Don’t Move (2024) Plot Summary Explained in Telugu

Don’t Move (2024) Plot Summary Explained in Telugu

మరణం మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నా మీరు మాత్రం ఒక్క అడుగు కూడా కదలలేని పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు!? ఇప్పుడు మనం ఇలాంటి సినిమా గురించే మాట్లాడుకోబోతున్నాం. అక్టోబర్ 25, 2024లో విడుదలైన “Don’t Move” అనే సినిమా మీలో ఎంత మందికి గుర్తుంది. ఇదొక ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు చాలా రసవత్తరంగా సాగుతుంది. ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు లేకుండా కథ అంతా ఒక చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతుంటదనమాట. ఈ సినిమాలో ఒక అమ్మాయి అనుకోకుండా ఓ ప్రాణాపాయ స్థితిలో పడుతుంది. తను ఆ ప్రాణాపాయ స్థితి నుంచి ఎలా బయటపడింది? తనని చంపాలని చూస్తున్న వ్యక్తి ఎవరు? అసలా హంతకుడికి, ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఇలా ప్రతి విషయాన్ని మనం తెలుసుకుందాం!

ఇప్పుడు కథలోకి వెళ్దాం!
ఐరిస్ పరిచయం

తన భర్త నిద్రపోతుండగా ఐరిస్ పడక గది నుండి బయటకొచ్చి, ఒక చిన్న కత్తి తీసుకుని కార్లో అక్కడ్నుంచి వెళ్ళిపోతుంటది. తను కాలిఫోర్నియా స్టేట్ పార్క్ దగ్గరికెళ్లి ఒక కొండ పైకి ఎక్కిద్ది. అక్కడే తన కొడుకు యెుక్క సమాధి ఉంటది. కొన్ని రోజుల క్రితమే ఐరిస్ కొడుకు ఆ కొండ మీద నుంచి పొరపాటున జారిపడి చనిపోతాడు. అప్పటినుంచి తను అదే బాధలో జీవితం గడుపుతుంటది. తన కొడుక్కి ఇష్టమైన పడవ బొమ్మని సమాధి దగ్గర పెట్టి, ఐరిస్ కూడా కొండపై నుంచి కిందకి దూకి చనిపోవాలనుకుంటది. అలా తను దూకబోతుండగా అకస్మాత్తుగా అక్కడికి ‘రిచర్డ్’ అనే వ్యక్తి వస్తాడు.

రిచర్డ్ తనని మాటల్లో పెట్టి ఆత్మహత్య చేసుకోకుండా మనసు మార్చాలని చూస్తాడు. రిచర్డ్ తనతో, “కాలేజీలో ఉన్నప్పుడు నేను, నా గర్ల్ ఫ్రెండ్ ఒక కార్లో వెళుతుండగా మాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో నా గర్ల్ ఫ్రెండ్ నా కళ్ళముందే చనిపోయింది. నాకు గాయాలవడంతో, నేను రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండిపోయాను. మన జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగినంత మాత్రాన జీవితమే పోయినట్టు కాదు కదా!” అని రిచర్డ్ అంటాడు. రిచర్డ్ చెప్పింది విన్న తర్వాత ఐరిస్ తన మనసు మార్చుకుని ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోద్ది. ఇక వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ తమ కార్స్ దగ్గరికొస్తారు.

రిచర్డ్ తన కారుని ఐరిస్ కారుకి చాలా దగ్గరగా పార్క్ చేసి ఉండడంతో ఐరిస్ తన కార్ డోర్ తెరవలేకపోద్ది. అప్పుడు రిచర్డ్ ఒక గొడుగు తీసుకుని ఐరిస్ దగ్గరికొస్తాడు. ఈ గొడుగుతో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వొచ్చు. రిచర్డ్ ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకున్నప్పుడు ఈ గొడుగుని ఉపయోగిస్తాడనమాట. రిచర్డ్ గొడుగుతో ఐరిస్కి షాక్ ఇచ్చి, కాళ్ళు చేతులు కట్టేసి తనని కార్లో వేసుకొని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. కాసేపటి తర్వాత ఐరిస్కి మెలకువస్తది. రిచర్డ్ తనని కిడ్నాప్ చేశాడని అర్థంచేసుకుని ఐరిస్ తన చేతికున్న స్మార్ట్ వాచ్ ద్వారా భర్తకి సమాచారం పంపించాలనుకుంటది.

