Heart Eyes (2025) Plot Summary Explained in Telugu

Heart Eyes (2025) Plot Summary Explained in Telugu

ఫిబ్రవరి 14 అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులు తమ మనసుకు నచ్చిన వ్యక్తులకి సమయాన్ని కేటాయించి రోజంతా సరదాగా గడుపుతారు. కానీ ఈ సినిమాలో మాత్రం ప్రేమికుల రోజు అంటే గుర్తొచ్చేది “హార్ట్ ఐస్”. హార్ట్ ఐస్ అంటే ఏదైనా రొమాంటిక్ బొమ్మ అని అనుకుంటున్నారా? హార్ట్ ఐస్ అంటే ఒక కిరాతకమైన సైకో కిల్లర్. వీడు ప్రేమికుల రోజున ప్రేమికుల్ని చాలా దారుణంగా చంపేస్తాడు. అసలు ఈ హార్ట్ ఐస్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇంతకీ ఈ సినిమా పేరు ఏమనుకుంటున్నారు!?

ఈ సినిమా పేరు కూడా “Heart Eyes”. ఇది 2025లో విడుదలైన రొమాంటిక్ హార్రర్ మూవీ. హార్ట్ ఐస్ ఎప్పుడూ తన ముఖానికి ఒక విచిత్రమైన మాస్క్ ధరించి ఉంటాడు. తను ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, తను ప్రేమికుల రోజున ప్రేమికుల్ని ఎందుకు చంపుతున్నాడో ఎవరికీ అంతు చిక్కదు. చివరికి పోలీసులు కూడా తనని కనిపెట్టలేకపోతుంటారు. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన కథను, ముఖ్యమైన ట్విస్టుల యెుక్క అర్థాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఒక ఆలస్యం చేయకుండా ఈ హార్ట్ ఐస్ కిల్లర్ యొక్క విశేషాలేంటో తెలుసుకుందాం పదండి!

మొదటి నుంచే అదిరిపోద్ది

సియాటిల్ పట్టణంలోని ఒక వైనరీ దగ్గర కథ మొదలవుతుంది. ఆరోజు ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ‘ప్యాట్రిక్’, ‘అడ్లైన్’ అనే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. తను ప్యాట్రిక్ ప్రేమని అంగీకరించి ఒక ముద్దు పెట్టిద్ది. ఆ సమయంలో ‘నికో’ అనే ఫోటోగ్రాఫర్ ప్యాట్రిక్ కి కాల్ చేసి, “కెమెరా సరిగా పనిచేయలేదు. మళ్ళీ ఇంకోసారి ప్రపోజ్ చేయి. ఈసారి మంచిగా ఫోటో తీస్తా” అని అంటాడు. సరే అని ప్యాట్రిక్ మళ్లీ ప్రపోజ్ చేస్తుంటాడు. ఆ సందర్భంలో అక్కడికి ‘హార్ట్ ఐస్’ అనే కిల్లర్ వచ్చి నికోని దారుణంగా కత్తితో చంపేస్తాడు. మరోపక్క ప్యాట్రిక్, అడ్లైన్ ముద్దు పెట్టుకుంటుంటారు.

అప్పుడు ప్యాట్రిక్ తలలోకి హార్ట్ ఐస్ ఒక బాణాన్ని దించుతాడు. అడ్లైన్ కి చచ్చేంత భయమేసి అక్కడ్నుంచి పారిపోద్ది. తను కార్లోకి ఎక్కబోతుండగా హార్ట్ ఐస్ తన మీదికి బాణాలు వేస్తుంటాడు. అడ్లైన్ ఆ బాణాల నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న పొలంలోకి పారిపోద్ది. తను ఆ పొలంలో ఎక్కడుందో హార్ట్ ఐస్ కి కనిపించకపోవడంతో, వాడు ప్యాట్రిక్ మొబైల్ నుంచి అడ్లైన్ కి కాల్ చేస్తాడు. అడ్లైన్ మౌనంగా ఉండొచ్చుగా! తను ఫోన్ లిఫ్ట్ చేసి, “నువ్వు నాతో అనవసరంగా పెట్టుకున్నావ్” అని గట్టి గట్టిగా మాట్లాడిద్ది.

