Despicable Me 4 Movie Explained & Summary in Telugu
Universal Pictures Distribute చేసిన “Despicable Me 4” అనే Animation మూవీ 6.2/10 IMDb రేటింగ్ ని సాధించింది. జూలై 3, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీని Chris Renauld డైరెక్ట్ చేశారు. Mike White మరియు Ken Daurio రచయితలుగా వ్యవహరించారు. Will Ferrell, Steve Carrel, Joey King, Kristen Wiig, Miranda Cosgrove, Sofía Vergara, Stephen Colbert మరియు Pierre Coffin ప్రధాన పాత్రల్లో నటించారు. 100 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 971 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో, Jio Hotstar and ZEE5లో Available గా ఉంది.
స్టోరీ తెలుసుకుందాం:
1) హీరో – విలన్ ఎదురెదురు
ఓపెన్ చేస్తే, మూవీలో main క్యారెక్టర్ అయిన Gru Fast గా తన car ని drive చేస్తూ స్కూల్ ఆఫ్ విలనీ కి చేరుకుంటాడు. తనతోపాటు మూడు మినియన్స్ కూడా ఒక చిన్న Car లో స్కూల్ ఆఫ్ విలనీ కి వస్తాయి. Maxim La Maal అనే వాంటెడ్ విలన్ ని పట్టుకోవడం కోసం Gru ఆ స్కూల్ కి వస్తాడు and Gru చిన్నప్పుడు చదువుకున్నది కూడా ఈ స్కూల్ లోనే. కాబట్టి ఆ మూడు మినియన్స్ ని పనిపై శ్రద్ధగా ఫోకస్ పెట్టమని Gru వాటికి చెప్తాడు. Actual గా Maxim La Maal and Gru కి మధ్య చిన్నప్పటి నుంచి కొన్ని గొడవలు ఉంటాయి.ఆ గొడవలేంటి అనేవి మనకి పోను పోనూ స్టోరీ లో రివీల్ అవుతుంది.
school లోకి enter అవ్వగానే ఆ మూడు మినియన్స్ ఒక పెద్ద జెల్లీ ని చూసి మిషన్ పై ఫోకస్ మర్చిపోయి ఆ జెల్లి దగ్గరికి వెళ్లి దాన్ని తింటుంటాయి. కానీ Gru మాత్రం Maxim దగ్గరికి వెళ్తాడు. Maxim, Gru కి తన గర్ల్ ఫ్రెండ్ వాలంటీనా ని పరిచయం చేసి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ, Gru ని అందరి ముందు అవమానిస్తుంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా స్కూల్ ప్రిన్సిపల్ స్టేజ్ పైకి వచ్చి ఈ సంవత్సరం అలమ్ నై అవార్డుని అందుకోబోతున్న వ్యక్తిని అనౌన్స్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం అలమ్ నై అవార్డుని గెలుచుకున్నది Maxim అని ప్రిన్సిపల్ చెప్పగానే Gru షాక్ అయిపోతాడు.
Maxim కి బొద్దింకలంటే చాలా ఇష్టం, అసలు తనకి బొద్దింకలు అంటే ఎందుకు ఇష్టమో and ఆ బొద్దింకల యొక్క పూర్తి శక్తి ఏంటో అందరికీ తన స్పీచ్ లో చెప్తూ Maxim ఒక్కసారిగా తన కాస్ట్యూమ్ ని చించేస్తాడు. తీరా చూస్తే Maxim కూడా ఒక బొద్దింకలాగా Mutant గా మారిపోయి ఉంటాడు. అలా బొద్దింక రూపంలో మ్యూటెంట్ గా మారిన Maxim ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక Maxim Gru వైపు చూస్తూ, “ఇప్పుడేమంటావు Gru” అని అంటుండగా, Gru ఒక నవ్వు నవ్వి, తన ID ని బయటకి తీసి తను ఒక Anti Villain Agent అని రివిల్ చేస్తాడు. ఇక Gru తన దగ్గర ఉన్న Gun తో Maxim ని shoot చేస్తూ తనని పట్టుకోడానికి try చేస్తుంటాడు, కానీ Maxim మాత్రం ఆ gun shots నుంచి తప్పించుకొని Gru పై ఎటాక్ చేయబోతాడు.

