Apocalypse Z: The Beginning of the End Movie Explained & Summary in Telugu
Amazon Prime Video Distribute చేసిన “Apocalypse Z: The Beginning of the End” అనే స్పానిష్ హార్రర్ జాంబీ మూవీ 6.1/10 IMDb రేటింగ్ ని సాధించింది. అక్టోబర్ 31, 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీని Carles Torrens డైరెక్ట్ చేశారు. Manel Loureiro రాసిన Apocalypse Z 1. El Principio del fin అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబడింది. నటీనటుల విషయానికొస్తే Francisco Ortiz ప్రధాన పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.
కథ ఏంటంటే:
1) ప్రారంభ దశ
ఓపెన్ చేస్తే మూవీ ఒక క్రిస్మస్ టైమ్ లో స్పెయిన్ లో మొదలవుతుంది. మెనల్ తన వైఫ్ జూలియతో తన అక్క ఇంటి బెలెన్ దగ్గర నుంచి తన ఇంటికి రిటర్న్ అవుతాడు. ఇద్దరూ కారులో వెళ్తుండగా జూలియా మెనల్ తో మనం కూడా పిల్లల్ని ప్లాన్ చేద్దాం, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి అని మాట్లాడుతుంటది. అయితే సడన్గా ఒక వెహికల్ అడ్డు రావడంతో చిన్న ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. తప్పించుకున్నామని హ్యాపీ గా ఫీల్ అయ్యేలోపు ఒక పెద్ద ట్రక్కు వచ్చి వాళ్ల కారుని డాష్ ఇస్తుంది. కట్ చేస్తే వన్ ఇయర్ గడిచిపోతుంది ఆ జరిగిన యాక్సిడెంట్ లో జూలియా చనిపోవడంతో ప్రస్తుతం మేనెల్ ఒక్కడే ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంటాడు. న్యూస్ లో ఒక ప్రమాదకరమైన వైరస్ స్ప్రెడ్ అవుతుండడంతో ప్రజలందరూ దానివల్ల ఇన్ఫెక్ట్ అయ్యే వైలెంట్ గా మారుతున్నారని మాట్లాడుతుంటారు.
మినల్ టీవీని మ్యూట్లో పెట్టేసి తన పని చేసుకుంటుండగా,ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక వ్యక్తి జాంబీగా మారడం హాస్పిటల్ రికార్డింగ్ లో చూపిస్తారు. మినల్ ఆ ఫుటేజ్ నీ చూడడు కదా సో ఆ వైరస్ ఎలాంటిదో అది ఎంత ప్రమాదకరమో మినల్ కి తెలియదు. మినల్ హార్బర్ లో ఉన్న తన బోట్ ని ఇద్దరు అమ్మాయిలకి అమ్మడం అమ్మడానికి వెళ్తాడు. బోట్ పేపర్స్ ని వెతుకుతుండగా జూలియా బ్రేస్లెట్ కనిపిస్తది. అపుడు మినల్ కి తనతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి బాధతో తో తిరిగి వచ్చేస్తాడు. మినల్ కి తన సిస్టర్ ఫోన్ చేస్తది కానీ మినల్ ఆ ఫోన్ ని లిఫ్ చేయడు. తనకు కావాల్సిన వస్తువుల కోసం సూపర్ మార్కెట్ కి వెళ్తే,అక్కడ అందరూ చాలా ఎక్కువగా గ్రోసరీస్ ని కొనుక్కొని వెళ్తుండడం గమనిస్తాడు.
కానీ మనోడు ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్లి తన కావలసిన వస్తువులు వరకు కొనుక్కొని వస్తాడు. మేనల్ జూలియా బ్రేస్లెట్ ని తన Cat మెడకి కడతాడు. కట్ చేస్తే న్యూస్ లో, వైరస్ స్పెయిన్ లొకి ఎంటర్ అయిందని చెప్తారు. మెనల్ తన సిస్టర్ కి వీడియో కాల్ చేస్తే, ఆమె మెనల్ తో ఈ వైరస్ చాలా డేంజరస్ గా ఉంది. మీ బావ మిలటరీ లో ఉన్నాడు, కాబట్టి గవర్నమెంట్ కి పని చేసే మిలటరీ, నేవీ ఆలాంటి ఆఫీసర్స్ ఫ్యామిలీస్ని సేఫ్ గా ఉంచడం కోసం కెనరీ ఐలాండ్స్ కి తరలిస్తున్నారు. నువ్వు కూడా వచ్చేసేయ్ నీకు మాత్రం ఎవరున్నారు మనందరం ఒకటే ఫ్యామిలీ కదా అని అంటది. ఫస్ట్లో మెనల్ నేను రానులే అని అంటాడు.

