Humane (2024): Story | Cast | Box Office | OTT | Release Date
Elevation Pictures & IFC Films Distribute చేసిన “Humane” అనే హార్రర్ థ్రిల్లర్ మూవీ 5.5/10 IMDb రేటింగ్ తో క్రిటిక్స్ నుంచి Mixed Average టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 26, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Caitlin Cronenberg” దర్శకుడిగా వ్యవహరించారు. “Michael Sparaga” రచయితగా ఉన్నారు. Jay Baruchel, Sebastian Chacon, Emily Hampshire, Uni Park, Alanna Bale, Enrico Colantoni, Sirena Gulamgaus మరియు Emily Hampshire లు ప్రధాన పాత్రల్లో నటించారు. లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 44,509 డాలర్స్ ని కలెక్ట్ చేసింది. బడ్జెట్ విషయాలైతే పబ్లిక్ గా ఎక్కడా రివీల్ చేయలేదు. ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే మీరీ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.
ఇప్పుడు ప్లాట్ లోకి!
1) పర్యావరణ విపత్తు
ఓపెన్ చేస్తే భూమిపై environmental collapse జరగడం వల్ల ప్రపంచ దేశాల నాయకులందరూ ఎథెన్స్ లో ఒక emergency summit ని నిర్వహిస్తారు. environmental collapse వల్ల భూమిపై నీటికి మరియు ఆహారానికి కొరత ఏర్పడిద్ది. కాబట్టి ఎలాగైనా సరే ఈ emergency situation నుంచి బయటపడాలని, అందుకు వీలైనంత వరకు జనాభాను తగ్గించాలని summit లో డిసైడవుతారు. వేరే దేశ ప్రజలు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు ప్రతీ దేశం తమ borders ని close చేసేస్తారు. జనాభాను తగ్గించడంలో భాగంగా ప్రతీ family నుంచి ఎవరో ఒకరు స్వచ్ఛందంగా తమ ప్రాణాల్ని దేశానికి అర్పించాల్సి ఉంటది. ప్రాణ త్యాగం చేసినందుకు గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తది.
So ఇప్పటివరకు చాలా మందే తమ ప్రాణాల్ని అర్పిస్తారు. ఎవరైనా బయటికి రావాలంటే ఖచ్చితంగా గొడుగు Use చేయాల్సిందే. లేదంటే ప్రాణాంతకరమైన UV Rays వల్ల మనుషులు మూలనపడతారు. కట్ చేస్తే Charles York అనే retired famous news anchor దగ్గర సీన్ ఓపెనవుతుంది. చార్లెస్ కి నలుగురు పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటంటే, Jared, Rachael, Ashley and Noah. Present వీళ్లంతా వేరే వేరే ప్రదేశాల్లో నివసిస్తుంటారు. Noah చార్లెస్ యొక్క సొంత కొడుకు కాదు, చార్లెస్ Noah ని దత్తత తీసుకుని తన సొంత కొడుకులాగే పెంచి పెద్దచేస్తాడు and Charles యొక్క మొదటి భార్య చనిపోవడంతో చార్లెస్ ప్రస్తుతం Dawn Kim అనే ఆవిడని సెకండ్ Marriage చేసుకుంటాడు.
Jared news interview లో మాట్లాడుతూ, “కేవలం 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు మాత్రమే తమ ప్రాణాల్ని అర్పిస్తే మనమెప్పుడు మన టార్గెట్ ని రీచ్ అవుతాం. కాబట్టి మన దేశ జనాభా త్వరగా తగ్గాలంటే only 18 plus మాత్రమే కాదు, 18 కంటే తక్కువ వయసు వారు కూడా తమ ప్రాణాల్ని అర్పిస్తే దేశానికి మంచిదని అంటాడు. ఒక Important విషయాన్ని చెప్పేందుకు Charles తన నలుగురు పిల్లల్ని వెంటనే ఇంటికి రమ్మని పిలుస్తాడు. So Interview కంప్లీటయిన తర్వాత Jared సరాసరి Palace కి వెళ్తాడు. తను Palace కి చేరుకున్న కొంత సేపటికే Rachael కూడా Palace కి వస్తది. Rachael తనతో పాటు తన కూతురు Mia ని కూడా Palace కి తీసుకొస్తది.

