Humane (2024) Plot Summary Explained in Telugu

Humane (2024) Plot Summary Explained in Telugu

భూమిపై పర్యావరణ సంక్షోభం ఏర్పడి తినడానికి సరిపడా ఆహారం దొరకకపోతే మీరు ఏం చేస్తారు? ప్రమాదకరంగా మారిన సూర్యకిరణాల నుంచి తప్పించుకునేందుకు గొడుగులు ఉపయోగించే రోజులు వస్తే మీరు ఏం చేస్తారు!? కరువు నుండి తప్పించుకునేందుకు ఇంటికొకరు ప్రాణత్యాగం చేయాలని గవర్నమెంట్ ప్రజలను ఆదేశిస్తే!? వింటుంటేనే చాలా ఆసక్తకరంగా ఉంది కదా! మనమిప్పుడు ఇలాంటి సినిమా గురించే మాట్లాడుకోబోతున్నాం. 2024లో విడుదలైన ‘హ్యుమేన్’ అనే సినిమాలో ఇలాంటి అబ్బురపరిచే ట్విస్టులు, ఆశ్చర్యం కలిగించే సన్నివేశాలు చాలా ఉంటాయి. గవర్నమెంట్ జారీ చేసిన ఆదేశం వల్ల ఒక కుటుంబం ఎంతలా ఇబ్బందిపడిందో మనం ఈ సినిమాలో చూడొచ్చు. మరి ఈ సినిమా యొక్క విశేశాలేంటో చూసేద్దాం పదండి!

ఇప్పుడు కథ తెలుసుకుందాం!
1) పర్యావరణ విపత్తు

భూమిపై ఒక పర్యావరణ విపత్తు జరగడం వల్ల ప్రపంచ దేశాల నాయకులందరూ ఎథెన్స్ లో ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తారు. పర్యావరణ విపత్తు వల్ల భూమిపై నీటికి మరియు ఆహారానికి కొరత ఏర్పడిద్ది. కాబట్టి ఎలాగైనా సరే ఈ అత్యవసర పరిస్తితి నుంచి బయటపడాలని, అందుకు వీలైనంత వరకు జనాభాను తగ్గించాలని సమావేశంలో నిర్ణయిస్తారు. వేరే దేశ ప్రజలు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు ప్రతీ దేశం తమ సరిహద్దుల్ని మూసేస్తారు. జనాభాను తగ్గించడంలో భాగంగా ప్రతీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు స్వచ్ఛందంగా తమ ప్రాణాల్ని దేశానికి అర్పించాల్సి ఉంటది. ప్రాణ త్యాగం చేసినందుకు గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తది.

అలా ఇప్పటివరకు చాలా మందే తమ ప్రాణాల్ని అర్పిస్తారు. ఎవరైనా బయటికి రావాలంటే ఖచ్చితంగా గొడుగు ఉపయోగించాల్సిందే, లేదంటే ప్రాణాంతకరమైన UV కిరణాల వల్ల మనుషులు మూలనపడతారు. కట్ చేస్తే “చార్లెస్ యార్క్” అనే రిటైర్డ్ ఫేమస్ న్యూస్ యాంకర్ దగ్గర సీన్ ఓపెనవుతుంది. చార్లెస్ కి నలుగురు పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటంటే, “జరెడ్”, “రేచల్”, “యాశ్లీ”, మరియు “నోవ”. ప్రస్తుతం వీళ్లంతా వేరే వేరే ప్రదేశాల్లో నివసిస్తుంటారు. నోవ, చార్లెస్ యొక్క సొంత కొడుకు కాదు. చార్లెస్ నోవాని దత్తత తీసుకుని తన సొంత కొడుకులాగే పెంచి పెద్దచేస్తాడు. చార్లెస్ యొక్క మొదటి భార్య చనిపోవడంతో, ప్రస్తుతం తను “డాన్ కిమ్” అనే ఆవిడని రెండో వివాహం చేసుకుంటాడు.

