Cobweb Movie Explained & Summary in Telugu
Lionsgate Films Distribute చేసిన “Cobweb” అనే హార్రర్ జాంబీ మూవీ 5.9/10 IMDb రేటింగ్ ని సాధించింది. జూలై 21, 2023 లో రిలీజ్ అయిన ఈ మూవీని Samuel Bodin డైరెక్ట్ చేశారు. Chris Thomas Devlin రచయితగా ఉన్నారు. నటీనటుల విషయానికొస్తే Lizzy Caplan, Anthony Starr, Woody Norman, Cleopatra Coleman ప్రధాన పాత్రలో నటించారు. లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజయిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి Mixed Reviews ని పొందింది. అలాగే బాక్సాఫీస్ వద్ద 8.5 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.
Story:
1) Beginning
మూవీ Halloween కి వన్ వీక్ ముందు స్టార్ట్ అవుతుంది. పీటర్ తన అమ్మానాన్న Mark & Carol తో ఒక పాత ఇంటిలో ఉంటుంటాడు. పీటర్ కి పెద్దగా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు and ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా మూడీ గా ఉంటాడు. ఒకరోజు అర్ధరాత్రి తన రూమ్ లో ఏదో సౌండ్ వస్తుండడంతో పీటర్ కి మెలకువ వస్తది. పీటర్ లేచి చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. సరేలే అని మళ్ళీ పడుకుంటాడు. బట్ పక్కనే ఉన్న గోడ నుంచి ఏదో సౌండ్ వస్తది. ఇక పీటర్ కి భయం వేసి వెంటనే లైట్ వేస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. తను ఆ గోడ దగ్గరికి వెళ్లి knock చేస్తాడు. అప్పుడు అవతల నుంచి కూడా ఎవరో గోడను కొడతారు. ఇక పీటర్ కి భయం వేసి, వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు.
వాళ్ళ అమ్మ వచ్చి గోడ దగ్గర చెక్ చేస్తది. బట్ ఈసారి ఏ సౌండ్ రాదు. ఇక ఆమె పీటర్ ని పడుకోబెట్టి, ఇది పాత హౌస్ కదా! సౌండ్స్ అలా వస్తుంటాయిలే, నువ్వేం భయపడొద్దు, నీకు ఇమేజినేషన్ పవర్ ఎక్కువ, సో నువ్వు థింక్ చేయొద్దు అని చెప్పి పడుకోమంటది. నెక్స్ట్ డే పీటర్ స్కూల్ కి బయలుదేరుతాడు. పీటర్ introvert అవ్వడం వల్ల క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ పీటర్ ని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు. కట్ చేస్తే డివైన్ అనే ఆమె కొన్ని డేస్ సబ్స్టిట్యూట్ టీచర్ గా వస్తుంది. ఆరోజు రాత్రి డిన్నర్ చేస్తుండగా పీటర్ తన అమ్మానాన్నతొ Halloween లో నేనేం కాస్ట్యూమ్ వేసుకోవాలని అడుగుతాడు. దానికి వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం, Halloween టైంలో ఒక అమ్మాయి తప్పిపోయింది.
ఆ అమ్మాయి ఇప్పటికీ తిరిగి రాలేదు. నీకు అలా అవడం మాకు ఇష్టం లేదు అందుకే నువ్వు Halloween కి ఇంట్లోనే ఉంటున్నావ్ చెప్తారు. ఇంక పీటర్ కి ఏం చేయలేక తన రూమ్ కి వెళ్లి పడుకుంటాడు. అయితే ఆ గోడ వెనక ఏముందో ఏమో కానీ అది గోడలో నుండి ముందుకు వచ్చి చూస్తది. కాసేపయ్యాక, అది పీటర్ ని పేరు పెట్టి పిలుస్తది. పీటర్ కి భయం వేసి, నాన్న అని గట్టిగా పిలుస్తాడు. ఇక మార్క్ వెంటనే అక్కడికి వస్తాడు. కానీ ఇప్పుడు ఆ సౌండ్స్ ఏం రావు. అప్పుడు మార్క్ మే బి అవి ఎలుకలు అయి ఉంటాయి. నువ్వు పడుకో అని చెప్తాడు. మరుసటి రోజు ఆ ఎలుకలను చంపడానికి మార్క్ & పీటర్ షెడ్ లో ఉన్న ఎలుకల మందును తెస్తారు. ఆ మందు సినమన్ స్మెల్ వస్తుందని పీటర్ తన ఫాదర్ తో అంటాడు.