All Hallow’s Eve (2013) Plot Summary Explained in Telugu

హార్ట్ ఐస్ తన మాటల శబ్దాన్ని అనుసరించి ఒక బాణాన్ని వదులుతాడు. ఆ బాణం సరిగ్గా అడ్లైన్ కాలుకి గుచ్చుకుంటది. తను నొప్పితో కుంటుకుంటూ పక్కనే ఉన్న వైన్ ఫ్యాక్టరీలోకి వెళ్తది. అక్కడొక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అడ్లైన్ తనని కాపాడమని ఆ వ్యక్తితో మాట్లాడుతుండగా హార్ట్ ఐస్ ఫాక్టరీలోకి వచ్చేస్తాడు. సెక్యూరిటీ గార్డ్ తనని కాపాడేందుకు హార్ట్ ఐస్ ని ఆపేందుకు చూస్తాడు. కానీ వాడు ఆ వ్యక్తిని దారుణంగా చంపేస్తాడు. వీడు నన్ను కూడా చంపేసేలా ఉన్నాడని అడ్లైన్ వెళ్లి ఒక మిషన్లో దాక్కుంటది. అప్పుడు హార్ట్ ఐస్ తెలివిగా ఆ మిషన్ ఆన్ చేయడంతో తను నుజ్జునుజ్జుగా నలిగిపోద్ది.

హీరో – హీరోయిన్ కలుసుకోవడం

అసలీ కిల్లర్ ఎవరు? ఎందుకని ఇతను ప్రేమికుల్ని చంపుతున్నాడనేదే మూవీలో అసలైన ట్విస్ట్ అనమాట. ఈ కిల్లర్ పేరు హార్ట్ ఐస్. ఇతను ఎప్పుడూ తన ముఖానికి మాస్క్ ధరించి ఉంటాడు. గత కొన్ని సంవ్సరాలుగా ఇతను ప్రేమికుల రోజున చాలా మంది ప్రేమికుల్ని దారుణంగా చంపేస్తుంటాడు. ఆ విధంగానే తను ఇప్పుడు ప్యాట్రిక్, అడ్లైన్ లను చంపేస్తాడు. ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. కాబట్టి ప్రేమికుల రోజున అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అని న్యూస్ లో చెప్తారు. ‘ఆలీ’ తన ఫ్రెండ్ ‘మోనికా’ తో ఒక కాఫీ షాప్ కి వెళ్తది. ఆలీకి ఈ మధ్యనే బ్రేకప్ అయిద్ది. అంటే ఇప్పుడు తను సింగిల్ అనమాట.

Heart Eyes (2025) Plot Summary Explained in Telugu
Heart Eyes (2025) Plot Summary Explained in Telugu

ఆలీ ఆర్డర్ చేసిన కాఫీని ‘జే’ అనే వ్యక్తి కూడా ఆర్డర్ చేస్తాడు. ఇలా వారిద్దరు అనుకోకుండా ఒకేరకమైన కాఫీని ఆర్డర్ చేయడంతో వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడిద్ది. ఆ సమయంలో తన స్ట్రా కిందపడడంతో దాన్ని తీసుకునే ప్రయత్నంలో ఆలీ తల జే ముక్కుకి తగిలి రక్తం బయటికొస్తది. ఇక వెంటనే తను క్షమాపణ కోరి అక్కడ్నుంచి ఆఫీసుకి హడావిడిగా వెళ్లిపోద్ది. ఆ సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ, “వాలెంటైన్స్ డే అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి” అని చెప్తుండడాన్ని జే టీవీలో చూస్తాడు.

ఆలీ సిద్ధం చేసిన పెర్ఫ్యూమ్ యాడ్ ఆమె బాస్ కి నచ్చకపోవడంతో ఆమె ఆలీని అరుస్తది. అలాగే తను ఆలీ స్థానంలోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తది. ఆ కొత్త వ్యక్తి మరెవరో కాదు. మనమింతకు ముందు చూసిన జే. “మేమిద్దరం కలిసి పని చేస్తాం” అని జే అంటాడు. కానీ ఆలీకి అలా కలిసి పని చేయడం ఇష్టముండదు. ఆలీ ఆఫీస్ నుంచి వెళ్లిపోతుడగా బాస్ తన దగ్గరికొచ్చి, “నువ్వుగాని జేతో కలిసి పని చేయకపోతే, నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెడతా” అని బెదిరించినట్టుగా మాట్లాడిద్ది. దాంతో వేరే దారి లేక జే తో కలిసి పనిచేసేందుకు ఆలీ ఒప్పుకుంటది. మరోవైపు వైనరీ దగ్గర జరిగిన హత్యల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ ‘హాబ్’ మరియు ‘షా’ సంఘటన స్థలానికి చేరుకుంటారు. అక్కడంతా పరిశీలిస్తుండగా వాళ్లకొక ఉంగరం కనిపిస్తది.

