ఫెయిలయింది. హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ ఈ చిత్రాన్ని వరస్ట్ సినిమాగా ప్రకటించారు.
గేమ్స్, మూవీస్, మ్యూజిక్ వీడియోస్
మేగన్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క
Transformers వీడియో గేమ్స్ కి వాయిస్ కూడా ఇచ్చింది. 2010వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఎమినెమ్ – రిహాన్నాల పాపులర్ మ్యూజిక్ వీడియో “Love The Way You Lie” లో మేగన్ పాల్గొంది. అంతేకాదు “Passion Play” అనే చిత్రంలో కూడా తను యాక్ట్ చేసింది. కానీ అది అంతగా విజయం సాధించలేదు.

మేగన్ బాడీపై టాటూస్
మేగన్ కి టాటూస్ అంటే చాలా ఇష్టం. తన బాడీ మీదనే కాదు, తన బాయ్ ఫ్రెండ్స్ బాడీ మీద కూడా టాటూస్ ఉండేటట్టు మేగన్ చూసుకుంటది. ఇప్పటివరకు మేగన్ బాడీ మీద దాదాపు 20 టాటూస్ ఉన్నాయి. మేగన్ వీపు మీద షేక్స్పియర్ కి సంబంధించిన మరియు Nietzsche కి సంబందించిన Quotations ఉన్నాయి. Nietzsche యొక్క టాటూని మేగన్ “మికీ రోర్క్” కి డెడికేట్ చేసింది. ఈ మికీ రోర్క్ మేగన్ తో కలిసి Passion Play అనే సినిమాలో నటించాడు. మేగన్ తన 18 ఏళ్ల వయసప్పుడు Marilyn Monroe ముఖాన్ని తన కుడి చేతి మీద టాటూ వేయించుకుంది. మేగన్ కి Marilyn Monroe అంటే అంత ఇష్టమనమాట. అయితే Marilyn Monroe యెుక్క జీవితమంతా నెగెటివ్ ఎనర్జీతోటి మానసిక కష్టాలతోటి నిండి ఉంటది. అందుకని మేగన్ ఆ నెగటివ్ ఎనర్జీ తన జీవితంలోకి రాకూడదనే ఉద్దేశంతో Marilyn Monroe టాటూని తీసేయాలని డిసైడయింది.
2010లో పెళ్లి
మేగన్, బ్రియన్ 2010 జూన్ 24న హవాయిలోని “Four Seasons Resort”లో సీక్రెట్ వెడ్డింగ్ చేసుకున్నారు. పసిఫిక్ మహా సముద్ర తీరంలో కుటుంబ సభ్యుల మధ్య వారి వివాహం జరిగింది. పెళ్ళైన రెండు సంవత్సరాలకే వాళ్లకి నోవా అనే మొదటి కొడుకు జన్మించాడు.
మైఖేల్ బే – మేగన్ ఫాక్స్ కలిసిపోవడం
మేగన్ ఫాక్స్, మైఖేల్ బే గతంలో జరిగిన గొడవల్ని పక్కనపెట్టి ఒకరితోనొకరు కలిసిపోయి “Teenage Mutant Ninja Turtles” అనే చిత్రంతో 2014వ సంవత్సరంలో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ సినిమాలో మేగన్ ఏప్రిల్ ఓ’నీల్ అనే రిపోర్టర్ పాత్రలో లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా క్రిటిక్స్ నుంచి నెగటివ్ రివ్యూలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం కొల్లగొట్టింది. సుమారు 150 మిలియన్ డాలర్స్ తెరకెక్కిన ఈ మూవీ, దాదాపు 500 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది.
Teenage Mutant Ninja Turtles 2
మొదటి భాగానికి కొనసాగింపుగా 2016లో “Teenage Mutant Ninja Turtles 2” రిలీజయింది. కానీ ఈ సినిమా మొదటి సినిమా సాధించినంత విజయం సాధించలేదు. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి.
