Left Behind Movie Explained & Summary in Telugu

Left Behind Movie Explained & Summary in Telugu

Freestyle Releasing Distribute చేసిన “Left Behind” అనే అపోకలిప్టిక్ థ్రిల్లర్ మూవీ 3.1/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ అక్టోబర్ 3, 2014 లో రిలీజయింది. Vic Armstrong ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. Paul Lalonde మరియు John Patus రచయితలుగా ఉన్నారు. నటీనటుల విషయానికొస్తే Nicolas Cage, Lea Thompson, Chad Michael Murray, Jordin Sparks, Nicky Whelan మరియు Cassi Thompson ప్రధాన పాత్రల్లో నటించారు. 16 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 27.4 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే సినీ ప్రియులకి ఈ సినిమా మంచి Experience ఇస్తది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.

కథ ఏంటంటే!
1) మొదలు

ఓపెన్ చేస్తే క్లోయి తన ఫాదర్ బర్త్డే కి న్యూయార్క్ కి  వస్తుంది. తను తన మదర్ ఐరిన్ కి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్తది. అప్పుడు ఐరీన్, “బర్త్ డే పార్టీ క్యాన్సిల్ అయింది. మీ నాన్నకి సడన్గా డ్యూటీ వేశారని చెప్తది. క్లోయ్ ఫాదర్ పైలెట్, సో ఎలాగు అతను ఎయిర్పోర్ట్ కి వస్తాడు కదా! ఎయిర్పోర్ట్ లో కలుద్దామని క్లోయ్ అక్కడే ఉంటది. ఆ టైంలో Cameron అనే జర్నలిస్ట్కి ఒక ఆవిడ దేవుడు గురించి క్లాస్ పీకుతుంటది. దానివల్ల Cameron కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. ఇక క్లోయి అక్కడికి వెళ్లి ఆమె నుండి Cameron ని Save చేస్తది. Cameron Chloe దగ్గరికి వెళ్లి, ఆమె పెట్టే నసనుండి నన్ను తప్పించినందుకు థాంక్స్ అని చెప్తాడు. అప్పుడు క్లోయి మా అమ్మకి కూడా దేవుడు పిచ్చి ఎక్కువ.

అందుకే నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేక నిన్ను కాపాడనని చెప్తది. అదే సమయంలో Chloe ఫాదర్ రెఫర్డ్, ఎయిర్ హోస్టెస్ Hattie తో పులిహోర కలుపుతూ అటు వస్తాడు. రెఫర్డ్ తన కూతురిని చూసి వచ్చే హగ్ చేసుకుని కాసేపు మాట్లాడతాడు. కొన్ని సంవత్సరాలుగా రెఫర్డ్ కి ఐరిన్ కి రిలేషన్ షిప్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటి టైంలో తన ఫాదర్ వేరే అమ్మాయిలతో ఇలా పులిహార కలపడం Chloe కి నచ్చదు. రేఫోర్డ్ తన వెడ్డింగ్ రింగ్ తీసేసి ఉండడం క్లోయి చూసి, బర్త్డే అయినా కూడా ఇంట్లో ఉండకుండా, Hattie తో టైం స్పెండ్ చేయాలని పక్కా ప్లాన్ ప్రకారమే తన ఫాదర్ డ్యూటీకి వచ్చాడని క్లోయికి అర్థం అవుద్ది.

రేఫర్డ్ తన కూతురితో. “నాకు మీ అమ్మకి చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లయింది. చాలా సంవత్సరాల మేము కలిసే ఉన్నాం. ఇంత లాంగ్ జర్నీలో మనుషులు చాలా రకాలుగా మారిపోతారు. మీ అమ్మకి దేవుడు పిచ్చి ఎక్కువైనప్పటి నుంచి అసలు తనతో మాట్లాడడమే చాలా కష్టమైపోతుందని చెప్తాడు. ఆ తరువాత Rayford తన కార్ కీస్ Chloe కి ఇచ్చి డ్యూటీకి వెళ్తాడు. Chloe Cameron తో మాట్లాడి ఇంటికి వెళ్తది. Chloe తన మదర్ తో మాట్లాడుతుండగా, ఆమె దేవుడు టాపిక్ తీసుకొని రావడంతో Chloe కి కోపం వచ్చి , ఆమె మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే Chloe తన బ్రదర్ రైమిని తీసుకుని ఒక మాల్ కి వెళ్తది. ఇద్దరూ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ సడన్గా రైమి మాయం అయిపోతాడు.

