Immaculate Movie Explained & Summary in Telugu
Neon Distribute చేసిన “Immaculate” అనే హార్రర్ మిస్టరీ మూవీ 5.8/10 IMDb రేటింగ్ ని సాధించింది. మార్చ్ 22, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీని Michael Mohan డైరెక్ట్ చేశారు. Andrew Lobel రచయితగా వ్యవహరించారు. నటీనటుల విషయానికొస్తే Sydney Sweeney, Benedetta Porcaroli, Àlvaro Morte, Simona Tabasco, Giorgio Colangeli మరియు Dora Romano ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 9 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 35.3 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.
ఇప్పుడు కథ చూద్దాం:
1) సిసిలియాకి ఆహ్వానం
Open చేస్తే, సిస్టర్ మేరీ సుపీరియర్స్ రూమ్ లోకి వెళ్లి కాన్వెంట్ యొక్క మెయిన్ గేట్ కీస్ ని దొంగతనం చేస్తుంది. మేరీ కాన్వెంట్ నుంచి తప్పించుకునేందుకు, గేట్ ని తను దొంగతనం చేసిన కీస్ use చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంతకీ గేట్ లాక్ ఓపెన్ కాకపోవడంతో సిస్టర్ మేరీ తన బాడీని గేట్ కి ఉన్న గ్యాప్స్ గుండా ముందుకు నెట్టుకుంటూ బయటపడాలని చూస్తుంది. కానీ అంతలోనే నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి సిస్టర్ మేరీ యొక్క కాలుని విరిచేస్తారు. కట్ చేస్తే, ఆ నలుగురు వ్యక్తులు సిస్టర్ మేరీని బ్రతిగుండగానే సమాధిలో పాతిపెట్టేస్తారు. మెలుకువ లోకి వచ్చిన సిస్టర్ మేరీ గట్టిగా ఏడుస్తూ సహాయం కోసం అరుస్తుండగా మూవీ టైటిల్ పడుతుంది.
సిసిలియ convent లో చేరేందుకు మిషిగన్ నుంచి ఇటలీకి వస్తుంది. రెవరెండ్ mother సిసిలియాని ప్రేమగా కాన్వెంట్ లోకి ఆహ్వానించి “నీ రాక కోసం మేము చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం” అని చెప్తది. ఇక సిస్టర్ ఇసబెల్ సిసిలియాని లోపలికి తీసుకెళ్ళి సిసిలియాకి ఒక గదిని ఇస్తుంది. Actual గా ఈ కాన్వెంట్ లో older nuns అందరూ తమ చివరి రోజులని గడుపుతుంటారు. ఈ older nuns ని జాగ్రత్తగా చూసుకోవడమే remaining nuns యొక్క ముఖ్యమైన పని. సిస్టర్ ఇసబెల్ కి సిసిలియా కాన్వెంట్ లో చేరడం అంతగా ఇష్టం లేదనుకుంటా. “నీకు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపో, once నువ్వు ప్రమాణాలు చేసి Nun గా మారితే ఇక ఇక్కడి నుంచి బయటపడలేవని” ఇసబెల్ సిసిలియాతో చెప్తుంది. అప్పుడు సిసిలియా, “నేను already అన్నింటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చానని” అంటుంది.
Next scene లో సిసిలియాకి సిస్టర్ Gwen తో పరిచయం ఏర్పడుతుంది. కట్ చేస్తే సిసిలియా నన్ గా మారేందుకు సిద్దమవుతుంది. ఈ వేడుకకి Father టెడేస్కి కూడా వస్తాడు. Present ఈ కాన్వెంట్ ఉన్నది ఇటలీ లో కదా! సో నార్మల్ గా అందరూ ఇటాలియన్ language నే మాట్లాడుతుంటారు and సిసిలియాకి కూడా ఇటాలియన్ కొంచెం మాత్రమే అర్థమవుతుంది. కార్డినల్ ఇటాలియన్ లో ప్రమానాలని చెప్తుంటే father టెడేస్కి వాటిని English లోకి translate చేసి సిసిలియాకి చెప్తాడు. అలా సిస్టర్ సిసిలియా తన ప్రమాణాలని చెప్పి nun ga మారుతుంది. వేడుక ముగిసిన తర్వాత father టెడేస్కి and సిసిలియా casual గా మాట్లాడుకుంటారు. అసలు సిసిలియాని ఈ కాన్వెంట్ లో చేరమని చెప్పింది అండ్ nun గా మారమని సలహా ఇచ్చింది ఎవరో కాదు! అది father టెడేస్కీనే.

