Azrael Movie Explained in Telugu

Azrael Movie Explained in Telugu

Shudder & IFC Films Distribute చేసిన “Azrael” అనే యాక్షన్ హార్రర్ మూవీ 5.4/10 IMDb రేటింగ్ తో క్రిటిక్స్ నుంచి Mixed Average టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 27, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “E. L. Katz” దర్శకుడిగా వ్యవహరించారు. “Simon Barret” రచయితగా ఉన్నారు. Samara Weaving, Nathan Stewart- Jarrett మరియు Vic Carmen Sonne ప్రధాన పాత్రల్లో నటించారు. 12 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 6 లక్షల 66 వేల 611 డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే మీరీ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.

స్టోరీ తెలుసుకుందామా!
1) అడవిలో జీవనం

ఓపెన్ చేస్తే ఒక భయంకరమైన విపత్తు జరగడం వల్ల భూమి మీదున్న మనుషులందరూ తమ ప్రాణాల్ని కోల్పోతారు. కేవలం కొద్ది మంది మాత్రమే విపత్తు నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకుంటారు. వీరిలో కొంతమంది అడవుల్లో, మరికొంత మంది అడవికి దూరంగా నివసిస్తుంటారు. అడవిలో నివసించే మనుషులందరూ ఒక చిన్నపాటి ఊరిని నిర్మించుకుని దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. వీరిని Cults అని పిలుస్తారు. తమ ఆరాధనలో భాగంగా నోరి తెరిచి మాట్లాడడం పాపమని, కాబట్టి ఎప్పటికీ మాట్లాడకూడదని డిసైడయ్యి వీరంతా తమ Vocal Cords ని Remove చేసుకుంటారు. So ఇక వీరెవ్వరూ మాట్లాడరు, మాట్లాడలేరు. Miriam (మిరియమ్) అనే ఆవిడ దేవునికి ప్రార్ధన చేసి, చర్చి యొక్క గోడ మీద ఒక అమ్మాయి బొమ్మని గీస్తది.

కట్ చేస్తే Azrael దగ్గర Scene ఓపెనయిద్ది. Azrael and Kenan రిలేషన్ లో ఉంటారు. వీరిద్దరూ తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు Cult Group నుంచి తప్పించుకుని విలేజ్ లోంచి దూరంగా వచ్చేస్తారు. అడవిలో ఉన్న చిన్నపాటి మొక్కలతోటి Azrael ఒక Bracelet ని తయారు చేస్తుండగా, Kenan మాత్రం చలి కాచుకునేందుకు మంట వెలిగిస్తాడు. But Azrael వెంటనే Kenan దగ్గరికి వచ్చి తను రాజేసిన మంటని Fast గా ఆర్పేసి, Kenan పై కోప్పడిద్ది. అంటే మంట నుంచి వచ్చే పొగని Cult Members చూశారంటే, ఆ పొగని Follow అవుతూ Cult Members తమ దగ్గరికి వచ్చే Chance ఉంది కదా. అందుకనే తను మంటని ఆర్పేసి Kenan పై కొప్పడిద్ది.

Azrael తను తయారుచేసిన Bracelet ని Kenan కి ప్రేమగా తొడిగిద్ది. అలా వీరిద్దరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా దూరం నుంచి ఎవరో విజిల్ చేస్తున్నట్టుగా Sound వినిపిస్తది. Maybe తమని పట్టుకునేందుకు Cult Members వచ్చినట్లుంది అని అనుకుని వీరిద్దరూ వెంటనే పరుగుతీస్తారు. కానీ కొన్ని క్షణాల్లోనే Cult Members Azrael and Kenan ని చేజ్ చేసి మరీ పట్టుకుంటారు. వాళ్ళు Azrael and Kenan పై బాగా దాడి చేసి, Azrael ని ఒక కార్ లో అలాగే Kenan ని మరో కార్ లోకి ఎక్కించి ఇద్దరినీ వేరే వేరే ప్రదేశాలకి తీసుకెళ్ళిపోతారు. Cult Members Azrael ని బలి అర్పించే ప్రదేశం దగ్గరికి తీసుకెళ్లి తనని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బంధిస్తారు.

Azrael Movie Explained in Telugu
Azrael Movie Explained in Telugu
2) క్రియేచర్ కి బలి

అక్కడే Josephine కూడా ఉంటది. ఈ Josephine Cult Members యొక్క లీడర్ అనమాట. Josephine ఒక కత్తిని తీసుకుని Azrael కాలికి చిన్నపాటి గాయం చేసి, తన కాలిలోంచి రక్తం బయటకు వచ్చేలాగా చేస్తది. Azrael ని బలి తీసుకునేందుకు తన కాలి నుంచి కారుతున్న రక్తపు వాసనని Follow అవుతూ అక్కడికి మరికొన్ని క్షణాల్లోనే భయంకరమైన Creatures రాబోతాయి. So Cult Members అందరూ చిన్నపాటి గుట్టపైకి చేరుకుని Azrael కి Opposite వైపు చూస్తూ గట్టిగా గసపెడుతుంటారు. ఆ సమయంలో ఓ Creature భయంకరంగా Sound చేస్తూ Azrael దగ్గరికి వస్తుంటది. Creature ని చూసిన Azrael ఒక్కసారిగా భయపడిపోద్ది.