2) మొదలైన భయం
కానీ తను నైబర్స్ కూడా వాళ్ళు ఉంటున్న ప్రదేశం నుండి సేఫ్ గా ఉండడానికి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతున్నాడంతో మెనల్ కూడా తన మనసు మార్చుకుని వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఇక తన క్యాట్ ని కూడా తీసుకొని ఎయిర్పోర్ట్ బయలుదేరుతాడు. మెనల్ ఎయిర్పోర్టుకు వెళ్లి నేను కూడా మీతో వస్తున్నానని తన సిస్టర్ కి మెసేజ్ పంపిస్తాడు. కానీ తీరా చూస్తే వీళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్లన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఏంటి ఇలా చేస్తున్నారు డబ్బున్న వాళ్ళందరూ తప్పించుకుని వెళ్ళిపోతుూ, మమ్మల్ని ఈ వైరస్ కి బలి చేయాలని చూస్తున్నారా అని కొంతమంది గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ లోగ మేనల్ కి తన సిస్టర్ కాల్ చేసి “నేను చెప్పేంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్లొద్దు, ప్రస్తుతం సిచువేషన్ అంతగా బాలేదని చెప్తది.
అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్లలో ఒకడు సెక్యూరిటీ గన్ తీసుకొని మమ్మల్ని ప్లేన్ఎక్కనివండని బెదిరిస్తుందటంతో అందరూ భయపడిపోయి వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు. తీరా చూస్తే ప్రతి రోడ్డు కూడా ట్రాఫిక్ తో నిండిపోయి కార్లు వెళ్ళలేని సిట్యువేషన్, సో అందరూ తమ కారులని రోడ్లమీద వదిలిపెట్టి తమ వస్తువులతో ఇంటికి నడుచుకుంటూ వెళ్లడం స్టార్ట్ చేస్తారు. ఇక చేసేదేం లేక మినల్ కూడా తన క్యాట్ ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. రాత్రి అయ్యే సమయానికి మెనల్ ఇంటికి చేరుకుంటాడు. కానీ మినల్ ఇంటిపక్క వ్యక్తి వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి జాంబీగా మారడంతో ఆర్మీ అతన్ని బంధించి తీసుకెళ్లడం చూస్తాడు.
సో ఈ వైరస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీనాలకి అర్థం అవుద్ది. ఇక ఇంట్లోకి వెళ్లి నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెనల్ కి బెనల్ వీడియో కాల్ చేసి ప్రస్తుతం సిచువేషన్ బాలేదు గవర్నమెంట్ సేఫ్ జోన్స్ నీ ఏర్పాటు చేయబోతున్నారు. కానీ ఎంత ఎక్కువ మందిని తీసుకొస్తే వాళ్లతో పాటు వైరస్ ని తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంటదేమో అని ప్రస్తుతం డిస్కషన్ నడుస్తుంది. నువ్వు మాత్రం నేను చెప్పే వరకు ఎక్కడికి బయటికి వెళ్లదు నేను నిన్ను కాపాడే దారి కోసం చూస్తున్న, నువ్వుఇంట్లోనే జాగ్రత్తగా ఉండు అని చెప్తది. గవర్నమెంట్ Country లోఒక కొత్త ప్రోటోకాల్ విదిస్తది.

3) మనుషుల తరలింపు
Afternoon రెండు గంటల తర్వాత అన్ని సోషల్ ఆక్టివిటీస్ ని ఆపేస్తాము. సిచువేషన్ అంత మిలిటరీ కంట్రోల్ లో ఉంటదని అనౌన్స్ చేస్తారు. సో మెనల్ తనకు కావాల్సిన వస్తువుల కోసం సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. తీరా చూస్తే జనాలు అందరూ వస్తువులన్నిటిని ఖాళీ చేసేసుంటారు. మినల్ ఏవో తనకి దొరికిన కొన్ని వస్తువులు తీసుకుని సూపర్ మార్కెట్ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత మెనల్ గ్యాస్ స్టేషన్ కి వెళ్లి తన కావాల్సిన వస్తువులు అన్నింటిని తీసుకుంటాడు. గ్యాస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక పోలీస్ ఆఫీసర్ జాంబి అటాక్ లో గాయపడి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి గ్యాస్ స్టేషన్లో తనని తనే లాక్ చేసుకుంటాడు. మరోవైపు జాంబీస్ అన్ని ప్రజల మీద అటాక్ చేస్తుంటాయి మినల్ అదంతా చూసి షాక్ అవుతాడు.