2) Continuous
అప్పుడు మార్క్ స్మెల్ బాగుందని తినకు, తింటే చనిపోతవని చెప్తాడు. ఆ తరువాత ఇద్దరు ఆ మందుని అక్కడ వేస్తారు. కట్ చేస్తే Halloween కోసమని పిల్లలందరినీ డ్రాయింగ్ వేపిస్తుంటారు. అప్పుడు పీటర్ ఇలా డ్రాయింగ్ వేస్తాడు. డివైన్ అది చూసి ఏంటి పీటర్ ఇలాంటి డ్రాయింగ్ వేశాడు. వీడికి ఏమైనా అయిందా, ఇంట్లో వీళ్ళ పేరెంట్ సరిగా Treat చేయట్లేదు ఏమో అని డౌట్ వచ్చి ఇంటికి వస్తది. డివైన్ ఆ పెయింటింగ్ ని క్యారోలకి చూపిస్తే పీటర్ బాగా ఇమేజింగ్ చేసుకుంటాడు. సో అలా ఇది గీసి ఉండొచ్చు అని ఏదో కవర్ చేస్తది. డివైన్ కి కారోల్ బిహేవియోర్ వింతగా అనిపిస్తుంది, బట్ సర్లే అని డివైన్ ఇంక వచ్చేస్తది. క్యారోల్ పీటర్ దగ్గరికి వెళ్లి, “ఏంటి నువ్వు వేసిన ఈ డ్రాయింగ్.
నీకు సాయం చేయమని బయట వాళ్ళని పిలుస్తున్నావా, మేము నిన్ను సరిగా చూసుకోవట్లేదా” అని అరిచి వెళ్తది. కాని నిజానికి పీటర్ ఆ డ్రాయింగ్ వేసింది తన గురించి కాదు. ఆ గోడ వెనుక నుండి ఎవరో అమ్మాయి నాకు హెల్ప్ చేయమని పీటర్ ని అడుగుతుంటది. సో దాన్ని పీటర్ డ్రాయింగా వేస్తాడు. కట్ చేస్తే ఆరోజు రాత్రి కూడా గోడ వెనక నుండి ఆ అమ్మాయి పీటర్ ని పిలుస్తది. ఆ అమ్మాయి పీటర్ తో “నేను నీతో ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాను, నీకు ఓకే అయితే మనం ఫ్రెండ్స్ అవుదాం, లేదంటే నేను వెళ్ళిపోతాను అని అంటది. పీటర్ కి కూడా ఎవరు ఫ్రెండ్స్ ఉండరు కదా! సో, తను ఆ అమ్మాయి తో ఫ్రెండ్ అవ్వాలనుకుంటాడు. నెక్స్ట్ డే స్కూల్లో అందరూ pumpkin మీద డ్రాయింగ్ వేస్తుంటారు. పీటర్ కూడా తన పంప్కిన్ కి డ్రాయింగ్ వేసి, దానికి హెక్టర్ అనే పేరు పెడతాడు.
డివైన్ పీటర్ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన హెక్టార్ నా ఫేవరెట్ అని మాట్లాడుతది. అయితే ఆ మాటలు Brian అనే వాడు విని, బాగా జలస్గా ఫీలవుతాడు. సో వాడు పీటర్ pumpkin ని నాశనం చేస్తాడు. కట్ చేస్తే ఆరోజు రాత్రి పీటర్ బాగా ఏడుస్తుంటాడు. అప్పుడు గోడ వెనుకున్న అమ్మాయి ఏం జరిగిందని పీటర్నీ అడగడంతో పీటర్ జరిగిందంతా చెప్పేస్తాడు. ఇక ఆ అమ్మాయి Brian గాని ఏదో ఒకటి చేయమన్నట్టు ఉసిగొలుపుతది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రెయిన్ ఒక pumpkin నీ తీసుకొని వచ్చి జరిగిందానికి సారీ చెబుతాడు. కానీ ఆల్రెడీ ఆ దయ్యం వల్ల పీటర్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు. సో పీటర్ Brian నీ మెట్ల మీద నుంచి తోసేస్తాడు. దాని వల్ల Brian కాలు విరిగిపోతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల పీటర్ ని స్కూల్ నుంచి తీసేస్తారు.

