Lethal Seduction (2015) Plot Summary Explained in Telugu
యవ్వనంలో ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి సరదాగా అనిపిస్తాయి. అదే మనం ఏదైనా క్షమించరాని తప్పు చేశామంటెే అది మనల్ని చనిపోయేవరకు బాధపెట్టిద్ది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలో కూడా ఒక అబ్బాయి అలాంటి తప్పునే చేస్తాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు!? తను చేసిన తప్పేంటి!? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు మరి కాసేపట్లో తెలుసుకుందాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు “Lethal Seduction”. ఇది 2015లో విడుదలైన ఒక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా.
ఈ సినిమా పేరు వింటేనే అర్థమవుతుంది కదా! ఈ సినిమాలో ప్రేమ, ఆకర్షణ, యవ్వనంలో చేసే తప్పులు, ఆ తప్పుల వల్ల ఏర్పడిన సమస్యలు… ఇలా చాలా ఉంటాయని. అది నిజమే! చూసేందుకు ఇదొక సాధారణ రొమాంటిక్ స్టోరీలా అనిపించొచ్చు. కానీ కథ ముందుకు సాగే కొద్దీ అసలైన మైండ్ గేమ్ మొదలయిద్ది. ఈ సినిమాలో ఒక కుర్రాడు ఉంటాడు. తన జీవితంలోకి అనుకోకుండా ఒక మహిళ ప్రవేశిస్తది. తను ఆ అబ్బాయి కంటే వయసులో చాలా పెద్దది. అయినా సరే వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తది. ఇంతకీ వాళ్ళ ప్రేమ వెనుక దాగి ఉన్న ఉద్దేశ్యం ఏంటి? తనకంటే వయసులో పెద్దదైన మహిళని ఆ కుర్రాడు ఎందుకని ప్రేమించాడు!? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పుట్టిన రోజు వేడుకలు
‘వాల్టర్’ తన ఫ్రెండ్ ‘మార్క్’ తో, అమ్మాయిల్ని ఎలా ప్రేమించాలి అనే విషయం గురించి చెప్తుంటాడు. సరిగ్గా అప్పుడే వాల్టర్ కి, తమ పక్కన ఇద్దరు ఆడవాళ్ళు కార్లో ఉండడం కనిపిస్తుంది. వాల్టర్ వాళ్లతో, “మేమిద్దరం పార్టీకి వెళ్తున్నాం, మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా” అని ఒక అంటాడు. కానీ వాళ్ళు తనని పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు మార్క్, “ఇదేనా రా నీకు తెలిసింది” అన్నట్టుగా వాల్టర్ వైపు చూసి నవ్వుతాడు. వాల్టర్ మాత్రం, “వాళ్లలో కార్ నడుపుతున్న బ్లాండి నాపై మనసు పారేసుకున్నట్టుంది” అని అంటాడు. కట్ చేస్తే ఇద్దరు మార్క్ ఇంటికిి చేరుకుంటారు. ఆరోజు మార్క్ యెుక్క పుట్టిన రోజు అవడంతో, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఒక పార్టీని ఏర్పాటుచేస్తారు.
మార్క్ అమ్మ పేరు ‘తాన్య’, తన నాన్న పది సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటాడు. అప్పటినుంచి తాన్యానే మార్క్ ని ఒంటరిగా చాలా జాగ్రత్తగా పెంచుతుంటది. మార్క్ కేక్ కట్ చేసిన తర్వాత, గదిలోకెళ్లి బట్టలు మార్చుకుని బయటికొస్తాడు. సరిగ్గా అదే సమయంలో ‘మెలని’ బికినీ వేసుకుంటుంటది. కాకపోతే ఆ బికినీ తాళ్ళు మెలనీకి సరిగా అందకపోతుండడంతో, తను ఆ తాళ్ళని ముడి వేసేందుకు మార్క్ ని సహాయం కోరుతుంది. మార్క్ మెలనీకి సహాయం చేసేందుకు తన దగ్గరికెళ్తాడు. కానీ వెంటనే అక్కడికి తాన్య వచ్చి, మెలని బికినీ తాళ్ళని తను కట్టి, మార్క్ ని స్విమ్మింగ్ పూల్ దగ్గర జరుగుతున్న పార్టీ వద్దకు వెళ్ళమంటది. నిజానికి మార్కుకి మెలని మీద మొదటి నుంచి క్రష్ ఉంటది.
