Heart Eyes Movie Explained & Summary in Telugu
Screen Gems & Republic Pictures Distribute చేసిన “Heart Eyes” అనే హార్రర్ స్లాషర్ మూవీ 6.1/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ ఫిబ్రవరి 7, 2025 లో రిలీజయింది. Josh Ruben ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. Philip Murphy, Christopher Landon మరియు Michael Kennedy రచయితలుగా ఉన్నారు. నటీనటుల విషయానికొస్తే Ally McCabe అనే పాత్రలో Olivia Holt, Jay Simmonds అనే పాత్రలో Mason Gooding నటించారు. Gigi Zumbado, Devon Sawa, Michaela Watkins, Jordana Brewster మరియు Yoson An ప్రధాన పాత్రల్లో నటించారు. 18 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 32.9 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది. హార్రర్ స్లాషర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి Experience ఇస్తది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.
ఇప్పుడు కథలోకి వెళ్దాం!
1) Introduction
ఓపెన్ చేస్తే సియాటెల్లో ఒక వైనరీ దగ్గర స్టోరీ మొదలవుతుంది. ఆరోజు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. Patric, Adeline కి ప్రపోజ్ చేస్తుంటాడు. ఆమె కూడా యాక్సెప్ట్ చేసి కిస్ చేస్తుంది. ఆ సమయంలో Patric అరేంజ్ చేసిన ఫోటోగ్రాఫర్ Nicco కాల్ చేసి ప్రపోజల్ ని నేను సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను, సో మళ్లీ ప్రపోజ్ చేయని అంటాడు. సర్లే అని Patric మళ్లీ ప్రపోజ్ చేస్తుంటాడు. కట్ చేస్తే అక్కడికి Heart Eyes వచ్చి కెమెరామాన్ ని దారుణంగా పొడిచి చంపేస్తాడు. Patric, Adeline కిస్ చేసుకుంటుండగా ఆ కిల్లర్ ఫోటోగ్రాఫర్ సెల్ నుండి Patric కి ఫోన్ చేస్తాడు. వీడి గోల ఏంటని Adeline సెల్ తీసుకుంటది.
విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆ కిల్లర్ Patric తలలోకి యారోని దించుతాడు. Adeline కి చచ్చేంత భయం వేసి అక్కడ నుంచి పారిపోతుంది. తను కారు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటది. కానీ ఆ కిల్లర్ యారోస్తో తన మీద అటాక్ చేస్తాడు. హార్ట్ ఐస్ వేసే బాణాల నుంచి తప్పించుకుంటూ Adeline అక్కడి నుంచి ఒక పొలం లోకి పారిపోయి దాక్కుకుంటుంది. Heart Eyes కి ఆ అమ్మాయి ఎక్కడ దాక్కుతుందో కనిపించదు. సో వాడు Patric మొబైల్ తో Adeline కి కాల్ చేస్తాడు. ఈ అమ్మాయి సైలెంట్ గా ఉండొచ్చుగా! ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు నాతో అనవసరంగా పెట్టుకున్నావ్ అని వార్నింగ్ ఇస్తది.
ఆ అమ్మాయి అరిచే అరుపులకి తన లొకేషన్ వీడికి అర్థమై, ఒక యారో ని Adeline కాల్లోకి దించుతాడు. ఇక తను అక్కడి నుంచి కుంటకుంటూ ఫాస్ట్ గా వైన్ ఫ్యాక్టరీ లోకి వెళ్తుంది. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే, తనని కాపాడమని ఆ కిల్లర్ గురించి చెప్తుండగా Heart Eyes అక్కడికి వచ్చేస్తాడు. సెక్యూరిటీ అతన్ని ఆపాలని చూస్తాడు. కానీ హార్ట్ ఐస్ అతన్ని చంపేస్తాడు. వీడు నన్ను కూడా చంపేసేలా ఉన్నాడని Adeline వెళ్లి క్రషింగ్ మిషన్ లో దాక్కుంటుంది. కానీ వాడు తనని చూసేసి ఆ మిషన్ ని క్లోజ్ చేసీ మిషన్ ని ఆన్ చేయగానే ఎడలైన్ క్రష్ అయ్యి చనిపోతుంది. అప్పుడే మనకి ఆ కిల్లర్ ని రీవిల్ చేస్తారు. వీడు ఒక మాస్క్ పెట్టుకొని ఉంటాడు.

