In a Violent Nature Movie Explained & Summary in Telugu
IFC Films & Shudder Films Distribute చేసిన “In a Violent Nature” అనే హార్రర్ స్లాషర్ మూవీ 5.6/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ మే 31, 2024 లో రిలీజయింది. Chris Nash ఈ సినిమాకి డైరెక్టర్ గా అలాగే రచయితగా చేశారు. నటీనటుల విషయానికొస్తే Ry Barret, Lauren Taylor, Andrew Pavlovic, Alexander Oliver, Sam Roulston, Cameron Love, Sea Rose Sebastianis, Reese Presley, Charlotte Creaghan మరియు Liam Leone ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 4.6 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది. హార్రర్ స్లాషర్ ఇష్టపడే సినీ ప్రియులకి ఈ సినిమా మంచి Experience ఇస్తది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.
కథ ఏంటంటే!
1) Beginning
ఓపెన్ చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ పాత ఫైర్ టవర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్లకి ఒక ఒక గోల్డ్ నక్లెస్ కనిపిస్తుంది. ట్రాయ్ ఆ చైన్ ని తీసుకోవాలి అనుకుంటే, Ehren తన ఫ్రెండ్స్ తో ఆ నెక్లెస్ ని తీసుకోవద్దు. అది వైట్ పెయిన్ కిల్లర్ ది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు నువ్వు చెప్పిన స్టోరీ నే మళ్లీ మళ్లీ చెప్పొద్దు. మేము వినలేము ఇకనుంచి ఇక్కడి వెళ్ళిపోదాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ ట్రాయ్ మాత్రం ఆ నెక్లెస్ ని తీసేసుకుంటాడు, దాన్ని ఎవరు గమనించరు. వాళ్ల అక్కడ్నుంచి వెళ్లిపోయిన కాసేపటికి భూమిలో నుంచి ఆ వైట్ పెయిన్ కిల్లర్ Jhonny యొక్క శవం బయటికి లేస్తుంది. వాడు తన నక్లెస్ కోసం ఇక వేట ప్రారంభిస్తాడు.
అతను అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ట్రాప్స్ లో ఇరుక్కుని చనిపోయిన కొన్ని నక్కల డెడ్ బాడీస్ కనిపిస్తాయి. దూరంలో ఎవరో ఇద్దరు గొడవ పడుతున్న శబ్దం వినిపించడంతో జానీ అటువైపు వెళ్తాడు. ఆ ఇంటి దగ్గర ఫారెస్ట్ రేంజర్ ఒక వ్యక్తితో, “అసలు నువ్వు అడవిలో ట్రాప్స్ పెట్టి జంతువుల్ని ఎందుకు చంపుతున్నావని గొడవ పడుతుంటాడు. కట్ చేస్తే ఆ ఫారెస్ట్ రేంజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. Jhonny అతని ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక నెక్లెస్ కనిపిస్తది. అప్పుడు అతనికి వాళ్ళ కొన్ని క్షణాలు అమ్మ గుర్తొస్తది. ఎందుకంటే Jhonny కి వాళ్లమ్మ నెక్లెస్ ఇచ్చి ఉంటది. సో అధంటే అతనికి చాలా ఇష్టం. ఎవరు దాన్ని దొంగిలించిన Jhonny వాళ్ళనీ చంపేస్తాడు.
Jhonny ఆ నెక్లెస్ దగ్గరకి వెళ్తుండగా హౌస్ ఓనర్ ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో నిలబడి ఉన్న Jhonny నీ ఫారెస్ట్ రేంజర్ ఏమో అనుకొని, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటావా అని హౌస్ ఓనర్ షూట్ చేస్తాడు. ఇక Jhonny కి కోపం వచ్చి అతని దగ్గరకి వెళ్తాడు. అతను Jhonny మొహాన్ని చూసి భయపడి అడవిలోకి పారిపోతాడు. Johnny కూడా అతని వెనకే వెళ్తాడు. ఆ వ్యక్తి కాలు ట్రాప్స్ లో ఇరుక్కొని ఒక చోట ఆగిపోతాడు. ఇక Jhonny అక్కడికి వచ్చి అతన్ని దారుణంగా చంపేస్తాడు. తిరిగి ఆ ఇంటికి వెళ్లి నెక్లెస్ ని తీసుకొని చూస్తే అది వాళ్ళ అమ్మ తనకిచ్చిన నెక్లెస్ కాదు. అది తన నక్లెస్ ఏమో అనుకొని పొరపాటున జానీ అతన్ని చంపేస్తాడు.

