10 Cloverfield Lane Movie Explained & Summary in Telugu
Paramount Pictures Distribute చేసిన “10 Cloverfield Lane” అనే హార్రర్ సైన్స్ ఫిక్షన్ మూవీ 7.2/10 IMDb రేటింగ్ ని సాధించింది. మార్చ్ 11, 2016 లో రిలీజ్ అయిన ఈ మూవీని Dan Trachtenberg డైరెక్ట్ చేశారు. Josh Campbell మరియు Matt Stuecken రచయితలుగా వ్యవహరించారు. ఇక నటీనటుల విషయానికొస్తే John Goodman, Mary Elizabeth Winstead మరియు John Gallagher Jr. ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు 13-15 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 110.2 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో Available గా ఉంది.
స్టోరి తెలుసుకుందాం:
1) మొదటినుంచే సస్పెన్స్
Open చేస్తే మిషెల్ తన ఫియాన్సి తో గొడవపడి తన వస్తువులని తీసుకుని ఇంటి నుంచి బయటకి వచ్చేస్తుంది. మిషెల్ ఫియాన్సీ పేరు బెన్. బెన్ ఎన్ని సార్లు కాల్ చేస్తున్నా కూడా మిషెల్ తన కాల్స్ ని పట్టించుకోకుండ కార్ ని drive చేస్తుంటుంది. కానీ ఈ సారి మాత్రం మిషెల్ తన మొబైల్ వైపు చూడగా వెంటనే తన కార్ వెళ్లి పొరపాటున ఒక ట్రక్ ని ఢీ కొడుతుంది. ఆ accident లో మిషెల్ కి బాగా గాయాలవడంతో మిషెల్ unconscious గా పడిపోతుంది. కట్ చేస్తే మిషెల్ మెలకువలోకి వచ్చేసరికి తను ఒక రూమ్ లో చైన్స్ తో బంధించబడి and తన చేతికి ఒక సెలైన్ బాటిల్ inject చేయబడి ఉంటుంది. అసలు తనకి ఏం జరిగింది, తనని ఎవరు ఇలా బంధించి ఉంచారో తెలుసుకోవాలంటే మనం మూవీలోకి వెళ్లాల్సిందే!
మిషెల్ తన కాలుని chains నుండి విడుపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. But no use. ఆ chains నుండి మిషెల్ ఎంతకీ బయటపడలేదు and మిషెల్ కి car accident వల్ల కుడి కాలికి బాగా దెబ్బ తగిలి ఉంటుంది. మిషెల్ కి ఆ రూం లోనే తన bag కనిపించడంతో మిషెల్ వెంటనే సెలైన్ బాటిల్ stand అందుకుని, ఆ స్టాండ్ సహాయంతో bag దగ్గర ఉన్న మొబైల్ ని నెమ్మదిగా తన దగ్గరికి లాక్కుంటుంది. మిషెల్ mobile ని అయితే అందుకుంటుంది, కానీ bad luck, తనకి ఆ రూం లో సిగ్నల్ అందదు. అసలు తను ఎక్కడ ఉందో, తనని ఇలా ఎవరు బందించారో తెలియక తను చాలా భయపడిపోతుంటుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి పెద్దగా అడుగులు వేసుకుంటూ వచ్చి మిషెల్ కి ఆహారాన్ని ఇస్తాడు.