3) Jealousy
కట్ చేస్తే అసలు ఎందుకు ఇలా చేశావని మార్క్ పీటర్ని అరుస్తుంటాడు. అప్పుడు క్యారల్ పీటర్ వేసిన డ్రాయింగ్ గురించి చెప్తది. ఎందుకురా ఇలా చేస్తున్నావని మార్క్ కి బాగా కోపం వచ్చి పీటర్ నీ అరుస్టాడు. అప్పుడు పీటర్ ఆ గోడ వెనక నుంచి ఎవరో అమ్మాయి మాటలు వినిపిస్తున్నాయి అని చెప్తాడు. మార్క్ కి కోపం వచ్చి అదంతా నీ ఇమేజినేషన్ అని అరుస్తాడు. ఇక పీటర్ కి బుద్ధి చెప్పాలని బేస్మెంట్లో వదిలిపెడతారు. అక్కడ అంతా చీకటిగా ఉంటది. పీటర్ ఒక్కడే భయంతో అక్కడ ఏడుస్తుంటాడు. తనతో మాట్లాడే ఆ అమ్మాయి అక్కడికి కూడా వచ్చిందేమో అని తనని పిలుస్తాడు, కానీ తను పలకదు. నెక్స్ట్ సీన్ లో డివైన్ పీటర్ గురించి ఆలోచిస్తూ ఇంట్లో పేరెంట్స్ వాడిని సరిగా ట్రీట్ చేయట్లేదు ఏమో అని డౌట్ వస్తది.
సో పీటర్ టెస్ట్ రిజల్ట్ మీద తన ఫోన్ నెంబర్ ని రాసి, ఎందుకైనా మంచిది పీటర్ ని కలుద్దామని పీటర్ ఇంటికి వెళ్తది. డివైన్ carol కి పీటర్ మార్క్స్ షీట్ ఇస్తదీ. మార్క్ డివైన్ ని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు డివైన్ వాళ్లతో పీటర్ బిహేవియర్ కి సరిపడే ఎన్విరాన్మెంట్ ఉండే స్కూల్లో జాయిన్ చేస్తే మంచిదని అంటది. కానీ మార్క్ & క్యారల్ సీరియస్ అయ్యి, మా పిల్లాడు ఏ స్కూల్ కి వెళ్ళడు ఇంట్లోనే చదువుకుంటాడని అంటారు. ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటుండడం అండర్ గ్రౌండ్ లో ఉన్న పీటర్ కి వినిపిస్తది. సో డివైన్ వచ్చిందని పీటర్ కి అర్థమై, వాడు అండర్ గ్రౌండ్ మైన్ డోర్ దగ్గరికి వచ్చి, నన్ను కాపాడండి అని డోర్ ని కొడుతుంటాడు. అదే సమయంలో వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఉండడంతో దాని సౌండ్ కి పీటర్ డోర్ కొట్టే సౌండ్ డివైన్ కి వినిపించదు.
డివైన్ వాళ్లతో “నేను ఒకసారి పీటర్ ఎలా ఉన్నాడో ని చూడొచ్చా అని అడుగుద్ది. దానికి వాళ్ళ అసలు ఒప్పుకోరు. నేను ఒకసారి కలిసేసి వెళ్తా అన్నా కూడా అసలు వాళ్ళు ఒప్పుకోరు. సో డివైన్ ఇక అక్కడి నుంచి బయటికి వచేస్తుంటది. ఆ టైంలో వాషింగ్ మిషన్ ఆగిపోతది. అపుడు పీటర్ డోర్ కొడుతున్న శబ్దం వినిపించి డివైన్ వెనక్కి తిరిగి ఆ డోర్ కొట్టే శబ్దం ఏంటని అడుగుద్ది. అప్పుడు మార్క్ అది వాషింగ్ మిషన్ అని చెప్తాడు. డివెన్ ఆ ఇంట్లో ఉన్నంత సేపు మార్క్ అండ్ క్యారల్ బిహేవియర్ వల్ల చాలా భయపడిపోయుంటది. అండ్ వాళ్ళు పీటర్ ని కూడా చూడనివ్వరు కదా! సో ఆమెకి వాళ్ళ మీద బాగా డౌట్ ఏర్పడుతుంది. కట్ చేస్తే ఆరోజు సాయంత్రానికి వాళ్లు పీటర్ ని అండర్గ్రౌండ్ నుండి బయటికి వదిలిపెడతారు.