2) Hero – Heroine
ఆ మాస్క్ కి హార్ట్ షేప్ లో సింబల్స్ ఉంటాయి & లాస్ట్ కొన్ని ఇయర్స్ గా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో వాలెంటైన్స్ డే రోజున చాలామంది ప్రేమికులని చంపేసి ఉంటాడు. ప్రజెంట్ వాలెంటైన్స్ డే కి సియాటెల్ వచ్చి ప్రేమికుల్ని మర్డర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రజెంట్ ఈ మర్డర్ న్యూస్ వైరల్ అవుతుంది. సో వాలెంటైన్స్ డే రోజు కపుల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని న్యూస్ లో చెప్తారు. కట్ చేస్తే Ally ఒక Ad డిజైనర్. ఆమె తన ఫ్రెండ్ మోనికాతో ఒక కాఫీ షాప్ కి వెళ్తది. Ally రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకొని ఉంటుంది. సో ఈ వాలెంటైన్స్ డే కి తను సింగిల్ అనమాట.
Ally ఆర్డర్ చేసిన సేమ్ టైప్ ఆఫ్ కాఫీనే జె అనే వ్యక్తి కూడా ఆర్డర్ చేస్తాడు. ఇద్దరు అన్ఫార్చునేట్గా అలా ఆర్డర్ చేయడంతో జస్ట్ 2 మినిట్స్ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో Ally మెటల్ స్ట్రా కింద పడడంతో అది తీసుకునే ప్రయత్నంలో Ally తల జే కి తగిలి అతనికి బ్లడ్ వస్తది. ఇక Ally జే కి సారీ చెప్పి, తనకీ ఆఫీసులో వర్క్ ఉందని హడావిడిగా వెళ్లిపోద్ది. ఆ టైంలో వైనరీ దగ్గర జరిగిన హత్యల గురించి ఎంక్వయిరీ చేయడానికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ న్యూస్ లో మాట్లాడుతూ, వాలెంటైన్స్ డే రోజు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తుండటం Jay టీవీలో చూస్తాడు.
కట్ చేస్తే Ally రెడీ చేసిన పెర్ఫ్యూమ్ యాడ్ ఆమె బాస్ కి నచ్చక ఆమే Ally నీ అరుస్తుంది & Ally ప్లేస్ లోకి కొత్త వ్యక్తి వస్తున్నాడని అతన్ని పిలుస్తది. అతను ఎవరో కాదు Jay. Jay Ally బాస్ తో, మేము కలిసి వర్క్ చేస్తామని అంటాడు. Ally కి అలా వర్క్ చేయడం ఇష్టం లేదు, సో తను వెళ్లిపోవాలనుకుంటుంది. బట్ Ally బాస్ ఆమె దగ్గరికి వెళ్లి, నువ్వు గాని Jay తో కలిసి వర్క్ చేయకపోతే నేను బ్లాక్ లిస్ట్ లో పెడతానని కొంచెం బెదిరించినట్టుగా చెప్తది. సో ఇక Ally జే తో కలిసి వర్క్ చేయక తప్పదని అర్థం చేసుకుంటది. మరోవైపు వైనరీ దగ్గర జరిగిన కపుల్ మర్డర్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ Hobb అండ్ Shaw అక్కడికి వెళ్తారు. వాళ్లు అక్కడ పరిశీలిస్తుండగా ఒక వెడ్డింగ్ రింగ్ కనిపిస్తుంది.

3) Heart Eyes Attack
దానిమీద J & S అనే లెటర్స్ ఉంటాయి. ఈ Heart Eyes కిల్లర్ గాడు పెద్ద సైకో గాడు. వాడు మర్డర్ చేసిన తర్వాత హార్ట్ ని బయటకు తీసి దాన్ని ఒక ప్లేస్ లో పెట్టి దాన్ని చుట్టూ హార్ట్ షేప్ లో సింబల్ వేసి వెళ్తాడు. అది చూసి వాళ్లు ఈ కిల్లర్ మామూలోడు కాదని అనుకుంటారు. అండ్ కాసేపటికే Downtown Spa లో మరో ఇద్దరు కపుల్స్ నీ కూడా చంపేస్తాడు. ఆ న్యూస్ TV లో రావడం Ally చూస్తుంది. కట్ చేస్తే Jay అండ్ Ally వర్క్ గురించి మాట్లాడుకోవడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. Jay Ally తో పులిహోర కలపాలని ట్రై చేస్తాడు అండ్ ఇద్దరూ కాసేపు లవ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ టైంలో Ally జే హర్ట్ అయ్యేలాగా మాట్లాడుతుంది.
