All Hallow’s Eve (2013) Plot Summary Explained in Telugu

All Hallow’s Eve (2013) Plot Summary Explained in Telugu

ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా చాలా భిన్నంగా ఉంటది. సినిమా పేరు ఏంటంటే “All Hallow’s Eve”. ఇది 2013లో ప్రేక్షకుల ముందుకు DVD రూపంలో వచ్చింది. ఇది మామూలు హార్రర్ సినిమా కాదు. ఇందులో మూడు భయంకరమైన కథలను ఒకే ఫ్రేమ్‌లో కట్టిపడేసే విధంగా రూపొందించారు. ఈ మూడు కథల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఒక విచిత్రమైన క్లౌన్. ఈ క్లౌన్ చూసేందుకు చాలా భయంకరంగా, క్రూరంగా ఉంటాడు. చిన్నపిల్లలు ఎవరైనా ఇతన్ని చూశారంటే భయంతో గగ్గోలుపెట్టాల్సిందే. అంత భయానకంగా ఉంటాడనమాట ఈ క్లౌన్.

ఒక అమ్మాయి హాలోవీన్ రాత్రి ఇద్దరు పిల్లలకి బేబీ సిట్టింగ్ చేస్తుంటది. ఆ పిల్లలకి ట్రిక్-ఆర్-ట్రీట్ సమయంలో ఒక విచిత్రమైన VHS టేప్ దొరికిద్ది. ఆ టేప్ ప్లే చేసి చూడగా, అందులో మూడు భయంకరమైన కథలు, ఆ కథల్లో ఈ విచిత్రమైన క్లౌన్ ఉంటాడు. అతని రూపం, అతని నిశ్శబ్ద హావభావాలు ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురిచేస్తాయి. వీక్ హార్ట్ ఉన్నవాళ్ళు ఈ సినిమాని అసలు చూడలేరు. ఇందులోని డార్క్ విజువల్స్, క్లౌన్ చేసే విచిత్రమైన పనులు ప్రేక్షకుల మనసులో అశాంతి కలిగిస్తాయి. ఇంతకీ ఆ క్లౌన్ ఎవరు!? ఆ క్లౌన్ వల్ల ఏర్పడిన సమస్యలేంటో తెలుసుకుందాం రండి!

ఇప్పుడు కథ చూద్దాం!
1) హాలోవీన్ సంబరాలు

అదొక హాలోవీన్ రాత్రి. ‘టిమ్మి’ మరియు ‘తియ’ అనే ఇద్దరు పిల్లల్ని ‘శారా’ చూసుకుంటుంటది. ట్రిక్-ఆర్-ట్రీట్ ద్వారా తను సేకరించిన క్యాండీస్ లెక్క పెట్టేందుకు టిమ్మీ తన చాక్లెట్ బ్యాగ్ తెరవగా, అందులో తనకొక వీడియో టేప్ కనిపిస్తది. ఆ టేప్ ని తన బ్యాగ్ లో ఎవరుపెట్టారో, ఎప్పుడుపెట్టారో టిమ్మికి అసలు తెలియదు. ఏదైతేనేం అసలీ టేప్ లో ఏముందో తెలుసుకోవాలని, టిమ్మి చాలా ఉత్సాహపడతాడు. తను ఆ వీడియో టేప్ ప్లే చేయబోతుండగా, శారా తన దగ్గర్నుంచి టేప్ తీసేసుకుంటది. “అసలీ టేప్ లో ఎలాంటి వీడియో ఉందో మనకెవరికి తెలియదు.

మీరింకా చిన్న పిల్లలే, ఏదైనా చూడకూడని వీడియో ఇందులో ఉంటే ఎలా! కాబట్టి దీన్ని ప్లే చేసేందుకు నేను ఒప్పుకోను” అని శారా పిల్లల్తో అంటది. కానీ టిమ్మికి మాత్రం, అందులో ఎలాంటి వీడియో ఉందో తెలుసుకోవాలని ఉత్సాహం పెరిగిపోతుంటది. టిమ్మి శారాతో, “నాకు తెలిసి ఆ టేప్ లో ఏదైనా దెయ్యాల సినిమా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ప్లే చేసి చూద్దాం” అని అంటాడు. తియ కూడా అందులో ఏముందో తెలుసుకుందామని అడగడంతో, ఇక శారా వీడియో టేప్ ప్లే చేసేందుకు ఒప్పుకుంటది. కానీ ఇందులో చూడకూడని విషయాలేమైనా ఉంటే మాత్రం, నేను టేప్ ని ప్లే చేయడం వెంటనే ఆపేస్తానని శారా అంటది. అందుకు టిమ్మి, తియ కూడా ఒప్పుకుంటారు. ఇక వాళ్ళు వీడియోని చూడడం మొదలుపెడతారు.