2) అందరూ ఇళ్ళకి ప్రయాణం
నిజానికి కేవలం తన నలుగురు పిల్లల్ని మాత్రమే Charles Palace కి పిలుస్తాడు. కాకపోతే Mia ని ఒంటరిగా ఇంట్లో ఉంచలేక Rachael తనని కూడా Palace కి తీసుకొస్తది. Noah Drug Addict. But ప్రస్తుతం తను Addiction నుంచి బయటకొచ్చి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. Noah Girlfriend పేరు Grace. Grace కూడా ఒకప్పుడు Drug Addict. But తను కూడా Addiction నుంచి బయటకొస్తది. Noah Palace బయట నిలబడి లోపలికి వెళ్లాలా!? వద్దా!? అని ఆలోచిస్తూ Grace కి ఫోన్ చేస్తాడు. “మా ఫాదర్ నన్నెలా Receive చేసుకుంటాడో నాకు అర్థమవ్వట్లేదు” అని అంటూ Noah బాగా Tension పడిపోతుంటాడు.
అప్పుడు Grace Noah తో, “సరే నువ్వు మన Apartment కి వెళ్లు. Work Complete అయిన తర్వాత నేను కూడా Apartment కి వస్తా. ఇద్దరం కలిసి ప్రశాంతంగా TV చూద్దాం” అని అంటది. సరే అని Noah అక్కడినుంచి బయల్దేరబోతుండగా సరిగ్గా అదే సమయంలో Ashley Noah దగ్గరికి వస్తది. Noah చార్లెస్ కి దత్తపుత్రుడు కదా! So Rachael and Jared కి Noah మీద అంతగా ప్రేమ ఉండదు. కానీ Ashley కి మాత్రం Noah మీద ప్రేమ ఉంటది అలాగే Noah కి కూడా Ashley అంటే చాలా ఇష్టం. “నేను కూడా నాన్న దగ్గరికి వెళ్తున్నా కదా, కాబట్టి నువ్వు కూడా నాతోపాటు ఖచ్చితంగా రావాలి” అని చెప్పి Ashley Noah ని కార్ లోకి ఎక్కించుకుంటది.
కార్ లోకి ఎక్కిన తర్వాత Noah Grace కి Message చేయబోతుండగా Ashley అది చూసేసి, “ఇంతకీ Grace ఎవరు?” అని అడిగిద్ది. “oh తను నా Girlfriend” అని Noah అంటాడు. నిజానికి వీరిద్దరు తమ మధ్య ఎటువంటి Secrets ని దాచుకోరు. కాకపోతే తనకి Girlfriend ఉందన్న విషయాన్ని Noah Secret గా ఉంచడంతో Ashley కాస్త Disappoint గా ఫీలయిద్ది. Ashley Noah తో, “ఇంకెప్పుడు మన మధ్య Secrets ఉండకూడదని Promise చేయమంటది. అందుకు Noah కూడా Promise చేస్తాడు. ఇక వారిద్దరూ Palace లోకి అడుగుపెడతారు. చార్లెస్ వాళ్ళని ఆప్యాయంగా పలకరించి లోపలికి ఆహ్వానిస్తాడు. కట్ చేస్తే Dawn Beautiful గా డిన్నర్ Ready చేస్తది.

3) పిల్లల్ని కాపాడేందుకు
Actual గా Dawn ఒక Popular Chef. తనొక Famous Restaurant ని కూడా Run చేస్తుంటది. But కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం తను Restaurant ని మూసేస్తది. ఇక ఫ్యామిలీ అంతా Happy గా డిన్నర్ చేస్తారు. ఆ సమయంలో Rachael Charles తోటి, “ఇంత Sudden గా మమ్మల్ని ఇంటికెందుకు పిలిచావని విషయం అడిగిద్ది. అప్పుడు చార్లెస్, “నేనూ, Dawn ప్రాణ త్యాగం చేసేందుకు నిర్ణయించుకున్నామని అంటాడు. Charles మాటలు విని వారంతా షాకైపోతారు. “మనకేమీ డబ్బులవసరం లేదు కదా, మనకి కావాల్సినంత ఆస్తి ఉంది. మరి అలాంటప్పుడు మీరెందుకు ప్రాణ త్యాగం చేయడమని Jared అంటాడు. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రాణత్యాగం చేయాలి.