2) సిసిలియ చిన్నతనం
సిసిలియాకి చిన్నప్పుడు గడ్డకట్టిన నీటి మీద నడవడమంటే చాలా ఇష్టం. అలాగే ఒకసారి తను గడ్డకట్టి ఉన్న lake పై నడుస్తుండగా పొరపాటున ice break అయ్యి, తను అతి చల్లటి నీటిలో మునిగిపోతుంది. ఆ ప్రమాదంలో సిసిలియా గుండే 7 నిమిషాల పాటు ఆగిపోతుంది. కానీ by god’s grace 7 నిమిషాల తర్వాత సిసిలియా గుండె మళ్లీ కొట్టుకోవడం start అవుతుంది. దేవుడు తనని మళ్ళీ బ్రతికించడానికి ఎదో ఒక రీజన్ ఉందీ అని సిసిలియా అప్పటినుంచి బలంగా నమ్ముతుంది. ఈ incident జరిగినప్పుడు సిసిలియా కి 12 సంవత్సరాలు. తరువాత Father టెడేస్కీ తనని nun గా మారమని చెప్పడం, సిసిలియా ఇలా కాన్వెంట్ లో జాయిన్ అవ్వడం జరుగుతాయి.
కట్ చేస్తే సిసిలియా ముఖం కడుక్కుంటుండగా తనకి ఎవరో ఏడుస్తున్న శబ్ధం వినిపిస్తుంది. సిసిలియా ఆ ఏడుపును ఫాలో అవుతూ ఒక హాల్ లోకి చేరుకుంటుంది. తీరాచూస్తే అక్కడ ఏడుస్తూ prayer చేసుకుంటున్న nun ki అసలు ఫేస్ ఉండదు. తన ముఖమంతా ఎర్రగా, ఫేస్ less గా ఉంటుంది. అది చూసి సిసిలియా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రెవరెండ్ మదర్ కూడా వస్తుంది. రెవరెండ్ మదర్ సిసిలియాని బలిపీఠం దగ్గరికి తీసుకెళ్లి, అక్కడ గాజు పెట్టెలో ఉన్న ఒక పొడవైన ఇనుప చీలని బయటికి తీసి సిసిలియాకి చూపిస్తుంది. “ఇది జీసస్ కి శిలువ వేసిన ఆ మూడు చీలలలో ఒకటి” అని రెవరెండ్ మదర్ సిసిలియాకి చెప్తుంది. తన మాటల్ని విన్న సిసిలియాకి అసలిక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళు తిరిగి కిందపడిపోతుంది.
కట్ చేస్తే కొంతమంది వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి సిసిలియాని చంపటానికి ప్రయత్నిస్తారు. దాంతో సిసిలియా వెంటనే నిద్రలోంచి మెలకువ లోకి వస్తుంది. సరిగ్గా అప్పుడే ఎవరో ఒక unknown person రూమ్ లోకి వచ్చి సిసిలియాని అంతే చూస్తుంటుంది. సిసిలియా తనని గమనించి వెంటనే light on చేయగా ఆ unknown person అక్కడినుంచి మాయమైపోతుంది. ఇలా ఆ కాన్వెంట్ లో అంతా వింత వింతగా జరుగుతుండడంతో సిసిలియాకి ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. రోజులు గడిచేకొద్దీ సిస్టర్ సిసిలియా అండ్ సిస్టర్ Gwen బాగా దగ్గరవుతారు. ప్రతిరోజూ బట్టలు ఉతికేయడం, older nuns ని జాగ్రత్తగా చూసుకోవడం వంటి పనులను వారిద్దరూ కలసి చేస్తుంటారు. ఒకరోజు సిసిలియా ప్రశాంతంగా నిద్రపోతుండగా ఒక older nun తన రూమ్ లోకి వచ్చి సిసిలియా యొక్క hair ని కొంచెం కట్ చేస్తుంది.

3) మొదలైన వింత
అప్పుడు సిసిలియా వెంటనే మెలకువలోకి వచ్చి older nun ని జాగ్రత్తగా తన బెడ్ దగ్గరికి తీసుకెళ్లి పడుకోపెడుతుంది. అంటే older nuns అందరూ మరణానికి దగ్గరగా ఉన్నారు కదా! So తనకి మతిస్థిమితం సరిగా లేకనే పొరపాటున తన hair ని cut చేసిందని సిసిలియా అనుకుంటది. ఇక సిసిలియా తనకి దుప్పటి కప్పి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్తూ older nun యొక్క కాళ్ళని చెక్ చేయగా తన పాదాలపై శిలువ ఆకారంలో కాలిన గుర్తులు ఉంటాయి. సిసిలియా ఆ గుర్తులని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు సిస్టర్స్ అందరూ స్నానం చేస్తుంటారు. అప్పుడు Gwen అసలు తను ఈ కాన్వెంట్ లో ఎలా చేరిందో సిసిలియాకి చెప్తుంది. Gwen యొక్క Ex Boyfriend ఎప్పుడు Gwen ని కొడుతుంటాడు.
