What You Wish For Movie Explained & Summary in Telugu
Magnet Pictures Distribute చేసిన “What You Wish For” అనే థ్రిల్లర్ మూవీ 6.7/10 IMDb రేటింగ్ ని సాధించింది. ఈ మూవీ జూలై 30, 2023 లో రిలీజయింది. ఈ సినిమాకి Nicholas Tomnay డైరెక్టర్ గా అలాగే రచయితగా బాధ్యత చేపట్టారు. నటీనటుల విషయానికొస్తే Nick Stahl, Penelope Mitchell, Tamsin Topolski మరియు Randy Vasquez ప్రధాన పాత్రల్లో నటించారు. లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజయ్యి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర 59,064 డాలర్స్ ని వసూలు చేసింది. థ్రిల్లర్ డ్రామా ఇష్టపడే సినీ ప్రియులకి ఈ సినిమా మంచి Experience ఇస్తది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.
ఇప్పుడు కథలోకి వెళ్దాం!
1) మొదలు
ఓపెన్ చేస్తే దాదాపు 12 సంవత్సరాల తర్వాత Ryan తన ఫ్రెండ్ జాక్ ని కలవడానికి అతనుండే ఊరికి వెళ్తాడు. జాక్ అరేంజ్ చేసిన కారులో ఇంటికి వెళ్తుండగా ఆ డ్రైవర్ Ryan కి జాక్ ఇచ్చిన లెటర్‌నీ ఇస్తాడు. జాక్ ఆ లెటర్లో “నాకు కొంచెం పని ఉంది, నేను బయటకి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లోకెళ్ళని ఇంటి కోడ్ ని రాసి ఉంటాడు. కట్ చేస్తే Ryan ఇంట్లోకి వెళ్తాడు. జాక్ అండ్ Ryan ఇద్దరూ Chefs. కానీ Ryan లైఫ్ అంతా కూడా కష్టాలతో అప్పులతో నిండి ఉంటది. జాక్ ఉంటున్న ఇంటిని చూసినా Ryan కి జాక్ చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడని అర్థం అవుద్ది. కట్ చేస్తే జాక్ ఇంటికి వస్తాడు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ గడిపేస్తారు.
Ryan జాక్ ని, “అసలు ఇంత లగ్జరీ లైఫ్ ఎలా?” అని అడుగుతాడు. దానికి జాక్, “నేను రిచ్ పీపుల్ కి వండి పెడతాను. సో వాళ్లు నాకు హెవీగా డబ్బులు పే చేస్తారు” అని చెప్తాడు. అలా అయితే నేను కూడా నీ దగ్గర అసిస్టెంట్ Chef గా జాయిన్ అవుతాను, నన్ను కూడా జాయిన్ చేసుకోమని Ryan అడుగుతాడు. కాని జాక్, ఇప్పుడు కొత్త Chef లు అంత అవసరం లేదని టాపిక్ డైవర్ట్ చేసేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు తినడం కోసం వెళతారు. అప్పుడు వాళ్ళకి Alice అనే అమ్మాయి పరిచయం అవుద్ది. ఆ అమ్మాయి వీద్దరిని, “అసలు మీరేం చేస్తుంటారు?” అని అడిగితే “మేమిద్దరం Chefs” అని చెప్తారు.
సో ఇద్దరిలో బెస్ట్ Chef ఎవరు అని తెలుసుకోవడం కోసం పోటీపడాలనుకుంటారు. ఇంటికి వెళ్లి ఇద్దరూ ఒకే వంటని రెడీ చేస్తారు. Alice కళ్ళకి గంతలు కట్టి ఫుడ్ ని ఇస్తారు. Alice ఫుడ్ తిని Ryan చేసిన ఫుడ్ కొంచెం బాగుంది అని చెప్తది. ముగ్గురు కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తారు. ఇక అందరూ నిద్రపోతారు. మరుసటి రోజు Alice వెళ్ళిపోతుంది. జాక్ కూడా తనకు పని ఉందని Ryan కి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక Ryan ఇల్లంతా తిరుగుతూ ఉండగా వాడికి జాక్ లాప్టాప్ కనిపిస్తుంది. ఆల్రెడీ అది జాక్ బ్యాంక్ అకౌంట్ లో లాగిన్ అయి ఉండడంతో Ryan బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేస్తాడు. తీరాచూస్తే అందులో చాలా అమౌంట్ ఉంటది. ఇది మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దాదాపు 18 కోట్ల 88 లక్షల రూపాయలు.

