Don’t Move Movie Explained & Summary in Telugu

Don’t Move Movie Explained & Summary in Telugu

Netflix Distribute చేసిన “Don’t Move” అనే హార్రర్ సర్వైవల్ మూవీ 5.8/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ అక్టోబర్ 25, 2024 లో రిలీజయింది. Sam Raimi ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. David White, TJ Cimfel రచయితలుగా ఉన్నారు. నటీనటుల విషయానికొస్తే ఐరిస్ అనే పాత్రలో Kelsey Asbille రిచర్డ్ అనే పాత్రలో Finn Wittrock నటించారు. Survival సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి Experience ని ఇస్తది. ప్రస్తుతం ఈ మూవీ Netflix లో Available గా ఉంది.

ఇప్పుడు కథలోకి వెళ్దాం!
1) Introduction

ఓపెన్ చేస్తే కథలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఐరిస్ నీ చూపిస్తారు. తన హస్బెండ్ నిద్రపోతుండగా ఐరిస్ రూమ్ నుండి బయటకు వచ్చి,టేబుల్ డ్రాయర్ లో నుండి ఒక చిన్న కత్తిని తీసుకుని, తన సెల్ ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి కారు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఇంటి నుంచి డైరెక్ట్ గా కాలిఫోర్నియా స్టేట్ పార్క్ దగ్గరికి వెళ్లి మౌంటెన్ మీదికి ఎక్కుతుంది. అక్కడే ఐరిస్ కొడుకు మెమోరియల్ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఐరిస్ కొడుకు ఆ కొండ మీద నుంచి పొరపాటున జారిపడి చనిపోతాడు. అప్పటినుంచి ఆమె అదే బాధలో జీవితం గడుపుతుంటది. తన కొడుక్కి ఇష్టమైన బోటు బొమ్మని అక్కడ పెట్టి, ఐరిస్ ఆ కొండ చివరకి వెళ్లి, తను కూడా అక్కడ నుంచి దూకి చనిపోవాలి అనుకుంటది. ఐరిస్ దూకేయాలి అనుకుంటుండగా అక్కడికి సడన్గా రిచర్డ్ అనే పర్సన్ వస్తాడు.

రిచర్డ్ ఐరిస్ ని మాటల్లో పెట్టి ఆమె సూసైడ్ చేసుకోకుండా మనసు మార్చాలని చూస్తాడు. అతను ఐరిస్తో నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను, నా గర్ల్ ఫ్రెండ్ వెళుతున్న కార్ కి యాక్సిడెంట్ జరిగింది. ఆమె నా కళ్ళముందే చనిపోయింది. నేను రెండున్నర నెలలు హాస్పిటల్లో బెడ్ మీదే గడిపాను. మన జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగినంత మాత్రాన జీవితమే పోయినట్టు కాదు కదా అని ఐరిస్ ని కాస్త మోటివేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఐరిస్ చనిపోవాలనే ఆలోచన తీసేసి అక్కడి నుంచి కిందకు దిగుతుంది. ఇక ఐరిస్ అండ్ రిచర్డ్  మాట్లాడుకుంటూ వాళ్ళ కార్ల దగ్గరికి వెళ్తారు. ఐరిస్ కారుకి చాలా దగ్గరగా రిచర్డ్ కార్ పార్క్ చేసి ఉండడంతో ఐరిస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లలేకపోతది.

అప్పుడు రిచర్డ్ ఒక గొడుగు ని తీసుకుని ఐరిస్ దగ్గరికి వెళ్తాడు. ఆ గొడుగుతో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వొచ్చు. రిచర్డ్ ఎవరినన్నా కిడ్నాప్ చేయాలి అనుకున్నప్పుడు దాంతో వాళ్లకి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాడన్నమాట. వాడు ఆ గొడుగుతో ఆమెకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి, చేతులు కాళ్ళు కట్టేసి ఆమెని తన కారులో వేసుకొని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. కాసేపటి తర్వాత ఐరిస్ కి మేలుకువ వస్తుంది. వాడు తనని కిడ్నాప్ చేశాడని ఆమెకి అర్థమై ఆమె వాచ్ తో తన హస్బెండ్ కి ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటది. అప్పుడు రిచర్డ్ అది చూసి, నువ్వు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్న ఇక్కడ సిగ్నల్స్ లేవని అంటాడు. అప్పుడు ఐరిస్ రిచర్డ్ తో నా హస్బెండ్ కచ్చితంగా నా కోసం వెతుక్కుంటూ వస్తాడు అని అంటది. దానికి రిచర్డ్ నేను ఇంతకు ముందుకు కిడ్నప్ చేసిన ఆడవాళ్ళు కూడా ఇలాంటి మాటలే చెప్పారులే అంటాడు.

