Bagman Movie Explained & Summary in Telugu
Lionsgate Films Distribute చేసిన “Bagman” అనే హార్రర్ థ్రిల్లర్ 4.6/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ సెప్టెంబర్ 27, 2024 లో రిలీజయింది. ఈ సినిమాని Colm McCarthy డైరెక్ట్ చేశాడు. John Hulme కథని రచించారు. ఇక నటీనటుల విషయానికొస్తే Patrick అనే పాత్రలో Sam Claflin, Karina అనే పాత్రలో Antonia Thomas, Emily అనే పాత్రలో Frankie Corio, Bagman అనే పాత్రలో Will Devis మరియు Liam అనే పాత్రలో Steven Cree నటించారు. ఈ మూవీ సుమారు 12 నుంచి 15 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కింది. హార్రర్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా కాస్త ఇంట్రెస్ట్ గా ఉంటది. ప్రస్తుతం ఈ మూవీ Amazon Prime Video లో Available గా ఉంది.
ఇప్పుడు కథలోకి!
1) ప్రారంభం
ఓపెన్ చేస్తే బేస్బాల్ గ్రౌండ్ లో ఒక ఫాదర్ అండ్ డాటర్ ని చూపిస్తారు. ఆ పాప పేరు ఎమిలి. అతను ఎమిలీని, “ఏంటి నీకు ఈ మధ్య పీడకలు వస్తున్నాయంట కదా! నాకు వాటి గురించి చెప్పు” అని అడుగుతాడు. బట్ ఎమిలీ ఆ పీడకల గురించి తన ఫాదర్ కి అంత ఓపెన్ గా చెప్పదు. కట్ చేస్తే ఎమిలీ ఎంతో ఇష్టంగా సేకరించుకున్న కొన్ని బొమ్మల్ని, వస్తువుల్ని వాళ్ళ అమ్మ పడేయమని చెప్తది. ఆ పని మీద ఇద్దరూ బయటుంటారు. ఎమిలీకి ఒక బన్నీ బేర్ అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని కూడా పడేయాల్సి వస్తది. ఇక ఎమిలీ ఒక బొమ్మని కారు వెనక పెట్టి ముందుకొచ్చేసరికి అక్కడ ఎమిలీ ఫాదర్ ఉండడు. అక్కడున్న వీధి లైట్లు అన్నీ కూడా సడన్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుండడంతో ఎమిలీకి భయం వేస్తది.
ఇక లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. ఎమిలీ చిన్న పిల్ల కదా! సో బాగా భయం వేస్తది. ఇక ఎమిలీ భయం భయంగా తన ఫాదర్ ని వెతుక్కుంటూ వెళ్తది. అయితే అతను ఒక రూమ్ లో పారలైజ్ అయ్యి నేల మీద పడిపోయి ఉంటాడు. అతను ఎమిలీని పారిపోమ్మని చెప్తుంటాడు, కానీ వెంటనే అక్కడికి బ్యాగ్ మ్యాన్ వచ్చి ఆ పాపని మడత పెట్టి ఒక చిన్న బ్యాగ్ లో కుక్కేస్తాడు. పాపం ఎమిలీ చనిపోద్ది. మన చిన్నతనంలో మన అమ్మ వాళ్ళు మాట వినకపోయినా, అన్నం తినకపోయినా బూచోడు వస్తాడు, మాట వినకపోతే ఎత్తుకెళ్తాడు అని చెప్తుంటారు కదా! నాకు ఈ సీన్ చూసినప్పుడు వీడే ఆ బూచోడేమో అనిపించింది. కానీ వీడు మంచి పిల్లల్ని, అందంగా ఉండే పిల్లల్ని మాత్రమే బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తాడు.
వీడు మనిషి కాదు, వీడు ఒక రాక్షశుడు అని అనుకోవచ్చు, కొంచెం పవర్ఫుల్ గా కూడా ఉంటాడు. వీడు పిల్లల్ని తీసుకెళ్లి ఏం చేస్తాడనేగా మీ డౌట్? వీడు పిల్లల్ని తీసుకెళ్లి తినేస్తాడు. కట్ చేస్తే స్టోరీ నాలుగు సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో అయిన ప్యాట్ ని అతని ఫ్యామిలీని చూపిస్తారు. ప్యాట్ యొక్క వైఫ్ పేరు కరీనా అండ్ ప్యాట్ యొక్క కొడుకు పేరు జాక్. మనోడు మంచి మెకానికల్ ఇంజనీర్. ఎన్నో రకరకాల ప్రోటోటైప్స్ ని కూడా డిజైన్ చేస్తాడు, బట్ ఆ ప్రోటోటైప్స్ వేటికి కూడా ఫండింగ్స్ మాత్రం రావు. ప్యాట్ తను రీసెంట్ గా డిజైన్ చేసిన ఒక ప్రోటోటైప్ ని లియాం కి చూపిస్తాడు. ఈ లియాం ప్యాట్ యొక్క బ్రదర్ అనమాట.

