Lethal Seduction Movie Explained & Summary in Telugu

Lethal Seduction Movie Explained & Summary in Telugu

MarVista Entertainment Distribute చేసిన “Lethal Seduction” అనే థ్రిల్లర్ డ్రామా 4.9/10 IMDb రేటింగ్ ని సాధించింది. జూలై 11, 2015 లో రిలీజ్ అయిన ఈ మూవీని “Nancy Leopardi” Direct చేశారు. “Michael Waite” మరియు “Roger Stigliano” రచయితలుగా వ్యవహరించారు. Caleb Ruminer, Dina Meyer, Amanda Detmer, Brian Thomas Smith మరియు Sam Lerner ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ TV Show గా రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియో లో Available గా ఉంది.

స్టోరీ ఏంటంటే:
1) బర్త్ డే పార్టీ

Open చేస్తే, Walter తన ఫ్రెండ్ Mark తో, అమ్మాయిలని ఎలా పడేయాలి అనే విషయం గురించి డీప్ గా మాట్లాడుతుంటాడు. సరిగ్గా అప్పుడే Walter కి, తమ పక్కన ఇద్దరు middle-aged women కార్ లో ఉండడం కనిపిస్తుంది. Walter వాళ్లతో, “మేమిద్దరం పార్టీకి వెళ్తున్నాం, మాతో పాటు మీరు కూడా రావచ్చు కదా” అని ఒక ట్రైల్ వేస్తాడు. కానీ ఆ middle-aged women Walter ని పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు Mark, “ఇదేనా రా నీకు తెలిసింది” అన్నట్టుగా Walter ని చూసి నవ్వుతాడు. వాల్టర్ మాత్రం, “వాళ్లలో Car drive చేస్తున్న బ్లాండి నాపై మనసు పారేసుకున్నట్టుంది” అని Mark తో అంటాడు. కట్ చేస్తే ఇద్దరు mark ఇంటికిి చేరుకుంటారు. ఆరోజు మార్క్ birthday అవడంతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్క్ కి ఒక surprise పార్టీని arrange చేస్తారు.

మార్క్ మదర్ పేరు Tanya and తన ఫాదర్ 10 సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటాడు. So, అప్పటినుంచి Tanya నే మార్క్ ని ఒంటరిగా చాలా కేరింగ్ గా పెంచుతుంటుంది. మార్క్ కేక్ కట్ చేసిన తర్వాత తన రూమ్ లోకి వెళ్లి, dress change చేసుకుని బయటికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో Melanie బికినీ వేసుకుంటూ, త్రెడ్స్ ని కట్టుకోబోతుంటుంది. కాకపోతే అవి తనకి సరిగా అందకపోతుండడంతో, తను ఆ త్రెడ్స్ ని ముడి వేసేందుకు mark ని సహాయం కోరుతుంది. Mark కూడా మెలనీకి సహాయం చేసేందుకు తన దగ్గరికి వెళ్తాడు. కానీ వెంటనే అక్కడికి తాన్య వచ్చి, మెలని బికినీ త్రెడ్స్ ని తను కట్టి, mark ని స్విమ్మింగ్ పూల్ దగ్గర జరుగుతున్న పార్టీ వద్దకు వెళ్ళమంటుంది. Actual గా మార్క్ కి మెలని మీద మొదటి నుంచి crush ఉంటుంది.

అలా mark, బికినీ వేసుకుని పూల్ లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న మెలని వైపు అంతే చూస్తుంటాడు. ఒకపక్క Randy మార్కుతో మాట్లాడుతున్నా కూడా, మార్క్ తన మాటల్ని పట్టించుకోకుండా మెలని వైపే చూస్తుంటాడు. ఇంతకీ ఈ Randy ఎవరంటే, Randy తాన్య యొక్క కొలీగ్. He’s like a family friend to them. Mark కి మెలని మీద interest ఉంది కదా! కాబట్టి Walter, mark తో, “ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మెలనీని ఏదైనా ఒక ప్రైవేట్ పార్టీకి invite చేద్దాం” అని ఐడియా ఇస్తాడు. అందుకు మార్క్ కూడా ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం మార్క్ ఒక ప్లాన్ వేసి Randy and తాన్యాని, ఒక రెస్టారెంట్ కి పంపించి, కాసేపలా ఎంజాయ్ చేసిరండని చెప్తాడు. ఇక ఇంట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది.