Don't Move Movie Explained & Summary in Telugu
Don’t Move Movie Explained & Summary in Telugu
2) Continuous

వాడల అనడంతో ఇంతకుముందు చాలామందిననే ఇలా కిడ్నాప్ చేశాడని ఐరిస్ కి అర్థం అవుతుంది. ఐరిస్ తన కొడుకు మెమోరియల్ దగ్గర పెట్టిన బోట్ ని రిచర్డ్ తీసుకొని, ప్రస్తుతం దాన్ని ఐరిస్ దగ్గర పెడతాడు. ఐరిస్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న కత్తిని పాకెట్లో పెట్టుకుంటది కదా. ఆ కత్తిని తీసి తన చేతి కట్లని మేల్లగా కట్ చేస్తుంటది. ఆ సౌండ్ వాడికి వినిపించకూడదని ఐరిస్ వాడిని మాటల్లో పెడతది. ఆమె తన చేతి కట్లను కట్ చేసుకుని వాడి మీద కత్తితో అటాక్ చేస్తుంది. అలా జరగడం వల్ల కారు అదుపుతప్పి ఫాస్ట్ గా వెళ్లి ఒక చెట్టును గుద్దేసుకుంటుంది. ఇక ఐరిస్ వెంటనే కారులో నుంచి బయటకు వెళ్లాలని చూస్తే, రిచర్డ్ ఆమెను పట్టుకొని లాగుతాడు. ఇద్దరి మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. ఇద్దరూ కారు నుంచి బయటపడతారు.

అపుడు ఐరీస్ తన కాళ్లకున్న తాళ్ళను కూడా కట్ చేసుకుంటుంది. బోట్ బొమ్మని తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటది. అప్పుడు వాడు ఆమె దగ్గరికి వచ్చి నువ్వు పారిపోవాలి అనుకున్న కూడా ఏం ఉపయోగం ఉండదు. నేను ఆల్రెడీ నీ బాడీలోకి ఒక పేరలైజర్ ని ఎక్కించాను. మరో 20 నిమిషాల్లో నీ బాడీ మొత్తం షడ్ డౌన్ అయిపోతుంది. నీ కాళ్లు చేతులు పనిచేయవు, నువ్వు సరిగా చూడలేవు. ఫైనల్ గా మాట్లాడను కూడా మాట్లాడలేవని అంటాడు. వాడితో ఉండడం చాలా డేంజర్ అనిపించి ఐరిస్ అడవిలోకి పారిపోతది. తను ఎంత స్పీడ్ గా పరిగెత్తితే ఆ మెడిసిన్ అంత ఫాస్ట్ గా పని చేస్తదని వాడు గట్టిగా అరిచి చెప్తాడు. ఐరిస్ మాత్రం వాడి మాటలు పట్టించుకోకుండా అడవిలో పరిగెత్తుతూ వెళ్తది. ఆ ప్రాసెస్ లో తన కత్తిని కూడా పోగొట్టుకుంటుంది.

తన చేతి వేళ్ళు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం ఆమె తన ఫింగర్స్ ని టచ్ చేస్తూ నెంబర్స్ కౌంట్ చేస్తది. అప్పుడు అక్కడికి రిచర్డ్ వచ్చి ఇంకాసేపు ఆగితే నువ్వు ఎలాగూ పడిపోతావ్, ఈ వీకెండ్ అంతా మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చులే అని వెటకారంగా మాట్లాడుతాడు. ఐరిస్ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. తను కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ తన ఫింగర్స్ ని టచ్ చేయాలని చూడగా లాస్ట్ ఫింగర్ ని మాత్రం టచ్ చేయలేకపోతుంది. ఆ పేరలైజర్ తన పని స్టార్ట్ చేసిందని ఆమెకు అర్థమై వాచ్ లో 20 మినిట్స్ కి టైం సెట్ చేసి పారిపోతుంటది. కొద్దిసేపటికి ఒక కాలు పనిచేయడం ఆగిపోతుంది. ఐరిస్ ఆ కాలుని ఈడ్చుకుంటూ అడవిలో మెల్లగా వెళుతుంటది.

