Apocalypse Z: The Beginning of the End Plot Summary Explained in Telugu
సినిమా అనే చక్రంలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. హార్రర్, ఫాంటసీ, రొమాంటిక్, థ్రిల్లర్, మిస్టరీ ఇలా చాలా రకాల సినిమాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు విడుదలవుతుంటాయి. వీటిల్లో జాంబీ సినిమాలకిగాను ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందువల్ల ఈ రోజు మనం ఒక జాంబీ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా పేరు వచ్చేసి “Apocalypse Z: The Beginning of the End”. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదొక భయంకరమైన జాంబీ అపోకలిప్స్ థ్రిల్లర్.
ఒక ప్రాణాంతకమైన వైరస్ వేగంగా వ్యాపించి మనుషులను ప్రమాదకరమైన జాంబీలుగా మార్చేస్తే? ఆ వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఒక సాధారణ వ్యక్తి ఎన్ని కష్టాలుపడ్డాడు? ఇంతకీ తను వైరస్ బారినపడకుండా జాంబీల నుంచి తప్పించుకున్నాడా, లేదా? ఇలా చాలా రసవత్తరంగా సినిమా సాగుతుంది. ఇది కేవలం ఒక జాంబీ సినిమా కాదు. ఇదొక సాధారణ మనిషి తన ప్రాణాల్ని కాపాడుకునేందుకే ఎంత వరకు తెగించాడు అని చూపించే సర్వైవల్ సినిమా. ఇక ఆలస్యమెందుకు… ఈ జాంబీ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం!
ప్రారంభ దశ
ఓపెన్ చేస్తే స్పెయిన్ లో కథ మొదలవుతుంది. ‘మనెల్’ భార్య పేరు ‘జూలియ’. మనెల్ తన భార్యని తీసుకుని బెలెన్ కి వెళ్తాడు. అక్కడ మనెల్ అక్క నివశిస్తుంటది. కొంచెంసేపటి తర్వాత వారిద్దరు అక్కడినుంచి ఇంటికి బయల్దేరతాడు. అప్పుడు జూలియా మాట్లాడుతూ, “మనం కూడా పిల్లల్ని కనేందుకు ప్రయత్నిద్దాం. ఇంకెంతకాలం ఇలా పిల్లలు లేకుండా ఉండాలి” అని అంటది. అప్పుడు హఠాత్తుగా ఒక వాహనం అడ్డు రావడంతో వారిద్దరు చిన్న ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. అంతలోనే ఒక పెద్ద ట్రక్ వచ్చి వాళ్ల కారుని ఢీ కొట్టిద్ది. ఒక సంవత్సరం గడిచిపోద్ది. ఆ ప్రమాదంలో జూలియా చనిపోవడంతో ప్రస్తుతం మనెల్ ఒక్కడే ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంటాడు.
ఒక ప్రమాదకరమైన వైరస్ భూమిమీద వ్యాపిస్తుంటది. ప్రజలందరూ దాని బారిన పడి క్రూరంగా మారుతుంటారు. ఆ వైరస్ బారినపడిన ఒక వ్యక్తి జాంబీగా మారడాన్ని టీవీలో చూపిస్తారు. మనెల్ తన బోట్ అమ్మేందుకు హార్బర్ కి వెళ్తాడు. తను బోట్ పేపర్స్ వెతుకుతుండగా జూలియా బ్రేస్లెట్ కనిపిస్తది. అపుడు మనెల్ కి జూలియాతో గడిపిన క్షణాలు గుర్తుకురావడంతో చాలా బాధపడతాడు. మనెల్ కి తన అక్క ఫోన్ చేస్తది, కానీ తను ఫోన్ ఎత్తడు. మనెల్ సరుకులు కొనేందుకు సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ అందరూ చాలా ఎక్కువ మొత్తంలో సరుకులు కొనుక్కుని ఇళ్ళకు తీసుకెళ్తుంటారు.
కానీ మనోడు మాత్రం వాళ్లని పట్టించుకోకుండా తనకి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కొని ఇంటికొస్తాడు. మనెల్ జూలియా బ్రేస్లెట్ ని తన పిల్లి మెడకి కడతాడు. మనెల్ తన అక్కకి వీడియో కాల్ చేయగా ఆమె మనెల్ తో మాట్లాడుతూ, “ఈ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉంది. గవర్నమెంట్ కి పని చేసే మిలటరీ, నేవి లాంటి ఆఫీసర్స్ కుటుంబాల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు కెనరీ ఐలాండ్స్ కి తరలిస్తున్నారు. మీ బావ మిలటరీలో ఉన్నాడు కదా! కాబట్టి మేము కూడా కెనరీ ఐలాండ్స్ కి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతోపాటు వచ్చేసెయ్” అని అంటది. కానీ మనెల్ వాళ్ళతో వెళ్లేందుకు ఒప్పుకోడు.