సో జే కాస్త బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. Ally బయటికి వచ్చి జే కి సారీ చెప్తది. అదే టైంలో Ally ఎక్స్ బాయ్ ఫ్రెండ్ Collin తన లవర్ తో వస్తుండటం తో Ally కాస్త జలసిగా ఫీల్ అయ్యి వెంటనే జే నీ కిస్ చేస్తది. అండ్ జే తన బాయ్ ఫ్రెండ్ అని Collin కి పరిచయం చేస్తుంది. సో ఇద్దరూ లవర్స్ లా వాళ్లతో తో మాట్లాడుతారు. Collin Ally తో ఆ Heart Eyes కిల్లర్ మన సిటీకి వచ్చాడు. వాలెంటైన్స్ డే రోజు వాడు కపుల్స్ ని చంపుతున్నాడు. ఆల్రెడీ వైనరీ దగ్గర ఒక కపుల్ ని చంపాడు. వాళ్లు మాకు తెలిసిన వాళ్లే. మేము వాళ్ళు ఇక్కడికి రావాలి అని అనుకున్నాం.
కాని వాళ్ళని చంపేశాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండని చెప్పి రెస్టారెంట్లోకి వెళ్తాడు. ఇక Jay అండ్ Ally ఒక క్యాబ్ లో ఇంటికి బయలుదేరుతారు. Ally Jay ని కిస్ చేసినప్పటి నుండి వాళ్లు క్యాబ్ ఎక్కేంతవరకు వాళ్ళిద్దరిని హార్ట్ ఐస్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ వీళ్ళకి ముహూర్తం పెట్టాడన్నమాట. కట్ చేస్తే ఇద్దరూ క్యాబ్లో వెళుతుండగా Ally హౌస్ వస్తది. సో తను అక్కడ దిగిపోతుంది. బట్ ఆమె తన ఇంటి కీస్ షాపింగ్ మాల్ డ్రెస్సింగ్ రూమ్ లో మర్చిపోయి ఉంటది. జే ఆమె దగ్గరికి వచ్చి సరే ఈ రాత్రికి నాతో బయటికి రావచ్చు కదా అని అడగదామనుకుంటాడు. బట్ Ally డోర్ వెనక ఇంకొక కీ ఉంది, నేను గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తానని అంటది.

4) Misunderstand
కానీ ఆమెకి గ్లాస్ బ్రేక్ చేసే అంత ధైర్యం లేకపోవడంతో Jay గ్లాస్ ని బ్రేక్ చేస్తాడు. ఆ టైంలో అతని వేలికి గాయం అవుతుంది. ఇక Ally తాళం తీసి అతని చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటది. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా Ally తన కబోర్డ్ ని ఓపెన్ చేస్తది. తీరా చూస్తే అక్కడ హార్ట్ ఐస్ ఉంటాడు. Ally కి భయం వేసి వెంటనే కబోర్డ్ క్లోజ్ చేస్తది. బట్ నో యూస్, వాడు ఇద్దరి మీద అటాక్ చేస్తాడు. వాళ్ళు ఎలాగోలా రూమ్ డోర్ క్లోజ్ చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. వెంటనే క్యాబ్ వెక్కి పారిపోదాం అనుకుంటారు. బట్ వాడు బయటికి వచ్చి క్యాబ్ డ్రైవర్ ని యారోతో షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడు Ally “అరే బాబు నువ్వు చంపేది కపుల్స్ నే కదా! మేము అసలు లవర్స్ ఏ కాదు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావని అంటది”.
బట్ వాడు మాత్రం Ally మాటలు పట్టించుకోకుండా అటాక్ చేస్తాడు. ఇక వీళ్ళకి భయం వేసి చీకట్లో పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్తారు. కానీ వాడు అక్కడికి కూడా వచ్చి ఇద్దరి మీద అటాక్ చేస్తాడు. ఆ ఎటాక్ లో జే కింద పడిపోతాడు. Ally కి భయం వేసి జేని వదిలేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. ఆమె ఒక కరౌజల్లో దాక్కుకుంటుంది. హార్ట్ ఐస్ తనని చూసేసి ఆ మిషన్ ని ఆన్ చేసి Ally మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ Ally వాడి అటాక్ నుంచి తప్పించుకుని వాడ్ని గట్టిగా తన్నడంతో వాడు పక్కకు పడిపోతాడు. ఇక Ally అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంటే Heart Eyes ఆమెను చంపడానికి ట్రై చేస్తాడు.