జరెడ్ ఒక న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “కేవలం 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు మాత్రమే తమ ప్రాణాల్ని అర్పిస్తే మనమెప్పుడు మన టార్గెట్ ని చేరుకుంటాం. కాబట్టి మన దేశ జనాభా త్వరగా తగ్గాలంటే కేవలం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే కాదు. అంతకంటే తక్కువ వయసు వారు కూడా తమ ప్రాణాల్ని అర్పిస్తే మంచిదని అంటాడు. ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పేందుకు చార్లెస్ తన నలుగురు పిల్లల్ని వెంటనే ఇంటికి రమ్మని పిలుస్తాడు. కాబట్టి ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత జరెడ్ సరాసరి ప్యాలెస్ కి వెళ్తాడు. తను ప్యాలెస్ కి చేరుకున్న కొంత సేపటికే రేచల్ కూడా ప్యాలెస్ కి వస్తది. రేచల్ తనతో పాటు తన కూతురు “మియా” ని కూడా తీసుకొస్తది.

2) అందరూ ఇంటికి ప్రయాణం

నిజానికి కేవలం తన నలుగురు పిల్లల్ని మాత్రమే చార్లెస్ ప్యాలెస్ కి పిలుస్తాడు. కాకపోతే మియాని ఒంటరిగా ఇంట్లో ఉంచలేక రేచల్ తనని కూడా తీసుకొస్తది. నోవాకి ఒకప్పుడు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటది. కానీ ప్రస్తుతం తను ఆ వ్యసనం నుంచి బయటకొచ్చి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. నోవ లవర్ పేరు “గ్రేస్”. తను కూడా ఒకప్పుడు డ్రగ్స్ తీసుకునేది. కానీ ప్రస్తుతం తను కూడా ఆ వ్యసనం నుంచి బయటకొస్తది. నోవా ప్యాలెస్ బయట నిలబడి లోపలికి వెళ్లాలా!? వద్దా!? అని ఆలోచిస్తూ గ్రేస్ కి ఫోన్ చేస్తాడు. “మా నాన్నతో ఎలా మాట్లాడాలో నాకు అర్థమవ్వట్లేదు” అని అంటూ నోవా బాగా కంగారుపడతాడు.

Humane (2024) Plot Summary Explained in Telugu
Humane (2024) Plot Summary Explained in Telugu

అప్పుడు గ్రేస్, “సరే నువ్వు మన అపార్టుమెంట్ కి వెళ్లు. పని పూర్తయిన తర్వాత నేను కూడా అపార్టుమెంట్ కి వస్తా. ఇద్దరం కలిసి ప్రశాంతంగా టీవీ చూద్దాం” అని అంటది. సరే అని నోవా అక్కడ్నుంచి బయల్దేరబోతుండగా సరిగ్గా అదే సమయంలో యాశ్లీ వస్తది. నోవా, చార్లెస్ కి దత్తపుత్రుడు కదా! కాబట్టి రేచల్ మరియు జరెడ్ కి నోవా మీద అంతగా ప్రేమ ఉండదు. కానీ యాశ్లీకి మాత్రం నోవా మీద ప్రేమ ఉంటది అలాగే నోవాకి కూడా యాశ్లీ అంటే చాలా ఇష్టం. “నేను కూడా నాన్న దగ్గరికి వెళ్తున్నా కదా, కాబట్టి నువ్వు కూడా నాతోపాటు ఖచ్చితంగా రావాలి” అని చెప్పి తను నోవాని కార్లోకి ఎక్కించుకుంటది.

కార్లోకి ఎక్కిన తర్వాత నోవా గ్రేస్ కి మెసేజ్ చేయబోతుండగా యాశ్లీ అది చూసేసి, “ఇంతకీ గ్రేస్ ఎవరు?” అని అడిగిద్ది. “ఓ తను నా లవర్” అని నోవా అంటాడు. నిజానికి వీరిద్దరు తమ మధ్య ఎటువంటి రహస్యాల్ని దాచుకోరు. కాకపోతే తనకి లవర్ ఉందన్న విషయాన్ని నోవా సీక్రెట్ గా ఉంచడంతో యాశ్లీ కాస్త భాదపడిద్ది. “ఇంకెప్పుడు ఇలా మన మధ్య రహస్యాలు ఉండకూడదు” అని చెప్పి యాశ్లీ నోవా చేత ప్రామిస్ చేయించుకుంది. ఇక వారిద్దరూ ప్యాలెస్ లోకి అడుగుపెడతారు. చార్లెస్ వాళ్ళని ఆప్యాయంగా పలకరించి లోపలికి ఆహ్వానిస్తాడు. కట్ చేస్తే డాన్ చాలా అద్భుతంగా డిన్నర్ సిద్ధం చేస్తది.