ఎలాగైనా సరే Creature నుంచి తప్పించుకోవాలని Azrael తన చేతుల్ని తాళ్ల నుంచి విడిపించుకునేందుకు బలంగా ప్రయత్నిస్తది. ఆ ప్రయత్నంలో Azrael కుడిచేయి తాళ్ళ నుంచి Free అయిద్ది. ఈ విషయాన్ని గమనించిన Cultist Azrael ని సరిగ్గా కుర్చీలో కూర్చోబెట్టేందుకు గుట్టపై నుంచి కిందకి వస్తాడు. Azrael చేతిని తాళ్ళతో కట్టేసేందుకు Cultist ప్రయత్నిస్తుంటాడు. But Azrael మాత్రం అక్కడినుంచి తప్పించుకునేందుకు Try చేస్తుంటది. అలా వారిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి Fight లో Azrael చేతిలోని పదునైన చెక్క ముక్క పొరపాటున Cultist యెుక్క గొంతుకి గుచ్చుకుంటది. తన గొంతు నుంచి కారుతున్న రక్తపు వాసనని ఫాలో అవుతూ Creature Cultist దగ్గరికి చేరుకుంటది.

ఇంకేముంది, Creature ఆ వ్యక్తిని ఒక చెట్టు దగ్గరికి లాక్కెళ్లి తనని బ్రతికుండగానే పీక్క తినేస్తది. ఆ సమయంలో Azrael తన ఎడమ చేతిని కూడా తాళ్ళ నుంచి విడిపించుకుని వెంటనే అక్కడినుంచి దూరంగా పారిపోద్ది. గుట్టపై ఉన్న Cult Members ఏమో Azrael వైపు కాకుండా తనకి Opposite వైపు చూస్తుంటారు. So వాళ్ళకి Azrael పారిపోయిందన్న విషయం అస్సలు తెలియదు. కొంచెం సేపటి తర్వాత Cult Members అందరూ గుట్టపై నుంచి కిందకి వస్తారు. తీరాచూస్తే Creature Azrael ని కాకుండా తమ Group లోని మెంబర్ ని తింటుండడంతో, Azrael పారిపోయిందన్న విషయం వాళ్ళకి అర్ధమైపోద్ది. ఇక్కడ Creatures అంటే మంటల్లో కాలిన మనుషులని అర్థం.

Azrael Movie Explained in Telugu
Azrael Movie Explained in Telugu
3) Azrael ధైర్య సాహసాలు

కట్ చేస్తే Azrael ఒక River వద్దకి చేరుకుని తన గాయానికి కట్టు కట్టుకుంటది. అప్పటికే తన రక్తపు వాసనని Follow అవుతూ మరో Creature కూడా River వద్దకి చేరుకుంటది. Creature నుంచి తప్పించుకునేందుకు Azrael వెంటనే తన పక్కనున్న Room లోకి వెళ్లి ఒక మూలన దాక్కుంటది and Creature కి తన రక్తపు వాసన తెలియకుండా ఉండేందుకు Azrael తన గాయాన్ని గట్టిగా చేతులతో మూసేస్తది. Azrael ని తినేందుకు Creature కూడా Room దగ్గరికి వస్తది, కానీ లోపలి నుంచి ఎటువంటి రక్తపు వాసన రాకపోతుండడంతో లోపలెవరూ లేనట్టుందనుకుని Creature అక్కడినుంచి వెళ్ళిపోద్ది. కొంచెం సేపటి తర్వాత Azrael Room లోపలి నుంచి బయటకి వస్తది. ప్రస్తుతం Kenan ఎటువంటి Situation లో ఉన్నాడో అని అనుకుంటూ Azrael బాగా Tension పడిపోద్ది.

So ఎలాగైనా సరే Kenan ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, కార్ టైర్స్ యొక్క అడుగుజాడల్ని ఫాలో అవుతూ Cult Members నివసించే విలేజ్ కి Azrael చేరుకుంటది. Creatures తమ విలేజ్ లోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు Cult Members తమ Village చుట్టూ ఫెన్స్ ని ఏర్పాటు చేసుకుంటారు. and ఆ ఫెన్స్ కి రకరకాల వస్తువులు తగించబడి ఉంటయ్. అంటే ఎవరైనా ఫెన్స్ దాటేందుకు ప్రయత్నించారంటే ఆ వస్తువుల నుంచి Sound వస్తది. ఇక Village లోని వ్యక్తులకి అర్థమైద్దనమాట, ఎవరో అక్రమంగా తమ విలేజ్ లోకి చొరబడుతున్నారని. ఈ విషయాలన్నీ Azrael కి తెలుసు. అయినా సరే ఎలాగైనా విలేజ్ లోకి వెళ్లి Kenan ని కాపాడుకోవాలని Azrael డిసైడయిద్ది.