Left Behind Movie Explained & Summary in Telugu
Left Behind Movie Explained & Summary in Telugu
2) మనుషులు మాయం

ఇప్పటిదాకా నాతోనే ఉన్న నా తమ్ముడు సడన్గా మాయమైపోయాడు ఏంటని Chloe బాగా టెన్షన్ పడుద్ది. తీరా చూస్తే రేమీ ఒక్కడే కాదు, చాలామంది అక్కడ మాయమైపోయుంటారు. వాళ్ళ వస్తువులు బట్టలు మాత్రమే అక్కడ మిగిలిపోతాయి. అదే సమయంలో ఒక కార్ అదుపుతప్పి మాల్ లోకి వచ్చేస్తది. క్లోయి కార్ లొపల చూస్తే  డ్రైవర్ మాయమైపోయి ఉంటాడు అండ్ ప్యాసింజర్ సీట్లో ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇంత జరుగుతుంటే కొంతమంది మాత్రం ఆ మాయం అయిపోయిన వాళ్ళ వస్తువులు, డబ్బులు అండ్ మాల్ లో ఉన్న వస్తువులు కొట్టేస్తుంటారు. ఏం జరుగుతుందో అర్థంకాక అందరూ భయంతో రోడ్లమీద పరిగెడతారు. రోడ్ల మీద ఫుల్లుగా ట్రాఫిక్ జామై ఉంటది.

మరోవైపు Rayford ప్యాసింజర్స్ తో ప్లేన్ని టేక్ ఆఫ్ చేసి ఉంటాడు. ఆ తరువాత తను Hattie ని కలిసి మనం ట్రిప్ కి వెళ్దాం అని టికెట్స్ ని చూపిస్తాడు. కట్ చేస్తే ప్లేన్ షేక్ అవుతూ కిందికి వెళ్తుంటది. ప్యాసింజర్స్ తమ పక్క సీట్లో ఉన్న వాళ్లు మాయమైపోయారని టెన్షన్ పడుతుంటారు. ఇక Rayford వెంటనే కాక్ఫిట్ లోకి వెళ్తాడు. తీరాచూస్తే తన కో పైలట్ మాయమైపోయిoటాడు. రెఫర్డ్ ప్లేన్ ని తన కంట్రోల్లోకి తీసుకుని దాన్ని స్మూత్ గా వెళ్లేలా చేస్తాడు. అయితే అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ప్యాసింజర్స్ అందరూ కాక్ పీట్ దగ్గరికి వెళ్లి కెప్టెన్నీ చూడాలని గొడవ చేస్తుంటారు. Hattie అండ్ Cameron వాళ్ళని ఆపాలని చూసిన కూడా వాళ్లు కంట్రోల్ అవ్వకపోవడంతో, ఇక రేఫర్డ్ క్యాబిన్లో ప్రెజర్ ని పెంచుతాడు.

దానివల్ల ప్యాసింజర్స్ బ్రీత్ తీసుకోవడం కష్టంగా మారుతుంది. సో ఇంక ఏం చేయలేక వాళ్ళు తమ సీట్ దగ్గర పడిన ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని అక్కడే కూర్చుంటారు. రేఫర్డ్ రేడియోలో హెల్ప్ కోసం ఎయిర్పోర్ట్స్ని కాంటాక్ట్ అవుతాడు. కానీ ఎవరు ఆన్సర్ ఇవ్వరు. తన సెల్ ఫోన్ కూడా పనిచేయదు. కట్ చేస్తే ప్యాసింజర్స్ అందరూ కాస్త కూల్ గా కూర్చున్న తర్వాత, రెఫర్డ్ వాళ్ల  దగ్గరికి వెళ్ళి, “ఇలాంటి సమయంలో టెన్షనే మనకి అది పెద్ద శత్రువు. మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేవరకు అందరూ కూల్ గా ఉండండి” అని మాట్లాడుతాడు. నెక్స్ట్ సీన్లో Hattie కి తన Co-Air Hostess యొక్క బట్టలు కనిపిస్తాయి. సో తను కూడా మాయమైపోయిందని Hattie కి బాధేసి, తను కాక్పి ట్ లోకి వెళ్లి Rayford కి విషయం చెప్పడంతో అతను ఆమెని ఓదారుస్తాడు.

3) మాయమవడానికి కారణమేంటి!?