2) బాడి మాయం
కట్ చేస్తే నైట్ కి జాక్ వస్తాడు. ఇద్దరూ మళ్ళీ సిట్టింగ్ వేసి తాగుతూ కాసేపు మాట్లాడుకుని ఆ తర్వాత నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం ప్రశాంతమైన ప్రకృతిని చూస్తూ Ryan ఇంట్లోకి వస్తుండగా, సడన్‌గా జాక్ ఉరి వేసుకుని ఉండడం కనిపిస్తది. దాన్ని చూసి Ryan కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు వీడేంటి ఇలా చేశాడని Ryan కి ఏం చేయాలో ఏం అర్థంకాక టెన్షన్ పడుతుంటాడు. పోలీసులకు కంప్లైంట్ ఇద్దామనుకుంటాడు, ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ Ryan కి ప్రస్తుతం డబ్బులు చాలా అవసరం. మనోడు రాబిట్ అనే వాడికి డబ్బులివ్వాలి.
మరి వాడితో ఏం పత్తేపారం చేసాడో. వాడు Ryan ని డబ్బుల కోసం బెదిరిస్తుంటాడు. Present వాడి నుండి తప్పించుకోవాలనే Ryan జాక్ దగ్గరకి వస్తాడు. కట్ చేస్తే Ryan కి ఒక ఐడియా వస్తది. ఆల్రెడీ జాక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి కదా! సో అవి ఎలాగైనా తన సొంతం చేసుకుంటే తన ప్రాబ్లమ్స్ తీరిపోతాయని అనుకుంటాడు. బట్ Ryan కి జాక్ ATM పిన్ తెలియదు. సో డైరెక్ట్ గా బ్యాంకు వాళ్లకి కాల్ చేసి జాక్ లాగా మాట్లాడి, “నాకు యాక్సిడెంట్ అయి కొంచెం మెమరీ లాస్ అయింది. నా PIN కూడా మర్చిపోయాను. Present నాకు కొంచెం డబ్బులు అవసరం. ఈ విషయంలో హెల్ప్ చేయండి” అని అడుగుతాడు.
అప్పుడు వాళ్ళు, సరే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు మీ ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకుని బ్యాంక్ కి రండని అంటారు. ఇక Ryan ఆన్లైన్లో ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి అప్లై చేసి దాంట్లో పూర్తిగా జాక్ డీటెయిల్స్ పెట్టేసి ఫోటో మాత్రం తనది పెడతాడు. ఆ టైంలో రాబిట్ గాడు Ryan మదర్ ఫోటోని Ryan కి పంపించి, రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మ నీకు దక్కదని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు Ryan, అంత పని చేయొద్దు. ఒక వారం టైం ఇవ్వు, కావాలంటే నేను ఎక్స్ట్రా మనీ ఇస్తానని అంటాడు. సరే నాకు 50,000 ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి రాబిట్ ఒక వారం టైం ఇస్తాడు. కట్ చేస్తే Ryan జాక్ బాడీని ఒక చెరువులో పడేస్తాడు.
3) మనుషుల కోసం వెతుకులాట
ఇంకేముందిలే ఎవరికి తెలియదు అని Ryan చాలా పీస్ ఫుల్ గా ఉంటాడు. నెక్స్ట్ డే జాక్ ఉండే ఇంటి దగ్గరికి జెన్ అండ్ మోరిస్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. జాక్ ఒక ఏజెన్సీకి వంట చేస్తుంటాడు కదా! ఈ ఇద్దరు వ్యక్తులు ఆ ఏజెన్సీకి సంబంధించిన ఏజెంట్స్ అనమాట. వాళ్ళు Ryan ని జాక్ అనుకుంటారు. వీడు కూడా నేనే జాక్ అన్నట్టు వాళ్లతో మాట్లాడుతాడు. ఒక వంట చేస్తే మూడు లక్షలు ఇస్తారని Ryan కి తెలుస్తది. సో Ryan జెన్ ని, నాకు ఒక 50,000 అడ్వాన్స్ కావాలి కొంచెం పని ఉందని చెప్తాడు. ఇక జెన్ 50,000 ట్రాన్స్ఫర్ చేస్తది. Ryan ఆ డబ్బుని రాబిట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. డిన్నర్ ఇంక రెండు రోజుల్లో మొదలవుతది.