2) Bagman నివసించే ప్రదేశం
ప్రస్తుతం లియామ్ తమ వారసత్వ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళది చెక్కల బిజినెస్ అనుకోండి. వీళ్ళ ఇల్లు కూడా పూర్తిగా లోన్ లోనే ఉంటది, కొన్ని అప్పులు కూడా ఉంటాయి. లియాం ప్యాట్ తో, “ఈ ప్రోటోటైప్స్, ఇవన్నీ తర్వాత చూద్దాం. ముందు మనం పని చేద్దాం. ఈ లోన్స్ అన్ని తీర్చేయాలి కదా!” అని అంటాడు. బట్ ప్యాట్ కి మాత్రం ఎలాగైనా తన ప్రోటోటైప్స్ కి ఫండింగ్ వస్తే బాగా సక్సెస్ అవ్వాలని ఆశగా ఉంటది. కట్ చేస్తే స్టోరీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ప్యాట్ అండ్ లియామ్ చిన్నతనంలో ఒక పాడుబడిన మైన్ దగ్గరికి వెళ్తారు. అది గోల్డ్ మైనా లేకపోతే బొగ్గుగనా తెలీదు కానీ, దాన్ని మాత్రం ప్రస్తుతం క్లోజ్ చేసి ఉంటారు.
అయితే అక్కడే బ్యాగ్ మ్యాన్ ఉంటాడని ఆ ఊరంతా పుకారనమాట. వీళ్ళ ఫాదర్ కూడా, “అసలు అటు వెళ్లొద్దు” అని కూడా చెప్తాడు. కానీ వీళ్ళకి ఆత్రం ఆగక అక్కడికి వెళ్తారు. ఆ గని ఎంట్రన్స్ దగ్గర ఒక ప్లం ట్రీ ఉంటది. దాని వుడ్ చాలా మెత్తగా, బొమ్మలు చెక్కడానికి కూడా చాలా వీలుగా ఉంటది. ప్యాట్ కి చిన్నప్పటి నుంచి బొమ్మలు చెక్కడం అంటే చాలా ఇష్టం. సో మనోడు ఆ చెట్టు కొమ్మ ఒకటి కట్ చేద్దామని అక్కడికి వెళ్లి దాన్ని లాగుతుంటాడు. లియామ్ ఏమో, “అరే వద్దురా వెళ్ళిపోదాం రా” అని అంటున్నా కూడా ప్యాట్ వినడు. ప్యాట్ ఆ చెట్టు కొమ్మని కట్ చేస్తుంటే, గని లోపల నుండి బ్యాగ్మెన్ చెయ్యి బయటికి వచ్చి కత్తెరతో ప్యాట్ హెయిర్ ని కట్ చేస్తుంది.
ఆ దెబ్బకి ప్యాట్ భయంతోటి కింద పడిపోతాడు.ఆ గని లోపల నుంచి వచ్చే ఒక భయంకరమైన శబ్దం వల్ల ప్యాట్ కి ఇంకా భయం వేస్తది. కట్ చేస్తే స్టోరీ ప్రెసెంట్ కి వస్తది. కరీనా సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటుండగా జాక్ ఉయ్యాల్లో ఊగుతుంటాడు. అప్పుడు జాక్ కి అక్కడున్న చెట్లలోంచి ఒక పిల్లాడు పిలుస్తున్నట్టు కనిపిస్తది. నిజానికి అది ఒక బొమ్మ. కానీ వీడు చిన్న పిల్లాడు కదా! వీడికి ఏం తెలుసు. ఆ బొమ్మకి అట్రాక్ట్ అయ్యి ఆ బొమ్మ వైపే వెళ్తాడు. నిజానికి ఆ బొమ్మని చూపిస్తూ పిలుస్తుంది ఎవరో కాదు, ఆ బ్యాగ్ మానే. ఇంటి పక్కన అంతా ఫుల్ అడవి లెక్కే ఉంటది. జాక్ ఆ బొమ్మని చూస్తూ వెళ్తుంటాడు. కరీనాకి ఉయ్యాల్లో జాక్ కనిపించకపోవడంతో, ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడని భయం వేసి అడవిలోకి పరిగెత్తుద్ది.

