Devara Part 1 Trailer Released

Devara Part 1 Trailer Released: Jr NTR అభిమానులు, సినిమా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న దేవర పార్ట్ 1 ట్రైలర్
వచ్చేసింది.

Devara Part 1 Trailer Released
Devara Part 1 Trailer Released

“Man of Masses NTR” నటించిన, “దేవర” పార్ట్ 1 మూవీ ట్రైలర్ ని, సెప్టెంబర్ పది సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు మూవీ టీం రిలీజ్ చేసేసింది.

2022 మార్చ్ 24 న రిలీజ్ అయిన RRR సినిమా తర్వాత, NTR ని ప్రేక్షక అభిమానులు థియేటర్లలో చూసిందే లేదు. కాబట్టి ఇప్పుడు NTR, రెండు సంవత్సరాల తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దేవర మూవీ, ఈ సంవత్సరం (2024) సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకి రైటర్ కూడా కొరటాల శివానే. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన దేవర సినిమా పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో విడుదల కాబోతుంది.

కొరటాల గత చిత్రం ఆచార్య ఫ్లాపైన తర్వాత, ఏ హీరో కూడా కొరటాల శివతో సినిమా చేసేందుకు ధైర్యం చూపలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం, కొరటాల శివ పై ఉన్న నమ్మకంతో సినిమాకి ఓకే చెప్పేసాడు.

ఫ్లాప్ సెంటిమెంట్:

రాజమౌళి డైరెక్షన్లో నటించిన తరువాత, హీరో ఏ సినిమా తీస్తే ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిద్ది అనే టాక్ సినీ అభిమానుల్లో అలాగే సినీ వర్గాల్లో ఎప్పటినుంచో నడుస్తుంది. బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో అయితేనేమి, RRR తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య అయితేనేమి. ఇలా ఏ సినిమా చూసినా సరే, రాజమౌళి డైరెక్షన్లో నటించిన తర్వాత, హీరో ఏ మూవీలో నటించినా సరే, ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయిద్ది అనే ముద్ర అందరి మనసులో పడిపోయింది. అలా చూసుకుంటే ఇప్పుడు NTR’s దేవర మూవీ RRR తర్వాతనే వస్తుంది కదా. మరి ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ని NTR దేవరతో బ్రేక్ చేస్తాడా!? లేదా!? అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

సాంగ్స్ & ట్రోల్లింగ్:

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే దేవర మూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ చేశారు. సాంగ్స్ and మ్యూజిక్ మీద మొదట కాస్త ట్రోలింగ్ వచ్చినప్పటికీ, రిలీజ్ అయిన ప్రతి పాట యూట్యూబ్లో మిలియన్స్ లో వ్యూస్ ని సంపాదిస్తూ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళాయి.

ఈ సినిమా నుంచి మొదటగా రిలీజ్ అయిన, “ఫియర్ సాంగ్” 54 ప్లస్ మిలియన్ వ్యూస్ ని సంపాదించింది. అలాగే రెండో సాంగ్ గా రిలీజ్ అయిన, “చుట్టమల్లే” సాంగ్ అయితే ఏకంగా 110 ప్లస్ మిలియన్ వ్యూస్ ని చేరుకుంది. మరియు మూడో సాంగ్ గా రిలీజ్ అయిన “దావుదీ” సాంగ్ కూడా 28 ప్లస్ మిలియన్ వ్యూస్ ని సంపాదించి, ఇప్పటికే బాగా వైరల్ గా నిలిచాయి.

ట్రైలర్:

సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో, ఇక మూవీ టీం నిన్ననే (సెప్టెంబర్ 10, 2024) ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేసింది. రెండు నిమిషాల నలభై సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఇప్పటికే 9 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. ట్రైలర్ లో NTR లుక్ and విజువల్స్ మాత్రం అదిరిపోయాయి. సినిమా కూడా ఖచ్ఛితంగా అదిరిపోయిద్దని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవరలో Jr NTR డ్యుయల్ రోల్ లో నటించాడు. (తండ్రిగా, కొడుకుగా) ఒకరు తండ్రి, మరొకరు కొడుకు.

ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, ఎన్టీఆర్ కి జోడిగా నటించింది. జాన్వి కపూర్ తెలుగులో నటించిన మొదటి సినిమా కూడా ఈ “దేవర” నే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు.

అనిరుద్ పై ట్రోలింగ్:

ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ని అందించాడు. అనిరుద్ ప్రతి సినిమాకి తనదైన శైలిలో మంచి మ్యూజిక్ నే అందిస్తుంటాడు. కాకపోతే తన మ్యూజిక్ ని తనే కాపీ కొడుతుంటాడు అని అనిరుధ్ పై బాగా ట్రోలింగ్ నడుస్తుంటది కూడా. దేవర “ఫియర్ సాంగ్” లో అయితే, ఎన్టీఆర్ కంటే అనిరుధే ఎక్కువగా కనిపించాడని అలాగే “దావూదీ” సాంగ్, బీస్ట్ సినిమాలోని “అరబిక్ కుత్తు” సాంగ్ కి కాపీలా ఉందని సోషల్ మీడియాలో అనిరుధ్ పై బాగా ట్రోల్లింగ్ జరిగింది. మరి ఈ సినిమాకి అనిరుధ్ ఎంతలా ఎఫెక్ట్స్ పెట్టడన్న విషయం సెప్టెంబర్ 27నే తెలియాల్సివుంది.

ముగింపు:

మొత్తం మీద “దేవర” ట్రైలర్ మాత్రం ఎన్టీఆర్ అభిమానులకి ఒక ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. ఈ ట్రైలర్ తో దేవర మూవీ మీద అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. మరి “దేవర” సినిమా ఎలా ఉండబోతుందో, ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయగలుగుతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

 

FAQ (Frequently Asked Questions):

When is Devara Part 1 released?

Who are the actors in ‘Devara Part-1’ movie?

Will there be a ‘Devara Part 1’ from NTR Jr?

What is the trailer of Devara – Part 1 about?

Leave a Comment