2) అడవిలో పారిపోవడం

అప్పుడు రిచర్డ్ తనని చూసి, “నువ్వు ఎవరికి సమాచారం ఇవ్వాలనుకున్న ఇక్కడ సిగ్నల్స్ లేవులే” అని అంటాడు. అప్పుడు ఐరిస్, “నా భర్త ఖచ్చితంగా నా కోసం వెతుక్కుంటూ వస్తాడు” అని అంటది. దానికి రిచర్డ్, “నేనింతకు ముందు కిడ్నాప్ చేసిన ఆడవాళ్ళు కూడా ఇలాంటి మాటలే చెప్పారులే” అని అంటాడు. “అంటే ఇంతకుముందు వీడు చాలా మందిని కిడ్నాప్ చేశాడా!” అని ఐరిస్కి అర్థమయిద్ది. ఐరిస్ తన కొడుకు సమాధి దగ్గర ఒక పడవ బొమ్మని పెట్టింద్ది కదా! రిచర్డ్ దాన్ని అక్కడ్నుంచి తీసుకుని ఐరిస్ దగ్గరపెడతాడు. ఐరిస్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న కత్తిని పాకెట్లో పెట్టుకుంటది కదా. తను ఆ కత్తిని ఉపయోగించి తన చేతికున్న తాళ్ళని మెల్లగా కట్ చేస్తుంటది.

అప్పుడు రిచర్డ్ తనని చూసి, “నువ్వు ఎవరికి సమాచారం ఇవ్వాలనుకున్న ఇక్కడ సిగ్నల్స్ లేవులే” అని అంటాడు. అప్పుడు ఐరిస్, “నా భర్త ఖచ్చితంగా నా కోసం వెతుక్కుంటూ వస్తాడు” అని అంటది. దానికి రిచర్డ్, “నేనింతకు ముందు కిడ్నాప్ చేసిన ఆడవాళ్ళు కూడా ఇలాంటి మాటలే చెప్పారులే” అని అంటాడు. ఐరిస్ తన కాళ్లకున్న తాళ్ళను కూడా విప్పేసుకుంటది. ఇక తను పడవ బొమ్మ తీసుకుని అక్కడ్నుంచి పారిపోవాలనుకుంటది. అప్పుడు రిచర్డ్ తన దగ్గరికొచ్చి, “నువ్వు పారిపోవాలనుకున్నా కూడా ఏ ఉపయోగం లేదు. నేను నీ శరీరంలోకి ఒక పేరలైజర్ ఎక్కించాను. మరో ఇరవై నిమిషాల్లో నీ శరీరం పనిచేయడం ఆగిపోద్ది. నీ కాళ్లు, చేతులు పనిచేయవు, నీ చూపు కూడా మందగిస్తది. చివరికి నువ్వు మాటలు కూడా మాట్లాడలేవు” అని అంటాడు.

Don’t Move (2024) Plot Summary Explained in Telugu
Don’t Move (2024) Plot Summary Explained in Telugu

కాబట్టి వాడితో ఉండడం చాలా ప్రమాదమని ఐరిస్ అడవిలోకి పారిపోద్ది. తను ఎంత వేగంగా పరిగెత్తితే ఆ మందు అంత వేగంగా పనిచేస్తదని రిచర్డ్ గట్టిగా అరిచి చెప్తాడు. ఐరిస్ మాత్రం వాడి మాటలు పట్టించుకోకుండా అడవిలో పరిగెత్తుతూ వెళ్తది. అలా మార్గమధ్యంలో ఒకచోట తన కత్తి కిందపడిపోద్ది. తన చేతి వేళ్ళు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం ఐరిస్ తన వేళ్ళని ముట్టుకుంటూ అంకెలు లెక్కపెట్టిద్ది. ఆ సమయంలో రిచర్డ్ తన దగ్గరికొచ్చి, “ఇంకొన్ని నిమిషాల్లో నువ్వు చలనం లేకుండా కింద పడిపోతవ్. ఈ శనివారమంతా మనం బాగా ఆనందంగా గడపొచ్చులే” అని వెటకారంగా మాట్లాడతాడు.

