All Hallow’s Eve Movie Explained in Telugu
Image Entertainment Distribute చేసిన “All Hallow’s Eve” అనే హార్రర్ స్లాషర్ మూవీ 5.2/10 IMDb రేటింగ్ ని సాధించింది. అక్టోబర్ 29, 2013 లో రిలీజ్ అయిన ఈ మూవీకి “Damien Leone” దర్శకుడిగా మరియు రచయితగా వ్యవహరించాడు. Katie Maguire, Marie Maser, Katherine Callahan, Mike Giannelli మరియు Kayla Lian ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా DVD లో రిలీజ్ అయ్యి Mixed Reviews సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.
ఇప్పుడు కథ చూద్దాం:
1) మొదలు
ఓపెన్ చేస్తే, అదొక Halloween Night. Timmy (టిమ్మి) and Tia (తియ) అనే ఇద్దరు పిల్లలకి Sarah (శారా) Babysitting చేస్తుంటది. Trick or treat లో భాగంగా, తను కలెక్ట్ చేసిన క్యాండీస్ ని లెక్క పెట్టేందుకు Timmy Candy Bag ని open చేయగా, అందులో తనకొక వీడియో టేప్ కనిపిస్తది. ఆ video tape ని తన Bag లో ఎవరు పెట్టారో, ఎప్పుడు పెట్టారో Timmy కి అసలు తెలియదు. ఏదైతేనేం అసలీ Tape లో ఏముందో తెలుసుకోవాలని, Timmy చాలా Excitement గా ఫీలవుతాడు. Timmy Video Tape ని Play చేయబోతుండగా, Sarah తన దగ్గర నుంచి tape ని తీసేసుకుంటది. “అసలీ Tape లో ఎలాంటి video ఉందో మనకెవరికి తెలియదు.
మీరింకా చిన్న పిల్లలే, ఎదైనా చూడకూడని video ఇందులో ఉంటే ఎలా! కాబట్టి Tape ని Play చేసేందుకు నేను ఒప్పుకోనని Sarah పిల్లల్తో అంటది. కానీ Timmy కి మాత్రం, అందులో ఎలాంటి video ఉందో తెలుసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటది. Timmy Sarah తో, “నాకు తెలిసి ఆ tape లో ఏదైనా horror movie ఉండొచ్చు. So ఒకసారి play చేసి చూద్దామని అంటాడు. Tia కూడా, అందులో ఏముందో తెలుసుకుందామని అడగడంతో, ఇక Sarah Video Tape ని Play చేసేందుకు ఒప్పుకుంటది. “కానీ ఇందులో చూడకూడని విషయాలు ఏమైనా ఉంటే మాత్రం, నేను Tape ని Play చేయడం వెంటనే ఆపేస్తానని Sarah అంటది. అందుకు Timmy, Tia కూడా ఒప్పుకుంటారు. ఇక వాళ్ళు Tape ని Play చేసి చూడడం మొదలు పెడతారు.
Play చేస్తే అదొక Halloween Night. Casey (కేసి) అనే అమ్మాయి, రైల్వే స్టేషన్ కి చేరుకుని Train కోసం wait చేస్తుంటది. అక్కడే Art The Clown (ఆర్ట్ ది క్లౌన్) కూడా కూర్చొని ఉంటాడు. Art ని చూసిన Casey, “Halloween Festival లో భాగంగా ఎవరో ఇలా విచిత్రంగా Costume వేసుకున్నారులే” అని లైట్ తీసుకుంటది. Art Casey దగ్గరికి వచ్చి తనకొక Flower ని ఇస్తాడు. అప్పుడు Casey ఒక పక్క కాస్త tension పడుతూనే, ఇంకోపక్క art ఇచ్చే flower ని silent గా తీసుకుంటది. అయితే ఆ flower లో పురుగులు ఉండటంతో, casey బాగా భయపడిపోయి flower ని కిందపడేస్తది. అది చూసి Art విచిత్రంగా నవ్వుతుంటాడు. వాడి నుంచి దూరంగా వెళ్లేందుకు Casey పరిగెడుతుండగా, art casey చేతిని పట్టుకుని, తనకి మత్తుమందు inject చేసేస్తాడు.