ప్లే చేస్తే అదొక హాలోవీన్ రాత్రి. ‘కేసి’ అనే అమ్మాయి, రైల్వే స్టేషన్ కి చేరుకుని రైలు కోసం ఎదురుచూస్తుంటది. అక్కడే “ఆర్ట్ ది క్లౌన్” అనే వ్యక్తి కూడా కూర్చొని ఉంటాడు. కేసీ, ఆర్ట్ ని చూసి, “హాలోవీన్ లో భాగంగా ఎవరో ఇలా విచిత్రంగా కాస్ట్యూమ్ వేసుకున్నారులే” అని అనుకుంటది. ఆర్ట్ తన దగ్గరికొచ్చి ఒక పువ్వు ఇస్తాడు. కేసీ ఒక పక్క కాస్త కంగారుపడుతూనే, ఇంకోపక్క ఆర్ట్ ఇచ్చే పువ్వుని మౌనంగా తీసుకుంటది. తీరాచుస్తే ఆ పువ్వులో పురుగులుండటంతో, కేసీ బాగా భయపడిపోయి దాన్ని వెంటనే కిందపడేస్తది. అది చూసి ఆర్ట్ విచిత్రంగా నవ్వుతుంటాడు. వాడి నుంచి దూరంగా వెళ్లేందుకు కేసీ పరిగెడుతుండగా, ఆర్ట్ తన చేతిని పట్టుకుని మత్తుమందు గుచ్చుతాడు.

All Hallow’s Eve (2013) Plot Summary Explained in Telugu
All Hallow’s Eve (2013) Plot Summary Explained in Telugu
2) సొరంగంలో రాక్షశుడు

కొంచెంసేపటి తర్వాత కేసీ ఒక చీకటి ప్రదేశంలో ఇనుప గొలుసులతో బంధించబడి ఉంటుంది. అక్కడ తనకి ‘శారా’, ‘క్రిస్టిన్’ అనే ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్లిద్దరు కూడా గొలుసులతో బంధించబడి ఉంటారు. అసలు వాళ్ళక్కడికి ఎలా వచ్చారో, ఎప్పుడొచ్చారో వాళ్ళకేమి గుర్తుండదు. బహుశా ఆ క్లౌన్ కాస్ట్యూమ్ లో ఉన్న వ్యక్తే తమనిక్కడికి తీసుకొచ్చుంటాడని వాళ్ళనుకుంటారు. క్రిస్టిన్, కేసీతో మాట్లాడుతూ, “మా ఇద్దరితో పాటు ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉండేది. కానీ సొరంగంలో ఉన్న వ్యక్తి ఆ అమ్మాయిని దారుణంగా చంపేశాడు” అని భయపడుతూ చెప్తది. అది విన్న కేసీ చాలా భయపడిపోద్ది.

చంపాలనుకుంటే మమ్మల్ని చంపెయ్యొచ్చుగా, అలా కాకుండ మమ్మల్నిక్కడ ఎందుకు బంధించారని కేసీ గట్టిగా అరుస్తుంది. మరణం కోసం ఎదురుచూడడం ఇష్టం లేక, ఎలాగైనా సరే ఇక్కడినుంచి బయటపడాలని కేసీ నిర్ణయించుకుంటది. అప్పుడు క్రిస్టిన్ తనతో, “ఇక్కడినుంచి బయటపడేందుకు మేము ఇంతకుముందే ప్రయత్నించాం. కాని మనం బయటపడేందుకు ఇక్కడ ఏ మార్గం లేదు” అని చెప్తది. కానీ తను మాత్రం క్రిస్టిన్ మాటల్ని పట్టించుకోదు. “ఎలాగైనా సరే ఇక్కడినుంచి తప్పించుకోవాలి. బహుశా ఈ సొరంగ మార్గం గుండా మనం బయటపడొచ్చేమో” అని కేసీ అంటది.