సో పని మొదలుపెడదామని అనుకుంటారు. జెన్ అండ్ మోరిస్ Ryan ని ఒక చర్చి దగ్గరికి తీసుకెళ్లి, “ఇక్కడికి వచ్చి వెళ్ళే మనుషులైతే కాస్త హెల్దిగా ఉంటారు. మన డిన్నర్ కి ఇద్దరు కావాలి” అని మాట్లాడతారు. అప్పుడు Ryan కి అర్థం అవుతది, ఓహో నేను వంట చేయబోయేది మనిషినా అని. ఆ విషయం తెలిసి మనోడికి చాలా భయం వేస్తది. “అసలు మనిషిని ఎలా వండగలను నేను వండలేనేమో?” అని అంటాడు. దానికి జెన్, “నువ్వు ఒక్క వంట పాడు చేసిన నిన్ను చంపేస్తారు” అని చెప్తది. ఆ మాటకి Ryan కి భయం వేసి, అరేయ్ ఏంట్రా బాబు ఇలాంటి సిచువేషన్ లో వీళ్ళ దగ్గర ఇరుక్కున్నారని భయపడి వంట చేస్తానంటాడు.
సరే రేపు వచ్చి మనుషుల్ని తీసుకెళ్దామని ఇంటికి వచ్చేస్తారు. తన ఫ్రెండ్ ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడో ఇప్పుడు Ryan కి అర్థం అయ్యి బాధపడతాడు. మిడ్ నైట్ రెండు గంటలకి Ryan పారిపోవాలని అనుకుంటాడు. కానీ జెన్ అండ్ మోరిస్ మేల్కొని ఉండడంతో వాడి ప్లాన్ ఫెయిల్ అవుతది. నెక్స్ట్ డే మార్నింగ్ మోరిస్ అండ్ Ryan చర్చ్ దగ్గరికి వెళ్తారు. ఒక తల్లి కూతుర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్లు మిస్ అవుతారు. వాళ్లని వెతుక్కుంటూ వెళ్లిన వీళ్ళిద్దరికీ పక్కనే ఒక మెకానిక్ షెడ్ దగ్గర జోస్ అనే వ్యక్తి కనిపిస్తాడు. వీడైతే కరెక్ట్ గా సరిపోతాడని వాడిని సెలెక్ట్ చేసుకుంటారు.
4) మొదలైన మనుషుల వంట
“మా కారు కొంచెం పాడైంది, వచ్చి రిపేర్ చేస్తావా?” అని వాడిని కారు దగ్గరికి తీసుకొని వస్తారు. వాడు కార్ కిందకి వెళ్ళి రిపేర్ చేస్తుండగా మోరిస్ వాడితో, “నువ్వు హెల్తీ ఫుడ్ తింటావా” అని అడుగుతాడు. దానికి వాడు “బయటి ఫుడ్డు తిని హెల్త్ పాడుచేసుకోడం ఎందుకు. అందుకే నేను హెల్దీ ఫుడ్ తింటాను” అని అంటాడు. సో మోరిస్ వాడ్ని షూట్ చేసి చంపేస్తాడు. డిన్నర్ కి వచ్చే వాళ్ళందరూ చాలా రిచ్ పర్సన్స్, వాళ్లు ఒక డిన్నర్ కి 1.5 మిలియన్స్ ఖర్చు పెడతారు. సో మంచి టేస్టీ అండ్ హెల్దీ హ్యూమన్ ఫుడ్ ని రెడీ చేసి పెట్టాలి. ఐక వాడ్ని లోపల వేసుకుందాం అనుకునే లోపు, ఆ తల్లి కూతుర్లు వీళ్లు మమ్మల్నీ ఫాలో అవుతున్నారని పోలీసుని తీసుకుని వస్తారు.
Police రావడంతో ఇద్దరూ కాస్త టెన్షన్ పడతారు. ఆ పోలీసోడు, “ఏంటి మీరు వీళ్ళని ఫాలో అవుతున్నారంట?” అని అడుగుతాడు. దానికి మోరిస్ పోలీస్ తో, “లేదు మేము హోటల్ పెట్టడానికి మంచి ప్లేస్ వెతుక్కుంటున్నాము. వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, మేమెందుకు ఫాలో అవుతాము. ఇతనే మా ఆర్కిటెక్ట్” అని Ryan ని చూపిస్తాడు. కట్ చేస్తే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. జెన్ కార్ దగ్గరికి వచ్చి, “ఏంటి ఒక మనిషేనా?” అని అడగడంతో “ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. సో మనం ఓక్కడితోనే సరిపెట్టుకోవాలి తప్పదు” అని మోరిస్ అంటాడు. ఆ తరువాత డేవిడ్ ని అండర్ గ్రౌండ్ కి తీసుకెళ్తారు.