3) కొత్త మనిషి

అప్పుడు ఐరిస్ వెంటనే అక్కడ్నుంచి పారిపోతుంది. తను కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ తన వేళ్ళని తాకాలని చూడగా అప్పటికే తన చిటికెన వేలు చలనం కోల్పోయిద్ది. రిచర్డ్ తన శరీరంలోకి పంపిన మందు వల్లనే ఇదంతా జరుగుతుందని ఐరిస్కి అర్ధమయిద్ది. కొద్దిసేపటికి తన కాలు కూడా పనిచేయడం ఆగిపోద్ది. ఐరిస్ ఆ కాలుని ఈడ్చుకుంటూ అడవిలో మెల్లగా వెళ్తుంటది. ఎలాగు ఇరవై నిమిషాల తర్వాత ఎక్కడో చోట కింద పడిపోద్దిలే అని రిచర్డ్ ఐరిస్ వెనకాలే నెమ్మదిగా వస్తుంటాడు. ఆ మందు వల్ల ఐరిస్ నీరసించిపోయి తెలివిగా ఒక చెట్టు తొర్రలో దాక్కుంటది. తను ఎక్కడుందో కనిపించకపోవడంతో రిచర్డ్ తనని పిలుస్తూ ఆ చెట్టు దగ్గరికొస్తాడు.

ఇంతలోనే తను ఎక్కడికి తప్పించుకుపోయిందని అనుకుంటూ రిచర్డ్ తనని వెతుక్కుంటూ ఇంకా ముందుకెళ్తాడు. ఐరిస్ దాకున్న చెట్టు తొర్రలో చీమలు ఎక్కువగా ఉంటాయి. అవి తన ముఖం మీదకి ఎక్కి బాగా కుడుతుంటాయి. కొంచెంసేపు తను ఆ నొప్పిని ఓర్చుకుంటది. కానీ ఇక తను నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తది. ఆ శబ్దాన్ని రిచర్డ్ విని వెంటనే చెట్టు దగ్గరికొస్తుంటాడు. అప్పటికే ఐరిస్ కాళ్ళు కూడా చలనం కోల్పోతాయి. అయినా సరే తను నేలపై పాక్కుంటూ పక్కనే ఉన్న నదిలోకి దూకుద్ది. ఐరిస్ అలా నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళిపోవడాన్ని రిచర్డ్ గమనిస్తాడు. కాసేపైన తర్వాత ఐరిస్ ఒక దుంగని పట్టుకొని నది నుండి బయటకొస్తది.

అక్కడొక ఇళ్లు ఉంటది. ఒక ముసలాయన ఇంటి బయట తోట పనులు చేస్తుంటాడు. ఆ ముసలాయన పేరు విలియం. ఐరిస్ నెమ్మదిగా పాక్కుంటూ తోటలోకి వస్తది. అప్పటికే ఇరవై నిమిషాలు అవడంతో ఐరిస్ శరీరమంతా చలనం లేకుండా పడిపోద్ది. ఇక తను కదల్లేదు, మాట్లాడలేదు. విలియం తనని చూసి ఇంట్లోకి తీసుకెళ్ళి సహాయం కోసం ఫోన్ చేస్తుండగా అదే సమయంలో ఎవరో ఇంటి తలుపుని కొడతారు. వచ్చింది ఖచ్చితంగా రిచర్డ్ అని అర్థంచేసుకుని, తలుపు తెరవడం ప్రమాదకరమన్నట్టుగా ఐరిస్ తన కళ్ళతో విలియంకు సంకేతం ఇస్తుంటది. అప్పుడు విలియం తనని ఒకచోట దాచిపెట్టి, వెళ్లి తలుపు తెరుస్తాడు.

4) ఇంటిని తగలబెట్టడం

తీరాచూస్తే నిజంగానే అక్కడ రిచర్డ్ ఉంటాడు. వాడు విలియంతో, “నేను, నా భార్య కార్లో వస్తుండగా మాకు ప్రమాదం జరిగింది. తను ఇప్పుడు ఎక్కడుందో నాకు అర్థమవడం లేదు. నా భార్య మీకేమైనా కనిపించిందా?” అని అంటూ బాగా నటిస్తాడు. విలియంకి రిచర్డ్ మీద అనుమానమొచ్చి, “సరే నేను పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్తా” అని తలుపు మూసేస్తాడు. కానీ రిచర్డ్ మాత్రం తలుపు నెట్టుకుని లోపలికొచ్చి ఐరిస్ కోసం వెతుకుతుంటాడు. అయినా సరే ఐరిస్ వాడికి ఎక్కడా కనిపించదు. “నా ఫోన్ ఎక్కడో పడిపోయింది, మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా!?” అని రిచర్డ్ విలియంని అడుగుతాడు. కానీ నిజానికి రిచర్డ్ జేబులో ఫోన్ ఉంటది.

