Gal Gadot Full Biography in Telugu – గాల్ గదోట్ పూర్తి బయోగ్రఫీ తెలుగులో!

Gal Gadot Full Biography in Telugu – గాల్ గదోట్ పూర్తి బయోగ్రఫీ తెలుగులో!

ఒక చిన్న పట్టణంలో జన్మించిన గాల్ గదోట్ 18 ఏళ్లకే మిస్ ఇజ్రాయెల్‌ గా కిరీటం ధరించింది. మిస్ యూనివర్స్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తన చేతులారా తనే ఆ అవకాశాన్ని పాడుచేసుకుంది. మొదట డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంది, కానీ మనసు మార్చుకుని లా చదివింది. కొన్ని సంవత్సరాలు ఆర్మీలో సేవ చేసింది. చివరికి తను హాలీవుడ్ స్టార్ గా అవతరించింది. నటన మీద ఇంట్రెస్ట్ లేని గాల్ గదోట్, ప్రస్తుతం హాలీవుడ్ లో One of the Top Actress గా పేరు సంపాదించింది. అసలు తను సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి కారణమేంటి, మొదటి సినిమా అవకాశం తనంతట తానుగానే గాల్ గదోట్ కి ఎలా వచ్చింది!? తన వ్యక్తిగత వీడియోస్ ఇంటర్నెట్ లో లీక్ అయినప్పుడు గాల్ గదోట్ ఏం చేసింది!? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం గాల్ గదోట్ యెుక్క బయోగ్రఫీలోకి వెళ్ళాల్సిందే!

చిన్నతనం

హాలీవుడ్ బ్యూటీ “గాల్ గదోట్” 1985 ఏప్రిల్ 30న ఇజ్రాయెల్ దేశంలోని “రోష్ హా ఐన్” అనే పట్టణంలో జన్మించింది. తన బాల్యమంతా “టెల్ అవివ్” అనే నగరంలో గడిచింది. గాల్ గదోట్ తండ్రి పేరు “మైఖేల్ గదోట్”, తల్లి పేరు “ఇరిత్ గదోట్”. వీరిద్దరూ చదువులో మంచి ఉత్తీర్ణులు. అందుకే మైఖేల్ గదోట్ ఇంజినీర్‌గా మరియు ఇరిత్ గదోట్ ఒక టీచర్ గా మంచి స్థానాన్ని చేరుకున్నారు. నిజానికి వీరి ఇంటి పేరు గ్రీన్‌స్టైన్. కానీ మైఖేల్ మరియు ఇరిత్ తమకి పెళ్ళైన తర్వాత తమ ఇంటి పేరుని గ్రీన్‌స్టైన్ నుంచి గదోట్ కి మార్చుకున్నారు. గదోట్ అంటే “నది ఒడ్డున” అని అర్ధం. గాల్ గదోట్ కి ఒక చెల్లి కూడా ఉంది. తన చెల్లెలి పేరు “డాన గదోట్”

చదువు – పనితనం

గాల్ తన చిన్నతనం నుంచే చాలా ఉషారుగా ఉండేది. చదువుతోపాటు స్పోర్ట్స్‌లో కూడా మంచిగా రాణించేది. గాల్ తన పన్నెండేళ్ళ వయసు వరకు జాజ్, హిప్‌హాప్ వంటి డాన్స్ కూడా నేర్చుకుంది. అదే ఇష్టంతో తను కొరియోగ్రాఫర్ గా మరాలనుకుంది. కానీ కాలక్రమేణా తనకి డ్యాన్స్ పై ఆసక్తి పోయి న్యాయశాఖ మీద ఇష్టం పెరిగింది.

తల్లిదండ్రులు మంచి స్థానంలో ఉన్నప్పటికీ గాల్ తన ఆర్థిక ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుండేది. చిన్నపిల్లలకు క్లాసులు చెప్పడం, బర్గర్ కింగ్ వంటి ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో పని చేస్తూ గాల్ తన ఖర్చులకి కొంత డబ్బుని స్వయంగా సంపాదించేది.