మొదలైన భయం
అయితే తన పొరుగింటి వాళ్ళు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతుండడంతో మనెల్ మనసు మార్చుకుని కెనరీ ఐలాండ్స్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇక తను తన పిల్లిని తీసుకుని ఎయిర్పోర్ట్ బయల్దేరతాడు. “నేను కూడా మీతో రావాలనుకుంటున్నా” అని మనెల్ తన జూలియాకి మెసేజ్ పంపిస్తాడు. తీరాచూస్తే వీళ్ళు వెళ్లాల్సిన విమానాలన్ని క్యాన్సిల్ అవుతాయి. దాంతో ప్రయాణికులందరూ ఎయిర్పోర్ట్ సిబ్బందిపై గొడవకి దిగుతారు. ఈలోగా జూలియా ఫోన్ చేసి, “నేను చెప్పేంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్లొద్దు. ప్రస్తుతం పరిస్థితులు అంతగా బాగాలేవు” అని అంటది.
Year 10 (2024) Plot Summary Explained in Telugu
తీరాచూస్తే ప్రతీ రోడ్డు ట్రాఫిక్ తో నిండిపోయింటది. అందుకని అందరూ తమ కార్లని రోడ్లమీద వదిలిపెట్టి కాలి నడకన ఇళ్ళకి వెళ్తుంటారు. ఇక చేసేదేం లేక మనెల్ కూడా ఇంటికి బయల్దేరతాడు. చీకటి పడే సమయానికి తను ఇంటికి చేరుకుంటాడు. తన ఇంటిపక్కన ఒక వ్యక్తి వైరస్ బారినపడి జాంబీగా మారడంతో ఆర్మీ సభ్యులు అతన్ని బంధించి తీసుకెళ్తుంటారు.
అంటే ఈ వైరస్ చాల ప్రమాదకరం అనమాట. దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనెల్ కి అర్థం అవుద్ది. ఇక తను ఇంట్లోకెళ్లి నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం బెనల్ వీడియో కాల్ చేసి, “ప్రస్తుతం పరిస్థితులేమి బాగలేవు. గవర్నమెంట్ రక్షణ ప్రదేశాల్ని ఏర్పాటు చేయబోతుంది. కానీ ఎంత ఎక్కువ మందిని తీసుకొస్తే వాళ్లతో పాటు వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటదేమో అని ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. నువ్వు మాత్రం నేను చెప్పే వరకు ఇంటి నుంచి బయటికెళ్లొద్దు. నేను నిన్ను కాపాడే మార్గం కోసం చూస్తున్న, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు” అని మనెల్ కి చెప్తది.
మనుషుల తరలింపు
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అన్ని సోషల్ ఆక్టివిటీస్ ఆపేస్తాము. పరిస్థితులన్నీ మిలిటరీ చూసుకుంటదని గవర్నమెంట్ ఒక కొత్త ప్రోటోకాల్ విడుదల చేస్తది. అందుకని మనెల్ తనకు కావాల్సిన వస్తువుల తెచ్చుకునేందుకు సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. తీరాచూస్తే జనాలందరూ వస్తువులన్నిటిని ఖాళీ చేసేసుంటారు. మనెల్ తనకి దొరికిన కొన్ని వస్తువుల్ని తీసుకుని మార్కెట్ నుంచి బయటకొస్తాడు. ఆ తర్వాత తను గ్యాస్ స్టేషన్ కి వెళ్లి ఇంకొన్ని వస్తువుల్ని తీసుకుంటాడు. తను గ్యాస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే జాంబీస్ అన్నీ ప్రజల మీద దాడి చేస్తుంటాయి. మనెల్ అదంతా చూసి షాక్ అవుతాడు.
ఒక జాంబి పోలీస్ మీద చేస్తుంటది. మనెల్ అది గమనించి తనని కాపాడాలని వెళ్తాడు. కానీ ఆ జాంబీ మనెల్ మీద కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ జాంబిని షూట్ చేసి చంపేస్తాడు. మనెల్ కిందపడిన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తనకి సహాయం చేయాలని అనుకుంటాడు. కానీ ఆయన నా దగ్గరికి రావద్దు అని మనెల్ వైపు షూట్ చేస్తాడు. దాంతో మనెల్ భయంతో అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తనని తానే షూట్ చేసుకుని చనిపోతాడు.