Lethal Seduction Movie Explained & Summary in Telugu
Lethal Seduction Movie Explained & Summary in Telugu
2) కరిస్సాతో పరిచయం

ఆ పార్టీకి మెలని తన ఫ్రెండ్ ని కూడా తీసుకుని వస్తుంది. ఇక అందరూ బాగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అవుతుండగా సరిగ్గా అప్పుడే అక్కడికి విలియమ్స్ వస్తాడు. ఇంట్లో మార్క్ ఒక్కడే ఒంటరిగా ఉన్నాడన్న ఉద్దేశంతో, మార్క్ కి తోడుగా ఉండేందుకు తాన్య విలియమ్స్ ని తమ ఇంటికి వెళ్ళమని చెప్తుంది. అంటే తాన్యాకి తెలియదు కదా! ఇంట్లో మార్క్ party కండక్ట్ చేసాడని. విలియన్స్ రావడంతో మార్క్ అండ్ వాల్టర్ వేసుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కట్ చేస్తే , తాన్య కొన్ని Hardware వస్తువులని కొనుక్కుని రమ్మని mark ని షాప్ కి పంపిస్తుంది. మార్క్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులని తీసుకుంటుండగా, తన దగ్గరికి 40 సంవత్సరాల వయసున్న ఒక మిడిల్ ఏజ్ ఉమన్ వస్తుంది.

ఆమె పేరు Carissa. Carissa మార్కుతో, ప్లంబింగ్ కోసం కావాల్సిన కొన్ని మంచి వస్తువులని తనకి సజెస్ట్ చేయమని అడుగుతుంది. Actual గా, మార్క్ ఆ షాప్ లో పనిచేసే వ్యక్తేమో అని అనుకుని Carissa అలా అడుగుతుంది. మార్క్ కూడా పర్వాలేదులే అన్నట్టుగా Carissa కి కొన్ని వస్తువులని సజెస్ట్ చేసి ఇస్తాడు. ఇక మార్క్ షాప్ నుంచి బయటకు రాగా, Carissa మార్క్ కి తనని తాను పరిచయం చేసుకుని, “నాకు ఈ ప్లంబింగ్ వర్క్ సరిగా చేతకాదు, నువ్వొచ్చి నాక్కొంచెం సహాయం చేస్తావా?” అని మార్కుని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మార్కు మాత్రం “నేను త్వరగా ఇంటికి వెళ్లి మా అమ్మకి Help చేయాలి” అని చెప్తాడు. అప్పుడు Carissa, “నువ్వు నాకు సహాయం చేశావంటే, నేను నీకు మనీ కూడా ఇస్తాను” అని మార్కుకి వల విసురుతుంది.

కట్ చేస్తే, మార్క్, Carissa ఇంటికి వెళ్లి, బాత్రూం లో ప్లంబింగ్ వర్క్ ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళబోతుంటాడు. అప్పుడు Carissa మార్క్ ముందే తన బట్టలన్నీ విప్పేసి, “అలా అయితే వెళ్లి ఒకసారి షవర్ ని ట్రై చేస్తా” అని చెప్పి, కావాలంటే నువ్వు కూడా రావచ్చు అని హిట్ ఇస్తుంది. దాంతో మార్క్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు Carissa, “రావాలనుకుంటే హాట్ వాటర్ కంప్లీట్ అయ్యేలోపు వచ్చేసెయ్” అని మళ్లీ పిలుస్తుంది. దాంతో ఇక మార్క్ కూడా బాత్రూంలోకి enter అయ్యి carissa దగ్గరికి వెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ Physical గా ఒక్కటవుతారు. Cut చేస్తే, మరుసటి రోజు ఉదయం మార్క్ ఎనర్జిటిక్ గా, సంతోషంగా ఉండడం చూసి, “ఏంటి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావ్” అని తాన్య అడుగుతుంది. అప్పుడు మార్క్, “ఏమో నాకు తెలీదు, maybe ఈ రోజు మంచి రోజేమో” అని తాన్యా తో అంటాడు.

