Blood Star Movie Explained & Summary in Telugu
Plaion Distribute చేసిన “Blood Star” అనే సైకలాజికల్ థ్రిల్లర్ 6/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ అక్టోబర్ 7, 2024 లో రిలీజయింది. ఈ సినిమాని Lawrence Jacomelli డైరెక్ట్ చేశాడు. Victoria Taylor, George Kelly & Lawrence Jacomelli కథని రచించారు. నటీనటుల విషయానికొస్తే John Schwab, Wyomi Reed, Felix Merback, Britni Camacho, Travis Lincoln Cox మరియు Sydney Brumfield ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో Available గా ఉంది.
ఇప్పుడు కథలోకి వెళ్తే!
1) ప్రారంభం
ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి నోటి నిండా రక్తంతో ఎడారిలో ఏడుస్తూ, నడవలేక నడుస్తూ వెళ్తుంటుంది. ఆ అమ్మాయి నాలుకని కట్ చేసి చిత్రహింసలు పెట్టి ఉంటారు. ఆ అమ్మాయి వెనకే ఎవరో కారులో ఫాలో అవుతూ వస్తుంటాడు. వాడే ఈ అమ్మాయిని ఇలా చేస్తాడు. ఇక తను నడవలేక ఒకచోట పడిపోతుంది. కారులో వచ్చిన వ్యక్తి కార్ ఆపి ఆమెకి కొంచెం వాటర్ ఇవ్వడంతో ఆమె ఆ వాటర్ తాగుతుంది. ఆ తరువాత వాడు ఒక గన్ అండ్ బుల్లెట్ ని పడేసి, “నీకు ఒకే ఒక ఛాన్స్ ఉంది. నిన్ను నువ్వే షూట్ చేసుకో, ఒకవేళ ఈ బుల్లెట్ నుండి నువ్వు బయటపడగలిగితే నిన్నేం చేయకుండా వదిలేస్తా” అని అంటాడు. ఆ అమ్మాయి బుల్లెట్ లోడ్ చేసి కార్ లో వచ్చిన వాన్ని షూట్ చేస్తది. బట్ అది మిస్ అవుతుంది.
ఇక వాడు కార్ తో ఆ అమ్మాయిని గుద్ది చంపేస్తాడు. కట్ చేస్తే మనకి బాబీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటది. అప్పుడు బాబీ సిస్టర్ ఫోన్ చేసి, “నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావ్? వాడు ఆల్రెడీ ఒకసారి నిన్ను కొట్టాడు కదా. కొట్టగలుగుతున్నాడు అంటే నిన్ను చంపనైనా చంపేస్తాడు. వాడి దగ్గరికి వెళ్లొద్దు” అని అంటది. కానీ ఈ పిచ్చిది మాత్రం, “వాడు మళ్ళీ అలా ఏం కొట్టడు. మారిపోయాడులే” అని కాల్ కట్ చేసి తను గ్యాస్ స్టేషన్ కి వెళ్తుంది. ఆ టౌన్ షరీఫ్ బాబీని పలకరించి ఆమెతో మాట్లాడుతూ బీర్ ఆఫర్ చేస్తాడు.
బాబీ మాత్రం ఆ బీర్ ని తీసుకోదు. ఆ సమయంలో బాబీ సిస్టర్ మళ్ళీ ఫోన్ చేసి, “నువ్వు వాడి దగ్గరికి వెళ్లడం నాకు అసలు ఇష్టం లేదు. మన నాన్న ఎంత శాడిస్టో నీకు తెలుసు కదా. వాడూ అలాంటోడే” అని అంటది. ఆ మాటలకి బాబీకి కోపం వచ్చి తన సిస్టర్ కాల్ కట్ చేసి కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వెళ్తది. తనలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వెళ్లడం షరీఫ్ చూసి స్పీడ్ లిమిట్ దాటి మరి డ్రైవ్ చేయడంతో షరీఫ్ ఆమెను ఫాలో చేస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత తన వెనక పోలీసు రావడం బాబీ గమనించి స్పీడ్ తగ్గించి కార్ ఆపుతుంది. అప్పుడు షరీఫ్ ఆమె దగ్గరికి వచ్చి, “మీరు స్పీడ్ లిమిట్ దాటి మరి వెళ్తున్నారు. మీరు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలి” అని అంటాడు.