కట్ చేస్తే ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడుతూ, “లాక్ డౌన్ మరికొన్ని రోజులు ఇలాగే ఉంటది. మిలిటరీ మిమ్మల్ని రక్షణ ప్రదేశాలకి తీసుకెళ్లేందుకు మీ ఇంటికి వస్తారు” అని చెప్తాడు. మనెల్ సోషల్ మీడియాలో కొన్ని ట్యుటోరియల్స్ చూసి తన ఇంటి గోడల్ని, తలుపుల్ని చాలా దృఢంగా మారుస్తాడు. అలాగే తనొక సీసీ కెమెరా కూడా అమరుస్తాడు. కొంచెంసేపటి తర్వాత ప్రజల్ని రక్షక ప్రదేశాలకి తీసుకెళ్లేందుకు ఆర్మీ వస్తారు. మనెల్ నివసించే ప్రదేశంలో ఉన్న జనాలందరూ ఆర్మీతో వెళ్లేందుకు సిద్ధమవుతారు. కానీ బెలెన్, “నువ్వు ఎక్కడికి వెళ్లదు, ఇంట్లోనే ఉండు. నేను నిన్ను కాపాడడానికి ఏదో ఒక మార్గం చూస్తా” అని మనెల్ కి మెసేజ్ పంపిస్తది. అందుకని మనెల్ ఆఫీసర్స్ కి కనిపించకుండా ఇంట్లోనే దాక్కుంటాడు.
ఒంటరిగా ఉండగలడా?!
ఆఫీసర్స్ మనెల్ ఇంటికొస్తారు, కానీ వాళ్లకి ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు. కట్ చేస్తే, రెండు వారాలు గడిచిపోతాయి. మనెల్ దగ్గరున్న ఆహారమంతా చాలా వరకు అయిపోద్ది. ఇంక ఇంట్లోనే ఉంటే లాభం లేదని, జాంబీల నుంచి తనను తాను రక్షించుకునేందుకు మనెల్ కొన్ని ఆయుధాలు తీసుకుని ఇంటి నుంచి బయటికొస్తాడు. తన ఊర్లోని ఇళ్లలో ఏమైనా ఆహారం దొరికిద్దేమో అని మనెల్ ప్రతీ ఇంటికి వెళ్తుంటాడు. కానీ ఏ ఇంట్లో కొంచెం కూడా ఆహారం ఉండదు. ఒక ఇంట్లో తనకి వీల్ చైర్ లో కూర్చుని ఉన్న ఒక ముసలావిడ కనిపిస్తది.
ఆమె నడవలేదు. తను నెమ్మదిగా మిలిటరీ సభ్యుల్ని చేరుకునే లోపే వాళ్ళందరు వాహనాల్లో వెళ్లిపోతారు. అలా ఆ బామ్మ ఒంటరిగా ఇంట్లోనే మిగిలిపోద్ది. ఆ బామ్మ దగ్గర కూడా ఆహారం ఉండదు. కానీ తనకు ఏ ఏ ఇంట్లో ఆహారం ఉందో తెలుసు. అలా ఆ బామ్మ చెప్పిన సమాచారం వల్ల మనెల్ చాలా సులభంగా వేరే వాళ్ళ ఇళ్లలోని ఆహారాన్ని తీసుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ తమకు దొరికిన ఆహారాన్ని సగం సగం పంచుకుంటారు. మనెల్ కి ఒక ప్రదేశంలో రెండు వాకిటాకిలు దొరకడంతో, తను బామ్మకి ఒక వాకిటాకి ఇస్తాడు.
కొంచెంసేపటి తర్వాత మనెల్ మళ్ళీ ఆహారం కోసం బైక్ వేసుకుని ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ తన వెనుక ఎవరో ఉన్నట్టుగా అనిపించడంతో, అది జాంబి ఏమో అని అనుకుని మనెల్ షూట్ చేస్తాడు. కానీ అక్కడున్నది జాంబి కాదు, మామూలు మనిషి. మనెల్ షూట్ చేయడంతో ఆ వ్యక్తి భయంతో పారిపోతాడు. చివరికి మనెల్ కి అదే ఇంట్లో చాలా మొత్తంలో ఆహారం లభిస్తది. తను కొన్ని రోజుల వరకు ఆ ఆహారాన్ని తింటూ హాయిగా గడిపేస్తాడు.

మనెల్ మీద జాంబి దాడి
మనెల్ బాగా మద్యం తాగేసి, “నేను నా కుటుంబంతో సరిగా గడపలేకపోయా” అని బామ్మకి చెప్తూ బాధపడతాడు. కాసేపటి తర్వాత బామ్మ వాకిటాకీలో మనెల్ ని పిలిచి రేడియో ఆన్ చేయమని చెప్తది. మనెల్ రేడియో ఆన్ చేస్తాడు. అప్పుడు రేడియోలో, “ఎవరైనా ప్రజలు ఇంకా ప్రాణాలతో ఉంటే వాళ్ళని కెనరీ ఐలాండ్ కి తీసుకెళ్తాము. కాబట్టి ప్రాణాలతో వాళ్లు అరౌస ఈస్ట్యూరి దగ్గరికి రండి” అని చెప్తారు. అప్పుడు మనెల్, “మన దగ్గరున్న ఆహారం కూడా పూర్తవ్వబోతుంది. కాబట్టి మనం వెళ్తే మంచిది” అని బామ్మతో అంటాడు. కానీ బామ్మ నడవలేదు కదా. కాబట్టి తను మనెల్ కి భారమవ్వకూడదని, “నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు” అని అంటది.