2) టన్నెల్లో మాన్స్టర్
Cut చేస్తే, Casey ఒక క్రీపి place లో చైన్స్ తో బంధించబడి ఉంటుంది. అక్కడ తనకి Sara (శారా) and Kristen (క్రిస్టిన్) అనే ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్లిద్దరు కూడా చైన్స్ తో బంధించబడి ఉంటారు. అసలు వాళ్ళక్కడికి ఎలా వచ్చారో వాళ్ళకేమి గుర్తుండదు. Maybe ఆ Clown costume లో ఉన్న వ్యక్తే తమనిక్కడికి తీసుకొచ్చుంటాడని వాళ్ళనుకుంటారు. Kristen Casey తో మాట్లాడుతూ, “మా ఇద్దరితో పాటు ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉండేది. కానీ టన్నెల్లో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయిని దారుణంగా చంపేశాడని భయపడుతూ చెప్తుంది. అది విని Casey కూడా చాలా భయపడిపోతుంది.
చంపాలనుకుంటే మమ్మల్ని చంపెయ్యొచ్చుగా, అలా కాకుండ మమ్మల్నిక్కడ ఎందుకు బంధించారని Casey గట్టిగా అరుస్తుంది. మరణం కోసం wait చేయడం ఇష్టం లేక, ఎలాగైనా సరే ఇక్కడినుంచి బయటపడాలని casey డిసైడయిద్ది. అప్పుడు Kristen Casey తో, “మేం Already ఇక్కడినుంచి బయటపడేందుకు try చేశాం. కాని మనం బయటపడేందుకు ఇక్కడ ఏ మార్గం లేదని చెప్తుంది. But Casey మాత్రం తన మాటల్ని పట్టించుకోదు. “ఎలాగైనా సరే ఇక్కడినుంచి తప్పించుకోవాలి. Maybe ఈ టన్నెల్ మార్గం గుండా మనం బయటపడొచ్చేమో” అని Casey అంటది.
నిజానికి ఆ టన్నెల్లోనే ఈ అమ్మాయిల్ని చంపే monster ఉంటుంది. So టన్నెల్లోకి వెళ్ళడమంటే suicide చేసుకున్నట్టే. కాని Silent గా కూర్చొని ఉండే బదులు, ఇక్కడినుంచి తప్పించుకునేందుకు ఏదో ఒక ప్రయత్నం చేద్దామని Casey, Kristen and Sara తో అంటది. So Sara కూడా tunnel లోకి వచ్చేందుకు ఒప్పుకుంటది. Tunnel లోకి వచ్చేందుకు Kristen మొదట ఒప్పుకోదు. కానీ Sara తనని request చేయడంతో Kristen కూడా tunnel లోకి వచ్చేందుకు ok చెప్పిద్ది. సరిగ్గా అప్పుడే, టన్నల్లోని Monster Sara మెడకున్న చైన్ని గట్టిగా లాగగా, Chain తో పాటు Sara కూడా టన్నెల్లోకి వెళ్ళిపోతుంది. ఇకా Monster Sara ని చంపేస్తుంది.

3) మొదలైన భయం
ఇదంతా చూసి Kristen, Casey బాగా భయపడిపోతారు. కానీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని, తమ Plan ప్రకారం టన్నెల్లోకి వెళ్ళేందుకు సిద్ధమవుతారు. అలా వాళ్ళిద్దరూ టన్నెల్లో కొంత దూరం నడిచిన తర్వాత, తమ మెడకున్న చైన్స్ ని విడిపించుకునేందుకు try చేస్తుంటారు. ఆ సమయంలో Monster వాళ్ల దగ్గరకి వచ్చి Kristen కాళ్లు, చేతుల్ని నరికేయగా, Kristen అక్కడికక్కడే చనిపోతుంది. And తను casey ని కూడా చంపబోతుండగా, Casey Monster నుంచి తప్పించుకుని దూరంగా పారిపోతుంది.
Tia, Sarah ఒకపక్క భయపడుతూనే, ఇంకోపక్క Video ని చూస్తుంటారు. But Timmy మాత్రం అసలు కల్లార్పకుండా చాలా interest గా చూస్తుంటాడు. కట్ చేస్తే కొన్ని Demons Casey ని ఒక చోట పడుకోబెట్టి, తన చుట్టూ round గా నిలబడి ఉంటాయి. అక్కడొక Pregnant woman ని కూడా demons బంధించి ఉంటాయి. అప్పుడొక Witch, Pregnant woman దగ్గరికెళ్లి, కత్తితో తన స్టమక్ ని అడ్డంగా కోసి, ఆమె కడుపులోని బిడ్డను బయటకి తీస్తుంది. అప్పుడా Pregnant woman body లోంచి బయటకొచ్చిన రక్తాన్ని, Witch తీసుకెళ్ళి సాతాన్ కి అందిస్తుంది. సాతాన్ ఆ రక్తాన్ని తాగి, Casey దగ్గరకొచ్చి తనతో బలవంతంగా మీటవుతాడు.