అతని పేరు హవర్డ్. హవర్డ్ దగ్గర ఒక gun కూడా ఉండడంతో మిషెల్ కి తన భయం ఇంకా పెరిగిపోతుంది. మిషెల్ హవర్డ్ తో ” నన్నేం చేయొద్దు, please నన్ను వదిలిపెట్టు” అని బ్రతిమిలాడుతుంది. అప్పుడు హవర్డ్ “నిన్ను ఏమైనా చేసే ఉద్దేశం నాకస్సలు లేదు, నేను కేవలం నిన్ను రక్షిస్తున్నాను” అని చెప్తాడు. నా ఫియాన్సి నాకోసం వెతుకుతుంటాడు, తను నా గురించి కనిపెట్టి పోలీసులని తీసుకుని ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు ” అని చెప్పి మిషెల్ హవర్డ్ ని బెదిరిస్తుంది. అప్పుడు హవర్డ్ సెలైన్ బాటిల్ stand ని సరిగ్గా నిలబెట్టి, ” నిన్ను వెతకడానికి బయట ఎవరు ప్రాణాలతోలేరని” చెప్తాడు. తన మాటల్ని విన్న మిషెల్ కి అసలేమీ అర్ధంకాదు.

2) హవర్డ్ చెప్పేది నిజమేనా?!
ఇక హవర్డ్ మిషెల్ కి నడిచేందుకు సపోర్ట్ గా రెండు చేతి కర్రల్ని and ఒక key ని ఇచ్చి door ని lock చేసేసి వెళ్ళిపోతాడు. హవర్డ్ రూమ్ లోంచి బయటికి వెళ్లిపోయిన వెంటనే మిషెల్ ఆ కీ ని use చేసి తన కాలికి లాక్ చేసి ఉన్న chain ని విడిపించుకుంటది. Room నుంచి బయటపడాలని చూస్తెనేమో door lock చేసి ఉంటది. హవర్డ్ తనకి ఇచ్చిన తాళం కేవలం చైన్ లాక్ కి మాత్రమే సెట్ అవుతుంది, కానీ door lock కి మాత్రం అస్సలు సెట్ అవ్వదు. అసలేం చెయ్యాలో, అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక మిషెల్ కి బాగా మెంటల్ లేస్తుంటుంది. సరిగ్గా అప్పుడే తనకి ఒక ఆలోచన రావడంతో తను వెంటనే ఆ key ని use చేసి, హవర్డ్ ఇంతకుముందు తనకి ఇచ్చిన ఆ రెండు చేతి కర్రల్లో ఒక కర్ర కొనని పదునుగా చేస్తుంది.
హవర్డ్ రూమ్ door ని open చేసుకుని లోపలికి వచ్చే టైం లో, ఆ కర్రని ఉపయోగించి హవర్డ్ పై దాడి చేసి ఇక అక్కడినుంచి తప్పించుకోవాలని మిషెల్ plan వేస్తుంది. కానీ ఎంతసేపు wait చేసినా హవర్డ్ రూమ్ లోపలికి రాకపోతుండడంతో, మిషెల్ తన bag లో ఉన్న ఒక dress ని కాల్చి fire alarm on అయ్యేలా చేస్తుంది. Fire alarm on అవ్వడంతో అసలు రూమ్ లో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని టెన్షన్ పడుతూ హవర్డ్ రూమ్ లోకి వస్తాడు. అప్పుడు మిషెల్ వెంటనే తను ready చేసుకున్న weapon use చేసి హవర్డ్ పై దాడి చేస్తుంది. కానీ ఆ దాడి వల్ల హవర్డ్ కి అంతగా ఏమీ కాదు. ఇక తను వెంటనే, అక్కడినుంచి పారిపోవాలని try చేస్తున్న మిషెల్ కి మత్తుమందు ని inject చేస్తాడు.
దాంతో మిషెల్ unconscious అవుతుంది. Cut చేస్తే కొంచెం సేపటి తరువాత మిషెల్ మెలకువ లోకి వస్తుంది. ఆ సమయంలో హవర్డ్ రూమ్ లోనే ఉంటాడు. మిషెల్ తనని “ప్లీజ్ నన్ను వదిలిపెట్టు” అని బతిమిలాడుతుంది. అప్పుడు హవర్డ్ “నేను నిన్ను వదిలిపెట్టినా సరే నువ్వసలు ఎక్కడికి వెళ్తావ్? బయటంతా emergency నెలకొంది, maybe అది nuclear attack వల్ల అయ్యుండొచ్చు and మనం పీల్చే గాలి కూడా పూర్తిగా కలుషితం అయింది. నువ్వా బయట గాలిని పీల్చినా సరే వెంటనే చనిపోతావు. అసలు బయట ఎవరూ ప్రాణాలతో లేరు. నువ్వు Accident లో గాయపడి మెలకువ లేకుండా పడివుంటే, నేను నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చాను. అందుకు నువ్వు నాకు thanks చెప్పకపోగా నాపై attack చేస్తున్నావ్.