అలా మార్క్, బికినీ వేసుకుని పూల్లో జాలీగా ఆడుకుంటున్న మెలని వైపు అంతే చూస్తుంటాడు. ఒకపక్క ‘ర్యాండీ’ మార్కుతో మాట్లాడుతున్నా కూడా, మార్క్ తన మాటల్ని పట్టించుకోకుండా మెలని వైపే చూస్తుంటాడు. మార్కుకి మెలని మీద ఆసక్తి ఉంది కదా! కాబట్టి వాల్టర్ మార్కుతో, “ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మెలనీని ఏదైనా ఒక ప్రైవేట్ పార్టీకి ఆహ్వానిద్దాం” అని అంటాడు. అందుకు మార్క్ కూడా ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం మార్క్ ఒక పథకం వేసి ర్యాండీ మరియు తాన్యాని ఒక రెస్టారెంట్ కి పంపించి, కాసేపు అలా సరదాగా గడిపి రండి” అని అంటాడు. ఇక ఇంట్లో పార్టీ మొదలవుతుంది.

కరిస్సాతో పరిచయం
ఆ పార్టీకి మెలని తన స్నేహితురాల్ని కూడా తీసుకొస్తది. ఇక అందరూ బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటుండగా సరిగ్గా అప్పుడే అక్కడికి ‘విలియమ్స్’ వస్తాడు. మార్క్ ఒక్కడే ఇంట్లో ఒంటరిగా ఉన్నాడన్న ఉద్దేశంతో, తనకి తోడుగా ఉండేందుకు తాన్య విలియమ్స్ ని తమ ఇంటికి వెళ్ళమని చెప్తది. అంటే తాన్యాకి తెలియదు కదా! ఇంట్లో మార్క్ పార్టీ చేసుకుంటున్నాడని. విలియమ్స్ రావడంతో వాళ్ళు పార్టీ చేసుకోలేకపోతారు. కట్ చేస్తే , తాన్య కొన్ని వస్తువులని కొనుక్కుని రమ్మని మార్కుని షాపుకి పంపిస్తది. మార్క్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులని తీసుకుంటుండగా, తన దగ్గరికి నలభై ఏళ్ల వయసున్న ఒక ఆవిడ వస్తది.
ఆమె పేరు ‘కరిస్సా’. కరిస్సా మార్కుతో, ప్లంబింగ్ కోసం కావాల్సిన కొన్ని మంచి వస్తువుల్ని అడిగిద్ది. మార్క్ ఆ షాపులో పనిచేసే వ్యక్తేమో అని అనుకుని కరిస్సా అలా అడిగిద్ది. మార్క్ కూడా పర్వాలేదులే అన్నట్టుగా తనకి కొన్ని వస్తువుల్ని చూపిస్తాడు. ఇక మార్క్ షాప్ నుంచి బయటకు రాగా, కరిస్సా తనని తాను పరిచయం చేసుకుని, “నాకు ఈ ప్లంబింగ్ వర్క్ సరిగా చేతకాదు, నువ్వొచ్చి నాక్కొంచెం సహాయం చేస్తావా?” అని మార్కుని అడిగిద్ది. కానీ మార్కు మాత్రం “నేను త్వరగా ఇంటికెళ్లి మా అమ్మకి సహాయం చేయాలి” అని చెప్తాడు. అప్పుడు కరిస్సా, “నువ్వు నాకు సహాయం చేశావంటే, నేను నీకు డబ్బులు కూడా ఇస్తా” అని మార్కుకి వల విసురుద్ది.
కట్ చేస్తే, మార్క్ కరిస్సాతో తన ఇంటికెళ్లి, బాత్రూంలో ప్లంబింగ్ పనిని పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతుంటాడు. అప్పుడు కరిస్సా తన ముందే బట్టలన్నీ విప్పేసి, “అలా అయితే వెళ్లి ఒకసారి షవర్ లో స్నానం చేస్తా, కావాలంటే నువ్వు కూడా రావచ్చు” అని సైగ చేస్తది. దాంతో మార్క్ ఒక్కసారిగా షాకైపోయి, లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు కరిస్సా, “రావాలనుకుంటే వేడి నీళ్లు పూర్తయ్యేలోపు వచ్చేసెయ్” అని మళ్లీ పిలుస్తది. దాంతో ఇక మార్క్ కూడా బాత్రూంలోకి వెళ్లి కరిస్సాతో కలిసి స్నానం చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. మరుసటి రోజు ఉదయం మార్క్ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం చూసి, “ఏంటి నువ్వు చాలా ఆనందంగా ఉన్నట్టున్నావ్” అని తాన్య అంటది. అప్పుడు మార్క్, “ఏమో నాకు తెలీదు, ఒకవేళ ఈ రోజు మంచి రోజేమో” అని తాన్యాతో అంటాడు.