2) అమ్మాయికి ఎర
ఆమె దగ్గర అంత కాష్ లేకపోవడంతో, సరే ఇప్పటికిప్పుడు ఒక 300 డాలర్స్ ఇస్తే మిమ్మల్ని వదిలేస్తానని అంటాడు. తన దగ్గర అంత క్యాష్ ఉండవు. సో షరీఫ్ ఆమె ఫోన్ తీసేసుకుని, “గ్యాస్ స్టేషన్లో ఏటీఎం ఉంది. అక్కడికి వెళ్లి మనీ విత్ డ్రా చేసుకొని రా. మనీ ఇచ్చాక నీ ఫోన్ ఇస్తా” అని అంటాడు. సరే అని బాబీ గ్యాస్ స్టేషన్ కి వెళ్తది. క్యాషియర్ బాబీతో, “ఏటీఎం ఎన్నో రోజులుగా పనిచేయట్లేదు” అని చెప్తాడు. అండ్ ఆ షరీఫ్ అంత మంచివాడు కాదు, అతని వల్ల చాలా మంది అమ్మాయిలు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి నువ్వు వాడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతే మంచిదని చెప్తాడు. ఇక బాబీకి కొంచెం భయం వేసి చాలా స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటది.
కానీ ఆ షరీఫ్ గాడు తక్కువ వాడేం కాదు. ఇలా జరుగుద్దని ముందే గెస్ చేసి వాడు రోడ్లో రెడీగా ఉంటాడు. బాబి స్పీడ్ గా వెళ్తుంటే తన స్నైపర్‌తో సిగ్నల్ లైట్ ని షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఫాస్ట్ గా ఆమెని చేజ్ చేసుకుంటూ వెళ్తాడు. షరీఫ్ వస్తుండడంతో బాబీ కార్ ని స్లోడౌన్ చేస్తది. షరీఫ్ అక్కడికి వచ్చి, “ఏంటి తప్పించుకుని పారిపోవాలనుకుంటున్నావా? నీ కార్ సిగ్నల్ లైట్ కూడా పగిలిపోయింది. దీనికి కూడా నువ్వు ఫైన్ కట్టాల్సి వస్తది” అని అంటాడు. బాబీ వెనక్కి వచ్చి చూస్తే సిగ్నల్ లైట్ డామేజ్ అయి ఉంటుంది. “దీన్ని షూట్ చేసింది షరీఫే. నేను వీడి ట్రాప్ లో ఇరుక్కుపోయినట్టున్నా” అని బాబి అనుకుంటుంది.
ఇక షరీఫ్ బాబీని కార్ దగ్గర నిలబడమని తనని చెక్ చేస్తున్నట్టుగా ఎలా అంటే అలా తాకుతుండడంతో బాబికి చాలా అన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తది. కానీ చేసేదేం లేక సైలెంట్ గా ఉంటుంది. షరీఫ్ బాబీతో, “నువ్వు నా నుంచి తప్పించుకుని వెళ్లాలంటే నాకు డబ్బులు ఇచ్చి వెళ్లాల్సిందే. దగ్గర్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్తే నువ్వు మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్లి మనీ విత్ డ్రా చెయ్, నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చి money తీసుకుంటా” అని అంటాడు. తనకు వేరే ఛాయిస్ లేక బాబీ దానికి ఒప్పుకుంటుంది. బాబి కార్ స్టార్ట్ చేసి వెళ్తుండగా షరీఫ్ ఒక గన్ తీసుకొని ఆమె కార్ టైర్ ని షూట్ చేస్తాడు. అప్పుడు కార్ క్రాష్ అయ్యి ఒక చోట ఇరుక్కుపోతుంది. బాబీకి భయం వేసి కారు నుంచి దిగి షరీఫ్ అక్కడినుంచి వెళ్లేంతవరకు దాక్కుంటుంది.
3) ఎడారిలో ఒంటరి ప్రయాణం
కాసేపటికి షరీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బాబి కారులో ఉన్న తన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తది. ఆ ఎడారిలో చాలాసేపు నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఆమెకి ఆ రెస్టారెంట్ కనిపిస్తుంది. అప్పటికే బాబీ పూర్తిగా డీహైడ్రేట్ అయి అలసిపోతుంది. ఆమె రెస్టారెంట్ లోపలికి వెళిన సమయంలోనే ఒక వ్యక్తి టేబుల్ మీద డబ్బులు పెట్టి మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుల్ని బాబి కొట్టేస్తుంది. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి, “నన్ను ఒక షరీఫ్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వాడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు” అని చెప్తది. కానీ వాడు మాత్రం, “ఆ షెరీఫ్ తో ఎఫైర్ పెట్టుకున్నావేమో? ఎవరికి తెలుసు” అని బ్రేకప్ చెప్పేస్తాడు.