Lethal Seduction Movie Explained & Summary in Telugu
Lethal Seduction Movie Explained & Summary in Telugu
3) మార్క్ – కరిస్సా

అప్పుడే వాల్టర్ ఇంటికి రావడంతో మార్క్ తన దగ్గరికి వెళ్లి, కరిస్సా తో తను గడిపిన విషయం గురించి చెప్తాడు. అది విన్న వాల్టర్, “తను 40 సంవత్సరాల రిచ్ ఉమనా” అని కాస్త జలసీగా ఫీల్ అవుతాడు. మరి మెలని విషయం ఏంటని వాల్టర్ అనగా, “ఏమో నాకు తెలియదు ప్రస్తుతం నేను కరిస్సాతో ఉన్నానని మార్క్ అంటాడు. రాత్రి సమయంలో మార్క్, కరిస్సా కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ వేసుకుంటారు. So, మార్క్ నీట్ గా రెడీ అయ్యి తన రూమ్ నుంచి బయటకు వస్తాడు. మార్కును చూసిన తాన్య, “మెలనీతో బయటకి వెళ్తున్నావా?” అని అడుగుతుంది. అప్పుడు మార్క్ “లేదు నేను వేరే వాళ్ళతో వెళ్తున్నాను” అని సమాధాన మిచ్చి, తను ఎవరితో బయటకు వెళ్తున్నాడో తాన్యాకి విషయం చెప్పడు. సరిగ్గా అప్పుడే అక్కడికి కరిస్సా రావడంతో, మార్క్ ఇక ఇంటి నుంచి బయటకు వెళ్తాడు.

తాన్యాకి మార్క్ మీద డౌట్ వచ్చి కిటికీలోంచి చూడగా, తనకి కరిస్సా కనిపిస్తుంది. కరిస్సా ఒక కాలేజ్ స్టూడెంటేమో అని అనుకుని, తాన్య కరిస్సా గురించి మొదట లైట్ తీసుకుంటుంది. ఇక మార్క్ కరిస్సా ఒక బార్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మార్క్, తను బిల్డ్ చేస్తున్న app గురించి కరిస్సాకు మాటల సందర్భంలో చెప్పగా, “నాకు ఇంటెల్ డిజిటల్ ల్యాబ్స్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. Maybe తను నీకు ఈ యాప్ development విషయంలో హెల్ప్ చేయొచ్చు” అని కరిస్సా కాస్త helpful గా మాట్లాడుతుంది. అది విని మార్క్ కూడా happy గా ఫీల్ అవుతాడు. తర్వాత కరిస్సా కొంచెం పౌడర్ తీసుకునెందుకు వాష్ రూమ్ లోకి వెళ్ళగా ఒక unknown person మార్కు దగ్గరికి వస్తాడు. “ఆవిడ అంత మంచి వ్యక్తి కాదు, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో” అని unknown person మార్క్ కి సలహా ఇస్తాడు. తను అలా ఎందుకు చెప్పాడో మార్క్ కి ఏమీ అర్థంకాదు.

సరిగ్గా అప్పుడే కరిస్సా washroom నుంచి మార్క్ దగ్గరికి రాగా, ఇక వాళ్ళిద్దరూ బార్ నుంచి వచ్చేస్తారు. మరుసటి రోజు ఉదయం తాన్య మార్క్ తో, “ఈ మధ్య నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు. అసలు నీ ప్రవర్తన ఏమి బాగాలేదు” అని మార్క్ పై కాస్త కోప్పడుతుంది. కానీ మార్క్ మాత్రం తాన్యాకి సరిగా సమాధానం చెప్పకుండా breakfast కంప్లీట్ చేసేసి బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మార్కు మళ్ళీ కరిస్సా దగ్గరికి వెళ్తాడు. అసలు విషయం ఏంటంటే, కరిస్సా యొక్క husband చాలా ముసలివాడు. తను ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయిఉంటాడు. అలా అప్పటినుంచి కరిస్సా ఒక్కతే, అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉంటుంది.