అందుకని Gwen ఇక తనని భరించలేక తనపై బాగా దాడి చేసి తన దగ్గరినుంచి వచ్చేస్తుంది. ఇక Gwen ki ఎక్కడికి వెళ్ళాలో తెలియని situation lo ఉన్నప్పుడు తనకి nuns కనిపిస్తారు. “ఈ సిస్టర్స్ కి తినడానికి ఆహారం, చేయడానికి పని, ఉండడానికి నివాసం కలిగిన ఒక safe place ఉంది. So నేను కూడా ఒక nun గా మారిపోయి ఈ చెడు లోకానికి దూరంగా వెళ్ళిపోతాను” అని decide అయ్యి Gwen ఈ కాన్వెంట్ లో జాయిన్ అవుతుంది. అంటే Gwen కి దేవునిపై నమ్మకం లేదని కాదు, తనకి దేవునిపై నమ్మకం ఉంది. కాకపోతే అంత ఎక్కువా కాదు, అంత తక్కువా కాదు. ఈ విషయాలన్నీ Gwen సిసిలియాకి చెప్పిన తరువాత సిసిలియా పొరపాటున Vomit చేసుకుంటది.
Cut చేస్తే సిసిలియా ని డాక్టర్ Gallo checkup చేసి టాబ్లెట్స్ ఇస్తాడు. కొంచెం సేపటి తరువాత సిసిలియాకి కార్డినల్స్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో సిసిలియా కార్డినల్స్ ఆఫీస్ లోకి వెళ్తుంది. అక్కడ కార్డినల్ తో పాటు dr. Gallo, father టెడేస్కి, and రెవరెండ్ మదర్ కూడా ఉంటారు. “నువ్వు ఇంతకుముందు చేసిన ప్రమాణాలని అతిక్రమించి ప్రవర్తించావా? ” అని కార్డినల్ కోపంగా సిసిలియాని అడుగుతాడు. అందుకు సిసిలియా” లేదు, నేను నా ప్రమానాలని ఎప్పుడూ అతిక్రమించి ప్రవర్తించలేదు ” అని సమాధానమిస్తుంది. కానీ కార్డినల్ మాత్రం తన మాటల్ని అస్సలు నమ్మడు. “నువ్వు ఈ కాన్వెంట్ లో చేరకముందు ఎవరితోనైనా ఫిజికల్ గా interact అయ్యావా?” అని కార్డినల్ సిసిలియాని మళ్లీ ప్రశ్నిస్తాడు.

4) సిసిలియాకి గౌరవం
అందుకు సిసిలియా “నేను ఇప్పటివరకు ఎవరితోనూ ఫిజికల్ గా interact అవ్వలేదు, నేను ఇప్పటికీ వర్జిన్నే” అని confident గా చెప్తుంది. అసలిప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో సిసిలియాకి ఏమీ అర్ధంకాక, అసలిక్కడ ఏం జరుగుతుంది? అని ఫాదర్ టెడేస్కి ని సిసిలియా అడుగుతుంది. అసలు డాక్టర్ Checkup లో తెలిసిన విషయం ఏంటంటే సిసిలియా కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందీ అని. ఏ మగాడితో ఫిజికల్ గా interact అవ్వకపోయిన సరే సిసిలియా pregnant అవ్వడంతో, ఇది దేవుని యొక్క miracle అని and సిసిలియా మరో virgin మేరీ అని decide అవుతారు. ఈ మిరాకిల్ ని సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ ఒక ఫంక్షన్ ని కండక్ట్ చేస్తారు. కానీ ఈ ఫంక్షన్ లో మాత్రం సిస్టర్ ఇసబెల్ అండ్ సిస్టర్ Gwen మాత్రం అస్సలు సంతోషంగా ఉండరు. అసలు వాళ్లిద్దరూ అలా ఎందుకు ఉన్నారనే విషయం మనకి కథలో పోను పోనూ తెలుస్తది.