మిస్ యూనివర్స్

గాల్ గదోట్ తన యవ్వనంలో చాలా అందంగా ఉండేది. అందుకనే గాల్ తన 18 ఏళ్ల వయసులో “మిస్ ఇజ్రాయెల్ 2004” బ్యూటీ కాంటెస్ట్‌ లో పాల్గొనింది. తీరాచూస్తే తను “మిస్ ఇజ్రాయెల్ 2004” గా విజయం సాధించింది. ఈ విజయాన్ని గాల్ కూడా నమ్మలేకపోయింది. ఆ తర్వాత తనని “మిస్ యూనివర్స్” కాంటెస్ట్ కోసం ఆహ్వానించారు. నిజానికి తనకి మిస్ యూనివర్స్ అవ్వాలన్న ఉద్దేశం అస్సలు లేదు. అందుకే తను “మిస్ యూనివర్స్” పోటీకి ఆలస్యంగా వెళ్ళడం, వాళ్ళిచ్చిన మంచి మంచి డ్రెస్సులని వేసుకోకపోవడం, కనీసం మేకప్ కూడా సరిగా వేయించుకోకపోవడం చేసేది. అలా చివరికి మిస్ యూనివర్స్ కిరీటం గాల్ కి కాకుండా వేరే బ్యూటీని వరించిది. గాల్ యెుక్క అందానికి ఇంప్రెస్ అయ్యి చాలానే మోడలింగ్ ఏజెన్సీస్ తనని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కానీ తనకి పాపులారిటీ మీద అంత ఇష్టం లేదు. అందుకే తను మొదట మోడలింగ్ చేసేందుకు ఒప్పుకోలేదు.

Gal Gadot Full Biography in Telugu
Gal Gadot Full Biography in Telugu
ఆర్మీ గర్ల్

గాల్ గదోట్ సినిమాల్లోకి రాకముందు కొన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) లో పనిచేసింది. చెప్పాలంటే ఇలా ఆర్మీలో పనిచేయడం వల్లే గాల్ కి డిసిప్లిన్, గౌరవం వచ్చాయి. తన జీవితంలో ఇదో మైలురాయి అని కూడా చెప్పుకోవచ్చు. తను అర్మీలో ఉన్నప్పటికీ తనకి మోడలింగ్ అవకాశాలు మాత్రం నిండుగా వస్తుండేవి. ఈ పరిస్థితిని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సద్వినియోగం చేసుకోవాలనుకుంది. So, తమ ఆర్మీ ఇమేజ్‌ని మెరుగుపరిచేందుకు లెబనాన్ యుద్ధం సమయంలో “Women of the Israeli Army” అనే ఫోటో షూట్ ప్లాన్ చేశారు. దాంతో గాల్ గదోట్ Maxim అనే మగవాళ్ల మ్యాగజైన్‌లో బికినీతో కనువిందుచేసింది. ఈ విషయం అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. అలాగే గాల్‌కి కూడా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.

ప్రేమ – మోడలింగ్ – చదువు

ఆర్మీలో పనిచేసే సమయంలోనే గాల్ తన ఫ్యూచర్ ఫస్బండ్ ని మొదటిసారి మీట్ అయింది. అతను గాల్ ని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయాడు.

ఆర్మీలో సర్వీస్ చేయడం కంప్లీటయిన తర్వాత గాల్ చదువుపై దృష్టి పెట్టింది. గాల్ కి లాయర్ అవ్వాలనే కోరిక ఉండేది. అందుకని అర్మీలో సర్వీస్ చేయడం పూర్తయిన వెంటనే ఐడీసీ హర్జలియా అనే ప్రైవేట్ కాలేజీలో “లా” చదవడం ప్రారంభించింది. ఒకపక్క లా చదువుతూనే మరోపక్క పెద్ద పెద్ద బ్రాండ్స్ కి మోడల్ గా మారింది. 2007లో ఇజ్రాయెల్ బ్రాండ్ Castroతో కాంట్రాక్ట్ సైన్ చేసి వారి ఫ్యాషన్ షోలలో రెగ్యులర్‌గా కనిపించేది. లా చదవడం మొదలుపెట్టిన ఏడాది తర్వాత గాల్ కి కనువిప్పు కలిగింది, ఈ లాయర్ మార్గం తనకి సరిపోదని.

నటనలో మొదటి అవకాశం

లండన్‌కు చెందిన ఓ కాస్టింగ్ డైరెక్టర్ గాల్ గదోట్ ఫోటోస్ని చూసి తనకి ఆకర్షితమయ్యాడు. ఇంకేముంది గాల్ ని తమ మూవీలో నటించేందుకు ఆడిషన్‌కు రమ్మని ఆహ్వానించారు. అది కూడా మామూలు సినిమా కాదు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్ లోని “క్వాంటమ్ ఆఫ్ సోలెస్” అనే చిత్రంలో నటించేందుకు. కానీ గాల్‌ కి ఆ సమయంలో నటనపై అంత ఆసక్తి లేదు. అందులోనూ జేమ్స్ బాండ్ మూవీని ఇంగ్లీష్ లో షూట్ చేస్తారు. అందుకని గాల్ ఆడిషన్ కి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆడిషన్ రోజున మేనేజర్ తనకి మళ్ళీ ఫోన్ చేయడంతో, ఇక తప్పనిసరి పరిస్థితిలో గాల్ ఆడిషన్ కి అటెండ్ అయింది. చివరికి ఆ ఆడిషన్లో తను కాకుండా Olga Kurylenko అనే అమ్మాయి ఎంపికయింది. ఇక ఆ క్షణం నుంచి గాల్ గదోట్ కి నటనపై ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే తను యాక్టింగ్‌ లో శిక్షణ తీసుకుని ఇజ్రాయెల్‌లో చాలా ఆడిషన్లు ఇచ్చింది. అలా 2007లో “Bubot” అనే టీవీ డ్రామాలో గాల్ కి ఫస్ట్‌ రోల్‌ దక్కింది. అప్పుడే తను డిసైడయింది, నటనే తన కెరీర్ అని.