2) Friends Batch
ఇక జానీ మళ్లీ తన నక్లెస్ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అడవిలో వెళ్తున్న Jhonny కి ఒక కారులో కొంతమంది వెళ్లడం కనిపించి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా చాలాసేపు నడుస్తూ వెళ్లిన తర్వాత జానికి ఒక గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపిస్తది. జానీ ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్తాడు. ఆ గన్ ఫైర్ చేసింది నెక్లెస్ తీసుకున్న ఫ్రెండ్స్ బ్యాచే. జానీ వాళ్ళ దగ్గరికి వెళ్లి చీకట్లో నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటాడు. Ehren తన ఫ్రెండ్స్ అందరికీ జానీ గురించి తన అంకుల్ చెప్పిన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక 70 సంవత్సరాల క్రితం లాగింగ్ అనే కంపెనీ కొన్ని షాప్స్ ని పెడుతుంది. వాటన్నింటినీ జానీ ఫాదరే చూసుకుంటుంటాడు.
కానీ ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన రేట్లకి వస్తువుల్ని అమ్మేవారు. దానివల్ల అందరూ ఏంటి ఇంత రేట్లకు అమ్ముతున్నారు అని జానీ ఫాదర్ మీద అసహ్యం పెంచుకుంటారు. కానీ వాళ్ళు ఆ కోపాన్ని అతని మీద చూపించలేక జానీ మీద చూపించేవాళ్ళు. ఒక రోజు ఒక లాగర్ బాగా తాగి జానీ బొమ్మల మీద పడటం వల్ల అన్ని బొమ్మలు పగిలిపోతాయి. సో జానీ ఫాదర్ అతన్ని జాబ్ లో నుంచి తీసేస్తాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ వ్యక్తి జానీతో, “నీకు ఒక బ్యాగ్ నిండా బొమ్మలిస్తా. నైట్ ఫైర్ టవర్ దగ్గరికి రమ్మని జానీకి చెప్తాడు. సరే అని జానీ ఆ నైట్ కి ఫైర్ టవర్ దగ్గరికి వెళ్తాడు.
కానీ వాళ్ళు జానీకి బొమ్మలు ఇవ్వకుండా అతన్ని భయపెట్టాలని చూడడంతో జానీ ఫైర్ టవర్ పై నుండి కింద పడి మెడ విరిగి చనిపోతాడు. మరుసటి రోజు ఆ విషయం జానీ ఫాదర్ కి తెలిసి వాళ్లతో గొడవ పడడంతో వాళ్ళు జానీ ఫాదర్ ని చంపేస్తారు. లాగింగ్ కంపెనీకి చిక్కుల్లో పడడం ఇష్టం లేక Jhonny father నీ చంపిన వాళ్ళనీ వదిలేసి జానీ ఫాదర్ డెత్ ని లైట్ తీసుకుంటారు. ఒక వారం తర్వాత కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు క్యాంప్ ని చూడ్డానికి వస్తారు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా బ్రతకరు, మొత్తం చనిపోతారు. లోకల్ లో ఉండే ప్రజలందరూ జానీ దయ్యమై వాళ్ళనీ చంపేసాడని పుకార్లు పుట్టిస్తారు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం ఫైర్ ఫైటర్ మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి చెట్లలో నుండి చూస్తున్నాడని అందరితో చెప్పడానికి ట్రై చేస్తాడు.

3) Hunting
కానీ అతని మాటలనీ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఈ స్టోరీ అంత విని ఇదొక కట్టు కథ అని Friends నవ్వుతారు. బట్ Ehren మాత్రం ఇది నిజంగా జరిగిందని అంటాడు. ఇక అందరూ ఒక సెల్ఫీ తీసుకుంటారు. ఆ ఫోటోలో వెనకే చెట్లలో ఉన్న జానీ కూడా పడతాడు. కానీ దాన్ని వాళ్ళు గమనించరు. ఇక అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు. కాసేపయిన తర్వాత Ehren బయటికి వచ్చి, మ్యూజిక్ వింటూ సిగరెట్ తాగుతూ ఉంటాడు. జానీ అతని దగ్గరికి వెళ్లి drawknife తో అతని తలని సగానికి కట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత అతని బాడీని లాక్కుంటూ ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ కి వెళ్లి ఆ బాడీతొ కిటికీ అద్దం పగలకొడతాడు.
Jhonny లోపలికి వెళ్ళి తన గొడ్డలి చైన్ అండ్ ఫైర్ ఫైటర్ మాస్క్ ని తీసుకొని ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్న ఇంటి దగ్గరికి బయల్దేరతాడు. మరుసటి రోజు ఉదయం యోగ చేద్దాం పద అని బ్రాడీ Aurora నీ ఒక Pond దగ్గరికి తీసుకెళ్తది. అప్పుడు వాళ్ళిద్దరినీ జానీ చూస్తాడు. కానీ Brodi యోగా చేయకుండా స్విమ్మింగ్ చేద్దాం పదా అని తను పాండ్ లోకి దూకుతుంది. ఇక జానీ కూడా మెల్లగా నీటిలోకి వెళ్తాడు. ఆరోరాకి స్విమ్మింగ్ చేయడం ఇష్టం లేక నేను పక్కకెళ్ళి యోగా చేసుకుంటా, నువ్వు కంటిన్యూ అవ్వని అక్కడ నుంచి వెళ్ళిపోతది. ఇంకేముంది జానీ బ్రాడీని చంపేస్తాడు. ఆ తరువాత జానీ యోగా చేసుకుంటున్న అరోరా దగ్గరికి వెళ్తాడు.
