35 Chinna Katha Kaadhu – 35 చిన్న కథ కాదు

థియేటర్స్ లోకి 35 Chinna Katha Kaadhu మూవీ వచ్చేసింది.

“నివేద థామస్”, గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా తెరపై ఈ పేరుని విన్నదే లేదు. చూడడానికి తెలుగు అమ్మాయిలాగా, పక్కింటి అమ్మాయిలాగా కనిపించే నివేద థామస్ గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా తెరపై ఎక్కడా కనిపించలేదు. కానీ తను ఒక పక్క ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గానే ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తుంది.

2022లో రెజీనాతో కలిసి, నివేదా థామస్ “శాకినీ డాకినీ” అనే మూవీలో నటించింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 16 2022న రిలీజ్ అయింది. కామెడీ, యాక్షన్ జోనర్లో వచ్చిన “శాకినీ డాకినీ” ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో థియేటర్స్ లో ఈ సినిమా సో సో గానే నడిచింది. శాకినీ డాకినీ తర్వాత నివేదా థామస్ ఏ తెలుగు సినిమాలోను యాక్ట్ చేసిందే లేదు. అయితే ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత, నివేద థామస్ “35 కథ కాదు కాదు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ మెయిన్ లీడ్ లో నటించగా, నివేదా ఇద్దరు పిల్లల తల్లిగా మరియు ప్రియదర్శి బడిలో టీచర్ గా తమ పాత్రల్ని పోషించారు.

35 Chinna Katha Kaadhu
35 Chinna Katha Kaadhu

అయితే ఈ సినిమాలో నివేదా చూడడానికి చాలా బొద్దుగా, కొంచెం లావుగా ఉంది. 35 చిన్న కథ కాదు టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే అభిమానులు ఈ విషయం గమనించి, “మరి తను ఈ సినిమా కోసమే లావుగా మారారా!? లేక లైఫ్ స్టైల్ లో భాగంగా అలా బరువు పెరిగారా!?” అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

The GOAT ప్రభావం:

ఈ సినిమాకి రైటర్ ప్లస్ డైరెక్టర్ కూడా నందకిషోర్ అనే వ్యక్తే. సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించగా వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతానికి ఈ సినిమా మీద కాస్త పాజిటివ్ బజ్ ఉండడంతో సినిమాకి అది కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఒకపక్క వర్షాలు పడుతుండడంతో మరి ఆ వర్ష ప్రభావం అనేది ఈ సినిమా కలెక్షన్స్ పై ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా దళపతి విజయ్ నటించిన “The Goat” (The Greatest Of All Time) అనే సినిమా కూడా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవడం, Goat మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకుపోతుండడంతో, GOAT సినిమా యొక్క ప్రభావం 35 చిన్న కథ కాదు సినిమా కలెక్షన్స్ పై ఏ విధంగా పడుతుందో మరి.

న్యాచురల్ స్టార్ నాని మాటల్లో:

ఒకపక్క వేగంగా ప్రమోషన్స్ ని జరుపుకుని థియేటర్స్ లోకి వచ్చిన 35 సినిమా ఇప్పటివరకు ప్రేక్షకులలో మంచి బజ్ నే ఏర్పరచింది. సినిమా ప్రమోషన్స్ లో నాచురల్ స్టార్ నాని కూడా జాయిన్ అవడం, తను కూడా సినిమా గురించి పాజిటివ్ లైన్స్ చెప్పి, ప్రేక్షకులకి ఈ సినిమా మీద ఆసక్తి కలిగించడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన, నాని సినిమా “సరిపోదా శనివారం” కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ లో రన్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

నివేద థామస్ మరియు నాని కలసి ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించారు. తెలుగులో నివేద థామస్ డెబ్యూ కూడా నాని హీరోగా నటించిన “జెంటిల్ మెన్” సినిమాతోనే జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ “నిన్ను కోరి”, “వి” అనే సినిమాల్లో కూడా జంటగా నటించారు. “35 చిన్న కథ కాదు” సినిమా, పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడుతూ, “ప్రతి అమ్మ, ప్రతి నాన్న తమ పిల్లల్ని థియేటర్ కి తీసుకెళ్లి చూపించాల్సిన సినిమా ఇది, ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్కరికి పర్సనల్ గా కనెక్ట్ అవుతుంది” అని చెప్పడం, ఇంకా “సరిపోదా శనివారం” లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయేమో, కానీ “35 చిన్న కథ కాదు” లాంటి సినిమాలు మాత్రం మళ్లీ మళ్లీ రావు. కాబట్టి అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది” అని అనడంతో, ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ యెుక్క కన్నుపడింది. మరి ఈ రోజు (సెప్టెంబర్ 6) థియేటర్స్ లోకి వచ్చిన ఈ “35 చిన్న కథ కాదు” అనే సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

Leave a Comment