Gal Gadot Full Biography in Telugu
Gal Gadot Full Biography in Telugu
ఫాస్ట్ & ఫ్యూరియస్ లో అవకాశం

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఫాస్ట్ & ఫ్యూరియస్ సిరీస్ మీ అందరికీ తెలిసే ఉంటది. ఫాస్ట్ & ఫ్యూరియస్ పార్ట్ 4 ఆడిషన్స్ లో పాల్గొనేందుకు గాల్ కి ఆహ్వానం వచ్చింది. Gisele Yashar అనే పాత్రను పోషించేందుకు జరుగుతున్న ఆడిషన్ అనమాట అది. గాల్ కి ఆర్మీలో అనుభవం ఉండడం, బైక్ నడపగలడం, గన్స్ ఎలా వాడాలో తెలియడం వంటి విషయాలు తన ఆడిషన్ లో బాగా ఉపయోగపడ్డాయి. అందుకనే Gisele Yashar అనే పాత్రలో నటించేందుకు గాల్ ని ఆడిషన్లో సెలెక్ట్ చేశారు. గాల్ కి కూడా ఈ పాత్ర బాగా నచ్చింది. హీరోలపై ఆధారపడకుండా తన ప్రాబ్లంని తనే సాల్వ్ చేసుకోగలిగే పవర్ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్ అనమాట అది. గాల్ కి ఇలాంటి పాత్రలు పోషించడమంటే చాలా ఇష్టం. అనుకున్నట్టుగానే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 4 మంచిగా హిట్ అయింది. దాంతో గాల్ కి “ఫాస్ట్ ఫైవ్”, “ఫాస్ట్ & ఫ్యూరియస్ 6” వంటి సినిమాల్లో కూడా అవకాశందక్కింది. ఈ సినిమాల్లో బైక్ నడపడం, స్టంట్స్ చేయడం, ఫైట్స్ చేయడంలాంటివన్నీ గాల్ స్వయంగా తనే చేసింది. ఈ ఫాస్ట్ & ఫ్యూరియస్ సిరీస్ అనేది గాల్ కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అయింది.

మరో గొప్ప మలుపు

2016 మార్చ్ నెలలో గాల్‌ మరో కొత్త పాత్రలో కనువిందు చేసింది. అదేనండీ, “బ్యాట్‌మాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్” అనే సూపర్‌హీరో సినిమాలో వండర్ ఉమన్ పాత్ర. మొదట Cat Woman పాత్రలో నటించేందుకు గాల్ ప్రయత్నించినట్టికీ ఆ ప్రయత్నం మాత్రం సఫలమవ్వలేదు. కానీ తనకి వండర్ ఉమన్ పాత్ర మంచిగా చేతికొచ్చింది. గాల్ ఈ పాత్రలో నటించేందుకు చాలా కష్టపడింది. ఆరు నెలల పాటు, రోజుకి ఆరు గంటల సమయం కేవలం కిక్‌బాక్సింగ్, కుంగ్ ఫు, జిజిట్సు వంటి విధానాల్లో శిక్షణ పొందేందుకు కేటాయించింది. అలా తను వండర్ ఉమన్ పాత్ర కోసం సుమారు 10 కిలోల బరువు పెరిగింది.

వండర్ ఉమన్

గాల్ గదోట్ నటించిన “వండర్ ఉమన్” 2017లో విడుదలయింది. 149 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, ప్రపంచవ్యాప్తంగా సుమారు 824 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. అసలీ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిద్దని గాల్ కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా గాల్ హాలీవుడ్ లో మరో మెట్టు పైకెక్కి స్టార్‌గా వెలుగులోకొచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా 2020లో “వండర్ ఉమన్ 1984” రిలీజయింది. కానీ ఈ సినిమా మొదటి పార్ట్ కంటే అంత గొప్పగా ఏమీ ఆడలేదు. బాక్సాఫీస్ పరంగా కూడా లాస్ రావడం జరిగింది. దాదాపు రెండు వందల మిలియన్ డాలర్స్ తో సీక్వెల్ ని నిర్మించగా కేవలం 169 మిలియన్ డాలర్స్ మాత్రమే వసూలు చేసి Flop అయింది. OTT పరంగా మాత్రం జనాలు ఈ సినిమాని బాగానే ఆదరించారు. మొదటి భాగానికి మూడు లక్షల డాలర్స్ ని గాల్ పారితోషికంగా తీసుకుంది. సీక్వెల్ విషయానికొచ్చేసరికి ఆ అమౌంట్ 30 రెట్లు ఎక్కువ పెరిగింది.