Lethal Seduction Movie Explained & Summary in Telugu
Lethal Seduction Movie Explained & Summary in Telugu
4) ముగింపు

Swimming pool కి పక్కనే ఒక రూమ్ ఉంటుంది. మార్క్ ఆ రూమ్ ని గమనించి, ” ఆ room ఎందుకోసం?” అని అడుగుతాడు. అప్పుడు కరిస్సా, “ఓ అదా! అది outdoor sauna” అని మార్కుతో చెప్పి, నువ్వు నాకు లోషన్ రాస్తావా అని తను మార్క్ కి లోషన్ ఇస్తుంది. ఇక మార్క్ కరిస్సా వీపు మీద లోషన్ ని రాయడం start చేయగా, అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోవడం కూడా మొదలు పెడతారు. గత కొన్ని రోజులుగా మార్కు ప్రవర్తిస్తున్న తీరు తాన్యాకి మార్కుపై అనుమానం కలిగేలా చేస్తాయి. తాన్య మార్క్ బట్టల్ని సర్ధుతుండగా తనకి ప్యాంట్ లో మార్క్ మొబైల్ కనిపిస్తుంది. తాన్య మార్క్ మొబైల్ ని చెక్ చేయగా కరిస్సా యొక్క నెంబర్ కనిపించడంతో, తాన్య కరిస్సా ని డిన్నర్ కి invite చేస్తూ మెసేజ్ పంపిస్తుంది. కానీ ఈ విషయం మార్క్ కి తెలియదు. కట్ చేస్తే, మెసేజ్ ని అందుకున్న కరిస్సా, ఒక costly wine bottle ని తీసుకుని మార్క్ ఇంటికి వస్తుంది.

కరిస్సా తన ఇంటికి రావడాన్ని చూసి మార్క్ కాస్త ఆశ్చర్యపోతాడు. “కరిస్సా అంటే ఒక టీనేజర్ అని అనుకున్నాను, కానీ ఈవిడ ఏంటి ఇంత పెద్దగా ఉందీ” అని తాన్యా కూడా కాస్త shock అవుతుంది. ఇక అందరూ కలిసి డిన్నర్ చేయడం మొదలు పెడతారు. కరిస్సా మాటల సందర్భంలో, మార్క్ బిల్డ్ చేస్తున్న యాప్ గురించి తాన్యాని అడుగుతుంది. Actual గా మార్క్ ఒక యాప్ ని రెడీ చేస్తున్నాడు అన్న విషయం తాన్యాకి అస్సలు తెలియదు. మార్క్ కూడా, App ready అయిన తర్వాత, దానిని తాన్యాకి చూపించి తనని surprise చేయాలనుకుంటాడు. కానీ పొరపాటున కరిస్సా వల్ల, app విషయం తాన్యాకి ఇప్పుడు తెలిసిపోతుంది.

అప్పుడు తాన్యా మార్క్ తో, “ఈ మధ్య నువ్వు సీక్రెట్స్ ని, surprises ని బాగానే దాస్తున్నావు లే” అని కరిస్సా ను ఉద్దేశించి అంటుంది. అప్పుడు కరిస్సా, “మార్క్ బిల్డ్ చేస్తున్న యాప్ సక్సెస్ అయిందంటే తను కాలేజ్ వదిలేసేసి కంపెనీని స్టార్ట్ చేయొచ్చని చెప్తుంది. ఇక తాన్యా వెంటనే అందుకుని , “కాలేజ్ ని వదిలేయడమా, నీకు తెలుసా!, మార్కుకి Princeton అనే కాలేజ్ లో full scholarship తో సీటు వచ్చింది. అలా సీట్ రావడం ఎంత కష్టమో అసలు నీకు తెలుసా? కాలేజ్ వదిలేసి కంపెనీ పెట్టొచ్చంట, అయినా సలహాలు ఇవ్వడానికి నువ్వేమి తన అమ్మవి కాదు. నీ ఫిజికల్ కోరికలు తీర్చుకోవడం కోసం టీనేజర్స్ ని వలలోకి దించే ఒక కన్నింగ్ పర్సన్ వి నువ్వు. ఆ వలలోకి నా కొడుకుని లాగొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో కరిస్సా ఇక అక్కడినుంచి బయటకు వచ్చేస్తుంది.

Image Credit: Lethal Seduction (2015)

Leave a Comment