హార్ట్ ఐస్ దాడి

దాని మీద ‘J & S’ అనే అక్షరాలుంటాయి. ఈ హార్ట్ ఐస్ కిల్లర్ పెద్ద సైకో అనమాట. వాడు ప్రేమికుల్ని చంపిన తర్వాత వాళ్ళ గుండెని బయటకు తీసి దాని చుట్టూ లవ్ సింబల్ వేస్తాడు. కొంచెంసేపటి తర్వాత తను మరో ఇద్దర్ని కూడా చంపేస్తాడు. ఆలీ ఆ వార్తని టీవీలో చూసి తెలుసుకుంటది. ఆ తర్వాత ఆలీ, జే తమ పని గురించి చర్చించుకునేందుకు ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. జే మాటల సందర్భంలో ఆలీతో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తాడు. ఆలీ ఆ విషయాన్ని పసిగట్టి జే మీద కోప్పడిద్ది.

దాంతో జే కాస్త బాధపడి అక్కడ్నుంచి బయటికెళ్తాడు. ఆలీ కూడా కొంచెం బాధపడి వెంటనే క్షమాపణలు చెప్తది. ఆ సమయంలో ఆలీ మాజీ ప్రియుడు వేరే అమ్మాయితో రెస్టారెంట్ కి వస్తుంటాడు. ఆలీ మాజీ ప్రియుడి పేరు ‘కోలిన్’. కోలిన్ వేరే అమ్మాయితో ఉండడంతో ఆలీ కొంచెం జలసీగా ఫీలయ్యి జేని ముద్దు పెట్టుకుంటది. అలాగే ఇతను నా కొత్త బాయ్ ఫ్రెండ్ అని జే ని కోలిన్ కి పరిచయం చేస్తది. అప్పుడు కోలిన్ మాట్లాడుతూ, “ఆ హార్ట్ ఐస్ కిల్లర్ మన సిటీకి వచ్చాడు. ఆల్రెడీ వాడు ఇప్పటికే చాలా మందిని చంపేశాడు. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి” అని చెప్పి రెస్టారెంట్లోకి వెళ్తాడు.

ఇక జే, ఆలీ ఒక క్యాబ్ లో ఇంటికి బయల్దేరతారు. ఆలీ జే ని ముద్దుపెట్టుకున్నప్పటి నుండి క్యాబ్ ఎక్కేంతవరకు వాళ్ళిద్దరిని హార్ట్ ఐస్ దూరం నుంచి గమనిస్తుంటాడు. అంటే వీళ్లిద్దరికే వాడు ముహూర్తం పెట్టాడనమాట. కట్ చేస్తే ఆలీ తన ఇంటి దగ్గర క్యాబ్ దిగిద్ది. ఆమె తన ఇంటి తాళం చెవి ఎక్కడో మర్చిపోయింటది. అందువల్ల తను తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్లేందుకు వీలుండదు. అప్పుడు జే తన దగ్గరికొచ్చి, “ఈ రాత్రికి నువ్వు నాతోటి బయటికిరావచ్చు కదా!” అని అడగాలనుకుంటాడు. కానీ తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళాలని ఆలీ అప్పటికే నిర్ణయించుకుంటది.