అప్పుడు జెన్ Ryan తో వాని కట్ చేసి వంటకి బాగా ప్రిపేర్ చేయమని చెప్తది. ఇక Ryan తన పని మొదలుపెట్టి జోస్ ని కట్ చేస్తాడు. ఆ తర్వాత తను అండర్ గ్రౌండ్ నుంచి బయటకు రాగానే మోరిస్ Ryan తో, “నీకేదో పార్సిల్ వచ్చింది, రూమ్‌లో పెట్టాను” అని చెప్తాడు. Ryan తన రూమ్ కి వెళ్లి స్నానం చేస్తూ, ఒక మనిషిని అలా చంపడం వల్ల తనకి చాలా బాధేసి చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత వచ్చి పార్సెల్ ని చూస్తే తను అప్లై చేసిన ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది. ఇక ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకొని జాక్ అకౌంట్లో ఉన్న డబ్బులతో హ్యాపీగా బతికేయొచ్చని Ryan అనుకుంటాడు.
5) పోలీసుల వెతుకులాట
అనుకున్నట్టుగానే ఎవరికీ కనిపించకుండా కారులోకెక్కి ఫాస్ట్‌గా వెళుతుంటాడు. కానీ ఆ ఇంట్లో పని చేసే ఒకడు సడన్‌గా కారుకు అడ్డం రావడంతో చిన్న యాక్సిడెంట్ అవుతది. ఇక వెంటనే మోరిస్ అక్కడికి వస్తాడు. Ryan తప్పించుకునేందుకు ట్రై చేశాడని మోరిస్ కి అర్థమై, “నువ్వు ఏజెన్సీ నుంచి తప్పించుకోవాలనుకుంటే వాళ్ళని చంపేస్తారు” అని చెప్తాడు. అప్పుడు Ryan, “మరి ఇక్కడ నుంచి బయటపడే మార్గమే లేదా?” అని అడగడంతో, ఒకే ఒక్క దారి ఉందని మోరిస్ చెప్తాడు. అదేంటంటే ఇంతకుముందు ఇక్కడ నీలాగే ఒక అమ్మాయి వంట చేసేది. ఆ అమ్మాయి ఫస్ట్‌లో బాగా భయపడేది. కానీ తర్వాత చాలా బాగా వంట చేయడం స్టార్ట్ చేసింది. కొన్ని ఇయర్స్ తరవాత ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు రిక్వెస్ట్ పెట్టుకుంది.
సో తనని పంపించేశారు. ప్రస్తుతం తను ఒక ధనవంతుల ఇంట్లో కుక్ గా జాయిన్ అయిందని చెప్తాడు. సో ఎలాగైనా సరే ఈ వంటని క్లైంట్స్ కి నచ్చేలా చేసి తనని వదిలిపెట్టమని Agency కి రిక్వెస్ట్ చేయాలని Ryan decide అవుతాడు. ఇక ఫుడ్ ని చాలా డెలిషియస్ గా కుక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ఒక డిటెక్టివ్ ని తీసుకొని అక్కడికి వస్తాడు. ఆ డిటెక్టివ్ జెన్ తో, మేం మోరిస్ ని కలవాలని అంటాడు. దానికి జెన్, “తను ఇక్కడ లేడు, ఏంటి విషయం?” అని అడుగుతది. ఆ డిటెక్టివ్ జెన్ కి జోస్ ఫోటోని చూపించి, “మార్నింగ్ ఇతనితో మీ వాళ్ళు మాట్లాడారంట. ఆ తర్వాత నుండి ఇతను కనిపించడం లేదు.
ఒకసారి ఈ విషయం గురించి మీ వాళ్లతో మాట్లాడాలి” అని అంటాడు. ఈ జోస్ డిటెక్టివ్ కి మేనల్లుడు. సో డిటెక్టివ్ కేస్ ని పర్సనల్ గా తీసుకుంటాడు. అప్పుడు జెన్, “మోరిస్ ఇక్కడ లేడు. ప్రస్తుతం ఇక్కడ ఒక డిన్నర్ జరుగబోతుంది. తను గెస్ట్స్ ని తీసుకురాడానికి వెళ్ళాడు. తను రావడానికి చాలా టైం పట్టుద్ది” అని చెప్తది. అప్పుడు డిటెక్టివ్, ఏం పర్లేదు! ఎంత సేపైనా వెయిట్ చేస్తామని అంటాడు. ఆ తర్వాత వాళ్ళు Ryan దగ్గరికి వెళ్తారు. Ryan కుక్ చేయడం చూసి, నువ్వు ఆర్కిటెక్ట్ కదా! కుకింగ్ చేస్తున్నావు ఏంటని అంటారు. దానికి Ryan, “నా ప్రొఫెషన్ ఆర్కిటెక్చర్. కానీ నాకు కుకింగ్ అంటే Passion. సో ఈ ఒక్కరోజుకి నేను కుక్ చేస్తున్నా” అని అంటాడు.