కట్ చేస్తే డబ్బులు మర్చిపోయిన వ్యక్తి రెస్టారెంట్లోకి వచ్చి, ఇక్కడ డబ్బులు మర్చిపోయాను అని ఓనర్ తో గోల చేస్తుంటాడు. అదే సమయంలో షరీఫ్ రెస్టారెంట్ దగ్గరికి రావడం బాబీ గమనించి, మళ్లీ వాడికి దొరికిపోతానేమో అనే భయంతో వెంటనే రెస్ట్ రూమ్ లోకి వెళ్లి కిటికీ ద్వారా తప్పించుకోవచ్చేమో అని చూస్తది. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో తను మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు తనకు ఒక ఐడియా వచ్చి 911 కి కాల్ చేసి తను ప్రమాదంలో ఉన్నానని వేరే లొకేషన్ చెప్తది. పోలీస్ రేడియోలో ఆ ఇన్ఫర్మేషన్ షరీఫ్ కి చేరడంతో షరీఫ్ ఆ లొకేషన్ కి వెళ్ళిపోతాడు. బాబి బయటికి వచ్చి చూస్తే తన కారు అక్కడ ఉంటుంది అండ్ పగిలిపోయిన తన సిగ్నల్ లైట్స్ కూడా ప్రజెంట్ బాగు చేసి ఉంటారు.
షరీఫ్ తన కార్ ని బాగు చేసి తీసుకొచ్చాడేమో అని తను అనుకుంటది. తను మళ్ళీ రెస్టారెంట్ లోపలికి వచ్చేసరికి డబ్బుల్ని అక్కడ పనిచేసే Amy అనే వెయిటర్స్ కొట్టేసిందని అనుమానించి ఆమెని పనిలో నుంచి తీసేస్తారు. రెస్టారెంట్ బయట కూర్చుని ఉన్న Amy దగ్గరికి బాబీ వచ్చి, “నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడుగుతుంది. దానికి Amy, “నేను దగ్గరలో ఉన్న టౌన్ లో నివసిస్తుంటా” అని చెప్తది. అప్పుడు బాబి, “సరే నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తా” అని Amy ని తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. Amy బాబితో, “ఈ షరీఫ్ చాలా డేంజరస్. చాలామంది అమ్మాయిల్ని వీడు హెరాజ్ చేశాడు” అని చెప్తుండగా, షరీఫ్ షూట్ చేయడంతో Amy కి బుల్లెట్ తగిలి తను బాబి ఒళ్ళో పడిపోతుంది.
4) థ్రిల్లింగ్
ఒక్క క్షణం బాబీకి అసలు ఏం అర్థం అవ్వదు. భయంతో బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటది. అప్పుడు తనకి కొంచెం దూరంలో దుమ్ము పైకి లేస్తుండడం కనిపిస్తది. సో ఆ షరీఫ్ కారు వేసుకొని తన దగ్గరికి రాబోతున్నాడని బాబీకి అర్థం అవుతుంది. బాబీకి చాలా భయం వేసి కారు వేసుకొని స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెనకే షరీఫ్ కూడా వచ్చి ఆమె కార్ ని డ్యాష్ ఇస్తుంటాడు. కొంత దూరంలోనే ఒక ట్రక్ ఆపి ఉండడం బాబీ చూసి ఫాస్ట్‌గా అక్కడికి వెళ్లి ఆ ట్రక్ డ్రైవర్ తో తన సిచువేషన్ అంతా చెప్తది. ట్రక్ డ్రైవర్ వెంటనే ఒక షాట్ గన్ తీసుకొని బయటకొస్తాడు.
అప్పుడు షరీఫ్ ట్రక్ డ్రైవర్ తో, “నేను పోలీస్ ని. ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ని హత్య చేసి తప్పించుకుంటుంటే పట్టుకున్నాను. కావాలంటే ఆమె కారులో డెడ్ బాడీ ఉంది చూడు” అంటాడు. “షరీఫ్ మొత్తం అబద్ధాలు చెప్తున్నాడు. అతనే నన్ను చంపాలని చూస్తున్నాడు, అతని షూట్ చేయ్” అని బాబీ ట్రక్ డ్రైవర్ తో అంటది. ఈ గందరగోళంలో ఆ ట్రక్ డ్రైవర్ కొంచెం డైవర్ట్ అవ్వగానే షరీఫ్ అతన్ని కాల్చి చంపేస్తాడు. బాబీకి భయమేసి వెంటనే కారెక్కేసి ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షరీఫ్ ఆ డ్రక్ డ్రైవర్ బాడీని ట్రక్ కి ఆనిచ్చి, బాబీని పట్టుకునేందుకు చేజ్ చేస్తూ వెళ్తాడు.

