Rajinikanth’s VETTAIYAN Review

Rajinikanth’s VETTAIYAN Review:

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “వేట్టయాన్” సినిమా దసరా కానుకగా ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ, పాన్ ఇండియా మూవీగా రిలీజయిన “వేట్టయాన్”, ప్రేక్షకుల అంచనాలని అందుకుందో లేదో ఇప్పుడు చూసేద్దాం.

బడ్జెట్ సుమారు:

“జైలర్” లాంటి భారీ హిట్ తర్వాత, రజినీకాంత్ నటిస్తున్న మూవీ అవడంతో, మామూలుగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సుమారు 160 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన “వేట్టయాన్” మూవీ, తమిళ్లో మాత్రమే కాకుండా అన్నీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాకి దర్శకుడు “TJ జ్ఞానవేల్”. రజినీకాంత్ గత సినిమా “జైలర్” కి మ్యూజిక్ ని అందించిన అనిరుధ్ రవిచందరే, ఈ “వేట్టయాన్” కి కూడా మ్యూజిక్ ని అందించాడు.

ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో యాక్టర్:

“వేట్టయాన్” పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండడంతో, ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కో యాక్టర్ ని సినిమాలోకి తీసుకున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి మరియు మాలీవుడ్ నుంచి ఫాహద్ ఫాసిల్ ని ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంకా కొన్ని కీలక పాత్రల్లో మంజు వారియర్, రితికా సింగ్ అలాగే రావు రమేష్ లు నటించారు. ఇలా వేట్టయాన్ సినిమా భారీ యాక్టర్స్ తోనే గ్రాండ్ గా తెరకెక్కింది.

Rajinikanth's VETTAIYAN Review
Rajinikanth’s VETTAIYAN Review
కంగువని వెనక్కినెట్టి మరి:

నిజానికి ఈ రోజునే (అక్టోబర్ 10, 2024) తమిళ స్టార్ హీరో సూర్య నటించిన “కంగువ” కూడా రిలీజ్ అవ్వాల్సింది. కానీ వేట్టయాన్ వస్తుండడంతో కంగువ నవంబర్ 14కి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది.

వేట్టయాన్ ఎలా ఉంది!?

“వేట్టయాన్” లో “సూపర్ స్టార్ రజినీకాంత్” పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సినిమా కథంతా ఎన్కౌంటర్స్ చుట్టూ నడుస్తది.

ఫస్టాఫ్ కి మాత్రం ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ల పోటాపోటీ యాక్టింగ్, Background Music మరియు డైరెక్టర్ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విధానం ఫస్టాఫ్ కి పిల్లర్స్ గా నిలిచాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం విషయం కాస్త తేడాకొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే, ఎంతో excitement తో నడిచిన ఫస్టాఫ్ కథ, సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం బాగా నెమ్మదించింది. సెకండ్ హాఫ్ లో లాగ్ ఉండడంతో, ప్రేక్షకులు కాస్త విసుగు చెందారన్న మాట వాస్తవమే. సినిమా పూర్తిగా యాక్షన్ – థ్రిల్లర్ అవడంతో, ఇందులో కామెడీ సీన్స్ అనేవి అంతగా కనిపించవు. ఫస్టాఫ్ లాగానే సెకండ్ హాఫ్ కూడా లాగ్ లేకుండా రన్ అయి ఉంటే, సినిమా టాక్ మరింతగా పెరిగిపోయుండేది.

చాలా సినిమాలే ఉన్నాయ్:

ప్రస్తుతం నడుస్తున్నది దసరా సీజన్ అయినప్పటికీ, మరీ అంత పెద్ద సినిమాలేవి పోటీలో లేవు. కానీ కొన్ని మూవీస్ మాత్రం దసరా రేసులో ఉన్నాయి. శ్రీను వైట్ల – గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన “విశ్వం” సినిమా అక్టోబర్ 11న రిలీజవ్వబోతుంది. సుధీర్ బాబు నటించిన “మా నాన్న సూపర్ హీరో” అనే చిత్రం కూడా అక్టోబర్ 11నే రిలీజ్ కి సిద్ధమయింది. వీటికి తోడు అలియాభట్ నటించిన పాన్ ఇండియా మూవీ, “జిగ్రా” కూడా అక్టోబర్ 11నే థియేటర్స్ లోకి రాబోతుంది. అలాగే దిల్ రాజు రోజు బ్యానర్ లో తెరకెక్కిన “జనకా అయితే గనక” అనే సినిమా కూడా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 12న వచ్చేందుకు రెడీ అయింది. “జనకా అయితే గనక” సినిమాలో “సుహాస్” హీరోగా నటించాడు. ఇలా వేట్టయాన్ రిలీజయిన మరుసటి రోజు నుంచే చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ మీడియం రేంజ్ సినిమాలే అయినప్పటికీ, పాజిటివ్ టాక్ వస్తే మాత్రం థియేటర్స్ కి ప్రేక్షకుల్ని ఈజీగా లాగేస్తాయి.

వేట్టయాన్ ముగింపు:

అయితే ఇప్పటికి కూడా “వేట్టయాన్” ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల్లో కాస్త Mixed Talk ఉన్నప్పటికీ, తమిళ ప్రేక్షకులకి వేట్టయాన్ బానే వంటపట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకైతే మాత్రం, ఈ సినిమా ఒక మంచి దసరా కానుకనే చెప్పుకోవచ్చు.

ఈ సినిమా మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి.

 

Frequently Asked Questions (FAQ):

Is Vettaiyan a movie?

Will Rajinikanth’s ‘Vettaiyan’ be a blockbuster?

How much does Vettaiyan cost in India?

Did Vettaiyan face a risk in making a film for a superstar?

Leave a Comment