మార్క్ – కరిస్సా
అప్పుడే వాల్టర్ ఇంటికి రావడంతో మార్క్ తన దగ్గరికెళ్లి, కరిస్సాతో తను గడిపిన విషయం గురించి చెప్తాడు. అది విన్న వాల్టర్, “తను నలభై సంవత్సరాల డబ్బున్న ఆవిడా!!” అని కాస్త జలసీ పడతాడు. మరి మెలని విషయం ఏంటని వాల్టర్ అనగా, “ఏమో నాకు తెలియదు ప్రస్తుతం నేను కరిస్సాతో ఉన్నా” అని మార్క్ అంటాడు. రాత్రి సమయంలో మార్క్, కరిస్సా బయటకు వెళ్లాలని ప్లాన్ వేసుకుంటారు. అందుకని మార్క్ స్నానం చేసి రెడీ అయ్యి తన గది నుంచి బయటకొస్తాడు. మార్కును చూసిన తాన్య, “మెలనీతో బయటకి వెళ్తున్నావా?” అని అడిగిద్ది. అప్పుడు మార్క్ “లేదు నేను వేరే వాళ్ళతో వెళ్తున్నాను” అని సమాధానమిచ్చి, తను ఎవరితో బయటకెళ్తున్నాడో తాన్యాకి విషయం చెప్పడు. సరిగ్గా అప్పుడే అక్కడికి కరిస్సా రావడంతో, మార్క్ ఇక ఇంటి నుంచి బయటకెళ్తాడు.
తాన్యాకి మార్క్ మీద అనుమానమొచ్చి కిటికీలోంచి చూడగా, తనకి కరిస్సా కనిపిస్తది. కరిస్సా ఒక కాలేజ్ స్టూడెంటేమో అని అనుకుని, తాన్య కరిస్సా గురించి మొదట అంతగా పట్టించుకోదు. ఇక మార్క్ కరిస్సా ఒక బార్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మార్క్, తను తయారుచేస్తున్న యాప్ గురించి కరిస్సాకు మాటల సందర్భంలో చెప్పగా, “నాకు ఇంటెల్ డిజిటల్ ల్యాబ్స్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకవేళ తను నీకు ఈ యాప్ డెవలప్మెంట్ విషయంలో సహాయపడొచ్చు” అని కరిస్సా అంటది. అది విని మార్క్ చాలా ఆనందపడతాడు. తర్వాత కరిస్సా కొంచెం పౌడర్ తీసుకునెందుకు వాష్ రూమ్ లోకి వెళ్ళగా ఒక వ్యక్తి మార్క్ దగ్గరికొస్తాడు. “ఆవిడ అంత మంచి వ్యక్తి కాదు, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో” అని ఆ వ్యక్తి మార్కుకి సలహా ఇస్తాడు. తను అలా ఎందుకు చెప్పాడో మార్కుకి ఏమీ అర్థంకాదు.

సరిగ్గా అప్పుడే కరిస్సా వాష్ రూమ్ నుంచి మార్క్ దగ్గరికి రాగా, ఇక వాళ్ళిద్దరూ బార్ నుంచి వచ్చేస్తారు. మరుసటి రోజు ఉదయం తాన్య మార్క్ తో, “ఈ మధ్య నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు. అసలు నీ ప్రవర్తన ఏమి బాగలేదు” అని కాస్త కోప్పడుతుంది. కానీ మార్క్ మాత్రం తాన్యాకి సరిగా సమాధానం చెప్పకుండా భోజనం తినేసి బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మార్కు మళ్ళీ కరిస్సా దగ్గరికెళ్తాడు. అసలు విషయం ఏంటంటే, కరిస్సా యొక్క భర్త చాలా ముసలివాడు. తను ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయింటాడు. అలా అప్పటినుంచి కరిస్సా ఒక్కతే, అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంటది.