So పిల్లల ప్రాణాల్ని కాపాడేందుకు Charles, Dawn ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే వీరిద్దరూ Famous Persons కదా. ఇలా Famous Persons కూడా ప్రాణ త్యాగం చేస్తే వీళ్ళని చూసి సామాన్య ప్రజలు కూడా దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తారన్న ఉద్దేశంతో Charles, Dawn ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. “ప్రతి ఇంటి నుంచి ఖచ్చితంగా ఒకరు ప్రాణత్యాగం చేయాలన్న రూల్ మనలాంటి రిచ్ Persons కి వర్తించదు. అది కేవలం సామాన్యులకు మాత్రమే. కాబట్టి మీరు చనిపోవాల్సిన అవసరం లేదని Jared అంటాడు. అప్పుడు చార్లెస్, “ఇలాంటి Situations లో మనం Chance తీసుకోకూడదు, మేము Already Decide అయ్యామని అంటాడు.
అసలీ Environmental Crisis కి Asian Countries అయిన చైనా, జపాన్, ఇండియాలాంటి దేశాలే కారణమని ప్రపంచమంతా False Rumor Spread అయిద్ది. ఈ Jared ఒక Racist అనమాట. So వాడు కూడా, “Yes దీనికి Asian కంట్రీసే కారణమని News Interviews కూడా చెప్తాడు. అది నిజమని నమ్మిన కొంత మంది ప్రజలు Asian Countries పై కోపం పెంచుకుని Dawn Run చేస్తున్న Restaurant ని మంటల్లో కాల్చేస్తారు. కట్ చేస్తే డిన్నర్ కంప్లీటయిన తర్వాత డెసర్ట్ రెడీ చేసేందుకు Dawn కిచెన్ లోకి వెళ్తది. Noah తన Girlfriend గురించి Charles కి చెప్పాలనుకుంటాడు. కానీ ఒకప్పుడు Grace కూడా Drug Addict కదా, So Charles తనని ఫ్యామిలీలోకి అంగీకరిస్తాడో లేదో అని Noah ఆలోచిస్తుంటాడు.

4) ముగింపు
అప్పుడు మాటల సందర్భంలో Noah యొక్క Girlfriend గురించి Ashley Charles కి చెప్తది. ఒకప్పుడు తను Drug Addict అయినప్పటికీ, ప్రస్తుతం తను చాలా సంవత్సరాల నుంచి Clean గా ఉందని తెలిసి Charles Grace ని Family Member గా అంగీకరిస్తాడు. దాంతో Noah చాలా Happy గా ఫీలవుతాడు. డెసర్ట్ తీసుకొచ్చేందుకు Charles Dawn దగ్గరికెళ్తాడు. But Dawn కిచెన్ లో ఉండదు. తనొక Letter రాసి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయుంటది. Dawn రాసిన లెటర్ కిచెన్ లో కనిపించడంతో Charles ఆ లెటర్ తీసుకుని హాల్లోకొస్తాడు. Dawn ఆ లెటర్ లో, “నేను నా ప్రాణాల్ని కోల్పోలేను.
నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా” అని Charles గురించి రాసి ఉంటది. సరిగ్గా అదే సమయంలో Department of Citizen Strategy aka DOCS నుంచి Bob అనే వ్యక్తి Palace దగ్గరికి వస్తాడు. “అంటే మీరిద్దరూ ఈ రాత్రికే చనిపోయేందుకు Sign up కూడా చేశారా!” అని అందరూ షాకైపోతారు. “మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నయ్. అప్పుడే వీళ్ళు వచ్చేస్తే ఎలా! ముందు వాళ్లని ఇక్కడినుంచి వెళ్ళమనండని వాళ్లంతా Charles తో అంటారు. చార్లెస్ Bob ని లోపలికి పిలిచి, “Dawn ఇంట్లో నుంచి పారిపోయింది. నిజానికి మేమిద్దరం ఒకేసారి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాం.
కాబట్టి మీరిప్పుడు వెనక్కి వెళ్ళిపోండి. Dawn వచ్చిన తర్వాత Inform చేస్తామని అంటాడు. “సరే No Problem, But Procedure Cancel చేస్తున్నట్టుగా మీరు కొన్ని పేపర్స్ పై Sign చేయాల్సి ఉంటదని Bob అంటాడు. Ok అదెంత పని అని చార్లెస్ Sign చేసేందుకు ఒప్పుకుంటాడు. Cut చేస్తే Bob, Charles office room లోకి వెళ్తారు. Cancellation Papers ని Bob చార్లెస్ కి ఇస్తాడు. Sign చేసేముందు ఒకసారి వాటిని చదువుదాం అన్నట్టుగా Charles Cancellation Papers లో ఏం రాసి ఉందో చదువుతాడు. అయితే అందులో రాసి ఉన్న Matter ని చూసి చార్లెస్ ఒక్కసారిగా షాకైపోతాడు.
Image Credit: Humane (2024)