3) బంకర్ లో మరో వ్యక్తి
ఈ బంకర్ లో ఉంటే మనం safe గా ఉండొచ్చు. బయట జరుగుతున్న attack complete అవ్వడానికి maybe 2 years అయినా పట్టొచ్చు” అని మిషెల్ తో చెప్తాడు. కానీ హవర్డ్ చెప్పిన ఈ మాటలని మిషెల్ అసలు నమ్మదు. అదే సమయంలో బయటనుంచి ఎదో శబ్ధం రావడంతో హవర్డ్ మళ్లీ రూమ్ డోర్ ని లాక్ చేసేసి హాల్ లోకి వస్తాడు. కట్ చేస్తే కొన్ని గంటల తరువాత మిషెల్ నిద్ర నుంచి మేల్కొoటుంది. అప్పుడు luckily room door open గా ఉండడంతో మిషెల్ వెంటనే రూమ్ నుంచి బయటికివస్తుంది. తీరాచుస్తే అక్కడ ఇంకో వ్యక్తి విరిగిన చేతితోటి and some గాయాలతోటి కూర్చొనిఉంటాడు. అతని పేరు ఎమెట్.
తన లాగే ఎమెట్ ని కూడా హవర్డ్ కిడ్నాప్ చేసి ఇలా బంకర్ లో బంధించి ఉంచాడని మిషెల్ అనుకుని, “నువ్వు నాతో కలువు, మనిద్దరం కలిసి ఇక్కడినుంచి బయటపడదాం” అని మిషెల్ ఎమెట్ తో చెప్తుంది. అప్పుడు ఎమెట్ “మనం బయటికి వెళ్ళకూడదు, బయటంతా గందరగోళంగా ఉంది and గాలి కూడా కలుషితమయింది, మనమిక్కడ ఉంటేనే safe గా ప్రాణాలతో ఉంటామని” మిషెల్ తో చెప్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి హవర్డ్ వస్తాడు. Actual గా హవర్డ్ ఆ బంకర్ ని ఒక అందమైన ఇంటిలాగా modify చేసి ఉంటాడు. చదవడానికి lots of books, ఆడుకోవడానికి games, puzzles and so much food ఆ బంకర్ లో ఉంటాయి. హవర్డ్ వాటన్నిటినీ మిషెల్ కి చూపించగా మిషెల్ ఆ అందమైన ఇల్లులాంటి బంకర్ ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది.
అసలు హవర్డ్ ఈ బంకర్ ని ఎందుకు ఒక అందమయిన ఇంటిలాగా మార్చాడో మనకి కథలో పోను పోను తెలుస్తది. And ఈ బంకర్ లో కేవలం ఒకే ఒక bathroom మాత్రమే ఉంటుంది, అది కూడా హవర్డ్ bedroom లో ఉంటుంది. కాబట్టి మిషెల్ ఎప్పుడు బాత్రూంలోకి వెళ్ళాలన్నా సరే తను హవర్డ్ bedroom లోకి రావాల్సిందే. Cut చేస్తే వాళ్లున్న బంకర్ మీదనుంచి ఒక కార్ వెళ్తున్నట్టుగా మిషెల్ కి sound వినిపిస్తుంది. ఈ విషయం గురించి తను హవర్డ్ కి చెప్పి “బయట మనుషులు ఇంకా ప్రాణాలతో ఉన్నట్టుంది” అని excitement తో అంటుంది. కానీ హవర్డ్ మాత్రం “బయట ఎవరూ ప్రాణాలతో లేరు” అని confident గా చెప్తాడు. But ఎంతకీ తన మాటల్ని మిషెల్ నమ్మకపోతుండడంతో హవర్డ్ మిషెల్ ని glass door దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ glass door గుండా బయట ఏం జరుగుతుందో హవర్డ్ మిషెల్ కి క్లారిటీగా చూపిస్తాడు.