Don't Move Movie Explained & Summary in Telugu
Don’t Move Movie Explained & Summary in Telugu
3) Suspense

ఎలాగూ 20 మినిట్స్ తర్వాత ఎక్కడో చోట పడిపోతుంది తనను తీసుకెళ్లొచ్చు అని రిచర్డ్ ఐరిస్ వెనకే  తాపీగా నడుచుకుంటూ వస్తుంటాడు. కట్ చేస్తే ఆ పేరలైజర్ వల్ల ఐరిస్ ఎక్కువ దూరం వెళ్లలేకపోతుంటుంది. అందువల్ల వాడి నుంచి తప్పించుకోవడం కోసం ఐరిస్ ఒక చెట్టు తొర్రలో దాక్కుకుంటుంది. రిచర్డ్ కి ఐరిస్ కనిపించకపోవడంతో వాడమని పిలుస్తూ ఆ చెట్టు దగ్గరకు వస్తాడు. ఐరిస్ ఎక్కడ కనిపించకపోవడంతో ఇక వాడు తనని వెతుకుతూ ముందుకు వెళ్తాడు. ఐరిస్ దాక్కున్న ప్రదేశంలో చీమలు ఎక్కువగా ఉంటాయి అవి ఆమె మొహం మీదకి  కుడుతుంటాయి. బట్ ఆ నొప్పికి అరిస్తే రిచర్డ్ కి తను దొరికిపోతనని ఆమె ఆ నొప్పిని బరిస్తది. కానీ ఆమె ఎక్కువసేపు ఆ నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తది.

ఆ శబ్దం రిచర్డ్ కి వినిపించి వాడు ఐరిస్ ని చూసి తిరిగి చెట్టు దగ్గరికి వస్తుంటాడు. అప్పటికే ఐరిస్ కాళ్లు  మాక్సిమం పనిచేయడం మానేస్తాయి. కానీ ఆమె రిచర్డ్ కి మాత్రం దొరకకూడదు అనుకుని పాక్కుంటూ పక్కనే ఉన్న నదిలోకి దుకుతుంది. ఆ నది ప్రవాహం వల్ల ఆమె నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోవడం రిచర్డ్ చూస్తాడు. కాసేపైన తరువాత చెట్టు మొద్దుని పట్టుకొని ఆమె నది నుండి బయటకు వస్తుంది. ఐరిస్ లక్ ఏంటంటే తను వచ్చిన ప్రదేశంలో ఒక పెద్దాయన నివసిస్తుంటాడు. ఆయన గార్డెన్ లోనే ఐరిస్ పడిపోతుంది. ఎగ్జాక్ట్గా ఆ టైం కి 20 మినిట్స్ టైం కూడా అయిపోయి ఐరిస్ బాడీ అంతా షడ్ డౌన్ అవుతుంది. ఇక తను కదల్లేదు మాట్లాడలేదు. ఆ పెద్దాయన ఐరిస్ ని చూసి ఇంట్లోకి తీసుకెళ్ళి, Helpline కి కాల్ చేద్దామనుకునే టైంలో ఎవరో ఇంటి డోర్ ని కొడతారు.

కచ్చితంగా వచ్చింది రిచర్డ్ ఏ అని ఐరిస్ కి అర్థమై డోర్ ఓపెన్ చేయడం ప్రమాదకరమని తన కళ్ళని ఫాస్ట్ గా బ్లింక్ చేస్తుంటది. అపుడు ఆ పెద్దాయన ఐరిస్ నీ దాచిపెట్టి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అనుకున్నట్టుగానే అక్కడికి వచ్చింది రిచర్డ్ యే. వాడు ఆ పెద్దయంతో నేను నా వైఫ్ కారు యాక్సిడెంట్ కి గురయ్యాము, తను ఏమైనా మీకు కనిపించిందా తను నేను పోగొట్టుకున్నానని నటించడం మొదలుపెడతాడు. ఆ పెద్దాయనకి వాడి మీద డౌట్ వచ్చి సరే నేను హెల్ప్ ఫోన్ చేస్తానని డోర్ వేసేస్తాడు. బట్ రిచర్డ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి ఐరిస్ కోసం వెతుకుతుంటాడు. కానీ తను వాడికి ఎక్కడ కనిపించదు. నా ఫోన్ మిస్ అయింది, మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా అని రిచర్డ్ ఆ పెద్దాయన అడుగుతాడు.