జస్టిస్ లీగ్ – వివాదం

సూపర్ మ్యాన్, బ్యాట్మాన్, ఆక్వామన్, వండర్ ఉమన్ వంటి సూపర్ హీరోస్ తో “జస్టిస్ లీగ్” అనే సినిమా షూటింగ్ జరుపుకుంటున్న రోజులవి. జస్టిస్ లీగ్ డైరక్టర్ జాక్ స్నైడర్ కొన్ని కుటుంబ సమస్యల వల్ల మూవీ నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ఆ సమయంలో జాస్ వీడన్ సినిమా భాధ్యతల్ని చేపట్టాడు. ఆ సమయంలో గాల్ కి, జాస్ వీడన్ కి మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. చివరికి జస్టిస్ లీగ్ 2017లో రిలీజయ్యి మంచి సక్సెస్ అయింది. 300 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కి, ప్రపంచ వ్యాప్తంగా 661 మిలియన్ డాలర్స్ ని జస్టిస్ లీగ్ కలెక్ట్ చేసింది.

Gal Gadot Full Biography in Telugu
Gal Gadot Full Biography in Telugu
వీడియోస్ లీక్

2017లో గాల్ ఫోన్ హ్యాక్ అయ్యి తన వ్యక్తిగత వీడియోలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఆ వీడియోస్ లో తను టాప్ లెస్ గా ఉండడం జరిగింది. అలాంటి వీడియోస్ బయటికొచ్చినప్పటికీ గాల్ అస్సలు భయపడలేదు. ఆ వీడియోస్ కొన్ని రోజులు ఇంటర్నెట్ లో హల్చల్ చేసి సద్దుమణిగాయి.

రెడ్ నోటీస్

గాల్ గదోట్, డ్వేన్ జాన్సన్, ర్యాన్ రెనాల్డ్స్ కలిసి నటించిన “రెడ్ నోటీస్” అనే మూవీ 2021లో రిలీజయింది. ఈ సినిమాకి గాల్ తీసుకున్న పారితోషికం సుమారు 20 మిలియన్ డాలర్స్. ఎన్నో అంచనాల మధ్య రిలీజైనప్పటీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తాని చాటలేకపోయింది. దాదాపు 200 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి గాను కేవలం 178 మిలియన్ డాలర్స్ మాత్రమే రాబట్టగలిగింది. కానీ Netflix లో మాత్రం ప్రేక్షకులు ఈ మూవీని మంచిగానే ఆదరించారు.

మరిన్ని సినిమాలు

గాల్ గదోట్ 2022లో “డెత్ ఆన్ ది నైల్” అనే సినిమాలో నటించింది. Kenneth Branagh ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దాదాపు 100 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు 137 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసి Mixed టాక్ ని సొంతం చేసుకుంది. 2023లో Netflix లో రిలీజైన “హార్ట్ ఆఫ్ స్టోన్” కూడా Mixed టాక్ ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత గాల్ గదోట్ కి డిస్నీ మూవీలో నటించే అవకాశం వచ్చింది. అదేనండి “స్నో వైట్” మూవీలో ఈవిల్ క్వీన్ పాత్ర పోషించేందుకు మేకర్స్ గాల్ ని సెలెక్ట్ చేశారు. గాల్ డిస్నీ మూవీలో నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమా 2025 మార్చ్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 270 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కి కేవలం 205 మిలియన్ డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది.

భర్త – పిల్లలు

గాల్ గదోట్ మరియు Jaron Varsano అనే బిజినెస్ మాన్ 2008లో ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఇప్పటివరకు వీళ్ళకి నలుగురు అమ్మాయిలు పుట్టారు. మొదటి అమ్మాయి పేరు అల్మ. తను 2011లో పుట్టింది. ఆ తర్వాత ఆరు సంవత్సరాలకి 2017లో రెండవ కూతురు మాయ పుట్టింది. మూడవ కుతూరు డానియెల్ల 2021లో అలాగే నాలుగవ కూతురు ఓరి 202లో జన్మించింది. ఇలా ఇప్పటివరకు గాల్ గదోట్ కి నలుగురు పిల్లలకి జన్మనిచ్చింది.

Leave a Comment