Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date

Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date

Warner Bros Pictures Distribution చేసిన “Companion” అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 7/10 IMDb రేటింగ్ తో క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జనవరి 31, 2025 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Drew Hancock” రచయితగా మరియు దర్శకుడిగా వ్యవహరించారు. ఐరిస్ అనే రోబోట్ పాత్రలో “Sophie Thatcher” నటించగా Josh అనే Boyfriend పాత్రలో “Jack Quaid” నటించాడు. 10 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర 36.5 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.

కథ ఎలా ఉందో చూద్దాం!
1) జాలీగా ఫ్రెండ్స్ తో షికారు

ఓపెన్ చేస్తే Josh తన గర్ల్ ఫ్రెండ్ ఐరిస్ ని తీసుకుని సిటీకి దూరంగా ఉన్న ఒక Lake House వద్దకి బయల్దేరతాడు. మరోపక్క Josh ఫ్రెండ్స్ అందరూ Already Lake House కి చేరుకుని ఉంటారు. Josh, Iris సరదాగా మాట్లాడుకుంటూ కొంచెం సేపటి తర్వాత Lake House కి రీచ్ అవుతారు. Kat వారిద్దరిని పలకరించి లోపలికి Invite చేస్తది. వీరంతా Just ఒక వెకేషన్ లో భాగంగా సరదాగా ఇలా Lake House కి వస్తారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావడంతో ఐరిస్ స్నానం చేసి Fresh up అయిద్ది. ఈ Lake House and Lake House చుట్టూ ఉన్న ప్రాంతమంతటికీ సెర్గే అనే వ్యక్తి ఓనర్. Kat, Serge Relation లో ఉంటారు. Relation అంటే పెద్ద రిలేషనేం కాదు. Kat, Serge కి Item అనమాట. Just like a property.

So, Kat Friends vacation purpose Lake House కి వచ్చేందుకు serge ఒప్పుకుంటాడు. కట్ చేస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటారు. Eli, Patrick Relation లో ఉంటారు. వీరిద్దరిదీ అదో రకమైన రిలేషన్, దాన్ని మనం తప్పు పట్టలేం. Patrick, Eli ని మొదటిసారి ఎక్కడ కలిశాడో, ఏ విధంగా కలిశాడో చెప్తూ, తమ మధుర జ్ఞాపకాల్ని అందరితో షేర్ చేసుకుంటాడు. డిన్నర్ కంప్లీటయిన తర్వాత ఒక మంచి సాంగ్ పెట్టుకుని అందరూ Happy గా డాన్స్ చేస్తారు. ఆ సమయంలో Josh and Kat సీక్రెట్ గా చెవిలో ఏదో మాట్లాడుకుంటారు. డాన్స్ చేయడం కంప్లీటయిన తర్వాత అందరూ ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్లిపోయి జాలీగా రొమాన్స్ చేసుకుని నిద్రపోతారు.

మరుసటి రోజు ఉదయం వాతావరణం చాలా అందంగా ఉండడంతో లేక్ దగ్గరికెళ్లి సరదాగా ఎంజాయ్ చేద్దామని Josh ఐరిస్ తో అంటాడు. అందుకు ఐరిస్ ఒప్పుకుని నీట్ గా రెడీ అయిద్ది. కానీ Josh, Iris తో, “నాకు కాస్త హ్యాంగోవర్ గా ఉంది. నాక్కొంచెం Rest కావాలి. So నువ్వొక్కదానివే లేక్ దగ్గరికెళ్లి ప్రశాంతంగా గడిపిరా” అని అంటాడు. “అదేంటి Lake దగ్గరికి వెళ్దామని నువ్వే కదా ప్లాన్ చేసింది. అలాంటిది నువ్వే రాకపోతే ఎలా” అని ఐరిస్ అంటది. “హ్యాంగోవర్ లేకపోయుంటే నేను కూడా వచ్చేవాన్ని. నువ్వు ఎలాగు రెడీ అయ్యావు కదా. నా వల్ల Plan పాడవడం ఎందుకు. నువ్వు ప్రశాంతంగా గడిపిరా” అని Josh అంటాడు.అలాగైతే సరే అని ఐరిస్ Josh కి ఒక ముద్దిచ్చి Lake దగ్గరికి బయల్దేరిద్ది.

Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date
Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date
2) ఐరిస్ కి టార్గెట్

ఐరిస్ Lake దగ్గరికి వెళ్ళగానే Josh ఒక Pen drive ని తన మొబైల్ కి కనెక్ట్ చేస్తాడు. ఐరిస్ Peaceful గా Nature ని Enjoy చేస్తూ Casual గా తన పాకెట్లో చెయ్ పెట్టిద్ది. తీరాచూస్తే తన పాకెట్లో ఒక చిన్న కత్తి ఉంటది. అసలీ కత్తి నా పాకెట్ లోకి ఎaలా వచ్చిందని అనుకుంటూ ఐరిస్ ఆ కత్తి వైపు అలాగే చూస్తుంటది. సరిగ్గా అదే సమయంలో సెర్గే కూడా లేక్ దగ్గరికొస్తాడు. సెర్గే ఐరిస్ కి గుడ్ మార్నింగ్ చెప్పి ప్రశాంతంగా బెంచ్ మీద పడుకుంటాడు. సెర్గేతో ఐరిస్ కి అంతగా పరిచయముండదు. So తను కాస్త Uncomfortable గా ఫీలయ్యి అక్కడ నుంచి Josh దగ్గరికి వెళ్ళేందుకు సిద్ధమయిద్ది. సెర్గే ఐరిస్ ని ఆపి, “ఎందుకు అప్పుడే వెళ్ళిపోతున్నవ్. నాకు కాస్త కంపెనీ ఇవ్వచ్చు కదా” అని అంటాడు. సరే అలాగే అని ఐరిస్ అక్కడే కూర్చుంటది.

Serge ఐరిస్ కి లోషన్ ఇచ్చి, “నా చేతులు వెనకదాకా అందడం లేదు. నువ్వు నా వీపు మీద లోషన్ రాయి” అని ఐరిస్ తో అంటాడు. వీడేంట్రా ఇలా చెప్తున్నాడని ఐరిస్ కాస్త Uncomfortable గా ఫీలయిద్ది. కానీ తను No చెప్పలేక Serge వీపుపై లోషన్ రాయడం మొదలుపెట్టిద్ది. ఇక ఇదే సరైన సమయమని Serge ఐరిస్ చేతిని పట్టుకుని తనతో రొమాన్స్ చేసేందుకు Try చేస్తాడు. “నువ్వు ఇందుకే కదా తయారయింది. నువ్వు Lake దగ్గర ఉన్నావని చెప్పి నన్నిక్కడికి పంపించింది కేటే” అని అంటూ Serge ఐరిస్ Shoulder పై కిస్ చేస్తాడు. తను No అని అంటున్నా కూడా Serge తన మాటల్ని పట్టించుకోకుండా తనని అలాగే కిస్ చేస్తుంటాడు.

ఇక ఐరిస్ కోపంతో పక్కనున్న వైన్ బాటిల్ తీసుకుని Serge తలపై బలంగా కొట్టిద్ది. “ఏంటే నన్నే కొడతావా” అని అంటూ Serge ఐరిస్ ని కిందపడేసి తన గొంతు నులిమేస్తుంటాడు. అప్పుడు ఐరిస్ తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు తన పాకెట్ లో ఉన్న చిన్నపాటి కత్తిని బయటికి తీసి Serge గొంతుకి గుచ్చిద్ది. దాంతో తను రక్తం కారుకుని చనిపోతాడు. కట్ చేస్తే ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఇంట్లో మాట్లాడుకుంటుండగా, రక్తంతో నిండిన దేహంతో ఐరిస్ ఇంట్లోకి అడుగుపెట్టిద్ది. ఐరిస్ అవతారాన్ని చూసిన వారందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. “అసలేం జరిగింది, నువ్వెందుకిలా రక్తంతో ఉన్నావని Josh ఐరిస్ ని అడుగుతాడు.

Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date
Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date
3) ఐరిస్ రోబోట్ అన్నమాట

అప్పుడు ఐరిస్ జరిగిన విషయమంతా Josh కి వివరంగా చెప్పి, “వాడు నా మీద పడి నా గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. ఒకవేళ నేను చనిపోతే నేన్నిన్ను ఎప్పటికీ చూడలేను కదా. అందుకని నేనే వాన్ని చంపేశా” అని అంటూ ఐరిస్ బాగా టెన్షన్ పడిపోతుంటది. Josh తన టెన్షన్ని చూడలేక, “ఐరిస్ Go to sleep” అని అంటాడు. దాంతో ఐరిస్ వెంటనే నిద్రలోకి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఐరిస్ ని కుర్చీలో కూర్చోపెట్టి తన కాళ్లు చేతుల్ని తాళ్లతో కట్టేస్తారు. “అసలిది ఎలా జరిగింది? ఈ రోబోట్స్ మనుషులకి ఎటువంటి హానీ కలిగించవు కదా” అని Eli Josh తో అంటాడు. “Maybe తన System లో గ్లిచ్ వచ్చుంటది.

అందుకే తను Serge పై దాడి చేసిందని Josh అంటాడు. అంటే నిజానికి ఐరిస్ మనిషి కాదు, తనొక Robot అనమాట. ప్రస్తుతం ఐరిస్ యెుక్క System లో గ్లిచ్ రావడంతో, జరిగిన మర్డర్ గురించి పోలీసులకి విషయం చెప్పాలని అందరూ డిసైడ్ అవుతారు. “నువ్వు బయటికెళ్లి పోలీసులకి ఫోన్ చెయ్, అంతలోపు నేను ఐరిస్ తో చివరిసారిగా మాట్లాడతానని Josh Eli తో అంటాడు. So, Eli బయటికి వెళ్ళిన తర్వాత, “ఐరిస్ Wake up” అని అనగానే ఐరిస్ మెలకువలోకి వస్తది. “నన్నెందుకిలా తాళ్లతో బంధించారు. నేను నిజంగా తనని కావాలని చంపలేదు, అదంతా Self Defense లో అలా జరిగిపోయిందని అంటూ ఐరిస్ బాగా Tension పడిపోతుంటది.

అప్పుడు Josh, “నువ్వు చెప్పేది నిజమేలే. నువ్వు ఎలాగు అబద్ధాలు కూడా చెప్పలేవు, ఎందుకంటే నువ్వు మనిషి కాదు, Robot” అని ఐరిస్ తో అంటాడు. “నువ్వసలు ఏం మాట్లాడుతున్నావ్!? నేను రోబోట్ ఏంటి!?” అని ఐరిస్ షాకైపోద్ది. అంటే నిజానికి తనొక రోబోట్ అన్న విషయం ఐరిస్ కి అస్సలు తెలియదు. “నేను మనిషినేగా, మనమిద్దరం మొదటిసారి Grocery Store లో మీటయ్యాం. నేను రెండు సార్లు జపాన్ కి కూడా వెళ్లొచ్చా. నాకు చాలా జ్ఞాపకాలు గుర్తున్నయ్” అని ఐరిస్ అంటది. అప్పుడు Josh, “నీ మైండ్ లో ఉన్న memories అన్నీ కేవలం కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే, అవేవీ నిజంగా జరగలేదు. అసలు మనమిద్దరం మొదటిసారి ఎలా మీటయ్యామో చెప్పేనా” అని Josh అంటాడు. ఇప్పుడు Story కాస్త వెనక్కి వెళ్తది.

Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date
Companion (2025): Story | Cast | Box Office | OTT | Release Date
4) ముగింపు

Empathix అనే రోబోటిక్ కంపెనీ Human Companion Robots ని తయారుచేస్తుంటది. వాళ్ల దగ్గర్నుంచే ఐరిస్ అనే రోబోట్ ని Josh Purchase చేస్తాడు. ఈ Robots యొక్క ఫీచర్స్ ఏంటంటే… ఇవి మనిషి ఫీలయ్యే ప్రతి ఒక్క ఎమోషన్ని ఫీలవ్వగలవు. Like Sadness, Depression, Happy, Anger etc etc., ఇక్కడొక Interesting విషయమేంటంటే.. ఈ రోబోట్స్ కి తాము రోబోట్స్ ఉన్న విషయం అస్సలు తెలియదు. Empathix Agent Josh యొక్క mobile ని ఐరిస్ కి సింక్ చేస్తాడు. So Josh తన మొబైల్ ద్వారా ఐరిస్ ని కంట్రోల్ చేయగలడు. నిజానికి ఈ రోబోట్స్ చాలా తెలివైనవి. కానీ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం Robots కి ఎక్కువ తెలివి ఉండకూడదన్న ఉద్దేశంతో Empathix తమ Robots యొక్క తెలివిని చాలా వరకు తగ్గించేస్తుంది.

But Users ఎవరైనా వాటి తెలివిని పెంచాలన్నా లేక తగ్గించాలాన్నా సరే తమ Robotic App ద్వారా సెట్టింగ్స్ Change చేయొచ్చు. కేవలం తెలివిని మాత్రమే కాదు, Robot యెుక్క కోపాన్ని, అది మాట్లాడే భాషని, అలాగే దాని Voice ని.. ఇలా చాలా రకాల Settings అనేవి User తన మొబైల్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. “Robot Boot up అయిన తర్వాత అది ఎలా అయితే చెప్తదో నువ్వు అలాగే తను చెప్పిన స్టెప్స్ ని ఫాలో అవ్వు, దాంతో మీ ఇద్దరిమధ్య Love Link ఏర్పడిద్ది” అని చెప్పి Empthix Agents Josh దగ్గర్నుంచి వెళ్ళిపోతారు. కొంచెం సేపటి తర్వాత ఐరిస్ Boot Up అయ్యి కళ్ళు తెరుస్తది. అప్పుడది Josh తో, “నా ముందుకొచ్చి నీ పేరు చెప్పు” అని అంటది.

So Josh ఐరిస్ వైపు చూస్తూ తన పేరు చెప్తాడు. ఇక వారిద్దరు మొదటిసారి Grocery Store లో మీటయినట్టుగా, అప్పటినుంచి వారిద్దరూ Relation లో ఉన్నట్టుగా ఐరిస్ mind లో ఒక Memory Create అయిద్ది. అలా Josh, ఐరిస్ ల మధ్య Love Link ఏర్పడిద్ది. Love Link ఏర్పడ్డమే ఆలస్యం, Josh Iris ని Bedroom లోకి తీసుకెళ్ళి తనతో Romance చేస్తాడు. కట్ చేస్తే Story Present కి వస్తది. “అంటే నేను నిజంగానే ఒక రోబోట్నా” అని ఐరిస్ షాకైపోద్ది. “సరే నేను రోబోట్ అయినా పర్లేదు. మనమిద్దరం ఎప్పటికీ ఇలానే కలిసుందాం” అని ఐరిస్ అంటది. ఆ సమయంలో Kat Upstairs నుంచి కిందకొచ్చి, “ఏంటి దాన్నింకా Shut Down చేయలేదా?” అని Josh తో అంటది. నన్ను Shut Down చేయడమేంటని ఐరిస్ కాస్త టెన్షన్ గా ఫీలయిద్ది.

Image Credit: Companion (2025)

Leave a Comment