అందరూ టెన్షన్ పడుతుంటే Cameron తన కెమెరాతో అసలు ఏం జరిగిందని అందర్నీ అడుగుతుంటాడు. వింతగా magic ఏం జరగలేదు, కానీ సడన్ గా అందరు మాయమైపోయారు. వాళ్ళ బట్టలు మాత్రమే మిగిలిపోయాయని వాళ్ళకి అర్థమవుతుంది.
సిచువేషన్ ఇంకా దారుణంగా మారడం Rayford కి ఇష్టం లేక ప్లేన్ ని తిరిగి న్యూయార్క్ కి మళ్ళీస్తాడు. క్లోయి అండ్ మిగిలిన వాళ్ళు మాల్ నుంచి ఫాస్ట్ గా బయటికి వస్తారు. Chloe కార్ ఎక్కుదామని వెళ్తుండగా, సడన్గా ఒక స్మాల్ ప్లైన్ అదుపుతప్పి Rayford కార్ని డాష్ ఇవ్వడంతో కార్ నాశనం అవుద్ది. ఇక చేసేదేం లేక క్లోయి నడుచుకుంటూనే వెళ్తది. క్లోయి వెళ్తుండగా ఒక స్కూల్ బస్ బ్రిడ్జ్ మీద నుంచి రివర్ లోకి పడుతుంది.

Left Behind Movie Explained & Summary in Telugu
Left Behind Movie Explained & Summary in Telugu

ఆ పిల్లల్ని కాపాడదామని క్లోయి బస్సు దగ్గరికి వెళ్తే, బస్సులో పిల్లలందరూ మాయమైపోయి వాళ్ళ బట్టలు మాత్రమే మిగులుతాయి. కట్ చేస్తే Chloe ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తది. హాస్పిటల్ బయట బోర్డు మీద “THE END IS HERE” అని రాసి ఉంటది. అక్కడ ఉన్న టీవీ ద్వారా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మాయమైపోతున్నారని క్లోయికి తెలుస్తది. తను హాస్పిటల్ లోపలికి వెళ్దామని చూస్తే అక్కడ అంతా గందరగోళంగా ఉంటది. సో తను ఒక గ్లాస్ డోర్ ని పగలగొట్టుకొని లోపలికి వెళ్తది. డెలివరీ వార్డులో ఒక్క పిల్లోడు కూడా ఉండడు, అందరూ మాయమైపోయి ఉంటారు. అది చూసి క్లోయి షాక్ అవుద్ది. అప్పుడు ఒకామె పిల్లలు అందరూ మాయమైపోయారు. ప్రపంచం అంతా ఇంతే జరుగుతుందని అంటది.

మరోవైపు రెఫర్డ్ న్యూయార్క్ వైపు వస్తుండగా అతని ప్లేన్ వెళుతున్న పాత్ లోనే ఎదురుగా మరొక ప్లేన్ వస్తుంటది. రెఫర్డ్ ఆ ప్లేన్ లో వచ్చే పైలెట్స్ ని కాంటాక్ట్ అవ్వాలని చూస్తాడు. కానీ ఆ ప్లేన్ లోని ఇద్దరు పైలట్ మాయమైపోయి ఉంటారు. సో రెండు Planes కొల్లాయిడ్ అవ్వడానికి కొద్ది సమయమే ఉంటుంది. సొ రేఫార్డ్ తన ప్లేన్ ని కొంచెం పైకి వెళ్లేలా చేస్తాడు. కానీ ప్లేన్ యొక్క ఒక వింగ్ రెండో ప్లేన్ ని తగులుతుంది. ఆ రెండో ప్లేన్ కి ఏం జరిగిందో అని కామెరూన్ విండోలో నుంచి చూస్తే, అది బ్లాస్ట్ అయి కింద పడిపోతుంటది. ప్లేన్ లో ఉన్న వాళ్లు “ఇలా మనుషులు సడన్గా మాయమైపోతున్నారంటే అది ఖచ్చితంగా మనకి సంబంధించిన టెక్నాలజీ కాదు. ఇది ఏలియన్స్ పని” అని అనుకుంటున్నారు.

4) ట్విస్ట్

కట్ చేస్తే ఒక ప్యాసింజర్ Hattie ని పిలిచి వింగ్ దగ్గర ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్తాడు. అప్పుడు Cameron వింగ్ ఫోటోలను తీసి Rayford కి చూపిస్తాడు. అప్పుడు రేఫోర్డ్ కి వింగ్ బాగా డ్యామేజ్ అయిందని ప్లేన్ ని ల్యాండ్ చేయడం కొంచెం కష్టమేనని అర్థం అవుతది. Rayford Cameron తో వింగ్ నుండి ఏదైనా లీక్ అవుతుందేమో వెళ్లి చూడమని చెప్తాడు. తీరాచూస్తే వింగ్ నుండి ఫ్యూయల్ అంతా లీక్ అవుతూ ఉంటది. కొద్దిసేపటికి వింగ్ దగ్గర మంటలు చెల్లరేగుతాయి. దానివల్ల ప్యాసింజర్స్ అందరూ Panic అయ్యి గందరగోళం చేస్తుంటారు. Cameron అండ్ Hattie మీరు టెన్షన్ పడొద్దు, ఇలాంటి టైం లోనే కామ్ గా ఉండాలని అందరిని కూల్ చేయడానికి ట్రై చేస్తుంటారు.