కట్ చేస్తే సిస్టర్ సిసిలియాని అందరూ గౌరవంగా, చాలా ప్రేమగా చూసుకంటుంటారు. Breakfast complete అయిన తరువాత సిసిలియా బాత్ టబ్ లో రిలాక్స్ అవుతుండగా అక్కడికి ఇసబెల్ వచ్చి సిసిలియా పై దాడి చేసి చంపాలని చూస్తుంది. ఇసబెల్ సిసిలియాపై దాడి చేస్తూ “నీ place లో ఉండాల్సింది నేను” అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుల్ని విన్న remaining nuns అక్కడికి వచ్చి ఇసబెల్ ని సిసిలియా దగ్గరినుంచి లాక్కెల్లిపోతారు. కట్ చేస్తే సిస్టర్ ఇసబెల్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. Gwen కి ఇక్కడున్న nuns మీద and fathers మీద మొదటినుంచి డౌట్ ఉంటుంది. Gwen ఈ విషయం గురించి సిసిలియాకి చెప్తుండగా father టెడేస్కి మధ్యలో కలగజేసుకుంటాడు.

5) ముగింపు
అప్పుడు Gwen ఇక ఓపిక పట్టలేక, “అసలు ఇసబెల్ ఎందుకు చనిపోయిందో మనకెవరికీ తెలియదు, and సిసిలియా ఎలా Pregnant అయ్యిందో కూడా ఎవరికీ తెలియదు. అసలిక్కడ ఎదో జరుగుతుంది, వీళ్ళందరూ ఆ విషయాలు మనకి తెలియకుండా దాస్తున్నారు” అని remaining nuns తో గట్టిగా చెప్తుంది. అప్పుడు టెడేస్కి అండ్ Convent members Gwen నోరు మూసేసి తనని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. చీకటి పడిన తరువాత Gwen తో మాట్లాడాలని సిసిలియా Gwen room లోకి వస్తుంది, కానీ అక్కడ Gwen ఉండదు. అలా సిసిలియా కార్డినల్స్ రూమ్ లోకి వెళ్లి అక్కడంతా చెక్ చేయగా అక్కడ తనకి ఒక ఫైల్ కనిపిస్తుంది. అందులో సిసిలియాకి సంభందించిన information అంతా ఉంటుంది, including childhood accident also. వాటిని చూసి సిసిలియా కాస్త షాక్ అవుతుంది.
సరిగ్గా అదే సమయంలో దూరం నుంచి ఎవరో అరుస్తున్న శబ్ధం వినిపిస్తుండడంతో సిసిలియా ఆ ఆరుపుల్ని ఫాలో అవుతూ వెళ్తుంది. తీరాచూస్తే కొంత మంది faceless nuns Gwen ని బంధించి తన నాలుకని కత్తితో కట్ చేసేస్తారు. అది చూసిన సిసిలియా భయంతో గట్టిగా అరవపోతుంటే అక్కడికి ఒక older nun వచ్చి సిసిలియా గొంతుని మూసేస్తుంది. ఈ Older nun ఎవరో కాదు, ఇంతకుముందు ఒక older nun సిసిలియా hair ని cut చేసింది కదా! ఆవిడే ఈవిడ. సిసిలియా తనతో “మనమిక్కడికి నుంచి వెంటనే వెళ్లిపోవాలి” అని tension పడుతూ చెప్తుంది. కానీ older nun మాత్రం “ఇక్కడినుంచి ఎవరూ ఎప్పటికీ తప్పించుకోలేరు” అని అంటుంది.
కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సిసిలియా గదిలోంచి గట్టిగా అరుపుల శబ్ధం వస్తుండడంతో అందరూ హడావిడిగా సిసిలియా రూంలోకి వెళ్తారు. తీరాచూస్తే సిసిలియాకి రక్తశ్రావం జరుగుతుంటుంది. సమయానికి Dr. Gallo కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక father టెడేస్కి సిసిలియాని car లోకి ఎక్కించి టౌన్ లోని హాస్పిటల్ కి తీసుకొస్తుంటాడు. రెవరెండ్ మదర్ సిసిలియాకి ఏమి కాకూడదని ఏడుస్తూ ప్రార్ధిస్తుండగా, తనకి ఆ రక్తపు వాసన మనిషి రక్తంలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉందని తెలుస్తుంది. దాంతో రెవరెండ్ మదర్ కి అనుమానం వచ్చి అక్కడంతా చెక్ చేయగా తనకి సిసిలియా మంచం కింద ఒక చచ్చిన కోడి కనిపిస్తుంది.
Image Credit: Immaculate (2024)