Don't Move Movie Explained & Summary in Telugu
Don’t Move Movie Explained & Summary in Telugu
4) New Man

కాసేపటికే వాడి పాకెట్ లో ఉన్న ఫోన్ రింగ్ అవుద్ది. అపుడు ఆ పెద్దాయనకి రిచర్డ్ మీద డౌట్ వచ్చి నువ్వీక ఇక్కడి నుండి బయలుదేరనీ అంటాడు. రిచర్డ్ కి సహనం నశించి ఆ ముసలాయన్ని పేరు పెట్టి పిలుస్తాడు. అతని పేరు విలియం. నా పేరు నీకు ఎలా తెలుసు అని అతను షాక్ అవుతాడు. ఆ టైంలో రిచర్డ్ అసలు తను ఎక్కడ ఉందో చెప్పు అని గట్టిగా బెదిరిస్తాడు. విలియం కాస్త భయపడి తనను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో తను షెడ్ లో ఉందని చెప్తాడు. ఇక రిచర్డ్ షెడ్ లోపలికి వెళ్ళబోతు విలియం దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటాడు. అప్పుడు విలియం రిచర్డ్ నీ బుక్ సెల్ఫ్ మీదికి తోసేయడంతో, ఆ సెల్ఫ్ మొత్తం రిచర్డ్ మీద పడుతుంది. అప్పుడు విలియం ఫోన్ తీసుకుని 911 కి కాల్ చేసి మా ఇంట్లోకి ఒకడు వచ్చి అటాక్ చేస్తున్నాడని చెప్తాడు.

ఈ లోపు రిచర్డ్ లేసి విలియంతో ఫైట్ చేస్తాడు. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైనల్ గా రిచర్డ్ విలియంని చంపేస్తాడు. ఆ తర్వాత షెడ్ లోకి వెళ్లి ఐరిస్ కోసం చూస్తాడు. తనక్కడ లేకపోవడంతో వాడికి కోపం వచ్చి ఇంటి మొత్తాన్ని తగలపెట్టలని అనుకుంటారు. అయితే ఇప్పటివరకు రిచర్డ్ కూర్చున్న సోఫా వెనకే ఐరిస్ పడుకొని ఉంటది. రిచర్డ్ ఆ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టేసి, ఆ పెద్దాయన ట్రక్కు వేసుకొని వెళ్లిపోబోతుండగా, ఇంట్లో పడుకొని ఉన్న ఐరిస్ విండో కర్టన్స్ ని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ రిచర్డ్ కి సిగ్నల్ ఇస్తుంటది. ఎందుకంటే తను ప్రస్తుతం వాడికి దొరికిన ఓకే! ముందు ఇక్కడి నుంచి బయటపడాలి కదా. తనేమో కదల్లేదు, సో కచ్చితంగా ఇపుడు వాడి హెల్ప్ కావాల్సిందే.

ఆ కర్టన్స్ ఆన్ అండ్ ఆఫ్ అవడం రిచర్డ్ చూసి లోపలికి వచ్చి ఐరిస్ ని తీసుకెళ్లిపోతాడు. అలా వెళ్తున్నప్పుడు రిచర్డ్ కి తన కూతురు ఫోన్ చేసి నాకు ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి. ఈ వీకెండ్ కి అమ్మ నేను నీ దగ్గరికి వస్తున్నాము అంటది. రిచర్డ్ కి వాళ్ళు రావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తను వీకెండ్స్ లో చాలా బిజీ. అదే ఇలా ఒంటరిగా దొరికిన లేడీస్ ని చంపడంలో బిజీ అనమాట. బట్ తప్పక వాళ్ళు రావడానికి ఒప్పుకుంటాడు. బండ్లో పెట్రోల్ అయిపోతుండడంతో రిచర్డ్ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కార్డుతో పే చేయడం టెంపరరీగా అందుబాటులో లేదని నోటీస్ అంటించడంతో క్యాష్ పే చేయాలని రిచర్డ్ లోపలికి వెళ్తాడు.