3) పిల్లల్ని కాపాడేందుకు

నిజానికి డాన్ ఒక ప్రఖ్యాతి చెందిన చెఫ్. తనకొక ఫేమస్ రెస్టారెంట్ కూడా ఉంటది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం తను ఆ రెస్టారెంట్ ని మూసేస్తది. ఇక అందరూ సంతోషంగా డిన్నర్ చేస్తారు. ఆ సమయంలో రేచల్ మాట్లాడుతూ, “ఇంత హఠాత్తుగా మమ్మల్ని ఇంటికెందుకు పిలిచావు” అని చార్లెస్ ని విషయమడిగిద్ది. అప్పుడు చార్లెస్, “నేను, డాన్ ప్రాణ త్యాగం చేసేందుకు నిర్ణయించుకున్నాం” అని అంటాడు. తన మాటలు విని అందరూ షాకైపోతారు. “మనకేమీ డబ్బులవసరం లేదు కదా! మనకి కావాల్సినంత ఆస్తి ఉంది. మరి అలాంటప్పుడు మీరెందుకు ప్రాణ త్యాగం చేయడం” అని జరెడ్ అంటాడు. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రాణత్యాగం చేయాలి.

కాబట్టి పిల్లల ప్రాణాల్ని కాపాడేందుకు చార్లెస్, డాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే వీరిద్దరూ పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తులు కదా. ఇలా పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తులు కూడా ప్రాణ త్యాగం చేస్తే వీళ్ళని చూసి సామాన్య ప్రజలు కూడా దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తారన్న ఉద్దేశంతో వారిద్దరు ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. “ప్రతి ఇంటి నుంచి ఖచ్చితంగా ఒకరు ప్రాణత్యాగం చేయాలన్న నిబంధన మనలాంటి డబ్బున్న వ్యక్తులకి వర్తించదు. అది కేవలం సామాన్యులకు మాత్రమే. కాబట్టి మీరు చనిపోవాల్సిన అవసరం లేదు” అని జరెడ్ అంటాడు. అప్పుడు చార్లెస్, “ఇలాంటి పరిస్థితిలో మనమిలా ఆలోచించకూడదు. మేమిద్దరం ముందుగానే నిర్ణయించుకున్నాం” అని అంటాడు.

అసలీ ప్రకృతి వైపరీత్యానికి ఆసియా దేశాలైన అయిన చైనా, జపాన్, ఇండియాలాంటి దేశాలే కారణమని ప్రపంచమంతా ఒక అబద్ధపు రూమర్ వ్యాపిస్తది. ఈ జరెడ్ ఒక రేసిస్ట్ అనమాట. వాడు కూడా, “అవును, దీనికి ఆసియా దేశాలే కారణమని న్యూస్ ఇంటర్వ్యూలలో కూడా చెప్తాడు. అది నిజమని నమ్మిన కొంత మంది ప్రజలు ఆసియా దేశాలపై కోపం పెంచుకుని డాన్ నడుపుతున్న రెస్టారెంట్ ని మంటల్లో కాల్చేస్తారు. కట్ చేస్తే డిన్నర్ ముగిసిన తర్వాత డెసర్ట్ తెచ్చేందుకు డాన్ వంట గదిలోకి వెళ్తది. నోవా తన లవర్ గురించి చార్లెస్ కి చెప్పాలనుకుంటాడు. కానీ ఒకప్పుడు గ్రేస్ కూడా డ్రగ్స్ తీసుకునేది కదా! కాబట్టి చార్లెస్ తనని ఫ్యామిలీలోకి అంగీకరిస్తాడో లేదో అని నోవా ఆలోచిస్తుంటాడు.