విలియం దాన్ని గమనించి రిచర్డ్ మీద అనుమానపడతాడు. కాబట్టి తను అతన్ని ఇంట్లో నుంచి బయటికెళ్ళమంటాడు. ఇక రిచర్డ్ కి సహనం నశించి, “నా భార్య ఎక్కడుందో చెప్పు” అని విలియంని బెదిరిస్తాడు. దాంతో విలియం కాస్త భయపడి, “తనను తీసుకొని ఇక్కడ్నుంచి వెళ్ళిపో! తను షెడ్ లోపల ఉంది” అని చెప్తాడు. ఇక రిచర్డ్ షెడ్ లోపలికెళ్తూ విలియం దగ్గరున్న ఫోన్ తీసుకుంటాడు. అప్పుడు విలియం అతన్ని అల్మారా మీదికి తోసేయడంతో, ఆ అల్మారా మొత్తం రిచర్డ్ మీద పడుతుంది. ఇక విలియం వెంటనే ఫోన్ తీసుకుని 911 కి ఫోన్ చేసి, “ఒకడు మా ఇంట్లోకొచ్చి మాపై దాడి చేస్తున్నాడు” అని చెప్తాడు. ఈలోపు రిచర్డ్ పైకి లేచి విలియంపై దాడికి దిగుతాడు. అలా వారిద్దరి మధ్య జరిగిన కొట్లాటలో విలియం చనిపోతాడు.

Don’t Move (2024) Plot Summary Explained in Telugu
Don’t Move (2024) Plot Summary Explained in Telugu

ఆ తర్వాత రిచర్డ్ షెడ్ లోకెళ్లి ఐరిస్ కోసం వెతుకుతాడు. కానీ ఐరిస్ అక్కడ ఉండదు. ఇక రిచర్డ్ కోపంతో ఆ ఇంటి మొత్తాన్ని మంటల్లో తగలబెట్టేస్తాడు. తీరాచూస్తే ఐరిస్ ఇంటిలోపలే ఉంటది. మా మంటల నుంచి తప్పించుకునేందుకు ఐరిస్ కిటికీ తెరల్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ రిచర్డ్ కి సంకేతమిస్తుంటది. ఇక రిచర్డ్ ఆ సంకేతాన్ని గమనించి వెంటనే ఇంటిలోకొచ్చి తనని మంటల నుంచి కాపాడతాడు. తను ఆమెని తీసుకుని ట్రక్కులో వెళ్తుండగా రిచర్డ్ కి తన కూతురు ఫోన్ చేసి, “నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. ఈ శనివారం నేను, అమ్మ నీ దగ్గరికొస్తున్నాము” అని అంటది.

5) పోలీసులకి సమాచారం

నిజానికి రిచర్డ్ కి వాళ్ళు రావడం ఇష్టముండదు. ఎందుకంటే తను శని, ఆది వారాల్లో ఇలా ఒంటరిగా దొరికిన ఆడవాళ్లని చంపే పనిలో ఉంటాడుగా. కానీ తన కూతుర్ని బాధపెట్టడం ఇష్టం లేక వాళ్ళు వచ్చేందుకు రిచర్డ్ ఒప్పుకుంటాడు. ట్రక్కులో పెట్రోల్ అయిపోతుండడంతో రిచర్డ్ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర బండి ఆపుతాడు. ఐరిస్ తన చుట్టూ ఉన్న మనుషులల్ని చూస్తూ ఎవరొకరికి తన పరిస్థితి అర్థమయ్యేలాగా ఏదైనా చిన్న సంకేతం ఇవ్వాలని అందర్ని గమనిస్తుంటది. అలాగే ఆ మందు యెుక్క ప్రభావం కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుంటది. తన అదృష్టం బాగుండి ఎదురుగా ఒక కారొస్తది. ఆ కారులో ఉన్న పిల్లాడు, ఆ పిల్లాడి అమ్మ కూడా ఐరిస్ ని గమనించి తన దగ్గరికొస్తారు.