తీరా చూస్తే ఈ లోపు అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. సో హార్ట్ ఐస్ అక్కడి నుంచి పారిపోతాడు. “Heart Eyes మా మీద దాడి చేశాడు. నాతో పాటు జే అనే వ్యక్తి కూడా ఉండాలని Ally పోలీస్ ఆఫీసర్ కి చెప్తుండగా, డిటెక్టివ్ Heart Eyes ని పట్టేసుకున్నాం అని వాకీటాకీలో అందరికీ చెప్తాడు. తీరా చూస్తే వాళ్లు పట్టుకుంది జే ని. జే అన్కాన్షియస్ గా పడిపోయిన దగ్గర Heart Eyes కి సంబంధించిన వెపన్ & మాస్క్ డిటెక్టివ్స్ దొరుకుతాయి. సో వాళ్లు జే నీ కిల్లర్ అనుకుని అతన్ని పట్టుకుంటారు. “అతను కిల్లర్ కాదు. మా ఇద్దరి మీద హార్ట్ ఐస్ అటాక్ చేశాడు. అసలు మీరు ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారని Ally డిటెక్టివ్స్ తో గొడవ పడుద్ది. కానీ వాళ్లు మాత్రం Ally మాటలు వినకుండా జే ని తీసుకెళ్లిపోతారు.

5) Suspense
హాబ్స్ జే ని ఇంటరాగేట్ చేస్తూ నువ్వేగా వాళ్ళని చంపింది నిజం ఒప్పుకోమని అంటాడు. కానీ జే మాత్రం నాకు ఆ మర్డర్స్ తో ఏ సంబంధం లేదని ఉంటాడు. కానీ Hobbs జే మాటల్ని నమ్మడు. ఈ డిటెక్టివ్స్ కి వైనరీ దగ్గర దొరికిన రింగ్ మీద J & S అనే లెటర్స్ ఉంటాయి కదా. Jay పూర్తి పేరు Jay Simmonds. సో కచ్చితంగా ఆ కిల్లర్ ఇతనే అని హబ్స్ ఫిక్స్ అవుతాడు. కానీ జే మాత్రం మీరు డిటెక్టివ్ అయి ఉండి సరిగా పనిచేయట్లేదన్నట్టు సార్కాస్టిక్ గా మాట్లాడుతాడు. ఇక Hobbs కి కోపం వచ్చి జే ని కొట్టబోతుంటే షా అతన్ని బయటకు పంపిస్తుంది. మరోవైపు Ally Jay కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటుంది.
ఆమె క్లర్క్ తో “నేను వచ్చి చాలా సేపు అయింది. నేను ఒకసారి జే తో మాట్లాడాలి. వెళ్లి మీ ఆఫీస్ర్స్ నీ పిలవండని క్లర్క్ తో మాట్లాడతది. Ally చేసే గోల పడలేక క్లర్క్ షా దగ్గరికి వెళ్తుంది. ఆ టైంలో డేవిడ్ అనే వ్యక్తి Ally ని చూసి తనని కాఫీ కి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు Ally “ఆల్రెడీ ఈరోజు నేను చచ్చేంత పని అయింది. నాకు ఇలాంటి ప్లాన్స్ ఇంకేం వద్దులే” అని సారీ చెప్తది. ఇక డేవిడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షా జే ని ఇంటరాగేట్ చేస్తూ “గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం వాలెంటెన్స్ డే లకి బోస్టన్ అండ్ ఫీలింగ్ లో సేమ్ ఇలాగే మర్డర్స్ జరిగాయి. నువ్వు నిజంగా ఇన్నోసెంట్ అయితే, మరి అదే టైంలో నువ్వు ఆ స్టేట్స్ లో ఎందుకు ఉన్నావని Question చేస్తది.
దానికి జె “నేను ఒక Freelancer ని. నా వర్క్ పర్పస్ నేను తిరగాల్సి వస్తుంటదని ఆన్సర్ ఇస్తాడు. ఆ టైంలో క్లర్క్ అక్కడికి వచ్చి Ally వచ్చిందని చెప్పడంతో షా కూడా అక్కడి నుంచి Ally దగ్గరికి వెళ్తది. షా Ally దగ్గరకి వచ్చిన కాసేపటికే కరెంటు పోతది. పవర్ ఎందుకు పోయిందా అని చెక్ చేయడానికి షా వెళ్ళిపోతుంది. తను అటు వెళ్లగానే హార్ట్ ఐస్ కిల్లర్ క్లర్క్ ని పొడిచి చంపేస్తాడు. Ally కి భయం వేసి దాక్కుంటది. Heart Eyes తన గాగుల్స్ వల్ల చీకట్లో కూడా క్లియర్ గా చూస్తుంటాడు. కానీ Ally అతన్ని కింద పడేసి ఆ రూమ్ నుంచి బయటకు పారిపోతుంది. తను షా కి ఆ కిల్లర్ ఇక్కడికి వచ్చేసాడని చెప్తది. అప్పటికే వాడు బయటకు వచ్చేస్తాడు. ఇక షా అతన్ని షూట్ చేస్తది. ఆ గన్ సౌండ్స్ హాబ్ విని Jay దగ్గర నుంచి బయటకొస్తాడు.
Image Credit: Heart Eyes (2025)