ఒక జాంబి పోలీస్ ఆఫీసర్ మీద పడి అతన్ని అటాక్ చేస్తుంటే మినల్ పోలీస్ ఆఫీసర్ ని కాపాడాలని వెళ్తాడు. కానీ ఆ జాంబీ మినల్ మీద అటాక్ చేయడానికి వస్తది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ జాంబిని షూట్ చేసి చంపేస్తాడు. ఈలోగా గ్యాస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ జాంబీగా మారిపోయీ బయటకు రావడానికి డోర్ ని పగలగొట్టాలని చూస్తుంటాడు. మరోవైపు మెనల్ కిందపడిన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఆయన నా దగ్గరికి రావద్దని షూట్ చేస్తాడు. ఇక మెనల్ బయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ తనని తనే షూట్ చేసుకుని చనిపోతాడు.
కట్ చేస్తే ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి లాక్ డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, మిలిటరీ మిమ్మల్ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లడానికి వస్తారనీ చెప్తాడు.మెనాల్ ఇంటర్నెట్లో కొన్ని ట్యుటోరియల్స్ చూసి తన ఇంటి బయట గోడల్ని తలుపుల్ని సెక్యూర్ గా ఉండేలాగా రెడీ చేసి ఒక సీసీటీవీ కెమెరా ని కూడా fix చేస్తాడు. కట్ చేస్తే ప్రజల్ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లడం కోసం ఆర్మీ అక్కడికి వస్తారు. మెనల్ నివసించే ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్మీతో వెళ్లడానికి రెడీ గా ఉంటారు. కానీ బెలీన్ మెలెన్ తో నువ్వు ఎక్కడికి వెళ్లదు ఇంట్లోనే ఉండు నేను నిన్ను కాపాడడానికి ఏదో ఒక మార్గం చూస్తాను అని మెసేజ్ పెట్టుంటది. సో మెనల్ ఆఫీసర్స్ కి కనిపించకుండా ఇంట్లో ధాక్కుంటాడు.

4) ఒంటరిగా ఉండగలడా?!
ఆఫీసర్స్ మెలన్ ఇంటి దగ్గరకి వస్తారు బట్ వాళ్లకి ఎవరు కనిపించకపోవడం తో వెళ్ళిపోతారు. కట్ చేస్తే రెండు వారాలు గడిచిపోతాయి మెనల్ దగ్గర ఉన్న ఫుడ్ కూడా Almost ఐపోయే స్టేజ్ లో ఉంటది. ఇంకా ఇంట్లోనే ఉంటే లాభం లేదని, జాంబి అటాక్స్ లో తన బాడీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మేనల్ తన బాడీని బాగా కవర్ చేసుకొని, కొన్ని ఆయుధాలు తీసుకొని ఇంటి నుంచి బయటకు వస్తాడు. తన ఊర్లో ఉన్న మిగిలిన ఇళ్లలోకి వెళ్లి ఏదైనా ఫుడ్ దొరుకుతుందా అని ట్రై చేస్తుంటాడు. కానీ ఏ ఇంట్లో కూడా కొంచెం కూడా ఫుడ్ దొరకదు. కాకపోతే ఒక ఇంట్లోకి తనకి వీల్ చైర్ లో కూర్చున్న ఒక బామ్మ కనిపిస్తది.
ఆమె నడవలేదు కదా సో తను మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్లే లోపే వాళ్లందరూ వెళ్లిపోతారు. సో తను అక్కడే మిగిలిపోతది. ఆ బామ్మ దగ్గర కూడా ఫుడ్ ఉండదు. కానీ ఆమె మినల్తో “లాక్ డౌన్ కు ముందు తన నైబర్స్ లో ఎవరెవరు ఎక్కువ ఫుడ్ కొన్నారో చెప్తది”. సో మెనల్ ఆ ఇళ్ళని చెక్ చేయగా తనకి ఫుడ్ అండ్ ఒక బైక్ కూడా దొరుకుతాయి. ఇక మినల్ బామ్మ ఫుడ్ ని షేర్ చేసుకుంటాడు. అలా ఒక్కొక హౌస్ లో ఉన్న ఫుడ్ అంతా ఎపిస్తారు.మినెల్ రెండు వాకీటాకిస్ దొరకడంతో, బామ్మతో మాట్లాడటానికి ఒక వాకిటాకి నీ ఇస్తాడు.