అరోరా జానిని చూసి చాలా భయపడిపోతది. తను తప్పించుకోవాలని పరిగెత్తుద్ది, కానీ ముందు పెద్ద లోయలాగా ఉండడం వల్ల ముందుకు వెళ్లడానికి వేరే దారే ఉండదు. ఈ లోపు జానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన చైన్ హుక్స్ తో ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేసి ఆమె బాడీని కిందకి విసిరేస్తాడు. ఇక జానీ తిరిగి పాండ్ దగ్గరికి వెళ్లి తన Axe ని తీసుకొని ఆ ఫ్రెండ్స్ ఉంటున్న ఇంటి దగ్గరికి బయలుదేరుతాడు. ఇంటి దగ్గర Ehren ఎలా మిస్ అయ్యాడు అనే దాని గురించి Colt, Troy, క్రిస్ గొడవ పడుతుంటారు. ట్రాయ్, క్రిస్ లవ్ లో ఉంటారు. క్రిస్ Colt తో Affair పెట్టుకుందేమో ఆని ట్రోయ్ కి డౌట్. సో వాల్ల మీద కోపంతొ ట్రాయ్ కార్ కీస్ ని చెట్లలోకి విసిరేస్తాడు.

4) Twist
అవి జానీ కాళ్ళ దగ్గర పడతాయి. ఆ కీస్ కి కారు బొమ్మ ఉండడంతో జానీ తన గొడ్డలిని పక్కన పెట్టి కీస్ ని తీసుకుని ఒక చెట్టు దగ్గరికి వెళ్లి తన మాస్క్ తీసేసి చిన్న పిల్లోడిలాగా ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. ఈలోగా Colt కార్ కీస్ కోసం చెట్లలోకి వస్తాడు. అయితే అక్కడ Colt కి జానీ గొడ్డలి కనిపించి వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఇదేదో తేడాగా ఉంది. ఎవడో మనల్ని చంపుతున్నాడు. వెళ్లి పోలీసులకి ఇన్ఫామ్ చేద్దాం అంటాడు. ట్రాయ్ కొల్ట్ మాటలు పట్టించుకోడు. సో Colt అండ్ క్రిస్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి ATV వేసుకుని వెళ్తారు. కట్ చేస్తే జానీ ఆ ఇంటి దగ్గరికి వచ్చి కార్ హారన్ మోగేలాగా చేస్తాడు.
ఆ సౌండ్ కి ట్రాయ్ ఇంటి నుంచి బయటకు వస్తాడు. ఇక జానీ వాడ్ని చంపడానికి వెళ్లి ట్రాయ్ కాలుని డ్యామేజ్ చేస్తాడు. జానీ ట్రాయ్ ని చంపబోతుంటే ఇవాన్ Jhonny Heart దగ్గర షూట్ చేసేస్తాడు. దాని వల్ల జానీ కింద పడిపోతాడు. ఇక ఇవాన్ వెంటనే ట్రాయ్ నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంటాడు. బట్ వన్ మినిట్ లోనే జానీ పైకి లేచి తన గొడ్డలిని విసిరి ఇవాన్ ని చంపేస్తాడు. ఆ తర్వాత ట్రాయ్ తల మీద ఒక పెద్ద బండ రాయిని వేసి వాడ్ని కూడా చంపేస్తాడు. కట్ చేస్తే అదే సమయంలో క్రిస్ అండ్ కోల్డ్ రేంజర్ ని కలవడంతో Ehren నీ ఎవరో చంపేశారని తెలుస్తది. సో మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు గట్టిగ అరుస్తు ఇంటికీ వస్తారు.
