Hey readers, ఈరోజు మనం The GOAT Box Office Collections గురించి మాట్లాడుకుందాం!
దలపతి విజయ్ నటించిన, The Goat (The Greatest Of All Time) అనే మూవీ రీసెంట్ గా సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. 380 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసాడు. పాన్ ఇండియా సినిమాగా GOAT అన్నీ భాషల్లో సెప్టెంబర్ 5నే రిలీజ్ అయింది.
మామూలుగా దలపతి విజయ్ సినిమా అంటే, అటు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి హైపే ఉంటుంది. దళపతి విజయ్ సినిమా వస్తుందంటే మన తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా చూస్తారు. అయితే విజయ్ గత సినిమా ఐన Leo తో Compare చేస్తే, ఈ GOAT సినిమాకి మాత్రం తెలుగు ఆడియన్స్ నుంచి ఊహించినంత మంచి స్పందనయితే లభించట్లేదు అనే టాక్ వినిపిస్తుంది.
LEO:
విజయ్ నటించిన గత సినిమా Leo ని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేశాడు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన Leo మూవీ, గత సంవత్సరం (2023) అక్టోబర్ 19న పాన్ ఇండియా మూవీగా అన్నీ భాషల్లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబట్టింది. LEO మూవీ తమిళనాడులో అయితే, రిలీజ్ అయిన మొదటి రోజే 145 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. అలా Leo మూవీ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి మంచి హిట్ గా నిలిచింది.
35 Chinna Katha Kaadhu
తండ్రిగా, కొడుకుగా:
దళపతి విజయ్ The GOAT మూవీలో డ్యుయల్ రోల్ లో నటించాడు. ఒకరు తండ్రి, మరొకరు కొడుకు. దళపతి విజయ్ ఇలా డ్యుయల్ రోల్ లో నటించడం ఇదేమి మొదటిసారి కాదు. విజయ్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో డ్యుయల్ రోల్ లో నటించాడు. విజిల్ అయితేనేమి, అదిరింది అయితేనేమి, ఇలా చాలా సినిమాల్లోనే ప్రేక్షకులు విజయ్ ని డ్యుయల్ రోల్ లో చూడడం జరిగింది. అదిరింది సినిమాలో అయితే దళపతి విజయ్ ముగ్గురిగా నటించి, ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందనని పొందాడు.
అసలు కథేంటి:
ఇప్పుడు మనం కొంచెం స్టోరీలోకి వెళ్ళినట్లయితే – స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Special Anti Terrorist Squad – SATS) లో సీక్రెట్ ఏజెంట్ గా గాంధీ (దళపతి విజయ్) ఉంటాడు. కానీ గాంధీ కొడుకు జీవన్, చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో అనుకోకుండా చనిపోతాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత జీవన్ బతికే ఉండడాన్ని గాంధీ చూసి, ఇక తను జీవన్ ని ఇండియాకి తీసుకుని వచ్చేస్తాడు. జీవన్ ఇంటికి వచ్చిన దగ్గరినుంచి, ఎవరో ఒక గుర్తుతెలియని వ్యక్తి, గాంధీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు!? తనెందుకు గాంధీ ఫ్రెండ్స్ ని చంపేస్తున్నాడనేదే మిగతా కథ!
మరి మ్యూజిక్ ఎలా ఉంది:
ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. సినిమాలో పాటలు పర్వాలేదనిపించాయి అండ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మంచిగానే ఉంది.
అయితే కలెక్షన్స్ చెప్పు గురూ:
ఒక పక్క మూవీకి Mixed టాక్ నడుస్తున్నా కూడా, కలెక్షన్స్ అయితే మాత్రం విపరీతంగా వస్తుండడం అనేది, ట్రేడ్ వర్గాలని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజునే GOAT మూవీ ప్రపంచవ్యాప్తంగా 126.32 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. రెండో రోజు కూడా GOAT మంచిగానే అన్నీ చోట్లా రన్ అవుతూ, 80 కోట్లకు పైగానే కలెక్షన్స్ ని రాబట్టింది. ఆ విధంగా GOAT మూవీ మొదటి రెండు రోజులకే 200 కోట్ల క్లబ్ లోకి చేరిందని మేకర్స్ అఫీషియల్ గా చెప్పేసారు.
Leo Day 1 కలెక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం, GOAT Day 1 కలెక్షన్స్ కాస్త తక్కువనే చెప్పుకోవాలి. Leo మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా 145 కోట్లు కొల్లగొట్టగా, GOAT మాత్రం 126.32 కోట్లు, అంటే సుమారు 127 కోట్లు మాత్రమే సాధించింది. GOAT మూవీ రిలీజ్ అయ్యి వారం కూడా కాకపోవడం, మరియు పోటీలో అంతగా ఏ సినిమా కూడా లేకపోవడంతో, Goat లాంగ్ రన్ లో ఇంకా పెద్ద మొత్తంలోనే కలెక్ట్ చేసే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. మరి చూద్దాం, ఈ GOAT మూవీ ఎంత వరకు వసూలు చేయగలుగుతుందో!
FAQ:
- When does Thalapathy Vijay’s ‘goat’ release?
- Who directed Thalapathy Vijay’s film ‘GOAT’?
- Is ‘goat’ a ‘greatest of all time’ starring Thalapathy Vijay?
- Is goat Vijay’s Best Performance?