Humane (2024) Plot Summary Explained in Telugu
Humane (2024) Plot Summary Explained in Telugu
4) ఇంటి నుండి పారిపోవడం

అప్పుడు మాటల సందర్భంలో గ్రేస్ గురించి యాశ్లీ చార్లెస్ కి చెప్తది. ఒకప్పుడు తను వ్యసనాలకు బానిసైననప్పటికీ, ప్రస్తుతం తను చాలా సంవత్సరాల నుంచి మంచిగా ఉందని తెలిసి చార్లెస్ గ్రేస్ ని తమ కుటుంబంలోకి వచ్చేందుకు అంగీకరిస్తాడు. దాంతో నోవా చాలా ఆనందపడతాడు. డెసర్ట్ తీసుకొచ్చేందుకు చార్లెస్ వంట గదిలోకెళ్తాడు. కానీ అక్కడ డాన్ ఉండదు. తనొక ఉత్తరం రాసి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయుంటది. డాన్ రాసిన ఉత్తరం వంట గదిలో కనిపించడంతో చార్లెస్ దాన్ని తీసుకుని పిల్లల దగ్గరికొస్తాడు. డాన్ ఆ ఉత్తరంలో, “నేను నా ప్రాణాల్ని కోల్పోలేను.

నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా” అని చార్లెస్ గురించి రాసి ఉంటది. సరిగ్గా అదే సమయంలో “డిపార్టుమెంట్ ఆఫ్ సిటిజన్ స్ట్రాటజీ (DOCS)” నుంచి “బాబ్” అనే వ్యక్తి ప్యాలెస్ దగ్గరికొస్తాడు. “అంటే మీరిద్దరూ ఈ రాత్రికే చనిపోయేందుకు పేపర్స్ మీద సంతకం కూడా చేశారా!” అని పిల్లలందరూ షాకైపోతారు. “మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నయ్. అప్పుడే వీళ్ళు వచ్చేస్తే ఎలా! ముందు వాళ్లని ఇక్కడినుంచి వెళ్ళమనండి” అని పిల్లలంతా చార్లెస్ తో అంటారు. చార్లెస్ బాబ్ ని లోపలికి పిలిచి, “డాన్ ఇంట్లో నుంచి పారిపోయింది. నిజానికి మేమిద్దరం ఒకేసారి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాం.

కాబట్టి మీరిప్పుడు వెనక్కి వెళ్ళిపోండి. డాన్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తా” అని అంటాడు. “సరే పర్లేదు, కాకపోతే వాయిదా వేస్తున్నట్టుగా మీరు కొన్ని పేపర్స్ పై సంతకం చేయాల్సి ఉంటది” అని బాబ్ అంటాడు. “అలాగే, అదెంత పని!” అని చార్లెస్ సంతకం చేసేందుకు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే చార్లెస్ తో కలిసి బాబ్ ఆఫీస్ రూంలోకి వెళ్తాడు. సంతకం చేసేముందు ఒకసారి చదువుదాం అన్నట్టుగా, బాబ్ ఇచ్చిన పేపర్స్ లో ఏం రాసి ఉందో చార్లెస్ చదువుతాడు. అందులో రాసి ఉన్న విషయాన్ని చూసి చార్లెస్ ఒక్కసారిగా షాకైపోతాడు.

5) ముగింపు

మరి ఆ పేపర్లో ఏం రాసి ఉంది!? ఎందుకని చార్లెస్ దాన్ని చదివి షాక్ అయ్యాడు!? చివరికి ఆ కుటుంబ కథా ఏ విధంగా ముగిసింది!? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే ఒకసారి మూవీని తనివితీరా చూడాల్సిందే! ఈ విధంగా హ్యుమేన్ కథ సాగుతుంది. ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలు కొని మాత్రమే. చదువుతుంటే కథ చాలా ఆసక్తికరంగా ఉంది కదా! ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. క్రిటిక్స్ నుంచి ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. వ్యక్తిగతంగా నాకైతే ఈ సినిమా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చూసిన అనుభూతి కలిగింది. మీరు కూడా ఈ సినిమాని వీక్షించాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది, ఒకసారి చూసేయండి.

Leave a Comment