3) పిల్లాడికి టార్గెట్
ఈలోగా జాక్ కి ఆ బొమ్మ ఒక చెట్టు వెనక కనిపించి, “ఇక్కడున్నావా” అని దాని దగ్గరికి వెళ్తాడు. ఇంకేముంది జాక్ కూడా ఫినిష్ అయిపోయాడని అనుకుంటున్నారా! కాదు లేండి, జాక్ కి ఏమీ కాదు. వాడు హాయిగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆ సౌండ్ విని కరీనా ఫాస్ట్ గా జాక్ దగ్గరికి వచ్చేస్తది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి కరీనా కాస్త భయపడుతూ జరిగిన విషయం అంతా ప్యాట్ కి చెప్తది. అదే రోజు రాత్రి ప్యాట్ కి దరిద్రం మళ్ళీ లిప్ కిస్ ఇస్తది. మనోడు తయారు చేసిన డిజైన్స్ కి లోన్ రాకపోగా, ఆల్రెడీ ఇచ్చిన లోన్స్ ని ఫాస్ట్ గా కట్టమని, కట్టకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని మెయిల్ వస్తది. “ఏంట్రా బాబు, ఈ దరిద్రం ఇంకా వదలదా?” అని ప్యాట్ తన కత్తిని గట్టిగా టేబుల్ కేసి గుద్దడంతో కత్తి విరిగిపోద్ది.
ఇక ప్యాట్ ఆ కత్తిని డస్ట్ బిన్ లో వేసి తన ప్రోటోటైప్ ని కూడా డిలీట్ చేస్తాడు. అప్పుడు ప్యాట్ బేబీ మానిటర్ లో చూస్తే జాక్ నిద్ర లేచి ఎవరితోనో మాట్లాడటం కనిపిస్తది. ప్యాట్ వెంటనే జాక్ దగ్గరికి వెళ్లి, “ఏంటి జేక్ ఎవరితో మాట్లాడుతున్నావ్?!” అని అంటే, “డాలీతో మాట్లాడుతున్నాను” అని అంటాడు. “డాలీ లేదు ఏం లేదులే కూల్ గా పడుకో” అని ప్యాట్ జేక్ ని నిద్ర పుచ్చి బయటికి వస్తాడు. అప్పుడు సడన్గా కరెంట్ పోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఏదో శబ్దం వస్తుంటే ప్యాట్ ఆ శబ్దం వైపే వెళ్తాడు. కట్ చేస్తే ప్యాట్ తన బెడ్ రూమ్ కిటికీ నుండి బయటికి అంతే చూస్తుంటాడు. కరీనా ప్యాట్ ని, “ఏంటి అలానే చూస్తున్నావ్?” అని అడుగుద్ది.
దానికి ప్యాట్, “అక్కడ చెట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. రా ఒకసారి నువ్వు కూడా వచ్చి చూడు” అని అంటాడు. ఈలోగా జేక్ గట్టిగా ఏడుస్తాడు. ఇద్దరూ వెంటనే జేక్ దగ్గరికి పరిగెడతారు. ఎవడో ఇంట్లోకి వచ్చాడని ప్యాట్ కి అనిపించి వాడిని వెతుకుతూ వెళ్తాడు. అలా వాడిని వెతుకుతూ జేక్ బయటికి వచ్చి, “రేయ్ ఎవర్రా నువ్వు బయటికి రారా” అని వార్నింగ్ ఇస్తుంటాడు. అప్పుడు అక్కడున్న చెట్లలో నుంచి ఏదో భయంకరమైన శబ్దం. తను చిన్నప్పుడు మైన్ దగ్గర ఫీలయిన భయాన్ని ప్యాట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. కట్ చేస్తే మార్నింగ్ పోలీసులు వస్తారు. పోలీస్ ఆఫీసర్ ప్యాట్ తో, “చుట్టూ అడవిలా ఉంది కదా! ఎవడైనా దొంగ వచ్చాడేమోలే. ఇంటి చుట్టూ సిసి కామెరాలు పెట్టించు” అని చెప్తాడు.

