Suriya’s KANGUVA Postponed/New Release Date

Suriya’s KANGUVA Postponed/New Release Date:

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన “కంగువ” మూవీ రిలీజ్ వాయిదా పడింది. నిజానికి “కంగువ” సినిమా కోసం తమిళ్లో మాత్రమే కాదు, తెలుగులోను, హిందీలోను మరియు అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Suriya's KANGUVA Postponed/New Release Date
Suriya’s KANGUVA Postponed/New Release Date

కంగువ మూవీని “శివ” డైరెక్ట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ఉన్నాడు. బాలీవుడ్ నటి దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ (Different Concept):

కంగువ మూవీ ట్రైబల్ జోనర్ లో నడిచే కథ. నిజానికి ఇలాంటి జోనర్ లో మూవీస్ రావడం అనేది ఇండియాలో చాలా అరుదు. ప్రేక్షకులు కూడా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇప్పటికే రిలీజ్ అయిన “కంగువ” ట్రైలర్ మూవీపై మంచి హైప్ ని తీసుకుని వచ్చింది.

అక్టోబర్ 10/2024:

సుమారు 300 నుంచి 350 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీని, మొదట దసరా కానుకగా అక్టోబర్ 10 2024న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా అక్టోబర్ 10నే సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా చెప్పేశారు. కంగువ పాన్ ఇండియా మూవీగా అన్నీ భాషల్లో రిలీజ్ అవుతుండడంతో, దసరా సీజన్ అయితేనే బాగా వర్కౌట్ అయిద్దని చిత్ర యూనిట్ భావించారు.

నిజానికి ఇంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాని దసరా సీజన్ లో రిలీజ్ చేస్తేనే మంచిదని, సినిమా వర్గాలు కూడా అనుకున్నాయి. దసరా హాలిడేస్ ఉండడం వల్ల సినిమాకి మంచి ప్లస్ అయ్యేది.

వెట్టయాన్ తో పోటీ:

అయితే అదే రోజున (అక్టోబర్ 10/2024), సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “వెట్టయాన్” మూవీని రిలీజ్ చెయ్యబోతునట్టు మూవీ మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. “కంగువ”, “వెట్టయాన్” తో పోటీకి దిగడమనేది, మంచి ఆలోచనా! లేదా, చెడ్డ ఆలోచనా! అనేది పక్కన పెడితే, 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీసినప్పుడు, పోటీ లేకుండా థియేటర్స్ లోకి వస్తేనే మంచిదని ఎవరైనా అనుకుంటారు. ఆ విధంగానే కంగువ మేకర్స్ కూడా భావించారు.

రజినీకాంత్ గత చిత్రమైన “జైలర్” సూపర్ హిట్ అవడంతో “వెట్టయాన్” పై కూడా ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో పోటీకి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ అక్టోబర్ 10న “కంగువ” ని రిలీజ్ చేయకపోతే, మరి ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే సందిగ్ధంలో కంగువ టీం ఉన్నారు.

పోటీ తప్పేలా లేదు:

“పుష్ప 2” డిసెంబర్ 6న రిలీజ్ అవ్వడంలేదని కొన్ని వార్తలు రావడంతో, “కంగువ” ని డిసెంబర్ మొదట్లో రిలీజ్ చేయాలనుకన్నారు. కానీ డిసెంబర్ 6నే “పుష్ప 2” వస్తుందని పుష్పా మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెప్పడంతో, “కంగువ” మళ్ళీ డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి. క్రిస్మస్ కానుకగా రావాలనుకుంటే, ఆ సమయంలో శంకర్-రామ్ చరణ్ కాంబోలో వస్తున్న “గేమ్ చేంజర్” రిలీజ్ అవ్వబోతుంది.

అసలు ఇదేదీ కాదని 2025 జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటే, అప్పుడు పోటీలో చాలా సినిమాలే ఉన్నాయి. అజిత్ నటిస్తున్న “Good Bad Ugly”, చిరంజీవి నటిస్తున్న “విశ్వంభరా”, బాబీ-బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమా మరియు అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబోలో రాబోతున్న సినిమా. ఇవన్నీ కూడా సంక్రాంతి కానుకగా జనవరిలోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి జనవరిలో రావడం కూడా కంగువకి కష్టమే.

కలెక్షన్స్ పై దెబ్బ:

నిజానికి “కంగువ”, “వెట్టయాన్” కి పోటీగా రిలీజ్ అయినా, డిసెంబర్ లో రిలీజ్ అయ్యే “పుష్ప 2”, “గేమ్ చేంజర్” కి పోటీగా రిలీజ్ అయినా లేదా జనవరిలో రిలీజ్ అయ్యే “Good Bad Ugly”, “విశ్వంభర” ఇంకా బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలకి పోటీగా రిలీజ్ అయినా కూడా, “కంగువ” పోటీని తట్టుకుని నిలబడగలదు.

కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, పోటీకి దిగినట్లయితే కలెక్షన్స్ మీద ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ పడిద్ది.
పోటీలో ఉన్న సినిమాల కలెక్షన్స్ మీద “కంగువ” ఎఫెక్ట్ చూపించొచ్చు. లేదా పోటీలో ఉన్న సినిమాల వల్ల “కంగువ” కలెక్షన్స్ కే దెబ్బపడొచ్చు.

నవంబర్ లో రిలీజ్ కి ప్లాన్:

భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెెక్కించినప్పుడు, ఇలా రిస్క్ చేయకపోవడమే మంచిదనీ “కంగువ” మేకర్స్ అనుకుంటున్నారు. అందుకని “కంగువ” ని ఇటు అక్టోబర్ లో కాకుండా, అటు డిసెంబర్, జనవరి లో కాకుండా నవంబర్ 14, గురువారం రోజున రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నవంబర్ 14న అయితేనే, ఎటువంటి పోటీ లేకుండా బరిలోకి దిగవచ్చు. దీనికి తోడు నవంబర్ 15న “గురు నానక్ జయంతి” మరియు “కార్తీక పౌర్ణమి” సెలవులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇంకా శని, ఆదివారాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కవర్ చేయొచ్చు అని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

FAQ (Frequently Asked Questions):

Who are the main actors in Kanguva?

When is Kanguva releasing?

Who directed Kanguva?

What are some similar movies to Kanguva?

Who is the music director for Kanguva?

Who is the cinematographer for Kanguva?

Where can I watch Kanguva?

What is the genre of Kanguva?

Leave a Comment