4) మిషెల్ ప్రయత్నం
హవర్డ్ మిషెల్ కి చనిపోయిన రెండు పందులని చూపించి, “అవి నా పెంపుడు పందులు, బయట కలుషితమై ఉన్న గాలిని పీల్చడం వల్లనే అవి చనిపోయాయి” అని మిషెల్ తో అంటాడు. వాటిని చూసిన మిషెల్ ఇక హవర్డ్ చెప్పిన మాటల్ని నమ్మడం మొదలుపెడుతుంది, కానీ తనకి ఆ పందుల పక్కనే రక్తపు మరకలతో accident అయి ఉన్న ఒక ట్రక్ కనిపిస్తుంది. అప్పుడే మిషెల్ కి గుర్తొస్తుంది, “అసలు ఇంతకుముందు నా కార్ వెళ్లి ట్రక్ ని ఢీ కొట్టలేదు, ఒక ట్రక్ వచ్చి నా కార్ ని ఢీ కొట్టింది, అది కూడా ఈ ట్రక్కే. అంటే హవర్డ్ నా కార్ కి accident చేసి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు, కానీ ఎందుకు?” అని మిషెల్ decide అయిద్ది.
Cut చేస్తే కొంచెం సేపటి తరువాత మిషెల్ and ఎమెట్ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఎమెట్ హవర్డ్ గురించి తనకి తెలిసిన విషయాల్ని మిషెల్ కి చెప్తాడు. “హవర్డ్ ఇంతకుముందు మిలిటరీ కోసం satellites ఫీల్డ్ లో work చేశాడు. అప్పటినుంచి తనకి technology మీద బాగా knowledge ఉంది and ఎప్పుడైనా సరే, ఇలాంటి emergency situation నెలకుంటదనే డౌట్ తోనే హవర్డ్ ఈ బంకర్ ని modify చేసి ఇంటిలాగా మార్చాలని decide అయ్యాడు. So హవర్డ్ నా సహాయం తీసుకుని దీనిని ఇలా modify చేశాడు. హవర్డ్ ఊహించినట్టుగానే ఆకాశంలో పెద్దగా కాంతి వెలిగి attack జరగడం మొదలైనవెంటనే, నేను ప్రాణాలకోసం పరిగెడుతూ వచ్చి ఈ బంకర్ లోకి చేరుకున్నాను. అప్పుడే నా ఈ చెయ్యి విరిగి దెబ్బలు తగిలాయి” అని ఎమెట్ మిషెల్ తో చెప్తాడు.
ఇలా వాళ్లిద్దరూ మాట్లాడుకున్న తరువాత ముగ్గురూ కలిసి భోజనం చేయడం start చేస్తారు. ఎమెట్ హవర్డ్ గురించి positive గా చెప్పినా కూడా మిషెల్ కి ఎందుకో హవర్డ్ మీద డౌట్ గానే ఉంటుంది, so తను ఎలాగైనా సరే ఆ బంకర్ లోంచి తప్పించుకోవాలని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అప్పుడే మిషెల్ కి హవర్డ్ బెల్ట్ కి అటాచ్ అయిఉన్న తాళాలు కనిపించడం and బంకర్ మీదనుంచి ఎదో car వెళ్తునట్టుగా సౌండ్ వినిపించడం జరుగుతాయి. ఇక మిషెల్ late చెయ్యకుండా తెలివిగా హవర్డ్ దగ్గరున్న తాళాల్ని తీసుకుని తనపై బాటిల్ తో దాడి చేసి వెంటనే glass door దగ్గరికి వస్తుంది.