ఇక రెఫర్డ్ Cameron తో ఇక నేను చేసేది ఏం లేదు, ఎలాగోలా న్యూయార్క్ కి త్వరగా తీసుకెళ్లడానికి ట్రై చేస్తానని అంటాడు. తీరాచూస్తే ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోయి మంటలు కూడా వాటీకవే ఆగిపోతాయి. సో అనుకున్న దానికన్నా కూడా చాలా ఫాస్ట్ గా ఫ్యూయల్ అయిపోద్ది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇప్పుడు ప్లెయిన్ నీ ల్యాండ్ చేయాల్సి వస్తది, లేకపోతె అందరూ అయిపోతారు. మరోవైపు క్లోయి ఇంటికి వెళ్తే అక్కడ తన మదర్ ఉండదు. వాష్ రూమ్ లో ఆమె చైన్ మాత్రమే మిగిలి ఉంటది. సో ఆమె కూడా మాయం అయిపోయిందని క్లోయికి అర్థమవుతది. ఆ టైంలో క్లోయికి తన మదర్ బైబిల్ కనిపించడంతో ఆమె దాన్ని విసిరేస్తది. ఆ తరువాత లోకల్ పాస్టర్ దగ్గరికి వెళ్తే అతను క్లోయితో, “చిన్నపిల్లలు, దేవున్నీ నమ్మిన వాళ్లు మాయమైపోయి స్వర్గానికి వెళ్తున్నారని చెప్తాడు.

Left Behind Movie Explained & Summary in Telugu
Left Behind Movie Explained & Summary in Telugu

“నేను ఇన్ని సంవత్సరాలు దేవుడు గురించి చెప్పినా కూడా నేనెప్పుడూ దేవున్ని నిజంగా నమ్మలేదు. అందుకే నేను మిగిలిపోయాను. రాబోయే చీకటి కాలం నుండి దేవుడు చిన్న పిల్లల్ని తనని నమ్మిన వాళ్లని కాపాడి తన దగ్గరికి తీసుకెళ్లాడని చెప్తాడు. ఆ మాటలు విన్న క్లోయికి బాగా కోపం వచ్చి పాస్టర్ మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. Rayford తన కో పైలట్ యొక్క వాచ్ ని చెక్ చేస్తే అందులో John 3:16 అని ఉంటది. అది డైరెక్ట్ గా బైబిల్ లో ఉన్న ఒక వచనానికి సంబంధించినది. దాని ప్రకారం దేవన్ని ఎవరైతే నిజంగా నమ్ముతారో, దేవుడు తిరిగి భూమి మీదకి వచ్చే సమయంలో వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్లి పోతాడు అని అర్థం. Hattie తన Co-Air Hostess యొక్క బుక్ ని తీసుకొస్తే దాంట్లో బైబిల్ స్టడీకి సంబంధించిన లైన్స్ ఉంటాయి.

5) దేవుడే అన్నిటికీ మూలం

అప్పుడు రెఫర్డ్ కి ఇది రాప్చర్ అని అర్థమవుతుంది. ఇలా జరుగుతుందని తన వైఫ్ కి ముందే తెలుసని, తను మాయం ఐపోయి ఉండొచ్చని ఎమోషనల్ అవుతాడు. కట్ చేస్తే ఒకామె తన దగ్గర ఉన్న గన్ తీసి అక్కడ వాళ్ళని “మీరందరూ నా హస్బెండ్ పంపించిన వాళ్లే కదా. నా కూతుర్ని మీరే మాయం చేశారు కదా” అని బెదిరిస్తది . ఆ గన్ చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అప్పుడు మరొక సీట్లో కూర్చున్నామే, “ఇది మనుషులు చేసింది కాదు. ఇది బైబిల్ కి సంబంధించినది. ఇది దేవుడి పునరాగమనం. ఆయనే తనని నమ్మిన వాళ్లని తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడని చెప్తది. నా కూతురు లేకుండా నేనుండలేనని ఆమె తనని తనే షూట్ చేసుకోవాలి అనుకుంటుంది. కానీ Cameron తన మాటలతో ఆమే మనసు మార్చి గన్ని తీసేసుకుంటాడు.