నిజానికి ఆ సొరంగంలోనే ఈ అమ్మాయిల్ని చంపే రాక్షషుడు ఉంటాడు. కాబట్టి సొరంగంలోకి వెళ్ళడమంటే ఆత్మహత్య చేసుకున్నట్టే. కాని మౌనంగా కూర్చుని ఉండే బదులు, ఇక్కడినుంచి తప్పించుకునేందుకు ఏదో ఒక ప్రయత్నం చేద్దామని కేసీ, క్రిస్టిన్ మరియు శారాతో అంటది. ఇక శారా కూడా సొరంగంలోకి వచ్చేందుకు ఒప్పుకుంటది. క్రిస్టిన్ మాత్రం అందుకు ఒప్పుకోదు. అప్పుడు శారా తనని బ్రతిమిలాడడంతో క్రిస్టిన్ కూడా సొరంగంలోకి వచ్చేందుకు సరే అంటది. సరిగ్గా అప్పుడే, సొరంగంలోని రాక్షషుడు, శారా మెడకున్న గొలుసుని గట్టిగా లాగగా, ఆ గొలుసుతో పాటు శారా కూడా రాక్షషుడి కాళ్ళ దగ్గరికెళ్తది. ఇంక ఆ రాక్షషుడు శారాని చంపేస్తాడు.

3) ఎవరూ ఊహించని సన్నివేశం

ఇదంతా చూసి క్రిస్టిన్, కేసీ బాగా భయపడిపోతారు. కానీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని, తమ పథకం ప్రకారం సొరంగంలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతారు. అలా వాళ్ళిద్దరూ సొరంగంలో కొంత దూరం నడిచిన తర్వాత, తమ మెడకున్న గొలుసుల్ని విడిపించుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో రాక్షషుడు వాళ్ల దగ్గరికొచ్చి క్రిస్టిన్ కాళ్లు, చేతుల్ని నరికేయగా తను అక్కడికక్కడే చనిపోద్ది. ఆ రాక్షషుడు కేసీని కూడా చంపబోతుండగా, కేసీ తెలివిగా తప్పించుకుని దూరంగా పారిపోద్ది.

తియ, శారా ఒకపక్క భయపడుతూనే, ఇంకోపక్క వీడియో చూస్తుంటారు. కానీ టిమ్మి మాత్రం చాలా ఆసక్తిగా వీడియో చూస్తుంటాడు. కట్ చేస్తే కొన్ని దెయ్యాలు కేసీని ఒక చోట పడుకోబెట్టి, తన చుట్టూ నిలబడి ఉంటాయి. అక్కడొక గర్భిణీ స్త్రీని కూడా దెయ్యాలు బంధించి ఉంటాయి. అప్పుడొక మంత్రగత్తె, గర్భిణీ స్త్రీ దగ్గరికెళ్లి, కత్తితో తన గర్భాన్ని అడ్డంగా కోసి, ఆమె కడుపులోని బిడ్డను బయటకి తీస్తది. అప్పుడా స్త్రీ గర్భంలోంచి బయటకొచ్చిన రక్తాన్ని, మంత్రగత్తె తీసుకెళ్ళి సాతాన్ కి అందిస్తుంది. సాతాన్ ఆ రక్తాన్ని తాగి, కేసీ దగ్గరకొచ్చి తనతో బలవంతంగా శారీరకంగా కలుస్తాడు.

All Hallow’s Eve (2013) Plot Summary Explained in Telugu
All Hallow’s Eve (2013) Plot Summary Explained in Telugu

వీడియో మరీ దారుణంగా మారుతుండడంతో శారా టేప్ ప్లే చేయడం ఆపేస్తది. తను పిల్లల్తో, “నిద్రపోయే సమయమయింది. కాబట్టి వెళ్లి పడుకోండి” అని చెప్తది. టిమ్మికి ఆ వీడియో పై బాగా ఆసక్తి కలిగి, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ శారా మాత్రం, టిమ్మీకి టేప్ ఇచ్చేందుకు ఒప్పుకోదు. ఇక చేసేదేం లేక టిమ్మి తన గదిలోకెళ్లి బెడ్ పై పడుకుంటాడు. తియా కూడా నిద్రపోయేందుకు తన గదికి వెళ్తది.

4) మొదలైన భయం

తియా, శారాతో మాట్లాడుతూ, “ఆ క్లౌన్ నిజంగా ఉన్నాడంటావా?” అని కొంచెం భయపడుతూ అడిగిద్ది. అప్పుడు శారా, “దెయ్యాలు, భుతాలు, రాక్షషులు నిజంగా ఉండవు. మనం చూసింది కేవలం ఒక సినిమా మాత్రమే. నువ్వేం భయపడకు” అని అంటది. కానీ తియా, “ఆ వ్యక్తి మనిషే కదా. కాకపోతే తను క్లౌన్ లాగా బట్టలు వేసుకున్నాడు. అంటే నిజంగా ఆ క్లౌన్ ఉండే ఉండొచ్చు కదా!” అని అంటది. అప్పుడు శారా, “మనం చూసింది నిజంగా ఒక సినిమా మాత్రమే. ఇవేవీ ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా నిద్రపో” అని తియాకి ధైర్యం చెప్తది.