4) Twist
ఆరోజు రాత్రి పీటర్ మళ్లీ గోడ వెనకున్న అమ్మాయితో మాట్లాడుతాడు. అప్పుడు పీటర్ ఆ అమ్మాయితో “నేను నిన్ను చూడాలనుకుంటున్నానని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి “నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ బంధించబడి ఉన్నాను, నన్ను చూస్తే నువ్వు భయపడతావ్ అని అంటది. నేనేం భయపడను ఒకసారి నిన్ను చూస్తానని పీటర్ అంటాడు. అయితే కింద ఒక చిన్న హోల్ ఉంది దాంట్లో నుంచి చూడు అని చెప్తది. అప్పుడు పీటర్ ఆ హోల్ దగ్గరనుంచి చూస్తే తనకి ఆ అమ్మాయి కన్ను కనిపించి భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు. పీటర్ ఆ అమ్మాయిని అసలు నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు బంధించబడి ఉన్నావ్? అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి “నేను మీ అక్క సారా ని, అమ్మానాన్న నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు, వాళ్ళే నన్ను ఇక్కడ బంధించారని చెప్తది.
మన ఇంట్లో ఒక క్లాక్ ఉంది కదా! దాని వెనక నేను బయటకు రావడానికి ఒక డోర్ ఉంటది. ఆ డోర్ లాక్ ఓపెన్ చేసి నన్ను బయటపడేలా చేయని చెప్తది. అదే రోజు రాత్రి పీటర్ నిద్రపోతుండగా “పీటర్ అమ్మానాన్న ఇద్దరు దెయ్యాలుగా మారి పీట మీద అటాక్ చేస్తారు, అపుడు పీటర్ భయంతో గట్టిగా అరుస్తాడు. తీరా చూస్తే ఇదంతా పీటర్ కల క్యారోల్ పీటర్ని పట్టుకొని అదొక పీడ కలలే నువ్వు కాస్త కూల్ గా ఉండు అని అంటది. కట్ చేస్తే, సారా పీటర్ తో అమ్మానాన్న నన్ను ఇక్కడ బంధించడానికి ముందు ఒక Halloween కి ఒక అమ్మాయి ట్రిక్ ఆర్ ట్రీట్ ఆడటానికి వచ్చింది. తను నన్ను చూడటంతో అమ్మ నాన్న ఆ అమ్మాయిని చంపేసి పాథేశారు. కావాలంటే గార్డెన్లో నేను చెప్పిన చోట తవ్వు అని చెప్తది.
మరుసటి రోజు పీటర్ గార్డెన్ లోకి వెళ్లి తవ్వితే అక్కడ ఒక హ్యూమన్స్ skull కనిపిస్తది. అది చూసిన పీటర్ షాక్ అయిపోతాడు. పీటర్ కోసం తన రూమ్ కి వెళ్ళిన carol కి పీటర్ గార్డెన్లో తవ్వుతుండడం కనిపిస్తది. ఆమె వెంటనే పీటర్ అని గట్టిగా అరిచి పీటర్ దగ్గరికి బయలుదేరుతది. పీటర్ ఆమె వచ్చేలోపు ఆ skull నీ మట్టితో కప్పేసి ఒక pumpkin తీసుకుని “నేను ఎలాగో హలోవీన్ కి బయటికి వెళ్ళడం లేదు కదా, సో ఇంట్లో అయినా దీంతో ఆడుకుంటానని అంటాడు. నెక్స్ట్ సీన్ లో పీటర్ సారా తో నేను నిన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకొస్తాను. మనం ఇక్కడి నుంచి పారిపోదామని చెప్తాడు. ఆ తరువాత పీటర్ తన పేరెంట్స్ రూంలోకి వెళ్లి డివైన్ కి కాల్ చేస్తాడు. పీటర్ ఆమెతో నాకు సాయం చేయండని అంటాడు. వెంటనే తన మదర్ రావడంతో ఫోన్ పెట్టేస్తాడు.