కాసేపయిన తర్వాత రెఫర్డ్ కి రేడియోలో కనెక్షన్ దొరుకుతుంది. అప్పుడు రేఫర్డ్ కి ప్రపంచమంతా ఇలానే మనుషులు మాయమైపోతున్నారని తెలుస్తది. Airport లోని Landing ప్లేస్ అంతా Planes క్రాష్ అయ్యి ఉన్నాయని కూడా తెలుస్తది. ఏదేమైనా ప్లేన్ ని ల్యాండ్ చేయాలని రెఫర్డ్ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే రెఫర్డ్ Cameron దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ తో Chloe కి ఫోన్ చేయమని అడుగుతాడు. అప్పుడు Cameron “నేను ఎప్పటినుంచో తనకి ట్రై చేస్తున్నాను, కానీ ఫోన్ కలవట్లేదు” అని చెప్తాడు. టికెట్స్ envelope మీద క్లోయి “SADDEST DAY OF MY LIFE” అని రాయడంతో Rayford అది చూసి బాధపడి, తన కూతురికి సారీ చెప్పాలనుకుంటాడు.

ఐరీన్ ప్రతిసారి దేవుడు గురించి మాట్లాడినప్పుడు నేనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మా Relationship లో నేనే సరిగా Understanding తో లేనని Chloe కి చెప్పాలనుకుంటాడు. మరోవైపు క్లోయి తన తమ్ముడు, అమ్మ మాయమైపోవడంతో తన నాన్న కూడా మయమైపోయాడేమి అని అనుకుని, చుట్టూ జరుగుతున్న సిచువేషన్ చూడలేక బాగా డిప్రెసెయ్యి తను కూడా చనిపోవాలని ఒక బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంది. అప్పుడు Chloe, “నేను నీతో సరిగా ఉండనందుకు నన్ను క్షమించు” అని వాళ్ళ అమ్మకి సారీ చెప్తది. ఇక తను దూకాలని అనుకుంటుండగా Cameron ఫోన్ కి సిగ్నల్స్ వచ్చి వెంటనే Chloe కి కాల్ చేస్తాడు. Rayford Chloe తో మాట్లాడి, “ఐరిన్ చెప్పింది నిజమే” అని జరిగిన దాని గురించి ఒకరితో ఒకరు ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు.

Left Behind Movie Explained & Summary in Telugu
6) ముగింపు

Plane ల్యాండ్ చేయడానికి నాకు మంచి ప్లేస్ కావాలని రెపోర్ట్ క్లోయితో చెప్తాడు. ఇంకేదో చెప్పబోతుండగా సిగ్నల్ పోయి ఫోన్ కట్ అవుతుంది. తన నాన్న బతికే ఉన్నాడని Chloe కి అర్థమై తను కిందికి దూకేయకుండా వెంటనే ప్లేన్ ల్యాండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ వెతకడం కోసం ఒక బైక్ వేసుకొని బయలుదేరుతది. మరోవైపు Plane కిందికి పడడం స్టార్ట్ అవుతది. ఈలోగా Chloe ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోకి వెళ్లి కార్ తో రోడ్డు మిద ఉన్న వాటన్నింటినీ పక్కకి జరిపేస్తది. ఇక వెంటనే Cameron ని కాంటాక్ట్ అయ్యి, ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ చూసానని చెప్తది. కానీ Cameron కి ల్యాండింగ్ ప్లేస్ ఎక్కడో అర్థం కాదు.

సో Chloe ని ఏదైనా పెద్ద సిగ్నల్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఫ్యూయల్ ని కింద పోసి లైటర్ వేసి పెద్ద బ్లాస్ట్ అయ్యేలా చేస్తది. ఆ మంటలను చూసి రెఫర్డ్ Plane నీ అటువైపుగా తీసుకెళ్తాడు. రేఫర్డ్ చాలా కష్టపడి ప్లేన్ లో ఉన్న ప్యాసింజర్స్ ని సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా చేస్తాడు. బట్ ఆ ల్యాండింగ్ మాత్రం చాలా దారుణంగా జరుగుతది. చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ నాశనం అవుతాయి. ప్యాసింజర్స్ అందరూ సేఫ్ అవుతారు. Chloe వెళ్లి తన ఫాదర్ ని, Cameron ని హగ్ చేసుకుంటది. Cameron మంటల్లో కాలిపోతున్న సిటీని చూసి, “మేబి ఇదే ఇక ప్రపంచానికి అంతమేమో” అని అంటాడు. అప్పుడు క్లోయి, “అంతం కాదు, మేబి ఇదే ఆరంభమై ఉండొచ్చని అంటది.

Image Credit: Left Behind (2014)

Leave a Comment