ప్లాస్టిక్ సర్జరీ
21 ఏళ్ల వయసులో మేగన్ తన మొదటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అప్పుడు తను తన ముక్కు మరియు నాసికా రంధ్రాల ఆకారాన్ని మార్పించుకుంది. అంతే కాదు, మేగన్ తన జీవితంలో చాలానే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. లిప్ ఫిల్లర్స్, చీక్‌బోన్స్, చిన్ షేప్ మార్చడం, 2007లో బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీవంటివి చేయించుకోవడం కూడా జరిగాయి. ఈ ప్లాస్టిక్ సర్జరీలు ఒక్కోసారి ఫెయిలయ్యి మనుషుల ముఖాలు దారుణంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సర్జరీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మేగన్ నటించిన మరికొన్ని మూవీస్
మేగన్ ఫాక్స్ 2019వ సంవత్సరంలో “Above The Shadows” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్లాడియా మైయర్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి బ్రూక్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆడియన్స్ అవార్డ్ కూడా వచ్చింది.
2019లోనే రిలీజయిన మేగన్ యెుక్క మరో చిత్రం “Zeroville”. జేమ్స్ ఫ్రాంకో ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. నిజానికి 2014లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేకర్స్ ఈ సినిమాని 2019లో రిలీజ్ చేశారు.
మేగన్ కి సైకో పాత్రలో మరియు మెంటల్ గా డిస్టర్బ్ అయిన పాత్రల్లో నటించడం అంటే చాలా ఇష్టం. కానీ తనకి ఎక్కువగా రొమాంటిక్ గర్ల్ పాత్రలే వచ్చేవి. మేగన్ కొన్ని యాక్షన్ మూవీస్ లో, కొన్ని OTT మూవీస్ లో కూడా నటించింది. కానీ అవేమీ అంతగా అలరించలేదు.
2020లో తను “Think Like a Dog” అనే ఫ్యామిలీ కామెడీలో నటించింది. ఈ సినిమా కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది. 2021లో మేగన్ నుంచి ఏకంగా మూడూ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఒకటి “Midnight in the Switchgrass” రెండు “Till Death” ఇక మూడవది “Night Teeth” అనే సినిమా. ఆ తర్వాత 2022వ సంవత్సరంలో “Big Gold Brick”, 2023లో “Johnny & Clyde” మరియు “Expend4bles” అనే మరో రెండు సినిమాల్లో కూడా మేగన్ నటించింది. ఇవి మరీ అట్టర్ ప్లాప్ గా నిలిచాయి. చివరిగా 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన “Subservience” సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని సాధించలేకపోయింది.
పిల్లలు – విడాకులు
మేగన్, బ్రియన్లకి ముగ్గురు కుమారులు పుట్టారు. ఒకరు 2012లో మరొకరు 2014లో ఇంకొకరు 2016లో. ఇలా వారిద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు. బ్రియన్, వనెస్సాల కొడుకు కాసియస్ ని కూడా మేగన్ చాలా ప్రేమగా తన సొంత కొడుకులానే చూసుకునేది. చివరికి 2020లో కొన్ని మనస్పర్థల వల్ల మేగన్, బ్రియన్ విడిపోవడం జరిగింది.
మూడో ప్రేమికుడు
బ్రియన్తో విడిపోయాక మేగన్, కోల్సన్ బేకర్ రిలేషన్లోకి ఎంటరయ్యారు. బ్రియన్, మేగన్ విడిపోవడానికి కారణం ఈ కోల్సన్ బేకరే అని వార్తలొచ్చాయి. మేగన్, కోల్సన్ బేకర్ aka “మెషిన్ గన్ కెల్లి” 2022లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్ని నెలలపాటు వీరిద్దరి రిలేషన్ బాగానే నడిచింది. కానీ 2024లో కొన్ని మనస్పర్థల వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. రీసెంట్ గా 2025 మార్చ్ నెలలో మేగన్ ఒక పాపకి జన్మనిచ్చింది. దాంతో వారిద్దరూ మళ్ళీ కాస్త దగ్గరయ్యారు.