5) Suspense
పీటర్ అలా చేసినందుకు carol కి చాలా కోపం వస్తది. ఇక ఆమే పీటర్ ని తీసుకుని వాడి రూమ్ లోకి వెళ్తది. అప్పుడు carol కి ఆ హోల్ కనిపించి బాగా బయపడిపోతది. carol peter నీ అసలు అది నీతో ఏం చెప్పిందని భయపడుతూ అడుగుతది. పీటర్ ఆ అమ్మాయితో జరిగిందంతా చెప్తాడు. Carol వణికిపోతూ, ఇకపై ఏం జరిగినా అదంతా నీ తప్పే మీ నాన్న వచ్చేవరకు నువ్వు లోపలే ఉండని తలుపేసి వెళ్ళిపోతుంది. మే బి అవతల వీళ్లు బంధించింది దెయ్యమో లేదా ఏదైనా విచిత్ర జీవో ఏమో తెలీదు కానీ carol ఐతే బాగా బయపడతది. కట్ చేస్తే సారా పీటర్ తో “అమ్మానాన్న మాట్లాడుకునేది నేను విన్నాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి లేకపోతే మనం సేఫ్ గా ఉండలేము.
ప్రెసెంట్ నేను నీతో మాట్లాడుతున్నట్టు కూడా వాళ్లకు అర్థమైంది సో వాళ్లు నిన్ను చంపడానికైనా వెనకాడరని అంటది. ఆరోజు రాత్రి ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు మార్క్ అండ్ క్యారల్ తింటుంటారు, కానీ పీటర్ తినడు. మ్యాటర్ ఏంటంటే ఆ ఫుడ్ లో పీటర్ rat పాయిజన్ కలిపి ఉంటాడు. food సినమన్ స్మైల్ వస్తున్నాడంటంతో మార్క్ కి విషయం అర్థం అయిపోద్ది. ఇక మార్కు వెంటనే carol ని 911 కి కాల్ చేయమని చెప్తాడు. బట్ పీటర్ ఫోన్ వైర్ ని కూడా కట్ చేసి ఉంటాడు. ఏంట్రా బాబు ఇలా చేశావని mark పీటర్ మీద అరుస్తాడు. ఇంక ఇప్పుడు అరిచి ఏం ఉపయోగం! మార్క్ రక్తం కక్కుకుని చనిపోతాడు. carol కి కోపం వచ్చి ఒక కత్తి తీసుకొని పీటర్ మీదికి వెళ్తది.
పీటర్ ఇంకా స్టెప్స్ ఎక్కి తన రూమ్ కి వెళ్తుండగా carol వాన్ని పట్టుకుంటది. కానీ ఆమె కూడా ఫుడ్ తిన్నది కదా! సో రక్తం కక్కుకుంటది. ఆమె తనని ఎక్కడ పొడిచేస్తదో అని పీటర్ carol నీ తన్నడంతో ఆమె మెట్ల మీద నుంచి కింద పడుతుంది. ఆ టైంలో Carol కి కత్తి గుచ్చుకుంటది. ఇక పీటర్ ఆమె దగ్గరికి వెళ్లి కీస్ ని తీసుకుంటాడు అప్పుడు carol “ప్లీజ్ పీటర్ దాన్ని బయటికి వదలొద్దు అని చెప్పి చనిపోతది. బట్ పీటర్ మాత్రం వెళ్లి క్లాక్ ని కింద పడేసి డోర్ లాక్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకేముంది సారా ఆ డోర్ నుంచి బయటకు రావడం స్టార్ట్ చేస్తది. తనని చూసి పీటర్ కి భయం వేసి వెళ్లి డోర్ వేసేస్తాడు. అయితే సారా పీటర్ అనుకున్నట్టు హ్యూమన్ ఫామ్ లో ఉండదు. చాలా పొడవైన జుట్టు తోటి పదునైన గోళ్ళ తో చూడ్డానికి వికారంగా ఉంటది.
Image Credit: Cobweb (2023)