క్రిస్ కి నేలమీద బ్లడ్ కనిపించడంతో ఆమె దాన్ని చూస్తుంటది. ఆ సమయంలో జానికి క్రిస్ మెడలో ఉన్న నెక్లెస్ కనిపిస్తుంది. ఇక వాడు క్రిస్ నీ చంపాలని గొడ్డలిని విసురుతాడు. కానీ క్రిస్ వాడిని చూసి గొడ్డలి నుంచి తప్పించుకుంటది. ఇక వెంటనే వాళ్లు వెహికల్ మీద ఎక్కి అక్కడి నుంచి పారిపోతారు. జానీ కూడా వారిని ఫాలో అవుతూ వెళ్తాడు. కోల్డ్ అండ్ క్రిస్ రేంజర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఆయన క్రిస్ మెడలో ఉన్న నెక్లెస్ చూసి, “అసలు ఈ నెక్లెస్ నీ ఎందుకు తీసుకొచ్చారు. మీరు చాలా పెద్ద తప్పు చేశారు, ఈ నెక్లెస్ జాన్ ది. వాడి ఆత్మకు శాంతి కలిగించేది నక్లెసే. ఇక మనం ఏం చేయలేం. వాడు ఆల్రెడీ నిద్ర లేచి ఉంటాడు. మనల్ని చంపేస్తాడని చెప్తుంటాడు. అదే సమయంలో అక్కడికి జానీ వస్తాడు.

5) Suspense
ఇక రేంజర్ జానీ Heart మిద షూట్ చేయడంతో వాడు కింద పడిపోతాడు. ఈ బుల్లెట్స్ జానీని కాసేపు ఆపగలుగుతాయి, కానీ అతన్ని పూర్తిగా అంతం చేయలేవు. 10 ఇయర్స్ బ్యాక్ ఇలానే ఒకసారి జరుగుతది. అప్పుడు రేంజర్ ఫాదర్ జానీని ఓడించి అతన్ని పాతిపెట్టి, ఆ నెక్లెస్ ని మళ్ళీ అక్కడే పెడతాడు. ఇక జానీ అక్కడే నిద్రపోతాడు. సో ప్రెసెంట్ రేంజర్ కూడా అదే పని చేయాలని Colt నీ పక్క రూంలో ఉన్న చైన్స్ తీసుకుని రమ్మంటాడు. కట్ చేస్తే కోల్డ్ వెళ్లి చైన్స్ తీసుకొని వస్తాడు. రేంజర్ Colt నీ “ఆ చైన్స్ తో వాడి కాళ్లు చేతులు కట్టేయమని చెప్తాడు. బట్ Colt భయపడి నేను కట్టలేనని అంటాడు.
అప్పుడు రేంజర్, “నీకు గన్ ఇస్తాను. వెంటనే తీసుకొని వాడికి గురి పెట్టు, నేను వాడిని కట్టేస్తానని అంటాడు. వీళ్లు గన్ మార్చుకునే సమయంలో జానీ లేచి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. కోల్డ్ అండ్ క్రిస్ భయంతో రేంజర్ని వదిలేసి పారిపోతారు. జానీ రేంజర్ మీద అటాక్ చేసి అతని బాగా కొడతాడు. ఆ తరువాత రేంజర్ ని పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి చెట్ల మొద్దుల్ని కట్ చేసే మిషన్ తో అతని బాడీని కట్ చేసి చంపేస్తాడు. ఇక Jhonny తన నెక్లెస్ కోసం కోల్డ్ అండ్ క్రిస్ వెనక వెళ్తాడు. కోల్డ్ అండ్ క్రిస్ Jhonny ని చంపాలని ఏదో ప్లాన్ వేస్తారు. బట్ అదేం పెద్ద ప్లాన్ కాదు, ఆ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వదు. జానీ కోల్డ్ ని తల మీద నరికి చంపేస్తాడు. తన కోపం తీరక కోల్డ్ బాడీని అలానే నరుకుతూ ఉంటాడు.
క్రిస్ కి చాలా భయం వేసి వీడితో పెట్టుకుంటే ఇంక నేను కూడా చచ్చిపోతాను అని, ఆ నెక్లెస్ ని అక్కడే పెట్టేసి, తను భయంతో ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తది. తెల్లవారే సమయానికి తను ఒక రోడ్డుకి రీచ్ అవుతుంది. అదృష్టం బాగుండి అదే సమయంలో ఒక కారు వస్తున్నాడంతో క్రిస్ ఆ కారుని ఆపుతుంది. కారులో ఉన్నామే క్రిస్ని కార్లో ఎక్కించుకొని ఏం భయపడొద్దు నేను హాస్పిటల్ కి తీసుకెళ్తానని చెప్తది. అలా వాళ్ళిద్దరూ వెళ్తుండగా క్రిస్ కాలికి బ్లీడింగ్ అవుతుండడంతో ఆమె కార్ ఆపి క్రిస్ కాలికి బ్లీడింగ్ అవ్వకుండా tourniquet ని కడుతుంది. ఆమె కారు ఆపడంతో క్రిస్ కి జానీ వస్తాడేమో అని చాలా భయం వేసి, ప్లీజ్ కార్ స్టార్ట్ చేయండి. మనం ఆగకుండా వెళ్ళిపోదాం అని బతిమిలాడుతది. కానీ జానీ అక్కడికి రాడు. క్రిస్ ఆ నెక్లెస్ ని వదిలేయడంతో జానీ దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు.
Image Credit: In a Violent Nature (2024)