కట్ చేస్తే, ఒంటరిగా పడుకునేందుకు కాస్త భయమేయడంతో, తియా టిమ్మీ గదిలోకెళ్లి తన పక్కన పడుకుంటది. శారా హాల్లో కూర్చొని టీవీ చూస్తుండగా, తనకెందుకో ఆ టేప్ ప్లే చేయాలనిపిస్తది. ఇక శారా ఆ టేప్ ప్లే చేస్తది. అయితే ఈసారి సీన్ వేరే చోట మొదలయిద్ది. ‘క్యరొలైన్’ తన భర్త ‘జాన్’ తో కలిసి ఒక కొత్త ఇంటికి వస్తది. జాన్ పని మీద బయటికెళ్ళగా, క్యరొలైన్ ఒక్కతే ఇంట్లో తమ వస్తువుల్ని సర్దుతుంటది. జాన్ ఒక ఆర్టిస్ట్ అనమాట. క్యరొలైన్ తన ఫ్రెండ్ ‘మేరీ’ తో ఫోన్లో మాట్లాడుతూ, “ఈ మధ్య జాన్ ఒక విచిత్రమైన పెయింటింగ్ వేశాడు. అసలా పెయింటింగ్ చూడాలంటేనే నాకు చాలా భయంగా ఉంది.

అసలా తను దాన్ని ఎప్పుడు వేశాడో జాన్ కి కూడా గుర్తులేదంటా. ఈ మధ్య జాన్ కి పీడకలలు కూడా బాగా వస్తున్నాయి” అని చెప్తది. అలా వాళ్లిద్దరు కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటారు. మేరీతో ఫోన్ మాట్లాడిన తర్వాత, క్యరొలైన్ ప్రశాంతంగా టీ తాగుతుండగా హఠాత్తుగా కరెంట్ పోయిద్ది. సరిగ్గా అప్పుడే, ఒక వస్తువు కాంతివంతంగా మెరుస్తూ ఆకాశం నుంచి భూమి మీద పడిద్ది. ఇళ్లంతా చీకటిగా ఉండగా, క్యరొలైన్ కి ఇక రకమైన ఒళ్ళు గగుర్పొడిచే శబ్ధాలు వినిపిస్తాయి. దాంతో తను బాగా భయపడిపోయి టౌన్ లోకి వెళ్లేందుకు కారులోకి చేరుకుంటది. కానీ ఆ కార్ స్టార్ట్ అవ్వదు. ఇక చేసేదేం లేక క్యరొలైన్ మళ్లీ ఇంట్లోకొస్తది.

5) ముగింపు

ఈ విధంగా కథ చాలా భయానకంగా సాగుతుంది. ప్రతీ సన్నివేశంలో ఏదో తెలియని భయం ఉంటది. ఇప్పటివరకు మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించే మాట్లాడుకున్నాం. కథలో ఇంకొన్ని ట్విస్టులు కూడా దాగున్నాయి.

  • మొత్తానికి ఇది ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అయితే కాదు. ఈ సినిమాని చూడాలంటే కాస్త గుండె ధైర్యం కావాల్సిందే.
  • నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది.సినిమా మొత్తం ఒక డార్క్ వాతావరణంతో ముందుకు సాగుతుంది.
  • ముఖ్యంగా ఇందులోని క్లౌన్ పాత్ర నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడు. సినిమా మొత్తం తను సైలెంట్‌గానే ఉంటూ ఎదుటివారిని మాత్రం భయంతో కేకలు పెట్టేలా చేస్తాడు. అంటే సినిమాలో ఆ క్లౌన్ పాత్ర అంత కిరాతకంగా ఉందన్నమాట.

హార్రర్ జానర్‌ను ఇష్టపడే సినీ ప్రేమికులకు ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాని రాత్రి పూట చూస్తే మాత్రం థ్రిల్ ఇంకా ఎక్కువైద్ది. ఇక ఆలస్యమెందుకు, మీరు కూడా ఒకసారి ధైర్యం చేసుకుని ఈ సినిమాని చూసేయండి!

Leave a Comment