Don’t Move Movie Explained & Summary in Telugu
5) Twist

అప్పుడు ఐరిస్ తన చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ ఎవరొకరికి తన పరిస్థితిని అర్థం అయ్యేలాగా ఏదన్న చిన్న సిగ్నల్ లాంటిది ఇవ్వాలని అందరినీ గమనిస్తుంటది & ఆ పేరలైజర్ ప్రభావం కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుంటుంది. దానివల్ల ఐరిస్ కాస్త కష్టపడి తన సీట్ బెల్ట్ ని తీసేసుకుని డోర్ కి ఆనుకుంటది. తన అదృష్టం బాగుండి ఎదురుగా ఒక కారు వస్తది. ఆ కారులో ఉన్న పిల్లవాడు ఐరిస్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ పిల్లాడి మదర్ కూడా అక్కడికి వచ్చి ఐరిస్ నీ చూస్తుంది. కాకపోతే ఈలోగా రిచర్డ్ వచ్చి అక్కడ నుంచి ఐరిస్ తో వెళ్ళిపోతాడు. ఆ కార్ లేడీ కి డౌట్ వచ్చి పోలీస్ వాళ్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కట్ చేస్తే రిచర్డ్ ఇంతకుముందు తన కార్ యాక్సిడెంట్ జరిగినా ప్లేస్ కి వచ్చి తన బట్టల్ని చేంజ్ చేసుకొని, ఒక సిరంజిని తనకు కావాల్సిన వస్తువులను తన కారు నుండి ఈ ఓల్డ్ మెన్ ట్రక్ లోకి తెచ్చుకుంటాడు.

తన కార్ని అక్కడ్నుంచి లాక్కొని వెళ్లాలని ఓల్డ్ మెన్ ట్రక్ లో ఉన్న పెద్ద చైన్ కనెక్టర్ నీ  తీసుకుని తన కార్ కి బిగిస్తుంటాడు. గ్యాస్ స్టేషన్ దగ్గర లేడీ పోలీస్ ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. పోలీస్ ఆఫీసర్ రిచర్డ్ ని చాలా క్యూస్షన్స్ అడుగుతాడు. వాడు వాటికి చాలా తెలివిగా సమాధానం ఇస్తాడు. ఐరిస్ నా వైఫ్ అని, బాగా తాగేసి ఆక్సిడెంట్ చేయిందని రకరకాలుగా చెప్తాడు. పారలైజర్ ప్రభావం కొంచెం కొంచెంగా తగ్గుతుందని చెప్పాను కదా. అందువల్ల ఐరిస్ కొంచెం కొంచెంగా మాట్లాడటం స్టార్ట్ చేస్తది. పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వెళ్లడంతో ఐరిస్ హెల్ప్ అని అంటది. ఆఫీసర్ కి ఆ మాట అర్థమయ్యే సమయానికి రిచర్డ్ చైన్ తో అతని మీద అటాచ్ చేసి చంపేసి, అతని కార్ తో సహా అతన్ని తగలబెట్టేస్తాడు.

ఇక రిచర్డ్ ఐరిస్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఐరిస్ రిచర్డ్ ని, “నువ్వు అసలు ఎందుకు ఇలా అమ్మాయిలని చంపుతున్నావ్. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు దూరమైందనా? లేక తను దూరం అయిన తర్వాత రెండున్నర నెల నువ్వు హాస్పిటల్ బెడ్ మీద గడిపి సైకో లాగా మారిపోయావా?” అని అడుగుతది. నిజానికి రిచర్డ్ ఇలా ఒంటరి అమ్మాయిల్ని చంపడానికి కారణం ఏంటంటే. రిచర్డ్ గర్ల్ ఫ్రెండ్ కార్ ఆక్సిడెంట్ లో అతని కళ్ళముందే చనిపోతుంది కదా. అప్పటినుంచి వీడికి అమ్మాయిల చావు అనేది ఒక అబ్సేషన్ లాగా మారిపోతది. అందుకే ఒంటరిగా ఉన్న లేడీస్ ని కిడ్నాప్ చేసి తన కళ్ళముందే చనిపోయేలాగా చేస్తుంటాడు. అది వాడికి ఆనందాన్ని ఇస్తది. ఇదో రకం సైకోయిజం.

Image Credit: Don’t Move (2024)

Leave a Comment