4) Pat అప్రమత్తం
ఈవెనింగ్ కి చుట్టూ కనిపించేలాగా ప్యాట్ సిసి కామెరాలని ఫిక్స్ చేస్తాడు. రూమ్ డస్ట్ బిన్ని క్లీన్ చేస్తున్న ప్యాట్ కి, తను చిన్నప్పుడు మైన్ దగ్గర పడేసుకున్న గుడ్లగూబ బొమ్మ కనిపిస్తది. ప్యాట్ ఆ బొమ్మని చూసి, “ఇదేంటి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది?!” అని షాక్ అవుతాడు. వెంటనే ప్యాట్ కరీనా దగ్గరికెళ్లి, “నువ్వేమైనా ఈ బొమ్మని డస్ట్ బిన్ లో వేసావా?” అని అడుగుతాడు. అప్పుడు కరీనా, “అసలు నేనీ బొమ్మని చూడడం ఇదే ఫస్ట్ టైం” అని అంటది. కరీనా జేక్ ఫ్లూట్ ని ప్యాట్ కి చూపించి, “ఈ ఫ్లూట్ ని కూడా నువ్వు వేస్టేజ్ తో పడేయొచ్చు కదా! జేక్ ఈ ఫ్లూట్ ఊదిన ప్రతిసారి నాకు భయం వేస్తుంది. కావాలంటే వాడికి మనం మంచి వస్తువు ఏదైనా కొనిద్దాం” అని అంటది.
ఆ ఫ్లూట్ ని ప్యాట్ ఎంతో ఇష్టంగా జేక్ కోసం రెడీ చేస్తాడు. జేక్ కి కూడా ఆ ఫ్లూట్ అంటే చాలా ఇష్టం. ప్యాట్ కి అసలా ఫ్లూట్ ని పడేయడం అంటే అసలు ఇష్టమే ఉండదు. కరీనా కోసం “సరే పడేస్తాలే” అని అంటాడు. కట్ చేస్తే జాక్ బాత్ టబ్ లో ఆడుకుంటూ, “ఫ్లూట్ కావాలి ఫ్లూట్ కావాలి” అని అంటాడు. సర్లే కాసేపు ఆడుకుంటాడులే అని ప్యాట్ ఫ్లూట్ చేద్దామని కిందకి వెళ్తుంటాడు. అసలే ఇంట్లో ఏదేదో జరుగుతుంది. అందుకే ప్యాట్ జేక్ ని పిలుస్తూ కిందకి వెళ్తుంటాడు. జేక్ అటు వెళ్ళగానే బ్యాగ్మెన్ కిటికీ దగ్గరికి వచ్చేస్తాడు. ప్యాట్ కి కింద రూమ్ లో ఫ్లూట్ కనిపించదు అండ్, “జేక్ నువ్వు ఓకేనా?” అని ప్యాట్ అంటే, వాడు ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటాడు.
వీడేంటి సైలెంట్ గా ఉన్నాడని ప్యాట్ కి డౌట్ వచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ పైకి వస్తాడు. ప్యాట్ వచ్చేలోగా బ్యాగ్మెన్ వెళ్ళిపోతాడు. అయినా ప్యాట్ రాగానే బ్యాగ్మెన్ పారిపోవడం ఏంటో నాకసలేం అర్థం కావట్లేదు. వాడేం మనిషి కాదు, సింపుల్ గా ప్యాట్ ని చంపేసేంత పవర్ ఉంది. అయినా కూడా ఎందుకు పారిపోతాడో ఏమో! ఇంట్లో సస్పిషియస్ గా ఏదేదో జరుగుతున్న టైం లో జేక్ ని ఒంటరిగా పడుకోబెట్టడం ఎందుకని జేక్ ని వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుంటారు. కట్ చేస్తే ప్యాట్ సెల్ కి సెక్యూరిటీ అలర్ట్ వస్తది. ఇక ప్యాట్ కిందకి వచ్చి సెక్యూరిటీ సిస్టంని మళ్ళీ యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు గ్యారేజ్ డోర్ ఓపెన్ అయ్యి కనిపిస్తది.

5) Bagman దాడి చేయడం
ఇక ప్యాట్ కి డౌట్ వచ్చి గ్యారేజ్ లోకి వెళ్తాడు. టార్చ్ వేసి చూస్తే ఎవరో బుడ్డోడు చీకట్లో కూర్చొని ఉంటాడు. ప్యాట్ మెల్లగా అక్కడికెళ్లి చూస్తే అదొక బొమ్మ, కానీ దానికి ఉన్న టోపీ మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం ప్యాట్ దగ్గరే ఉండేది. అంటే అది ప్యాట్ చిన్నప్పటి టోపీ అనమాట. కానీ ఆ టోపీ అక్కడికి ఎలా వచ్చిందో ప్యాట్ కి అసలు అర్థం కాదు. ఇక ప్యాట్ గ్యారేజ్ డోర్ ని మూసేసి ఇంట్లోకి రావాలని డోర్ ఓపెన్ చేయపోతే, డోర్ ని ఎవరో లోపల నుండి లాక్ చేసి ఉంటారు. ఎంత ట్రై చేసినా సరే డోర్ అసలు ఓపెనవ్వదు. డోర్ కి చిన్న హోల్ ఉంటే ఆ హోల్ నుండి ప్యాట్ లోపల లాక్ ని తీయాలని ట్రై చేస్తుంటాడు. అప్పుడు ప్యాట్ కి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తది.