మినల్ బైక్ వేసుకొని తన నైబర్ ఇంట్లో ఫుడ్ ఏమైనా ఉంటదేమో అని వెళ్తాడు. తీరా చూస్తే ఆ ఇంట్లో ఏ ఫుడ్ దొరకదు. సడన్ గా మేనల్ కి తన వెనక ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తది. జాంబి ఏమో అని వెంటనే షూట్ చేస్తాడు, కానీ అతను కూడా నార్మల్ మనిషే మెనల్ ఎక్కడ తనని చంపేస్తాడేమో అని ఆ వ్యక్తి పారిపోతాడు. మెనల్ ఆ ఇంట్లో ఉన్న లాస్ట్ కబోర్డ్ ని ఓపెన్ చేయడంతో, అక్కడ కొన్ని రోజులకు సరిపడే ఫుడ్ దొరుకుతుంది. కొన్ని రోజులు వరకు హాయిగా తింటూ గడిపేస్తాడు.

5) ముగింపు
మేనల్ బాగా తాగి నేను నా ఫ్యామిలీతో సరిగ్గా గడపలేకపోయాననీ బాధపడుతూ బామ్మతో మాట్లాడి నిద్రపోతాడు. కాసేపయ్యాక బామ్మ వాకి టాకీలో మెనల్ ని పిలిచి రేడియో ఆన్ చేయమని చెప్తది. మెడల్ రేడియోని ఆన్ ఆన్ చేస్తాడు. అప్పుడు రేడియోలో “ఎవరైనా మిగిలిపోయిన ప్రజలు ఉంటే వాళ్ళని కెనరీ ఐలాండ్ కి తీసుకెళ్తాము. సో ఇంకా ఎవరైనా బ్రతికుంటే వాళ్లు Arousa Estuary దగ్గరికి రండని చెప్తారు. మేనల్ బామ్మ తో “మన దగ్గర ఫుడ్ కూడా అయిపోవస్తుంది సో మనం వెళ్తే మంచిదని అంటాడు. కానీ బామ్మ మాత్రం “తను మెనలకి ఒక బర్డెన్ లాగా ఉంటానేమో అని ఆలోచించి నేను రానులే అని అంటది.
అప్పుడు మెన్నెల్ నా దగ్గర ఒక బోటు ఉంది. ఆ బోట్ ద్వారా మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు నువ్వేం ఆలోచించొద్దు మనం వెళ్తున్నాం అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేనల్ బామ్మ ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. మేనల్ కి తన ఫ్యామిలీతో గడపలేకపోయానే అనే బాధ ఉంటది , అండ్ తన సిస్టర్ తనకి తక్కువ దూరంలోనే ఉన్నా కూడా ఎప్పుడూ తన దగ్గరికి వెళ్లి హ్యాపీగా టైం స్పెండ్ చేయలేదే అని మరొక బాధ ఉంటది. ఇవన్నీ కాదన్నట్టు తన వైఫ్ ఆక్సిడెంట్ లో చనిపోతుంది. ఇప్పుడేమో గత కొన్ని రోజులుగా తను క్లోజ్ గా ఉన్న బామ్మ కూడా చనిపోవడంతో మేనల్ చాలా బాధపడతాడు. ఇన్ని రోజులు నాతో టైం స్పెండ్ చేసినందుకు థాంక్స్ నువ్వు సేఫ్ గా కెనరీ ఐలాండ్ కి రీచ్ అవ్వు అని బామ్మ చిన్న లెటర్ ని మెనల్ కి రాసిపెట్టి ఉంటది.
మేనల్ అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరుతుండగా వాడి మీద ఒక జాంబి అటాక్ చేస్తుంది. అది మేనల్ చేతిని కొరుకుతుంది కానీ వాడు తన బాడీ మొత్తాన్ని ఫుల్లుగా ప్రొటెక్ట్ చేసుకుని ఉండడంతో దాని పళ్ళు శరీరంలోకి దిగవు. మినల్ ఆ జాంబీ తో పోరాడి దాన్ని చంపేస్తాడు, కానీ జాంబీగా మారకముందు తను కూడా ఒక మనిషే కదా అని మినల్ కాస్త బాధపడతాడు. నేను ఇంకా ఎంతకాలం ఇలా వెయిట్ చేయాలి, ఇక వెయిట్ చేయలేను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నానని తన సిస్టర్ కి మెసేజ్ పంపిస్తాడు. కానీ అప్పటికి కూడా తన సెల్ లో సిగ్నల్ ఏమి ఉండదు సర్వీసెస్ అన్ని ఆపేసుంటారు. బట్ సిగ్నల్ వచ్చినప్పుడు వెళ్తాయిలే అని తన సిచువేషన్ని ఎప్పటికప్పుడు తన సిస్టర్ కి మెసేజ్ పంపిస్తూనే ఉంటాడు.
Image Credit: Apocalypse Z The Beginning of the End (2024)