6) ముగింపు
ఆ తర్వాత వాళ్ళు, “మీరు ఈ రోజు ఎక్కడేక్కడికి వెళ్లారు?” అని అడిగి, Ryan కి జోస్ ఫోటోని చూపించి, “అతన్ని నువ్వు చూశావా?” అని అడుగుతాడు. అప్పుడు Ryan, “నేను ఇతని చూడలేదు” అని చెప్తాడు. అప్పుడు డిటెక్టివ్, సరే మేము మోరిస్ వచ్చిన తర్వాత అతనితో కూడా మాట్లాడి ఆ తర్వాత వెళ్తామని అంటాడు. వాళ్ళు ఉదయం నుండి ఏం తినలేదని జెన్ కి చెప్పడంతో, Ryan చేసిన సూప్ ని ఆమె వాళ్ళకి తినడానికి పెట్టిస్తది. ఆ తర్వాత ముందుగా డిన్నర్ కి వచ్చిన గెస్టుల దగ్గరికి వెళ్లి, “మన ఇంటికి పోలీసులు వచ్చారు. మీరు మా ఇన్వెస్టర్స్ లా మాట్లాడాలి” అని చెప్తది. వాళ్ళు కూడా ఓకే అంటారు.
డిటెక్టివ్ సూప్ తాగుతూ, “నువ్వు అనవసరంగా ఆర్కిటెక్చర్ అయ్యావు. నువ్వు సూప్ చాలా టేస్టీగా చేశావ్. నువ్వు చెఫ్ అయ్యుంటే బాగుండేది” అని అంటాడు. కట్ చేస్తే మోరిస్ మిగిలిన గెస్ట్ లతో ఇంటికి వస్తాడు. డిటెక్టివ్ తనికి జోస్ ఫోటోని చూపించి, “నువ్వు ఇతన్ని కలిసావా?” అని అడగడంతో, లేదు నేను కలవలేదని మోరిస్ చెప్తాడు. డిటెక్టివ్ జెన్ తో, “మార్నింగ్ ఈ పోలీస్ ఆఫీసర్ నాతో ఒక విషయం చెప్పాడు. ఊర్లో ప్రతీ తొమ్మిది నెలలకి చెప్పాపెట్టకుండా ఇద్దరు ముగ్గురు యువకులు కనిపించకుండా పోతున్నారు. వాళ్ళు వెళ్లిపోయిన కొన్ని రోజులకి మేము మంచి లైఫ్ లీడ్ చేయడానికి సిటీకి వెళ్తున్నామని ఒక మెయిల్ గాని లెటర్ గాని వాళ్ళ కుటుంబాలకి వస్తుంది. ప్రతిసారి ఇలా జరగడం నాకు చాలా డౌట్ గా ఉంది” అని అంటాడు.
ఆ తర్వాత డిటెక్టివ్ అక్కడ ఫుడ్ తింటున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి జోస్ ఫోటో చూపించి, “ఇతన్ని ఎక్కడైనా చూశారా?” అని అడుగుతాడు. కానీ వాళ్ళు మాకు తెలియదు అని అంటారు. డిటెక్టివ్ కి ఎందుకో వాళ్ళందరి మీద కొంచెం డౌట్ వస్తది. ఆ విషయం అక్కడున్న ఒక ముసలోడికి అర్థమై డిటెక్టివ్ ని కూడా తినడానికి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు జెన్ ఆ ముసలోన్ని పక్కకు పిలిచి, “అసలు ఎందుకు ఇలా చేశారు?” అని అడిగిద్ది. దానికతను, “డిటెక్టివ్ కి మన మీద కొంచెం డౌట్ వచ్చింది. సో వాడ్ని వదిలేస్తే వాడు తన డౌట్ తో మళ్ళీ రిటర్న్ వస్తాడు. అదే వాడ్ని మనం కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేస్తే, మన మీద మంచి ఒపీనియన్ ఏర్పడిద్ది. ఇది మన మంచికే” అని చెప్తాడు.
Image Credit: What You Wish For (2023)