బ్యాగ్ మ్యాన్ సీలింగ్ కి గబ్బిలంలా అతుక్కొని జేక్ ఫ్లూట్ ని ఊదుతుంటాడు. అది చూసిన ప్యాట్ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే డోర్ గ్లాస్ ని పగలగొట్టి లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకొస్తాడు. బట్ అప్పటికే బ్యాగ్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మార్నింగ్ పోలీసులని పిలిచి జరిగిందంతా చెప్పి, జేక్ ఫ్లూట్ కూడా వాడి దగ్గరే ఉందని అంటాడు. ఆ తర్వాత ప్యాట్ తన అన్న లియాం దగ్గరికి వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అప్పుడు లియాం ప్యాట్ తో, “నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నావ్. నీ చిన్నతనంలో కూడా ఇలాంటి ఆలోచనల వల్ల ఇబ్బంది పడ్డావు కదా! సో అప్పుడు నిన్ను ట్రీట్ చేసిన సైకాలజిస్ట్ ని మళ్ళీ ఒకసారి కలువు” అని చెప్తాడు.
కట్ చేస్తే కరీనా జాక్ ని ఒక ప్లే పార్క్ కి తీసుకెళ్తది. జాక్ ఆడుకుంటుంటే కరీనా సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటుంటది. అప్పుడు జాక్ కరీనా దగ్గరికి వచ్చి డాలీ ఇచ్చాడని చెప్పి రెండు పేపర్స్ ఇస్తాడు. అందులో ఒక పేపర్ లో, చిన్నప్పుడు ప్యాట్ మైన్ దగ్గర చెట్టుకొమ్మని కట్ చేస్తున్న డ్రాయింగ్, రెండో దాంట్లో ప్రెజెంట్ పార్క్ లో జాక్ అండ్ కరీనా ఉన్న డ్రాయింగ్స్ ఉంటాయి. వాటిని చూసిన కరీనాకి భయం వేసి వెంటనే జాక్ కోసం వెళ్తది. అప్పటికే బ్యాగ్ మ్యాన్ జాక్ ని బ్యాగ్ లో వేసుకోడానికి ట్రై చేస్తుంటాడు. కరీనా బాబుని కాపాడాలని ట్రై చేస్తూ గట్టిగా అరుస్తుంటది. కట్ చేస్తే ప్యాట్ కలలో నుండి మేల్కొంటాడు. సో పార్క్ లో జరిగిందంతా కూడా ప్యాట్ కి వచ్చిన కల అనమాట.
6) ముగింపు
ఎందుకైనా మంచిదని నెక్స్ట్ డే ప్యాట్ కరీనాని తీసుకొని సైకాలజిస్ట్ దగ్గరికెళ్తాడు. ఇక్కడే కరీనాకి ప్యాట్ గురించిన ఒక పెద్ద నిజం తెలుస్తది. సైకాలజిస్ట్ కరీనాతో, “ప్యాట్ కి చిన్నప్పటి నుండి” అంటే ఆ మైన్ దగ్గర కింద పడతాడుగా ఆ రోజు నుండి “పెర్సిస్టాఫోబియా ఏర్పడింది. దాని వల్ల ప్యాట్ కి ఒక బ్యాగ్ మ్యాన్ కనిపిస్తుంటాడు” అని అంటది. అప్పుడు ప్యాట్ ఆమెతో, “వాడేం ఊహ కాదు, మొన్న రాత్రి కూడా వాడు మా ఇంటికి వచ్చాడు” అని చెప్తాడు. సైకాలజిస్ట్ మాత్రం, “అవన్నీ నీ ఊహలు, పీడకలు మాత్రమే. నువ్వు రియాలిటీలోకి రావాలి” అని అంటది. కట్ చేస్తే ఈ విషయం గురించి క్లియర్ గా చర్చించుకోవాలని ప్యాట్ అండ్ కరీనా డిసైడ్ అవుతారు. ఆ రాత్రికి జాక్ ని యానా కి అప్పగించి ఒక హోటల్ కి వెళ్తారు. ఇక తన చిన్నతనంలో ఏం జరిగిందనే విషయం గురించి, ఆ బ్యాగ్ మ్యాన్ గురించి ప్యాట్ కరీనాకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు స్టోరీ గతంలోకి వెళ్తది.
Image Credit: Bagman (2024)