2) కొత్త ఇంట్లోకి ప్రవేశం
సరిగ్గా అప్పుడే బయట నుంచి అద్దాల్ని పగలగొట్టుకుంటూ రిమైనింగ్ యాంటీ విలన్ ఏజెంట్స్ అందరూ స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యి తమ దగ్గర ఉన్న స్టన్ గన్స్ తో Maxim ని బంధిస్తారు. అప్పుడు Maxim, “నేనిప్పుడు ఓడిపోయినప్పటికీ అతి త్వరలో నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను” అని చెప్పి Gru కి వార్నింగ్ ఇస్తాడు. ఇక యాంటీ విలన్ ఏజెంట్స్ Maxim ని జైల్ కి తీసుకెళ్తారు. Maxim వార్నింగ్ ని విన్న Gru కి, మొదట కాస్త భయమేసినప్పటికీ తను దానిని అంతగా పట్టించుకోడు. కట్ చేస్తే, Gru షాపింగ్ నుంచి ఇంటికి వస్తాడు. Gru భార్య పేరు Lucy and తన కొడుకు పేరు Gru జూనియర్. Gru దగ్గర ముగ్గురు చిన్న పిల్లలు పెరుగుతుంటారు, వాళ్ల పేర్లు వచ్చేసి Margo, Edith and Agnes. వీళ్లు ముగ్గురూ అక్కా చెల్లెళ్ళు.
తన కొడుకు అంటే Gru కి చాలా ఇష్టం, కానీ వాడికి మాత్రం తన అమ్మ మీద ప్రేమ ఉంటుంది కానీ నాన్న మీద అంతగా ప్రేమ ఉండదు. So Gru తన కొడుకు ప్రేమ పొందేందుకు ప్రతి నిమిషం ఆరాటపడుతుంటాడు and తన కొడుకు తనని నాన్న అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. Gru తన కొడుకుని ఎత్తుకొని ఆడిపిస్తుండగా సరిగ్గా అదే సమయంలో యాంటీ విలన్ లీగ్ డైరెక్టర్ (సైలస్) Silas, Gru ఇంటికి వస్తాడు. Silas Gru తో Maxim జైలు నుంచి తప్పించుకున్నాడు కాబట్టి నువ్వు నీ ఫ్యామిలీ కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు. Maxim చాలా Powerful విలన్, So తను Gru ని ఖచ్చితంగా చంపేసిన చంపేస్తాడని Silas భయపడి Gru ఫ్యామిలీని అక్కడి నుంచి May Flower అనే టౌన్ కి Shift చేయాలనుకుంటాడు.
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో Gru ఫ్యామిలీ అక్కడ నుంచి మే ఫ్లవర్ టౌన్ కి వచ్చేస్తారు. Gru తో పాటు మూడు మినియన్స్ కూడా మే ఫ్లవర్ కి వస్తాయి and మిగిలిన మినియన్స్ అన్నింటిని Silas AVL కి Bus లో తీసుకెళ్ళిపోతాడు. మే ఫ్లవర్ లో ఉన్న ఇళ్లన్నీ చాలా పెద్దగా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి అందమైన ప్లేస్ లో ఉండబోతున్నందుకు Gru ఫ్యామిలీ చాలా ఆనందిస్తారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఉండబోతున్నది ఒక చిన్న ఇంట్లో అని. “పర్వాలేదులే ఏ ఇల్లు అయితే ఏమి!” అని అనుకొని వాళ్లిక ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ town లో నివసించే ప్రజలకి Gru ఒక Ex విలన్ అనిగాని and present తను ఒక anti విలన్ agent అనిగాని ఎవరికీ తెలియదు.

3) మినియన్స్ కి సూపర్ పవర్స్
తమ కొత్త ఇంట్లో ఒక క్యాండీ మిషన్ ఉండడంతో one eye మినియన్ ఆశగా క్యాండీస్ ని అందుకోడానికి ప్రయత్నించి క్యాండీ మిషన్లో ఇరుక్కుని పోతుంది. అప్పుడు మిగిలిన రెండు మినియన్స్ ఫన్నీగా one eye మినియన్ని కొడుతూ జాలీగా నవ్వుతుంటాయి. కట్ చేస్తే ఒక బొద్దింకా సిటీలో ఉన్న అండర్ గ్రౌండ్ ఏరియా కి చేరుకోగా అక్కడ Maxim తన గర్ల్ ఫ్రెండ్ వాలంటీనా తో కలిసి బొద్దింకలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని Gru ని ఎలా పట్టుకోవాలో డిస్కస్ చేస్తుంటాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా Maxim Gru యొక్క కొడుకుని కిడ్నాప్ చేసి Gru పై కక్ష సాధించాలని ప్లాన్ వేస్తాడు. ఇక తను ఒక పెద్ద air ship తో road ని బద్దలుకొట్టుకుంటూ underground నుంచి బయటకు వచ్చి Gru ఎక్కడ ఉన్నాడో వెతకడం ప్రారంభిస్తాడు.