So ఎటువంటి శబ్దం చేయకుండా చాలా జాగ్రత్తగా ఫెన్స్ ని దాటి Safe గా లోపలికి వెళ్తది. Kenan ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు తను Village అంతా చెక్ చేస్తది. చివరికి తనకి Kenan కాదు కదా, తను Kenan కి Gift గా ఇచ్చిన Bracelet ఒక చోట కనిపిస్తది. అంటే Kenan కి ఏదో అపాయం జరిగినట్టుందని Azrael కి అర్థమైపోద్ది. అదే సమయంలో బలినర్పించే ప్రదేశం నుంచి Josephine కూడా విలేజ్ కి చేరుకుంటది. Azrael వెంటనే ఒక గుడిసె వెనక్కి వెళ్లి Josephine కి కనిపించకుండా దాక్కుంటది. Miriam ని కలిసేందుకు Josephine చర్చ్ లోకి వెళ్తది. But ఆ సమయంలో చర్చ్ లోపల Prayer జరుగుతుంటది. చర్చ్ గోడకి ఉన్న చిన్నపాటి రంధ్రం గుండా బయటనుంచి లోపలికి గాలి వస్తుంటది. ఆ రంద్రం నుంచి వచ్చే గాలి ద్వారా దేవుడు తమతో మాట్లాడతాడనేది వారి యొక్క నమ్మకం.

Azrael Movie Explained in Telugu
Azrael Movie Explained in Telugu
4) ముగింపు

కొంచెం సేపటి తర్వాత ప్రార్థన ముగియడంతో ప్రజలందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. Azrael బలి నుంచి తప్పించుకుందని తెలిసి, “ఒక్క పని కూడా సరిగ్గా చేయవా!” అన్నట్టు Miriam Josephine పై చై చేసుకుంటది. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఏదో శబ్దం రావడంతో, అదేంటో తెలుసుకునేందుకు Josephine వెంటనే చర్చిలోంచి బయటకు వస్తది. తీరాచూస్తే Azrael చర్చ్ కిందనే దాక్కుని ఉంటది. “చివరికి దొరికింది రా ఇది” అని అనుకుంటూ Josephine Azrael ని పట్టేసుకుంటది. కానీ Azrael Josephine పై దాడి చేసి తన దగ్గరి నుంచి పరుగుతీస్తది. విషయం తెలుసుకున్న Cult Members ఆయుధాలు చేత పట్టుకుని Azrael ని వెంబడిస్తారు. కానీ తను వాళ్లకి చిక్కకుండా Successful గా ఫెన్స్ దాటి అడవిలోకి పారిపోద్ది.

అయినా సరే వాళ్ళు తనని అస్సలు వదిలిపెట్టరు. ఫెన్స్ దాటే క్రమంలో Azrael చేతికి పొరపాటున గాయమయిద్ది. ఇంకేముంది, ప్రస్తుతం తన గాయం నుంచి రక్తం కారుతుండడంతో ఆ రక్తపు వాసనని ఫాలో అవుతూ Creatures కూడా Azrael ని వెంబడిస్తాయి. ప్రాణ భయంతో వారందరి నుంచి దూరంగా పారిపోతున్న Azrael కి Lucky గా ఒక కార్ కనిపిస్తది. ఆ కార్ ని Jason అనే వ్యక్తి Drive చేస్తుంటాడు. Azrael వెంటనే కార్ లోకి ఎక్కి, “మనం వెంటనే ఇక్కడినుంచి పోవాలి” అన్నట్టుగా Jason కి సైగ చేస్తది. తను అలా ఎందుకు సైగ చేస్తుందో Jason కి ఏమి అర్ధం కాదు. But అయినా సరే తను Car Start చేస్తాడు. Jason Azrael తో మాట్లాడుతూ, “విపత్తు నుంచి తప్పించుకున్న మనుషుల్లో నువ్వు కూడా ఒకరివా?” అని అడుగుతాడు.

కానీ Azrael మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. “ఏంటి ఈ అమ్మాయి అసలు మాట్లాడడం లేదు!” అని Jason అనుకుంటాడు. అప్పుడు Azrael తన గొంతు మీద ఉన్న సిలువ గుర్తుని Jason కి చూపిస్తది. అయినా సరే దాని అర్ధమేంటో Jason కి ఏమీ అర్థంకాదు. ఎందుకంటే తను నివసించేది అడవికి చాలా చాలా దూరంగా అనమాట. So Jason కి అసలీ Cult Group గురించి ఏ విషయాలు తెలియవు. అలా వారిద్దరూ కార్ లో వెళ్తుండగా సడన్ గా అక్కడికొక Cultist వచ్చి Jason ని Gun తో Shoot చేస్తాడు. దాంతో Jason చనిపోవడంతో, తమ కార్ కూడా అదుపుతప్పి యాక్సిడెంట్ కి గురైద్ది. Azrael పై దాడి చేసేందుకు Cultist Try చేస్తాడు. But వారి మధ్య జరిగిన ఫైట్ లో Azrael లే Cultist ని Gun తో Shoot చేసి చంపేస్తది.

Image Credit: Azrael (2024)

Leave a Comment