10 Cloverfield Lane (2016) Plot Summary Explained in Telugu
అప్పుడు మనెల్, “నా దగ్గర ఒక బోట్ ఉంది. ఆ బోట్ ద్వారా మనం అక్కడికి చేరుకోవచ్చు. నువ్వేం ఆలోచించొద్దు, మనం వెళ్తున్నాం” అని అంటాడు. మరుసటి రోజు ఉదయం తను బామ్మ ఇంటికెళ్తాడు. తీరాచూస్తే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటది. మనెల్ కి తన కుటుంబంతో గడపలేకపోయానే అనే బాధ ఉంటది. అలాగే తన అక్క తనకి దగ్గర్లోనే ఉన్నప్పటికీ ఎప్పుడూ తన దగ్గరికెళ్లి అనందంగా సమయం గడపలేదు అనే మరొక బాధ కూడా ఉంటది. ఇవన్నీ కాదన్నట్టు తన భార్య కారు ప్రమాదంలో చనిపోద్ది. ఇప్పుడేమో గత కొన్ని రోజులుగా ఎంతో ప్రేమగా ఉన్న బామ్మ కూడా చనిపోవడంతో మనెల్ చాలా బాధపడతాడు. “ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు, నువ్వు జాగ్రత్తగా కెనరీ ఐలాండ్ కి వెళ్ళు” అని బామ్మ ఒక పేపర్లో రాసి ఉండడాన్ని మనెల్ చదువుతాడు.
మనెల్ అక్కడ్నుంచి ఇంటికి బయల్దేరుతుండగా తన మీద ఒక జాంబి దాడి చేస్తది. అది తన చేతిని కొరికిద్ది. కానీ మనెల్ తన బాడీ మొత్తానికి రక్షణ ఏర్పాటు చేసుకోసుకుని ఉండడంతో దాని పళ్ళు శరీరంలోకి దిగబడవు. ఇక తను జాంబీతో పోరాడి దాన్ని చంపేస్తాడు. కానీ జాంబీగా మారకముందు అతను కూడా ఒక మనిషే కదా అని మనెల్ కాస్త బాధపడతాడు. “నేనింకా ఎంతకాలం ఇలా ఎదురుచూడాలి. నేనిక ఆగలేను, నేను ఇంటి నుండి బయలుదేరుతున్నా” అని మనెల్ జూలియాకి మెసేజ్ పంపిస్తాడు. అప్పటికి కూడా తన సెల్ లో సిగ్నల్ ఉండదు. కానీ సిగ్నల్ వచ్చినప్పుడు ఆ మెసేజెస్ అన్నీ వెళ్తాయిలే అని, తన పరిస్థితిని ఎప్పటికప్పుడు జూలియాకి తెలియజేస్తుంటాడు.
ముగింపు
ఈ విధంగా సినిమా చాలా రసవత్తరంగా సాగుతుంది. కథ ఇంకా ముగియలేదు… మనెల్ జాగ్రత్తగా తన అక్కని చేరుకున్నాడా, లేదా? గవర్నమెంట్ ఈ వ్యాధిని అంతం చేసేందుకు ఏదైనా మందు కనిపెట్టిందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు సినిమాలో ఇంకా దాగున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ వద్ద కూర్చోబెట్టిద్ది.
- ఒక పక్క ప్రపంచమంతా భయంకరమైన వైరస్ బారిన పడి మనుషులందరూ మృగాలుగా మారిపోతుంటే, ఒక సగటు మనిషి ఎలా స్పందిస్తాడు అని బాగా చూపించారు. ఏదేమైనా ప్రాణాలతో బయటపడాలి అన్న మానవుని తపనని చాలా సహజంగా తెరకెక్కించారు.
- నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. టైటిల్‌కు తగ్గట్టుగా, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ సినిమాకి ఇంకా సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉంది.
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు సైలెంట్ సన్నివేశాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. జాంబీ సన్నివేశాలు మాత్రం సగటు ప్రేక్షకుడిని బాగా భయపెట్టగలిగేలా ఉన్నాయి.
జాంబీ మూవీస్ ఇష్టపడే సినీ ప్రియులకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటుగా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ జాంబీ సినిమాని చూసేయండి!