కట్ చేస్తే, Gru ఫ్యామిలీ కొత్త ఇంటికి అలవాటుపడటం మొదలుపెడతారు. Gru Margo ని స్కూల్లో డ్రాప్ చేసేందుకు తన కార్ దగ్గరికి రాగా తనకి Perry కనిపిస్తాడు. నైబర్స్ తో friendship చేసేందుకు ఇదే మంచి అవకాశం అని అనుకుని, తను Perry దగ్గరికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుంటాడు. కానీ Perry కి మాత్రం Gru తో మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు. Gru మాత్రం Continuous గా Perry తో మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి Perry Daughter Poppy వస్తుంది. తను Poppy కి కూడా హలో చెప్తాడు, కానీ ఆ చిన్నపిల్ల కూడా తనని అంతగా పట్టించుకోదు. ఇక Gru, Margo ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ తనకి Poppy మళ్ళీ కనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం తను Gru వైపు చూసి కన్నింగ్ గా ఒక నవ్వు నవ్వి స్కూల్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే Poppy అలా ఎందుకు నవ్విందో Gru కి ఏమీ అర్థం కాదు.
Next Scene లో Silas మినియన్స్ తో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. జైలు నుంచి తప్పించుకున్న Maxim ని పట్టుకోడానికి Silas ఆ మినియన్స్ ని మెగామినియన్స్ గా మార్చాలి అనుకుంటాడు. ఈ విషయాన్ని తను మినియన్స్ తో చెప్పి, వాలంటీర్స్ గా కొంతమందిని ముందుకు రమ్మనగా, ఆ మినియన్స్ అందరూ తెలివిగా కాస్త వెనక్కి వెళ్తారు. కానీ ఈ విషయాన్ని గమనించని ఐదుగురు మినియన్స్ మాత్రం అక్కడే నిలబడి ఉంటారు. So ఇక Silas ఆ ఐదుగురు మినియన్స్ ని సెలెక్ట్ చేసి వాళ్లని మెగామినియన్స్ గా మారుస్తాడు.
Despicable Me 4 Movie Explained & Summary in Telugu
4) అంతా గందరగోళమే!
కట్ చేస్తే Lucy, Agnes and Edith లను కరాటే స్కూల్లో డ్రాప్ చేస్తుంది. ఈ స్కూల్లోని కరాటే మాస్టర్ స్టూడెంట్స్ తో చాలా కఠినంగా ఉంటుంటాడు. కరాటే మాస్టర్ Agnes ని “నీ పేరు ఏంటో చెప్పి, క్లాస్ కి నిన్ను నువ్వు పరిచయం చేసుకో” అని చెప్తాడు. కానీ Agnes మాత్రం తనని తాను క్లాస్ కి పరిచయం చేసుకునేందుకు కాస్త ఇబ్బంది పడుతుంది. దాంతో మాస్టర్ Agnes పై కోప్పడతాడు. అది చూసి Edith కి కోపం వచ్చి, “నా చెల్లెలి పైనే కోప్పడతావా?” అని మాస్టర్ కాలుని గట్టిగా తొక్కగా ఆ మాస్టర్ చిటికెన వేలు విరిగిపోతుంది. అది చూసి రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ Edith దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే సమయంలో, బ్యూటీ పార్లర్ లో వర్క్ చేసేందుకు Lucy పార్లర్ కి వెళ్లి ఉంటుంది. కాకపోతే తనకసలు బ్యూటీ పార్లర్ లో ఎలా వర్క్ చేయాలో ఏమీ తెలియదు.
సరిగ్గా అప్పుడే ఒక Customer Shop లోకి వచ్చి, Lucy కి ఒక ఫోటో చూపించి “నాకు Same ఇలాంటి Hairstyle కావాలి” అని అంటుంది. Lucy కి ఇలాంటి పనుల్లో చాలా అనుభవం ఉందిలే అని Remaining Staff అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా! Lucy కి అసలు ఈ పనిలో ఎటువంటి Experience లేదని. ఇక చేసేదేం లేక Lucy ఏవేవో Products ని ఆ Customer యొక్క హెయిర్ పై apply చేసి వర్క్ చేస్తున్నట్టుగా మేనేజ్ చేస్తుంటుంది. అయితే ఆ Products రియాక్షన్ కొట్టడంతో Customer యొక్క హెయిర్ కొంచెం కొంచెం గా కాలిపోవడం Start అవుతుంది. ఆ మంటలు పక్కనే ఉన్న Electric Wires ని కూడా touch చేయడంతో Shop లో ఒక్కసారిగా మంటలు అంటుకొని గందరగోళం ఏర్పడుతుంది.