5) ముగింపు
మిషెల్ ఆ Glass door ని కూడా open చేసి బయటపడాలని చూస్తుంటుంది, కానీ ఆ డోర్ లాక్ ఎంతకీ open అవ్వదు. సరిగ్గా అప్పుడే ఒకావిడ కార్ లోంచి బయటికి వచ్చి మిషెల్ దగ్గరికి చేరుకుంటుంది. ఆవిడ ముఖమంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. తను మిషెల్ తో “అది నన్ను కొంచెం మాత్రమే touch చేసింది, నాకేం కాలేదు ప్లీజ్ నన్ను లోపలికి రానివ్వు” అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడే హవర్డ్ కూడా అక్కడికి వచ్చి “ఎట్టి పరిస్థితుల్లో నువ్వా door ని open చెయ్యకు, ఆవిడని లోపలికి రానివ్వకు” అని మిషెల్ కి గట్టిగా చెప్తాడు. అసలు మిషెల్ కి ఏం చేయాలో ఏమి అర్ధంకాదు.
మిషెల్ ఎంతకీ డోర్ ని ఓపెన్ చెయ్యక పోతుండడంతో ఆవిడ మిషెల్ ని తిట్టీ డోర్ ని చేత్తో బలంగా గుద్దుతుంది. అప్పుడు మిషెల్ కి అసలిక్కడ ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో ఏమీ అర్ధంకాక భయంతో మళ్ళీ బంకర్ లోకి వచ్చేస్తుంది. తరువాత హవర్డ్ మిషెల్ దగ్గరికి వచ్చి accident గురించి నిజం ఒప్పుకుంటాడు. “నీ కార్ కి accident చేసింది నేనే, కానీ నేనది కావాలని చేయలేదు. ఆకాశం నుంచి attack జరగడం మొదలవ్వగానే నేను భయంతో ట్రక్ ని fast drive చేసుకుంటూ ఈ బంకర్ దగ్గరికి వస్తున్నాను. అప్పుడే పొరపాటున నేను నీ కార్ ని accident చేశాను. గాయాలతో పడిఉన్న నిన్ను, అక్కడే వదిలెయ్యలేక ఇలా ఇక్కడికి తీసుకుని వచ్చాను” అని హవర్డ్ మిషెల్ తో చెప్తాడు.
తన మాటల్ని విన్న మిషెల్ ఇక నిజం తెలుసుకుని Compromise అయిధి. మిషెల్ వేసుకునేందుకు హవర్డ్ మేగన్ బట్టల్ని ఇస్తాడు. హవర్డ్ మేగన్ ఫోటోని మిషెల్ కి చూపించి “Megan నా కూతురు. తను చాలా తెలివైన అమ్మాయి. కానీ నా భార్య నాతో గొడవపడి Megan ని చికాగో కి తీసుకెళ్ళింది” అని హవర్డ్ sad voice తో మిషెల్ కి చెప్తాడు. తన మాటల్ని విన్న మిషెల్ కూడా కాస్త sad గా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఇక హవర్డ్, ఎమెట్ and మిషెల్ ముగ్గురూ కలిసిపోసి హ్యాపీ గా జీవించడం మొదలుపెడతారు. ఒకరి life గురించి ఒకరు తెలుసుకోవడం, puzzles solve చేయడం, గేమ్స్ ఆడుకోవడం వంటి వాటిని వాళ్ళు ముగ్గురూ కలసి హ్యాపీగా చేస్తుంటారు. అయితే ఒకరోజు ఒక search helicopter బంకర్ మీదనుంచి వెళ్ళడం వాళ్ళు ముగ్గురు గమనిస్తారు. అప్పుడు మిషెల్ “మనకి సహాయం అందింది, ఇక మనం ఇక్కడినుంచి మనుషులుండే place కి helicopter లో వెళ్ళొచ్చని” excitement తో అంటది.
Image Credit: 10 Cloverfield Lane (2016)