నిజం తెలుసుకున్న తాన్య
స్విమ్మింగ్ పూల్ కి పక్కనే ఒక గది ఉంటది. మార్క్ ఆ గదిని గమనించి, “ఆ గది ఎందుకోసం?” అని అడుగుతాడు. అప్పుడు కరిస్సా, “ఓ అదా! అది సానా” అని చెప్పి, “నువ్వు నాకు లోషన్ రాస్తావా” అని తను మార్కుకి లోషన్ ఇస్తది. ఇక మార్క్ కరిస్సా వీపు మీద లోషన్ రాయడం మొదలుపెడతాడు. అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. గత కొన్ని రోజులుగా మార్క్ ప్రవర్తిస్తున్న తీరు తాన్యాకి అనుమానం కలిగేలా చేస్తుంది. తాన్య మార్క్ బట్టల్ని సర్ధుతుండగా తనకి ప్యాంట్ జేబులో మొబైల్ కనిపిస్తది. తాన్య ఆ మొబైల్ ని చెక్ చేయగా అందులో కరిస్సా ఫోన్ నెంబర్ కనిపించడంతో, తాన్య కరిస్సాని డిన్నర్ కి ఆహ్వానిస్తూ మెసేజ్ పంపిస్తది. కానీ ఈ విషయం మార్కుకి తెలియదు. కట్ చేస్తే, మెసేజ్ అందుకున్న కరిస్సా, ఒక విలువైన వైన్ బాటిల్ తీసుకుని మార్క్ ఇంటికి వస్తది.
కరిస్సా తన ఇంటికి రావడాన్ని చూసి మార్క్ కాస్త ఆశ్చర్యపోతాడు. “కరిస్సా అంటే ఒక టీనేజర్ అని అనుకున్నాను, కానీ ఈవిడ ఏంటి ఇంత పెద్దగా ఉంది” అని తాన్యా కూడా షాక్ అయిద్ధి. ఇక అందరూ కలిసి డిన్నర్ చేయడం మొదలుపెడతారు. కరిస్సా మాటల సందర్భంలో, మార్క్ తయారుచేస్తున్న యాప్ గురించి తాన్యాని అడిగిద్ది. నిజానికి మార్క్ ఒక యాప్ తయారుచేస్తున్నాడన్న విషయం తాన్యాకి అస్సలు తెలియదు. మార్క్ కూడా యాప్ సిద్ధమైన తర్వాత, దాన్ని తాన్యాకి చూపించి సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. కానీ పొరపాటున కరిస్సా వల్ల ఇప్పుడు యాప్ విషయం తాన్యాకి తెలిసిపోతుంది.
తాన్యా మార్కుతో, “ఈ మధ్య నువ్వు చాలా విషయాల్ని బాగానే దాస్తున్నావులే” అని కరిస్సాను ఉద్దేశించి అంటది. అప్పుడు కరిస్సా, “మార్క్ తయారుచేస్తున్న యాప్ సక్సెస్ అయిందంటే తను కాలేజ్ వదిలేసి కంపెనీ మొదలుపెట్టొచ్చు” అని చెప్తది. ఇక తాన్యా వెంటనే అందుకుని, “కాలేజ్ వదిలేయడమా… నీకు తెలుసా!, మార్కుకి ప్రిన్స్టన్ అనే కాలేజీలో సీటు వచ్చింది. అలా సీట్ రావడం ఎంత కష్టమో అసలు నీకు తెలుసా? కాలేజ్ వదిలేసి కంపెనీ పెట్టొచ్చంట, అయినా సలహాలు ఇవ్వడానికి నువ్వేమి తన అమ్మవి కాదు. నీ కామ కోరికలు తీర్చుకోవడం కోసం టీనేజర్స్ ని వలలోకి దించే మాయలాడివి నువ్వు. ఆ వలలోకి నా కొడుకుని లాగొద్దు” అని గట్టిగా వార్నింగ్ ఇస్తది. దాంతో కరిస్సా ఇక అక్కడినుంచి బయటికెళ్ళిపోద్ది.
ముగింపు
చూశారు కదా కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఇక్కడినుంచి కూడా కథ ఇంకా రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడి వరకు మనం ఈ సినిమాలో ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఇకపై కథ ఎన్ని మలుపులు తిరగబోతుందో మీరే ఒకసారి మీ కళ్ళారా చూడండి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది.
- నాకైతే ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. పెద్దగా గ్రాఫిక్స్, యాక్షన్ వంటివి అవసరం లేకుండా పూర్తిగా భావోద్వేగాల మధ్య సినిమా అంత నడుస్తుంది.
- ఒక వ్యక్తి తను కోరుకున్న మహిళ కోసం ఎంత దూరం వెళ్ళగలడు? అందుకు తను తీసుకునే నిర్ణయాలు తన కుటుంబాన్ని ఎంతలా బాధపెడతాయో చూపించేందుకు ప్రయత్నించారు.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే అంతగా మెప్పించలేకపోయింది. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఐతే ఇది కాదు. రొమాంటిక్ డ్రామా ఇష్టపడే సినీ ప్రియులకి ఈ సినిమా ఒకింత నచ్చే అవకాశముంది. మొత్తం మీద ఒకసారి మాత్రం ఈ సినిమాని చూసేయొచ్చు.