బాబి వెళ్తూ ఉండగా తనకి ఒక పాత గరాజ్ కనిపిస్తుంది. అక్కడ తనకి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని కార్ అక్కడ ఆపుతుంది. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా ఉండదు. అదే సమయంలో అక్కడికి ఎవరో వస్తున్నాడంతో ఒకవేళ అది షరీఫ్ ఏమో అని అనుకుని బాబి ఒక చెక్కతో కొడుతుంది. కానీ వచ్చింది షరీఫ్ కాదు. ఆ షెడ్ లో పనిచేసే మెకానిక్ ఎడ్. బాబి ఎడ్ కి సారీ చెప్పి తన సిచువేషన్ మొత్తం అర్థమయ్యేలా చెప్తుంది. ఎడ్ కూడా తనని అర్థం చేసుకొని, “నువ్వేం భయపడొద్దు. మా ఓనర్ చాలా మంచివాడు. మేము నీకు హెల్ప్ చేస్తాం” అంటాడు. వాళ్ళలా మాట్లాడుకుంటుండగా అక్కడికి ఒక కారు వస్తుంది.
5) అంతా ఒకే బ్యాచ్
“మా ఓనర్ వచ్చినట్టుంది, నువ్వు ఇక్కడే ఉండు” అని ఎడ్ ఆయన దగ్గరికి వెళ్లబోతుండగా, బాబీ ఎడ్ ని, “రెస్ట్ రూమ్ కి ఎటు వెళ్ళాలి” అని అడిగిద్ది. ఇక ఎడ్ ఆమెకి రెస్ట్ రూమ్ వైపు దారి చూపిస్తాడు. బాబి ఆ రూమ్ లోకి వెళ్తే అది రెస్ట్ రూమ్ కాదు. దాని నిండా మనుషుల్ని చంపడానికి ఉపయోగించే వస్తువులు, రకరకాల అమ్మాయిల ఐడి కార్డ్స్, వాళ్ళ లైసెన్స్ వస్తువుల తోటి నిండిపోయి ఉంటుంది. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎడ్ బాస్ ఎవరో కాదు, షరీఫ్ అని. అవన్నీ చూస్తూ బాబి టెన్షన్ పడుతున్న సమయంలోనే షరీఫ్ అక్కడికి వస్తాడు.
బాబీ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూడగా ఎడ్ ఆమెను కొట్టడంతో తను కింద పడిపోతుంది. కాసేపయిన తర్వాత బాబి మెలకువలోకోస్తది. అప్పటికే తనని కట్టేసి ఉంటారు. ఎడ్ బాబీని టచ్ చేస్తుండడంతో షరీఫ్ వాణ్ని అరిచి పక్కకు జరగమంటాడు. అప్పుడు బాబీ షరీఫ్ ని, “అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు?” అని అడుగుతుంది. “నీలాంటి సిటీ గర్ల్స్, అసలు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే అని చాలా పొగరుగా తిరుగుతుంటారు. సో నీలాంటి అమ్మాయిలందరికీ మగాడు ఎప్పుడూ మీ కన్నా పైనే ఉంటాడని ఒక పాఠం చెప్పడానికి ఇలా చేస్తున్నా” అని షరీఫ్ అంటాడు. షరీఫ్ ఇంకో పని కూడా చేస్తాడు.
అదేంటంటే తను ఎవరినైతే ట్రాప్ చేస్తాడో ఆ అమ్మాయి తన నుంచి ఎన్ని కిలోమీటర్లు తప్పించుకొని వెళ్లగలుగుతుందా అని అబ్జర్వ్ చేస్తాడు. అలా చనిపోయిన ప్రతి అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆ అమ్మాయి ఎన్ని కిలోమీటర్లు తన నుంచి తప్పించుకుని పారిపోయిందో రాస్తాడు. కట్ చేస్తే షరీఫ్ ఒక కత్తి తీసుకొని బాబి నాలుకను కోసేసి దాన్ని సింక్‌లో పడేస్తాడు. బాబి నొప్పితో చాలా బాధపడుతూ ఏడుస్తది. కాసేపయిన తర్వాత తను unconscious అయిపోతుంది. కొంత సమయం తర్వాత బాబీ మెలకువలోకొస్తది. అప్పటికి తన కట్లని విప్పేసి ఉంటారు. కానీ తన ఒంట్లో నీరసం తప్ప శక్తి ఉండదు.