మేము ప్రేమికులం కాదు

కానీ తనకి ధైర్యం సరిపోకపోవడంతో జే తనకి సహాయంచేసేందుకు తలుపు పగలకొడతాడు. ఆ ప్రయత్నంలో జే వేలికి గాయమవుద్ది. ఇక వెంటనే ఆలీ తనని లోపలికి తీసుకెళ్ళి తన వేలుకి కట్టుకట్టిద్ది. తర్వాత ఆలీ తనతో సరదాగా మాట్లాడుతూ కబోర్డ్ తెరుస్తది. తీరాచూస్తే అందులో హార్ట్ ఐస్ ఉంటాడు. దాంతో వారిద్దరు భయంతో కేకలు వేస్తారు. హార్ట్ ఐస్ వాళ్లపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వెంటనే పరుగు తీసి ఇంటి నుంచి బయటకొచ్చేస్తారు. హార్ట్ ఐస్ క్యాబ్ డ్రైవరును కూడా చంపేయడంతో జే, ఆలీ భయంతో వణికిపోతారు. ఆలీ మాట్లాడుతూ, “అరే బాబు నువ్వు చంపేది ప్రేమికులనే కదా! మేము అసలు ప్రేమికులం కాదు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావ్” అని అంటది.

Heart Eyes (2025) Plot Summary Explained in Telugu
Heart Eyes (2025) Plot Summary Explained in Telugu

కానీ హార్ట్ ఐస్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా దాడి చేస్తాడు. ఇక వాళ్ళు భయంతో చీకట్లో పరుగుతీస్తారు. అయినా సరే హార్ట్ ఐస్ వాళ్లని వదిలిపెట్టకుండా దాడి చేస్తాడు. ఆ దాడి వాళ్ళ జే ఒక చోట కిందపడిపోతాడు. ఆలీ జే కి సహాయం చేయకుండా దూరంగా పారిపోయి ఒక కరౌజల్లో దాక్కుంటది. హార్ట్ ఐస్ తనని చంపేందుకు ముందుకొస్తాడు. అప్పుడు ఆలీ వాడ్ని గట్టిగా తన్నిద్ది. దాంతో హార్ట్ ఐస్ మరింత కోపంతో ఆలీని చంపేందుకు ప్రయత్నిస్తాడు.

తీరాచూస్తే ఆ సమయంలో అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. దాంతో హార్ట్ ఐస్ అక్కడ్నుంచి వెంటనే పారిపోతాడు. “హార్ట్ ఐస్ మా మీద దాడి చేశాడు. నాతో పాటు జే అనే వ్యక్తి కూడా ఉండాలి” అని ఆలీ పోలీసులకి చెప్తది. తీరాచూస్తే జే ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. జే ఇంతకుముందు ఒకచోట కిందపడిపోతాడు కదా! అక్కడ హార్ట్ ఐస్ కి సంబంధించిన మాస్క్ మరియు ఆయుధాలు డిటెక్టివ్స్ కి దొరుకుతాయి. దాంతో వాళ్లు జే ని హార్ట్ ఐస్ అనుకుని అరెస్ట్ చేస్తారు. “జే కిల్లర్ కాదు. మా ఇద్దరి మీద హార్ట్ ఐస్ దాడి చేశాడు. అసలు మీరు జే ని ఎందుకు అరెస్ట్ చేశారు” అని ఆలీ డిటెక్టివ్స్ తో గొడవపడుద్ది. కానీ వాళ్లు ఆలీ మాటలు పట్టించుకోకుండా జే ని జైలుకి తీసుకెళ్తారు.

పోలీసుల విచారణ

హాబ్స్ జే ని విచారిస్తు, “నువ్వేగా ప్రేమికుల్ని చంపుతున్న హార్ట్ ఐస్” అని అంటాడు. కానీ జే మాత్రం, “నేను హార్ట్ ఐస్ కాదు. నాకు ఆ హత్యలతో ఎటువంటి సంబంధం లేదు” అని అంటాడు. కానీ హాబ్స్ తన మాటలు నమ్మడు. వైనరీ దగ్గర దొరికిన ఉంగరం మీద J & S అనే అక్షరాలు ఉంటాయి కదా. జే పూర్తి పేరు ‘జే సిమ్మండ్స్’. ఇలా ఉంగరం మీదున్న అక్షరాలు కూడా సరిగ్గా కుదరడంతో ఆ కిల్లర్ ఇతనే అని హాబ్స్ నిర్ణయించుకుంటాడు. ఇక హాబ్స్ కోపంతో జే మీద చేయి చేసుకోబోతాడు. షా హాబ్స్ ని ఆపి ఇంటరాగేషన్ గది నుంచి బయటకు పంపిస్తది. మరోవైపు ఆలీ జే కోసం పోలీస్ స్టేషన్ కి వస్తది.