దాంతో Shop లోని వ్యక్తులందరూ కేకులు వేసుకుంటూ బయటికి వచ్చేస్తారు. ఇక Lucy ఇదే సరైన సమయం అని Shop నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. అలా మొదటి రోజే Lucy తన జాబ్ ని పోగొట్టుకుంటుంది. కట్ చేస్తే Maxim మనుషుల్ని బొద్దింకలుగా మార్చేందుకు ఒక Weapon రెడీ చేస్తాడు. Margo ని స్కూల్ నుంచి పికప్ చేసుకునేందుకు Gru తన Car లో స్కూల్ దగ్గరికి వస్తాడు. Gru తన కొడుకుతో ప్రేమగా నడుచుకుంటూ తనని నాన్న అని పిలవమని అడుగుతుంటాడు. కానీ వాడు మాత్రం బాగా అల్లరి చేస్తూ Gru ని ఇబ్బంది పెడుతుంటాడు. అదే సమయంలో Margo ఇక స్కూల్ నుంచి బయటికి రాగా ముగ్గురు కలిసి ఇంటికి వచ్చేస్తారు.చెత్త పారేసెందుకు రాత్రిపూట Gru ఇంటి లోంచి బయటకి రాగా తనకి అక్కడ Poppy కనిపిస్తుంది.

5) ముగింపు
Poppy Gru తో, “నువ్వు ఎవరో నాకు తెలుసు. నువ్వు Gru The Master Villain అని ఇక్కడున్న అందరికీ చెప్పేస్తా దానివల్ల నీకే ప్రాబ్లం అవుతుంది. అలా నీకు నీ ఫ్యామిలీకి Problem రాకూడదనుకుంటే నువ్వు నాకు సహాయం చేయి. నాకు విలన్ గా మారాలని ఉంది, అందుకు నువ్వే నాకు సహాయం చేయాలి, లేదంటే నీ గురించిన నిజాన్ని అందరికీ చెప్పేస్తా” అని Poppy Gru ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. తన మాటల్ని విన్న Gru “నా గురించి ఈ అమ్మాయికి ఎలా తెలిసింది” అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, తన ఫ్యామిలీకి ఏ problem రాకూడదని, “సరే నేను నీకు సహాయం చేస్తా” అని ఒప్పుకుంటాడు
మరుసటి రోజు ఉదయం Perry భార్య Patsy (ప్యాట్సి) కి Gru ఫ్యామిలీకి మధ్య పరిచయం ఏర్పడుతుంది. Perry కి నైబర్స్ తో మాట్లాడడం అంతగా interest లేనప్పటికీ, Patsy కి మాత్రం అందరితో ఫ్రెండ్లీగా ఉండడమంటే చాలా ఇష్టం. అలా Patsy, Gru and Lucy ని టెన్నిస్ గేమ్ కి invite చేస్తుంది. తమని Patsy టెన్నిస్ కి invite చేయడంతో Gru చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంచెం సేపటి తరువాత పాపి Gru తో, తనని Tree House దగ్గర కలవమని చెప్తూ ఒక పేపర్లో రాసి, దానిని Gru దగ్గరికి విసిరేస్తుంది. అసలు Maxim and Gru కి మద్య ఉన్న గొడవేంటో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడు స్కూల్లో ఒక Talent Show జరుగుతుండగా, ఆ Show లో Maxim ఒక సాంగ్ ని పాడి అందరినీ impress చేయాలని ప్రిపేర్ అయి ఉంటాడు.
కానీ Maxim కంటే ముందుగా Gru స్టేజ్ మీదకి వచ్చి Maxim ప్రిపేర్ అయిన పాటని Gru పాడతాడు. దాంతో Maxim చాలా నిరాశ చెందుతాడు. తను ప్రిపేర్ అయిన పాటని Gru కావాలనే Copy కొట్టి, తనని అందరి ముందు పాట పాడనివ్వకుండా చేశాడని Maxim అనుకుంటాడు. అలా Maxim అప్పటినుంచి Gru పై పగని పెంచుకుంటాడు. “నువ్వు పాడాలనుకున్న పాటనే Gru కూడా పాడడం maybe coincidence అయ్యుండొచ్చు కదా!” అని వాలెంటీనా అంటుంది. దానికి Maxim “లేదు లేదు, వాడు ఖచ్చితంగా కావాలనే నేను select చేసుకున్న పాటని పాడాడు. కాబట్టి నేనిప్పుడు వాడి కొడుకుని దొంగతనం చేసి నా ప్రతీకారం తీర్చుకుంటా” అని maxim అంటాడు.
Image Credit: Despicable Me 4 (2024)