6) ముగింపు
ఆ సమయంలో ఎడ్, షరీఫ్ కార్టూన్స్ చూస్తుండడంతో ఇదే కరెక్ట్ టైం అని బాబి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. కానీ షరీఫ్ దాన్ని కనిపెట్టేస్తాడు. బాబీకి ఇలా జరగడం కొత్తేమోగానీ, షరీఫ్ ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతోమంది అమ్మాయిలకు ఇలా చేశాడు కదా! ఇక షరీఫ్ బాబి వెనకే ఫాలో అవుతూ వెళ్తాడు. ఫస్ట్ లో ఒక అమ్మాయిని ఇదే ఎడారిలో ఒకడు చంపేశాడు కదా! తనని చంపేసింది కూడా ఈ షరీఫే. సేమ్ ఆ అమ్మాయి ఏ ప్లేస్ లో అయితే వెళ్తుందో ఇప్పుడు బాబి కూడా అదే ప్లేస్ లో వెళ్తుంటది. ఇంక నడవలేక బాబి ఒకచోట పడిపోవడంతో షరీఫ్ ఆమె దగ్గరికి వెళ్లి వాటర్ ఇస్తాడు. కానీ బాబి ఆ వాటర్ ని కిందపడేస్తుంది.
ఆమె ముందు ఒక గన్ అండ్ బుల్లెట్ వేసి, “నిన్ను నువ్వే షూట్ చేసుకో. నువ్వు కాని బతికితే నేను నిన్ను వదిలేస్తా” అని చెప్పి షరీఫ్ అక్కడి నుంచి వెళ్లి కార్ ఎక్కుతాడు. ఇక బాబి గన్ తో తనని తనే షూట్ చేసుకుని కింద పడిపోతుంది. వీడు ఆనందంగా బాబి డెడ్ బాడీ దగ్గరికొస్తాడు. కానీ బాబి తనని షూట్ చేసుకోదు, గాల్లోకి షూట్ చేస్తది. సో బాబీకి ఏమి అవ్వదు. తను వెంటనే కత్తితో షరీఫ్ ని పొడిచి, వెళ్లి కార్ ఎక్కుతుంది. కీస్ కోసం వెతుకుతుంటే కీస్ అక్కడ ఎక్కడా ఉండవు. ఈలోగా షరీఫ్ అక్కడికి వచ్చేస్తాడు. ఇక బాబీ వెంటనే కార్లో నుంచి దిగి పరిగెత్తాలని చూస్తది. కానీ షరీఫ్ ఆమెను పట్టుకొని గొంతు పిసికి చంపేయాలని చూస్తాడు.
అప్పుడు బాబి ఒక రాయితో షరీఫ్ ని కొట్టడంతో వాడు కింద పడిపోతాడు. ఇక బాబి కార్ కీస్ తీసుకుని కార్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ షరీఫ్ పైకి లేవడంతో తననంత టార్చర్ చేసినందుకు బాబీకి చాలా కోపం వచ్చి వాన్ని కార్ తో గుద్ది చంపేస్తుంది. అప్పటితో తన పగ అయితే తీరిపోలేదు. తను డైరెక్ట్ గా షెడ్ దగ్గరికి వెళ్తది. ఫ్రీజర్ లోంచి ఐస్ క్యూబ్స్ ని ఒక కంటైనర్ లో వేసుకొని దానిమీద తన కట్ చేసిన నాలుకని వేస్తుంది. కొంచెం త్వరగా హాస్పిటల్ కి వెళ్తే దాన్ని అటాచ్ చేసుకోవచ్చని బాబి అలా చేస్తుంది. అదే సమయంలో ఎడ్ అక్కడికి రావడంతో బాబి వాణ్ని కూడా చంపేస్తుంది. షరీఫ్ చేసిన క్రైమ్స్ అన్నిటినీ బయటపెట్టాలని అక్కడున్న మిస్సింగ్ గర్ల్స్ యొక్క లైసెన్స్ లని తీసుకుంటుంది. ఇక బాబి అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళిపోతుంది.
Image Credit: Blood Star (2024)