Lethal Seduction (2015) Plot Summary Explained in Telugu

ఆమె క్లర్క్ తో, “నేను వచ్చి చాలా సేపు అయింది. నేనొకసారి జే తో మాట్లాడాలి” అని గట్టిగట్టిగా మాట్లాడుతుంటది. ఆలీ చేసే గోల భరించలేక క్లర్క్ షా దగ్గరికెళ్తది. ఆ సమయంలో ‘డేవిడ్’ అనే వ్యక్తి ఆలీని చూసి తనని కాఫీకి ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆలీ, “ఈరోజు నేను చచ్చేంత పని అయింది. నాకు ఇలా కాఫీకి వచ్చే ఉద్దేశాలు లేవులే” అని అంటది. దాంతో డేవిడ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. షా జే ని ఇంటరాగేట్ చేస్తూ, “గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ప్రేమికుల రోజున బోస్టన్ మరియు ఫీలింగ్ లో అచ్చం ఇలాగే హత్యలు జరిగాయి. నువ్వు నిజంగా హార్ట్ ఐస్ కాకపోతే, మరి అదే సమయంలో నువ్వు ఆ సిటీలలో ఎందుకున్నావ్?” అని ప్రశ్నిస్తది.

దానికి జే, “నేనొక ఫ్రీలాన్సర్. కాబట్టి నేను చాలా సిటీస్ తిరుగుతుంటాను” అని అంటాడు. ఆ సమయంలో క్లర్క్ షా దగ్గరికొచ్చి ఆలీ వచ్చిందని చెప్తది. షా ఆలీతో మాట్లాడేందుకు తన దగ్గరికొచ్చిన కొంత సేపటికి కరెంట్ పోయిద్ది. ఇక వెంటనే హార్ట్ ఐస్ అక్కడికొచ్చి క్లర్క్ ని పొడిచి చంపేస్తాడు. ఆలీ భయంతో ఒకచోట దాక్కుంటది. హార్ట్ ఐస్ తనని కనిపెట్టి తనపై దాడి చేయబోతుండగా ఆలీ అక్కడ్నుంచి బయటకి పారిపోద్ది. షా హార్ట్ ఐస్ ని గన్ తో షూట్ చేస్తది. కానీ ఒక్క బుల్లెట్ కూడా వాడికి తగలదు.

ముగింపు

ఈ విధంగా హార్ట్ ఐస్ కథ చాలా ఆసక్తిగా, రసవత్తరంగా సాగుతుంది. ఇంతవరకు ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా మనం హార్ట్ ఐస్ కథ గురుంచి మాట్లాడుకున్నాం. అసలు ఈ హార్ట్ ఐస్ కిల్లర్ ఎవరు? ఇతడు ఎందుకని ప్రిమికుల్ని చంపుతున్నాడు? ఇంతకీ హార్ట్ ఐస్ కిల్లర్ అంటే ఒక వ్యక్తేనా, లేక అలాంటి కిల్లర్స్ ఇంకా చాలా మంది ఉన్నారా!? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులన్నీ ఒకసారి తనివితీరా సినిమా చూసి ఆశ్వాదించండి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది.

మొత్తానికి, Heart Eyes (2025) రసవత్తరంగా సాగే రొమాంటిక్ కామెడీ హార్రర్ మూవీ. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఇంతకీ ఆ హార్ట్ ఐస్ ఎవరై ఉంటారు అని నాక్కూడా సినిమా చూసేటప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. హార్ట్ ఐస్ తర్వాత ఎవర్ని చంపబోతున్నాడు, ఎలా చంపబోతున్నాడు, ఈసారైనా పోలీసులు తనని పట్టుకుంటారా, లేదా!? సినిమా చూసేటప్పుడు ఇలాంటి చాలా రకాల ప్రశ్నలు ప్రేక్షకుల మెదడులో మెదులుతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు మాత్రం ప్రేక్షకుల ఊహకి అందని రీతిలో ఉంటుంది. ఇక ఆలస్యమెందుకు మీరు కూడా ఒకసారి ఈ సినిమాని చూసేయండి.

3 thoughts on “Heart Eyes (2025) Plot Summary Explained in Telugu”

Leave a Comment