సరిగ్గా అదే సమయంలో రిచర్డ్ ట్రక్కులో పెట్రోల్ నింపేసి అక్కడ్నుంచి ఐరిస్ ని తీసుకెళ్ళిపోతాడు. ఆ పిల్లాడి అమ్మకి రిచర్డ్ మీద అనుమానమొచ్చి పోలీసులకి ఫోన్ చేసి చెప్తది. తర్వాత రిచర్డ్ ఇంతకుముందు తన కార్ ప్రమాదానికి గురైన ప్రదేశానికొచ్చి తన బట్టల్ని మార్చుకుని, ఒక సిరంజిని తనకు కావాల్సిన వస్తువుల్ని కార్ నుండి ట్రక్కులోకి తెచ్చుకుంటాడు. తన కారుని అక్కడ్నుంచి లాక్కుని వెళ్లాలని రిచర్డ్ దాన్ని ట్రక్కుకి కడుతుంటాడు. గ్యాస్ స్టేషన్ దగ్గరున్న లేడీ, పోలీసులకి ఫోన్ చేసి సమాచారమిచ్చింది కదా! దాని వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ పాట్రోలింగ్ చేస్తూ రిచర్డ్ దగ్గరికొస్తాడు. పోలీస్ తనని చాలా ప్రశ్నలు అడుగుతాడు. రిచర్డ్ వాటికి చాలా తెలివిగా సమాధానమిస్తాడు.

ఐరిస్ తన భార్య అని, తను బాగా తాగేసి కారుని చెట్టుకి గుద్దేసిందని రకరకాలుగా అబద్ధాలు చెప్తాడు. ఐరిస్ శరీరంలోంచి పారలైజర్ ప్రభావం కొంచెం కొంచెంగా తగ్గుతుందని చెప్పాను కదా. అందువల్ల తను కొంచెం కొంచెంగా మాట్లాడుతూ, “నాకు సహాయం చేయండి” అని అంటది. ఇక రిచర్డ్ వెంటనే ఒక ఇనుప గొలుసుతో పోలీస్ మీద దాడి చేసి తనని కారుతో సహా మంటల్లో తగలబెట్టేస్తాడు. ఇక రిచర్డ్ ఆమెని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుండగా, “అసలు నువ్వు ఎందుకిలా అమ్మాయిల్ని చంపుతున్నావ్. నీ ప్రేమికురాలు నీకు దూరమైందనా? లేక తను దూరమయిన తర్వాత రెండున్నర నెలలు నువ్వు హాస్పటల్ మంచం మీద గడిపి సైకోలాగా మారిపోయావా?” అని ఐరిస్ అంటది.

6) ముగింపు

నిజానికి రిచర్డ్ ఇలా ఒంటరి అమ్మాయిల్ని చంపడానికి కారణం ఏంటంటే… రిచర్డ్ ప్రేమించిన అమ్మాయి కార్ ప్రమాదంలో అతని కళ్ళముందే చనిపోతుంది కదా! తను అలా చనిపోవడాన్ని వీడు దగ్గర్నుండి చూస్తాడు. ఆ చావు వీడికి ఒకరకమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్ల అప్పట్నుంచి వీడికి అమ్మాయిల చావు అనేది ఒక వ్యసనంలాగా మారిపోద్ది. అందుకే ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తన కళ్ళముందే చనిపోయేలాగా చేస్తూ ఆనందపడుతుంటాడు. అది వాడికి ఆనందాన్నిస్తది. ఇదో రకమైన క్రూరత్వ మనమాట.

ఈ విధంగా ఈ సినిమా కథ సాగుతుంది. చివరికి ఐరిస్ తన ప్రాణాల్ని కాపాడుకోగలిగిందా? రిచర్డ్ చేసిన హత్యల గురించి పోలీసులకి ఏమైనా తెలిసిందా!? అసలు ఈ సినిమా ఎలా ముగుస్తుంది అనే పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే ఒకసారి సినిమాని వీక్షించాల్సిందే! ప్రస్తుతం ఈ మూవీ Netflix లో అందుబాటుగా ఉంది. నాకైతే మాత్రం ఈ సినిమా మంచి అనుభూతిని ఇచ్చింది. చూసేందుకు కథ మామూలుగా ఉన్నప్పటికీ సినిమా చూస్తున్నప్పుడు వచ్చే అనుభూతి చాలా బాగుంది. ఎక్కువ గ్రాఫిక్స్ ఏమీ లేకుండా, ఒక మంచి ఆసక్తికరమైన సినిమాగా మంచి మార్కులు కొట్టేసింది. ఒక మనిషి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతవరకు పోరాడగలడో ఈ సినిమాలో బాగా చూపించారు. సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే సినీ ప్రియులకి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్‌ చేయండి.

Leave a Comment