Video మరీ violent గా మారుతుండడంతో Sarah tape ని play చేయడం ఆపేస్తది. Sarah పిల్లల్తో, “నిద్రపోయే టైమయింది. So వెళ్లి పడుకోండని చెప్తుంది. అయితే Timmy కి ఆ వీడియో పై బాగా interest కలిగి, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ Sarah మాత్రం, Timmy కి Video Tape ని ఇచ్చేందుకు ఒప్పుకోదు. So చేసేదేం లేక Timmy తన room కెళ్లి bed పై పడుకుంటాడు. Tia కూడా నిద్రపోయేందుకు తన రూమ్ కి వెళ్తది.

4) ముగింపు
Tia, Sarah తో మాట్లాడుతూ, “ఆ Clown నిజంగా ఉన్నాడంటావా?” అని కొంచెం భయపడుతు అడిగిద్ది. అప్పుడు Sarah, “Demons, Witches, Monsters నిజంగా ఉండవు. మనం చూసింది just ఒక Scary movie మాత్రమే. నువ్వేం భయపడకు” అని అంటది. కానీ Tia, Sarah తో, “ఆ వ్యక్తి మనిషే కదా. కాకపోతే తను Clown లాగా బట్టలు వేసుకున్నాడు. So నిజంగా ఆ Clown ఉండే ఛాన్స్ ఉంది. Like a Serial killer” అని చెప్తుంది. అప్పుడు Sarah, “మనం చూసింది just movie మాత్రమే. ఇవేవీ ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా నిద్రపో” అని tia కి ధైర్యం చెప్తది.
Cut చేస్తే, ఒంటరిగా పడుకునేందుకు కాస్త భయమేయడంతో, Tia Timmy room లో కెళ్లి తన పక్కన పడుకుంటది. Sarah హాల్లో కూర్చొని TV చూస్తుండగా, తన కెందుకో ఆ video tape ని play చేయాలని అనిపిస్తది. So Sarah video ని play చేస్తుంది. అయితే ఈసారి Scene వేరే చోట ఓపెనవుతుంది. Caroline (క్యరొలైన్) తన భర్త John తో కలిసి ఒక కొత్త ఇంటికి మూవవుతుంది. John పని మీద బయటకి వెళ్ళగా, Caroline ఒక్కతే ఇంట్లో తమ వస్తువులని సర్దుతుంటది. Actual గా John ఒక Artist అనమాట. Caroline తన ఫ్రెండ్ Mary తో ఫోన్లో మాట్లాడుతూ, “ఈ మధ్య John ఒక విచిత్రమైన Painting వేశాడు. అసలా painting ని చూడాలంటేనే నాకు చాలా భయంగా ఉంది.
అసలా Painting ని తను ఎప్పుడు వేశాడో John కి కూడా గుర్తులేదంటా. ఈ మధ్య John కి పీడ కలలు కూడా బాగా వస్తున్నాయని Caroline చెప్తది. అలా వాళ్లిద్దరు కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటారు. Mary తో ఫోన్ మాట్లాడిన తర్వాత, Caroline ప్రశాంతంగా టీ తాగుతుండగా, ఇంట్లో సడన్గా Power పోతుంది. సరిగ్గా అప్పుడే, ఒక వస్తువు కాంతివంతంగా మెరుస్తూ ఆకాశం నుంచి భూమి మీద పడుతుంది. ఇళ్లంతా చీకటిగా ఉండగా, Caroline కి upstairs నుంచి some kind of creepy sound వినిపిస్తది. దాంతో Caroline బాగా భయపడిపోయి Town లోకి వెళ్లేందుకు Car లోకి చేరుకుంటది. కానీ ఆ Car start అవ్వదు. ఇక చేసేదేం లేక Caroline మళ్లీ ఇంట్లోకి వచ్చేస్తది.
Image Credit: All Hallow’s Eve (2013)